93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్‌ సీక్రెట్‌ ఇదే.. | US woman spends in India shares her secret to long and happy life | Sakshi
Sakshi News home page

93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..

Mar 3 2026 1:05 PM | Updated on Mar 3 2026 1:14 PM

US woman spends in India shares her secret to long and happy life

ఆ బామ్మ చూస్తే తొమ్మిది పదుల వయసు అనిపించదు. వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా ఆరోగ్యంగా,చలాకీగా ఉంటుందా బామ్మ. స్వతహాగా అమెరికన్‌ అయినా ఆమె మన భారత్‌ని మెచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. పైగా మన ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి..మన భారతీయత ఉట్టిపడేలా ఆహార్యం, సంస్కృతిని మార్చేస్తుకుందామె. పైగా ఈ గడ్డపైనే ఓ సామాన్య భక్తురాలిలా జీవిస్తోందామె. ఎవరామె అంటే..

ఆ బామ్మే అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న. దీర్ఘాయువు అనేది ఎక్కడ నుంచో కాదని, మన సంతోషం, జీవనవిధానం నుంచే వస్తుందని చెప్పలా జీవిస్తోంది ఈ బామ్మ. యాంటీ ఏజింగ్‌ ట్రెండ్‌కి సరిగ్గా సరిపోతుంది ఆమె జీవన విధానం. ఇప్పటికీ రెండు పూటల సైక్లింగ్‌ చేస్తుందట. తనకు ఎలాంటి వైద్య మస్యలు లేవని  అంటోంది. బుద్దిపూర్వకంగా తినడం, శరీరానికి సరిపడ వ్యాయామాలు, స్నేహితులతో కలివిడిగా ఉండటం ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని చెబుతోంది. తొంభైఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చలాకీగా చేసుకుంటానని అంటోంది. 

తనకు ఆర్థరైటిస్‌ తప్ప మరే సమస్యలు లేవని చెబుతోంది. వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ ఈ విదేశీ బామ్మ హెల్దీ లైఫ్‌ సీక్రెట్‌ గురించి నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె ప్రతి విషయాన్ని సానుకూలత దృక్పథంతో చూసే తీరే ఆమె దీర్ఘాయువుకి కారణం అంటూ ఆమె జీవిన విధానం గురించి పోస్ట్‌లో తెలిపారు. పైగా ఈ బామ్మ తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం మెడిసిన్స్‌ మానేయడమేనని హాస్యస్పదంగా చెబుతుంటుందని అన్నారు. 

ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా, తమిళనాడులలోని ఆధ్యాత్మిక కమ్యునిటీలో సభ్యురాలు కూడా. 2001 నుంచి ఈ కమ్యూనిటిలో సభ్యురాలిగా అంకితభావంతో సేవలందిస్తోంది. ఒకప్పుడు ప్రముఖ సంస్థలో విజయవంతమైన సేల్స్‌ మేనేజర్‌ పనిచేసిన తదనంతరం ఈ జీవనశైలికి మారిపోయిందని చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. 

నెటిజన్లు కూడా ఈ బామ్మ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టిన సూపర్‌బామ్మ అంటూ పోస్టులు పెట్టారు. విదేశాల్లో హైఫై లైఫ్‌ని పక్కన పెట్టి మన సంస్కృతి, వేషధారణను నేర్చుకుని ఆధ్యాత్మికవేత్తగా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు. 

 

(చదవండి: నడక చాలు...జిమ్‌కు వీడ్కోలు...!)
 

Advertisement
 
Advertisement
Advertisement