సుమత్రా దీవిలో భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు | Earthquake Strikes Off Indonesia Sumatra Island With Magnitude Of 6.1, No Casualties Or Damage Reported | Sakshi
Sakshi News home page

Indonesia Earthquake: సుమత్రా దీవిలో భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు

Mar 3 2026 12:22 PM | Updated on Mar 3 2026 12:32 PM

Earthquake Strikes off Indonesias Sumatra Island

జకార్తా: భూకంప తీవ్రత ఇండోనేషియాను మరోమారు వణికించింది. మంగళవారం ఉదయం సుమత్రా దీవి సమీప సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఇండోనేషియా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ (AFP) తెలిపింది.

భౌగోళికంగా ఇండోనేషియా అత్యంత క్రియాశీలకమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోట ఈ దీవుల సముదాయం విస్తరించి ఉండటమే ఈ వరుస భూప్రకంపనలకు ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేకపోయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement