సిరికొండ: విప్లవపంథా కోసం చివరిదాకా పోరాడిన రవన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సీపీఐఎంఎల్ మాస్‌లైన్(ప్రజాపంథా) రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యుడు వీ ప్రభాకర్ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో రాయల రవన్న 10వ వర్ధంతి సభ వాల్ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే 10వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. రవన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుదీర్ఘకాలం రహస్యంగా పని చేసి మృతి చెందాడన్నారు. 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవపంథా ఉండాలని, విప్లవకారులు ఐక్యంగా పని చేయాలని, తన ఊపిరి ఉన్నంత వరకు విప్లవోద్యమ నాయకుడిగా పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రమేశ్, ఆర్ దామోదర్, బాబన్న, కిశోర్, అనీస్, సాయారెడ్డి, లింబాద్రి, నారాగౌడ్, రమేశ్, బాల్‌రెడ్డి, రమ, పుష్పలత, స్వప్న, కిశోర్, నరేశ్, ఆశీష్, ఆశన్న, పోశన్న తదితరులు పాల్గొన్నారు.


