రెడ్‌ నోటీసులు! | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ నోటీసులు!

Mar 3 2026 7:25 AM | Updated on Mar 3 2026 7:25 AM

మొండి

బకాయిలపై

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిల వ సూళ్లకు అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో బకాయిలు రాబట్టేందుకు నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.

నగరంలో మొత్తం 89 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షి యల్‌ కేటగిరీలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి రూ.95 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌ ఉంది. డబుల్‌ అసెస్‌మెంట్లు, కూల్చేసిన, శిథిల దశలో ఉన్న భవనాలను మినహాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.75 కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటికే రూ.33.5 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన రూ.41.5 కోట్లు వసూలు చేసేందుకు గాను అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా రూ.41.5 కోట్ల బకాయిలలో సుమారు రూ.15 కోట్ల వరకు నలుగురైదుగురు మాత్రమే చెల్లించాల్సి ఉండడం విశేషం. వీటిపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. బకాయిల వసూలు కోసం స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా అన్ని జోన్లలో ప్రత్యేకంగా నోడల్‌ అధికారులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లను నియమించారు. అదేవిధంగా 60 వార్డులకు గాను సూపర్‌వైజర్లు, మరో ముగ్గురు చొప్పున అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశారు. డబుల్‌ అసెస్‌మెంట్లు, శిథిల, కూల్చేసిన భవనాలను శాసీ్త్రయ విధానంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు. డాక్యుమెంట్‌ వారీగా ఫైల్‌ను నిర్వహించి వాటిని తొలగించనున్నారు. మిగిలిన వాటికి సంబంధించి వసూళ్లకు కచ్చితమైన ప్రణాళికలను తయారు చేశారు.

డిఫాల్టర్లకు వారంరోజుల గడువు

30 వేల మందికి నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం.. ఇప్పటికే 9 వేల మందికి అందించిన కార్పొరేషన్‌

రావాల్సిన బకాయిలు రూ.41.5 కోట్లు.. నాలుగైదు పెద్ద ప్రాపర్టీల బకాయిలే

రూ.15 కోట్లు

చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం

బకాయిలకు సంబంధించి 30 వేల మందికి రెడ్‌ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 9 వేల మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలినవాళ్లకు సైతం జారీ చేసేందుకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ముందుకెళుతోంది. ముఖ్యంగా మొండి బకాయిదారులను గుర్తించి ప్రత్యేకంగా జాబితా రూపొందించారు. వీటిలో హోటల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను ప్రత్యేకంగా గుర్తించి రెడ్‌ నోటీసులు జారీ చేశారు. వీటికి సంబంధించిన పాత బకాయిల ను సైతం ఏడు రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, డిప్యూటీ కమిషనర్లను క్షేత్రస్థాయిలోకి పంపుతున్నారు.

ఇందూరులో ఆస్తి పన్నుల వసూలుకు

నెలాఖరు వరకు స్పెషల్‌ డ్రైవ్‌

వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు

బకాయిల వసూళ్లకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. నలుగురైదుగురు మొండి బకాయిదారులపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాం. మొత్తం ఇంకా రావాల్సిన 41.5 కోట్లలో ఈ నలుగురైదుగురే రూ.15 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అందరికీ ముందుగానే సమాచారం ఇస్తుండడంతో పాటు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నాం. వసూళ్లకు సంబంధించి ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశాం. ప్రతి రోజూ ఉదయం సంబంధిత బృందాల్లోని అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసి క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముందురోజు రాత్రే వసూళ్ల ప్రణాళిక వివరాలను వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేసేలా నిర్ణయించాం. బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు అయితే నగర అభివృద్ధికి ఉపయోగపడతాయి.

– దిలీప్‌కుమార్‌, కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement