వచ్చిన బస్తాలు వచ్చినట్లుగా.. | - | Sakshi
Sakshi News home page

వచ్చిన బస్తాలు వచ్చినట్లుగా..

Mar 3 2026 7:25 AM | Updated on Mar 3 2026 7:25 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో యూరియా విక్రయాలు అసాధారణ స్థితికి చేరాయి. సొసైటీలకు వచ్చిన బస్తాలను వచ్చినట్లుగా రైతులు తీసుకెళ్తుండడంతో గోదాములు వేగంగా ఖాళీ అవుతున్నాయి. జిల్లా కోటా ముగిసిన కూడా రైతులు ఇంకా యూరియా బస్తాలను కొనుగోలు చేయ డం వ్యవసాయాధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంత స్టాక్‌ తెప్పించినా సరిపోవడం లే దని తలలు ప ట్టుకుంటున్నారు. యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. అత్యధికంగా వరి 4.25లక్షల ఎకరాలు, మొక్కజొన్న 32,754 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాకు 78వేల మెట్రిక్‌ టన్నుల యూరి యా సరిపోతుందని భావించిన వ్యవసాయశాఖ బ ఫర్‌ స్టాక్‌తో కలిపి మొత్తం 82వేల మెట్రిక్‌ టన్నులు అవసరమని రాష్ట్ర శాఖకు ఇండెంట్‌ పంపింది. రైతులు వరికి మూడో డోసు యూరియా తీసుకునే సమయంలోనే ప్రభుత్వం ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యా ప్‌ను తీసుకొచ్చింది. అప్పటికే పాత పద్ధతిలో ఒక టి, రెండు డోసుల యూరియాను తీసుకున్న రైతు లు రానున్న రోజుల్లో కొరత రావచ్చనే ఉద్దేశంతో యాప్‌ ద్వారా మరింత యూరియా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద రైతులు ఎక్కువ బస్తాలను తీసుకెళ్లడంతో చిన్న రైతులకు సమయానికి దొరకడం లేదు. ఇప్పటి వరకు 79వేల మెట్రిక్‌ టన్నుల యూ రియా అమ్ముడుపోగా, సోమవారం మరో వెయ్యి మెట్రిక్‌ టన్నులు తెప్పించారు. ఇది కూడా సరి పోదని జిల్లాకు మరింత కావాలని వ్యవసాయ శాఖ ఇండెంట్‌ పంపింది. పోయిన ఏడాది యాసంగిలో 79,615 మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దానిని మించి కొనుగోళ్లు జరుగుతాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ విధానం కారణంగా కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ లేని రైతులు బుకింగ్‌ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో సొసైటీల ముందు, రోడ్లపై ధర్నా లు చేస్తున్నారు. యాప్‌ అలవాటైన రైతులు మా త్రం చకచక యూరియాను బుకింగ్‌ చేసేస్తున్నా రు. స్టాక్‌ వచ్చిందని తెలియగానే స్టాక్‌ ఎక్కడ అ యిపోతుందేమోనని పొద్దున్నే సొసైటీ గోదాము ల వద్ద మొబైల్‌ ఫోన్‌లతో కుస్తీ పడుతున్నారు.

రైతులు అవసరం మేరకే తీసుకోవాలి

యాసంగి సీజన్‌కు అవసరమయ్యే యూరియా కోటా ఇప్పటికే పూర్తయ్యింది. ఇంకా రైతుల నుంచి డిమాండ్‌ ఉండడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లాకు ఎప్పటికప్పుడు యూరియాను తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు సహకరించి అవసరం మేరకే బస్తాలను తీసుకెళ్లాలి. యాప్‌ను అందరూ అలవాటు చేసుకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఉండవు. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో అసాధారణంగా యూరియా విక్రయాలు

యాసంగిలో ఇప్పటి వరకు 79వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసిన రైతులు

జిల్లా కోటా ముగిసినా..

మరింత తెప్పిస్తున్న వ్యవసాయ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement