యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
● బోర్గాం(పి)లో ధర్నా, నిరసన
● ఇందల్వాయి సొసైటీ ముట్టడి
● యాప్‌లో బుకింగ్‌తో
ఇబ్బందులవుతున్నాయని ఆవేదన
మోపాల్/డిచ్‌పల్లి(ఇందల్వాయి): యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యాప్‌లో బుకింగ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స రిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డి మాండ్ చేశారు. నిజామాబాద్ నగరశివారులోని బో ర్గాం(పి)లో మంచిప్ప ప్రధాన రోడ్డుపై, ఇందల్వాయి సొసైటీ ఎదుట శనివారం బైఠాయించారు. సకాలంలో యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. పంటకాలం దాటిపోతోందని, యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. యాప్‌లో, ఆన్‌లైన్‌లో కాకుండా పాత పద్ధతిలోనే అడిగిన ప్రతి రైతు కు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బోర్గాం(పీ)లో సుమారు గంటకుపైగా రైతులు రో డ్డుపై కూర్చోవడంతో వాహనాలు నిలిచిపోయా యి. నాల్గో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని రై తులను సముదాయించారు. ఒక దశలో పోలీసు లు, రైతులకు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా కొనసాగింది. డీఏవో వీరాస్వామి వచ్చి తక్షణమే లోడ్ యూరియా అందిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఏవో, ఏఈవోను ఆదేశించడంతో రైతులు శాంతించారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, రైతు నాయకులు ఈగ సాయిరెడ్డి, రాజేశ్వర్ రైతులు బి హ న్మాండ్లు, సూర్యారెడ్డి, తిరుపతి సంజీవ్, చామకూర గణేశ్, సంజీవ్, తలారి సాగర్, వేల్పూర్ గంగారాం, కిషన్, గుత్ప దశరథ్, మల్కారెడ్డి, భుజేందర్ పాల్గొన్నారు.
ఇందల్వాయిలో ఎస్సై సందీప్, మండల వ్యవసాయాధికారి శ్రీకాంత్ సొసైటీ వద్దకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు


