ప్రజావాణికి అధికారులందరూ రావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి అధికారులందరూ రావాలి

Mar 3 2026 9:14 AM | Updated on Mar 3 2026 9:14 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ప్రజల నుంచి వినతుల స్వీకరణ

నిజామాబాద్‌అర్బన్‌: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆమె అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో, ప్రజావాణికి హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సీబీఎస్సీ పాఠశాల పేరుతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు అడ్మిషన్లు చేపడుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ నాయకులు అఖిల్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చే శారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బోర్గాం(కె) గ్రామానికి చెందిన కొందరు గేదెలను కట్టేస్తున్నారని వాటి ని తొలగించడం లేదని గ్రామానికి చెందిన మాల కులస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలోని కంఠేశ్వర్‌లోని మహా దేవ్‌ హైట్స్‌ భవన నిర్మాణం నిబందనలకు విరద్ధుంగా ఉండడంతో తుమ్మ శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గతంలో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను కలెక్టర్‌కు వివరించా రు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ము న్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ విచారణ చేయా లని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారంటూ..

కలెక్టరేట్‌ వద్దకు సందీప్‌ అనే వ్యక్తి తన ఆర్టీసీ అద్దె బస్సును తీసుకవచ్చి తనను అధికారులు వేధిస్తున్నారని నిరసన చేపట్టారు. బస్సును ఐదు రోజులు నడపకుండా, డిపోలోనే ఉంచి తనకు ఆర్థికంగా నష్టపరిచారని ఆర్‌ఎం జ్యోత్స్న, డిపో మేనేజర్‌ ఆనంద్‌పై ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement