జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

Mar 3 2026 9:14 AM | Updated on Mar 3 2026 9:14 AM

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ పరీక్షలు పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్‌ మాచారెడ్డిలో నాలుగు కాళ్ల కోడి

నిజామాబాద్‌ అర్బన్‌: హోలీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ ఇ లా ట్రిపాఠి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రా గద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఒక ప్రకటనలో ఆకాంక్షించా రు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకోవాలని అభిలాషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా పండుగను నిర్వహించుకోవాలన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఒక విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు గానూ 27 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్‌ అయినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలు, యూనివర్సిటీ మెయి న్‌ క్యాంపస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల, భిక్కనూర్‌ సౌత్‌క్యాంపస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, రెగ్యులర్‌ మొదటి, 7వ సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,905 మంది విద్యార్థులకు గానూ 1,798 మంది హాజరు అయ్యారు. 107 మంది గైర్హాజరయ్యారు. ఆర్మూర్‌లోని పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడటంతో డిబార్‌కు గురయ్యారు.

మాచారెడ్డి: కోళ్లకు సాధరణంగా రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. అయితే మాచారెడ్డి మండలం గజ్యనాయక్‌ తండా చౌరస్తాలోని ఎజాజ్‌ అనే యువకుడి చికెన్‌ సెంటర్‌లో నాలుగు కాళ్ల కోడి ఽసోమవారం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చికెన్‌ సెంటర్‌ వద్దకు భారీగా తరలివచ్చి వింత కోడిని చూశారు. జన్యులోపంతో అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతుందని పలువురు విదావంతులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement