ఉమ్మడి జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక

Mar 7 2026 7:25 AM | Updated on Mar 7 2026 7:25 AM

మోపాల్‌: మండలంలోని ఏకలవ్య ఆర్చరీ అకాడమిలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. మినీ సబ్‌జూనియర్‌ విభాగంలో జరిగిన ఎంపికలకు కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి సుమారు వంద మంది క్రీడాకారులు హాజరయ్యా రు. పోటీలను అర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పటాన్‌చెరువులో ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ నెల 8న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి పోటీ పడే క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కోచ్‌ ఎన్‌ రవీందర్‌, ప్రతినిధులు ప్రతాప్‌దాస్‌, రవీందర్‌, మురళి, పీరియా, జైత్రం, నవనీత్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement