ఆశాజనకంగా నువ్వుల ధర
మోర్తాడ్:యాసంగి సీజన్‌లో నువ్వుల సాగు రైతు లకు లాభదాయకంగా మారుతోంది. ఎగుమతుల డిమాండ్ కారణంగా క్వింటాలుకు ఆశాజనకంగా ధ ర లభిస్తోంది. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడితో మంచి ఆదాయం వస్తుండటంతో జిల్లాలో సాగు వి స్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట కోత దశ చే రుకోడానికి కొంత సమయం ఉన్నా మార్కెట్‌లో ధ ర ఎక్కువగా ఉండటంతో రైతుల్లో సంతోషం వ్యక్త మవుతోంది. కోతలు మొదలయ్యే దశలోనూ ఇదే ధర ఉంటే ప్రయోజనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల్లో నువ్వుల పంటు సాగు అవుతోంది. గతంలో 5 వేల ఎకరాల వరకే సాగైన ఈ పంట మంచి ఆదాయం వస్తుండడంతో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.8,200 ఉండగా మార్కెట్‌లో రూ.10వేలు పలుకుతోంది. ఆరేళ్ల క్రితం క్వింటాలు నువ్వులు రూ.16వేల వరకు అమ్ముడు కావడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారించారు. సజ్జలకు సముచితమైన ధర లేక పోవడంతో ఎక్కువ మంది రైతులు నువ్వులను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే నువ్వుల సాగు వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఎన్నోమార్లు నువ్వులు కోత దశకు వచ్చిన సమయాల్లో వడగండ్ల వర్షాలు కురిసి నేలకూలిన సందర్భాలు ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి నువ్వులకు డిమాండ్ ఏర్పడింది. ఆరోగ్య ప్రదాయనిగా నువ్వులు గుర్తింపు పొందడంతో వీటి వినియోగం పెరిగింది.
జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలకు
పైగా సాగు
క్వింటాలు నువ్వులకు
రూ. పదివేల వరకు ధర
మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉండటంతో సాగుకు ఉత్సాహం చూపిన రైతులు


