క్షణక్షణం.. భయంభయం
నిజామాబాద్‌అర్బన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పొట్ట చేతపట్టుకుని వెళ్లిన త మ వారు అక్కడ ఎలా ఉంటున్నారోనని క్షణక్షణం భయపడుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటూ గత రెండు రోజులుగా గంటగంటకూ వాట్సా ప్ వీడియో, ఆడియోకాల్స్ చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దుబాయి, ఇజ్రాయి ల్, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ తదితర దేశాల్లో జిల్లాకు చెందిన 20వేల మందికిపైగా కార్మికులు, విద్యార్థులు ఉన్నారు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో వలసకార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. దుబాయిలో ఉన్నవారు డ్రోన్ దాడుల వీడియోలను ఇక్కడున్న తమ బంధువులకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేయాలని ఉన్నా ఎయిర్‌పోర్టులు మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు
వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన
తమవారి క్షేమ సమాచారం కోసం
గంటగంటకూ ఫోన్‌లు
మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో
20వేల మందికిపైగా జిల్లావాసులు


