‘భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది’.. పాక్‌ అధ్యక్షుడు | Pakistan President Zardari claims India preparing for another war | Sakshi
Sakshi News home page

‘భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది’.. పాక్‌ అధ్యక్షుడు

Mar 3 2026 9:08 AM | Updated on Mar 3 2026 9:36 AM

Pakistan President Zardari claims India preparing for another war

ఇస్లామాబాద్: ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో భారత్‌ దాడులు చేస్తుంటే తనని బంకర్‌లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆరోపించారు.  

పాకిస్థాన్‌ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం ‘హైడ్రో టెరరిజా’నికి పాల్పడింది. రాజకీయానికి నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమజసం కాదు.  భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మేము శాంతి, సంభాషణ ద్వారానే సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలే భారత్‌తో చర్చలు జరిపేందుకు పాక్‌ సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేశారు.

జర్దారీ వ్యాఖ్యలు,ఇటీవల భారత్–పాకిస్థాన్‌ సంబంధాలు మరింత జఠిలమయ్యాయి. ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు శాంతి మార్గంలో ముందుకు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అని కాలమే నిర్ణయించాల్సి ఉంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement