సుభాష్‌నగర్: జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) దిలీప్‌కుమార్ సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌ను నియమించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. దిలీప్ కుమార్‌ను పలువురు జిల్లా అధికారులు కలిసి పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేడు, రేపు మద్యం
దుకాణాలు బంద్
నిజామాబాద్ అర్బన్: హోలీ పండుగ నేప థ్యంలో మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు కమిషనరేట్ పరిధిలో మద్యం దు కాణాలు బంద్ ఉంటాయని పోలీస్ కమిషన ర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా మద్యం దుకాణాలు, కల్లుడిపోలు, బార్‌లు బంద్ పాటించాలని పేర్కొన్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.
687 మంది
విద్యార్థుల గైర్హాజరు
ఖలీల్‌వాడి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సో మవారం ఫస్టియర్ మ్యాథ్స్–1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగగా, 96.8 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
మొత్తం 21,473 మంది విద్యార్థులకు గాను 20,786 మంది హాజరు కాగా, 687 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లాలోని మొత్తం 58 పరీక్షాల కేంద్రాలకుగాను తాను ఆరు జూనియర్ కళాశాలలను తనిఖీ చేయగా, 56 కేంద్రాలను పరీక్షల అధికారులు పర్యవేక్షించారన్నారు.
పోలీస్ ప్రజావాణికి
34 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో 34 ఫి ర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ సా యి చైతన్య ఫిర్యాదులు స్వీకరించారు. ఫి ర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్‌ల బాధ్యులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసులకు విన్నవించుకోవాలని ఆయన సూచించారు.


