ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరీక్షకు ఆన్‌లైన్‌ గండం | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరీక్షకు ఆన్‌లైన్‌ గండం

Mar 3 2026 9:14 AM | Updated on Mar 3 2026 9:14 AM

ఇబ్బందులు వస్తున్నాయి..

5వ తరగతికి నిర్వహించాలి..

కమ్మర్‌పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఆన్‌లైన్‌ మాక్‌ పరీక్షకు గండాలు వెంటాడుతున్నాయి. దీంతో సోమవారం (మార్చి 2) నిర్వహించిన ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ విఫలమైంది. విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల కోసం ఎన్‌సీఈఆర్టీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్య శాస్త్రం(ఫౌండేషన్‌ లిట్రసీ అండ్‌ న్యూమరసీ–ఎఫ్‌ఎల్‌ఎన్‌)ను 2021–22 నుంచి నిర్వహిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నిపుణ భారత్‌ కార్యక్రమం కింద మూడో తరగతి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు తెలుసుకునేందుకు ఎన్‌సీఈఆర్టీ మార్చి 12, 13న దేశమంతటా సామర్థ్యాల పరీక్ష నిర్వహించనుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయిలో మూడవ తరగతి విద్యార్థులకు 3వ నమునా పరీక్షను మార్చి 2, 4 తేదీలలో ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ అధికారులు, ఎస్‌సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు.

మూడు నమూనా పరీక్షలు..

జిల్లావ్యాప్తంగా 719 ప్రాథమిక, 127 ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలిపి మొత్తం 15600 మంది విద్యార్థులు మూడవ తరగతి చదువుతున్నారు. రాష్టస్థాయిలో ఎస్‌సీఈఆర్టీ మూడో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఇదివరకు రెండు నమూనా పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించారు. కానీ మూడో మాక్‌ టెస్ట్‌ను ఆన్‌లైన్‌ నిర్వహించగా, సాంకేతిక కారణాలతో ఫెయిల్‌ అయింది. చాలా చోట్ల సైట్‌ ఓపెన్‌ కాలేదు. కొందరికి సైట్‌ ఓపెన్‌ అయినా పరీక్ష ప్రశ్న పత్రం రాలేదు. దీంతో జిల్లాలో సుమారు 90 శాతం పాఠశాలల్లో 3వ నమూనా పరీక్ష నిర్వహించలేదు. ఎస్‌సీఈఆర్టీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ విఫలమైందని పలు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మూడో మాక్‌ టెస్ట్‌ను కూడా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఈనెల 4న జరుగనున్న మరో పరీక్షను సైతం ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్‌సీఈఆర్టీ నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరీక్ష కోసం రాష్ట్ర విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్టీ సంయుక్తంగా డిసెంబర్‌ నుంచి విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతిరోజు ఒక పీరియడ్‌లో 45 నిమిషాలు పాఠ్యంశాలు, మిగిలిన 45 నిమిషాలు ఎఫ్‌ఎల్‌ఎన్‌పై తర్పీదు ఇస్తున్నారు. కానీ జిల్లాలో దాదాపుగా 280 పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఒకరిద్దరూ ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఇటువంటి పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రిపరేషన్‌లో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒకరిద్దరూ ఉన్న బడుల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ సంసిద్ధతలో తీవ్ర ఇ బ్బందులు ఎదురవుతున్నా యి. ఇతర తరగతుల విద్యా ర్థులను పక్కన పెట్ట వీరికి బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –వేంకటేశ్వర్‌గౌడ్‌,

పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాల కోసం ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరీక్ష నిర్వహించడం శుభపరిణామం. కానీ ప్రాథమిక స్థాయిలో 5వ తరగతికి కూడా నిర్వహించాలి. 3వ నమూనా పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తే బాగుంటుంది.

–ప్రవీణ్‌కుమార్‌, ఎస్జీటీ

ఎస్‌సీఈఆర్టీ అధ్వర్యంలో

విద్యార్థులకు మాక్‌టెస్టులు

ఇప్పటికే 2 నమూనా

పరీక్షలు ఆఫ్‌లైన్‌లో పూర్తి

3వ పరీక్షకు సాంకేతిక ఆటంకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement