అనారోగ్యానికి దెయ్యాలే కారణమని… ఇంట్లోనే రక్తరంజితం? | ai era but superstitions still continue fake babas cheating people | Sakshi
Sakshi News home page

అనారోగ్యానికి దెయ్యాలే కారణమని… ఇంట్లోనే రక్తరంజితం?

Mar 2 2026 9:49 AM | Updated on Mar 2 2026 9:49 AM

ai era but superstitions still continue fake babas cheating people

  • ప్రపంచం ప్రస్తుతం ఏఐ యుగంలోకి మారుతున్నా.. మనిషి మాత్రం తన మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. దీంతో ఇలాంటి ప్రజలను ఆసరాగా చేసుకొని నకిలీ బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు చేతబడులు, పూజల నెపంతో దాడులకు పాల్పడుతు న్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి.

  1. తమ అనారోగ్యానికి కారణం దుష్టశక్తులే అని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు విన్న ఓ కుటుంబం.. తమలో ఒకరైన వృద్ధురాలిని హత్య (నరబలి) చేశారనే పుకార్లు వ్యాపించాయి. వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయినట్లు చిత్రీకరించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఈ ఘటన గత నెలలో పాల్వంచ గ్రామంలో చోటు చేసుకుంది.

  2. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట గ్రామా నికి చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్దిరోజుల క్రితం వాస్తు, అ తీంద్రియ శక్తులు అంటూ వచ్చిన ఓ వ్యక్తి  మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని నమ్మించాడు. లంకెబిందెల కారణంగానే కు టుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతోందని, వా టిని బయటికి తీయకపోతే మీ ప్రాణాలకు ముప్పు అని భయపెట్టాడు. క్షుద్రపూజలు చేసి లంకె బిందెలు తీస్తానని నమ్మించి రూ. 8.20 లక్షలు వసూలు చేశాడు. బీరవ్వ కుటుంబ సభ్యులు సదరు వ్యక్తికి కామారెడ్డిలో డబ్బులు ముట్టజెప్పారు. ఆ తరువాత అతడు ఫోన్‌ ఎత్తకపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజన్నసిరిసిల్లకు చెందిన మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

  3. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి దాదాపు నాలుగు నెలల క్రితం భిక్షాటనకు ఓ వ్యక్తి వచ్చాడు. మీ ఇంట్లో అందరూ అనారోగ్య సమస్యలతో బాధపడటానికి ఇంట్లో ఉన్న లంకె బిందెలే కారణమని నమ్మించాడు. వాటిని తీసివ్వడానికి రూ.14 లక్షలు డిమాండ్‌ చేసి లాస్య వద్ద నుంచి రూ.2.93 లక్షలు తీసుకుని ఉడాయించాడు. సదరు నిందితుడు ఇతర జిల్లాల్లో కూడా మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

కామారెడ్డి క్రైం: కాలం వేగంగా మారుతున్నా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నా మూఢ నమ్మకాలను మాత్రం మనిషి వీడటం లేదు. మాయగాళ్లు లంకెబిందెలు, నరబలులు అంటూ సులువుగా బురిడీ కొట్టించి ఉడాయిస్తున్నారు. నరబలులకు సైతం వెనుకాడని అనాగరిక, మూర్ఖపు సంస్కృతి వైపు అడుగులు వేస్తున్న ఘటనలు, మంత్రాల నెపంతో దాడులు వంటి ఘటనలు ఇప్పటికీ అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. అప్పులు, అనారోగ్యం, ఇతర బాధల్లో ఉన్న వారు మూఢనమ్మకాలకు బలవుతున్నారు. దొంగ బాబాలు, స్వామీజీలు, మోసగాళ్ల ఉచ్చులో ఇరుక్కుని లబోదిబోమంటున్నారు. గుప్త నిధులు, లంకె బిందెల మాయలో పడి నిలువు దోపిడీకి గురవుతున్నారు. కామారెడ్డి పోలీసులు ఇటీవల ఓ ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. 

 ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో.. 
పోలీసు శాఖ కళాబృందం నిత్యం గ్రామాల్లో ప్రదర్శనలు ఇస్తూ మూఢ నమ్మకాలను వీడాలని సూచిస్తున్నా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి సమాజంలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. రెండు నెలల క్రితం చిన్నమాల్లారెడ్డి గ్రామానికి వచ్చిన ఓ దొంగ స్వామీజీ గుప్తనిధులంటూ కొందరిని నమ్మించాడు. అతడు ఉండే చోట ఇంటిపని చేయడానికి నియమించిన ఓ మహిళను లోబర్చుకుని మోసం చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  

విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నాం 
మూఢనమ్మకాలను వీడాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నాం. మంత్రాలు అంటూ  ఎవరైనా భయపెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మంత్రాలు, అతీంద్రియ శక్తులంటూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.              – రాజేశ్‌చంద్ర, ఎస్పీ, కామారెడ్డి  

మంత్రాల నెపంతో దాడులు 
మంత్రాల నెపంతో దాడులకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 2025లో జిల్లాలోని ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నాలుగు కేసులు న మోదయ్యాయి. గ్రామాల్లో పంచాయతీల కారణంగా చాలా కేసులు వెలుగు చూడటం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement