ఫర్టిలైజర్‌ యాప్‌ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫర్టిలైజర్‌ యాప్‌ను రద్దు చేయాలి

Mar 2 2026 8:42 AM | Updated on Mar 2 2026 8:42 AM

ఫర్టిలైజర్‌ యాప్‌ను రద్దు చేయాలి

ఫర్టిలైజర్‌ యాప్‌ను రద్దు చేయాలి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఫర్టిలైజర్‌ (యరియా) యా ప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలం లోని గాదేపల్లి సొసైటీ గోదాము వద్ద రైతులు ఆది వారం ధర్నా చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యా ప్‌ విధానం కారణంగా సమయానికి యూరియా దొరకడం లేదని, ఇబ్బందులు పడుతున్నామన్నా రు. మొబైల్‌ ఫోన్‌ లేని రైతులు ఏవిధంగా యూరి యా బుక్‌ చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరి యా అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

రెంజల్‌ మండలంలో..

రెంజల్‌(బోధన్‌): మండలంలోని దూపల్లి, రెంజల్‌ గ్రామాల రైతుల మధ్య యూరియా కోసం స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దూపల్లి, రెంజల్‌ విండోలకు యూరియా బస్తాలు వచ్చాయని ఆయా విండోల కార్యదర్శులు వాట్సాప్‌, ప్రచార మాధ్యమాల్లో ఆదివారం ప్రకటించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న రెంజల్‌ రైతులు దూపల్లి విండో ద్వార యూరియా తీసుకోవాలని సమాచారం వచ్చింది. ఈ మేరకు రెంజల్‌కు చెందిన పలువురు రైతులు పలువురు దూపల్లి విండోకు వెళ్లగా ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోని రైతులకు అందించకుండా పక్క గ్రామాల రైతులకు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. తమ విండోలో పక్క గ్రామా ల రైతులకు ఆన్‌లైన్‌లో యూరియా బుక్‌ అయ్యిందని రెంజల్‌కు చెందిన రైతులు సర్దిచెప్పారు. చివరకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దూ పల్లి గ్రామానికి చేరుకుని రెండు గ్రామాల రైతులను సముదాయించారు. రెంజల్‌ గ్రామ రైతులు సాయంత్రం వరకు దూపల్లిలోనే వేచి ఉండి అధికారులు అందించిన యూరియా బస్తాలను తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement