breaking news
Indus Water Treaty
-
Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్‌లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్‌లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్‌కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్‌లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్‌తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్‌కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్‌లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్‌కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్‌లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్‌కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్‌యాన్‌కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్‌ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్‌మంత్రీ వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్‌కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’. -
కాల్పుల విరమణకు పాక్ అడుక్కుంది: జై శంకర్
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్‌తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. -
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపై పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ స్పందించారు. సింధు జల ఒప్పందం (IWT) తన దేశానికి రెడ్ లైన్ అని అభివర్ణించారు. నీటి సమస్యపై ఇస్లామాబాద్ (పాక్ రాజధాని) ఎప్పటికీ రాజీపడదు’ అని ప్రకటించారు.పాకిస్తాన్లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు, ప్రిన్సిపల్స్, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ.. రెడ్‌లైన్ అనేది పాకిస్తాన్ నీరు. 24 కోట్ల పాకిస్తానీయుల కనీస హక్కు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమంటూ భారత్ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై గురించి ప్రస్తావించారు.గత నెల ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ముష్కరులు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ ఆటకట్టించేందుకు ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఏప్రిల్ 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ ఉగ్రవాదుల స్థావరాల్ని నేలమట్టం చేసింది. వందల మంది పాక్ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపింది. అదే సమయంలో భారత్- పాక్ మధ్య 1960లో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో నీటి యుద్ధాలు మొదలయ్యాయి. తాగేందుకు,వ్యవసాయం చేసేందుకు, నిత్యవసరాలకు వినియోగించుకునేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియోలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంపై అసమ్మతి మొదలైంది. ఆ అసమ్మతిని చల్లార్చేందుకు భారత్‌కు లేఖ రాసింది. తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నానమని, సింధూ జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంలో పునసమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. భారత్ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. -
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి. -
ఆనకట్టల కట్టడి
సింధూ, దాని పరీవాహక నదుల నుంచి పాకిస్తాన్‌కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్, ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులకు సూచించింది. జమ్మూ కశ్మీర్లో చినాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్, సలాల్ జల విద్యుత్కేంద్రాల్లో ఆ దిశగా గురువారం లాంఛనంగా మొదలైన పూడికతీత పనులు సోమవారం పూర్తిస్థాయికి చేరాయి. పనుల్లో భాగంగా రెండు డ్యాముల్లో అవసరమైన గేట్లను గురువారం నుంచి శనివారం దాకా పాక్షికంగా ఎత్తడంతో పాక్‌లోని సరిహద్దు ప్రాంతాలు నీటమునిగాయి. సింధూ జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్‌కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. 1960ల్లో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒప్పందాన్ని బూచిగా చూపుతూ పూడిక పనులను పాక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడిక ఆ ప్రాజెక్టుల్లోని పూడిక మొత్తాన్నీ తొలగించి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. అప్పటిదాకా చినాబ్ నదీజలాలు పాక్‌కు పూర్తిగా నిలిచిపోయినట్టే!. సింధూ ఒప్పందం ప్రకారం చినాబ్ జలాలు పాక్‌కే చెందుతాయి. వాటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడానికి వీల్లేదు.మూడింటి నుంచి నీళ్లు బంద్జమ్మూ కశ్మీర్లో సింధూ, దాని పరీవాహక నదులపై ఆరుకు పైగా జలాశయాల్లో పూడికతీతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ సారథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాగ్లిహార్, సలాల్‌తో పాటు జీలం నది మీది కిషన్‌గంగ జలాశయాల నుంచి పాక్‌కు నీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపేశారు. దాంతో పాక్‌లోని పంజాబ్ తదితర ప్రాంతాలకు సాగునీరు నిలిచిపోయింది. సలాల్ ప్రాజెక్టును 1987లో, బాగ్లిహార్ను 2008లో నిర్మించారు. అప్పటినుంచీ వాటిలో పూడికతీత చేపట్టడం ఇదే తొలిసారి. సలాల్ 690 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. బాగ్లీహార్ సామర్థ్యం 900 మెగావాట్లు. పూడిక నేపథ్యంలో వాటిలో విద్యుదుత్పాదన చాలాకాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతూ వస్తోంది.10 వేల మెగావాట్ల విద్యుత్జమ్మూ కశ్మీర్లో సింధూ, ఉప నదులపై మొదలు పెట్టిన ఆరు ప్రాజెక్టులు పాక్ అభ్యంతరాల నేపథ్యంలో చాన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటి నిర్మాణాన్ని తక్షణం పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సవాల్కోట్ (1,856 మెగావాట్లు), కిర్తాయ్ 1, 2 (1,320 ఎంవీ), పాకాల్దుల్ (1,000 ఎంవీ)తో పాటు 2,224 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మరో ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఏకంగా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌తో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మరిన్ని జలవనరులు అందుబాటులోకి వస్తాయి. సింధూ ఒప్పందం కింద ఇలాంటి పనులకు పాక్‌కు ఆర్నెల్ల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజా చర్యలను అడ్డుకునేందుకు పాక్‌కు పెద్దగా మార్గాలేమీ లేవు. మధ్యవర్తి అయిన ప్రపంచబ్యాంకు కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఇరు దేశాలనూ చర్చలకు ప్రోత్సహించడం తప్ప ఒప్పందం అమలుకు ఆదేశించడం వంటి అధికారాలేవీ దానికి లేవు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఆ నీళ్లు ఇవ్వకపోయినా ఇబ్బందేం లేదు’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ చుట్టూ భారత్ ఉచ్చు బిగుస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న తన నీటి వాటాను నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెచ్చరికలను పాక్ పట్టించుకోవడం లేదు. నీళ్లు ఇచ్చినా.. ఇవ్వకపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని పాకిస్తాన్ తెలిపినట్లు సమాచారం. ఈ విషయం గురించి పాకిస్తాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్ మాట్లాడుతూ.. ‘సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు నదుల్లో మూడు నదులపై పాకిస్తాన్‌కు, మరో మూడు నదులపై ఇండియాకు హక్కులు ఉన్నాయి. మూడు పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు.. మూడు తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్‌పై భారత్‌కు హక్కులున్నాయి. అయితే భారత్‌కు హక్కులున్న నదుల్లో మిగులు నీరు పాకిస్తాన్‌కు వెళ్తున్నది. ఇప్పుడు ఈ జలాలను జమ్ముకశ్మీర్ ప్రజలకు ఇస్తామని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ నీటిని భారత్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మాకు నష్టం లేదు’ అని ఆయన అన్నారు.(పాక్‌పై జలఖడ్గం) అంతేకాక ‘ఈ జలాల విషయమై మాకు ఆందోళనగానీ, అభ్యంతరంగానీ ఏమీ లేదు. ఆ నదుల్లోని నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చు. సింధూ నదీ జలాల ఒప్పందం కూడా అందుకు అనుమతి ఇచ్చింది’ అని స్పష్టం చేశారు. అయితే తమకు హక్కులున్న పశ్చిమ నదులు చీనాబ్, సింధు, జీలం నదుల్లోని నీటిని మళ్లిస్తే మాత్రం తమ అభ్యంతరాలను లేవనెత్తుతామ’ని ఆయన తెలిపారు. -
అలా.. నడుచుకుందాం
ఒప్పందం ప్రకారం ముందుకెళదాం అలాచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది వరల్డ్ బ్యాంక్కూడా మా వైపే ఉంది ఐరాసలో పాక్ ప్రధాని ఐక్యరాజ్య సమితి : సింధూ నదీ జలాలపై పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించింది. సింధూనదిపై భారత్ కేవలం విద్యుత్ అవసరాలకోసమే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నా.. పాక్ మాత్రం వాటిపై వివాదాలను రాజేస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సమావేశంలో ప్రసంగించిన పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ.. సింధూ నదీ జలాలపై గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఇరు దేశాల మధ్య నదీ జలాల విషయంపై ఎటువంటి వివాదాలు చెలరేగిన ఒప్పందం ప్రకారంపరిష్కరించుకోవచ్చని తెలిపారు. నదీ జలాలపై ఏర్పడ్డ సమస్య విషయంలో ప్రపంచ బ్యాంక్ కూడా మా వైఖరిని సమర్థించిందని పేర్కొన్నారు. సింధూనదిపై భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టు వివాదంపైఘీ నెల 14,15 తేదీల్లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భారత్-పాక్దేశాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. అయితే ఈ చర్చలు ఏ మాత్రం ఫలవంతం కాలేదు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్-పాకిస్తాన్లో 1960లో ప్రపంచబ్యాంక్ సమక్షంలో సింధూ నదీ జలాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నదీ జలాలపై ఏమైనా సమస్యలు, వివాదాలు ఏర్పడితే.. ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వం చేయవచ్చు. -
ఏకపక్షంగా తప్పుకోవద్దు: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: సింధు నదీ జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ల పరస్పర అంగీకారంతో 1960లో కుదిరిందని, ఏ ఒక్క దేశం ఏకపక్షంగా ఒప్పందం నుంచి తప్పుకోలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ భద్రతకు అంతర్గతంగాను, బయటి దేశాల నుంచి కూడా ఏ ముప్పూ లేదని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని బుధవారం అధికారులతో జరిగిన భేటీలో అన్నారు. ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ అధీనంలో ఉన్న నదుల్లోని నీటిని గరిష్టంగా వినియోగించాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాక్ ప్రతినిధుల బృందం ప్రపంచ బ్యాంకు అధికారులతో భేటీ అయింది. ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన బ్యాంకు తటస్థంగా ఉంటూనే ఒప్పంద అంశాన్ని సకాలంలో పూర్తిచేసే బాధ్యత తనకు ఉందని పేర్కొన్నట్లు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. -
భారత్ తలుచుకుంటే పాక్ ను నలిపేయొచ్చు
న్యూఢిల్లీ: ఏళ్లుగా భారత్ పై ఉగ్రవాద దాడులు చేయిస్తూ ప్రపంచసభలలో నీతి సూక్తులు వల్లించే పాకిస్తాన్ ను భారత్ తలుచుకుంటే ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. అవును. సింధు నదీ జలాల్లో ఒప్పందం ప్రకారం మనకున్న హక్కును ఉపయోగించుకున్నా.. నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా.. అది పాకిస్తాన్ పాలిట యమపాశమే అవుతుంది. ఉడీ దాడిలో 18మంది సైనికులను పొట్టనబెట్టుకోవడమే కాక.. కశ్మీర్ లో కల్లోలాలు సృష్టిస్తోంది భారతేనని పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో చెప్పింది. దీంతో ఎన్నడూ లేని విధంగా యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ పాక్ కు ధీటుగా సమాధానం కూడా ఇచ్చింది. అంతేకాదు అప్పటివరకూ అంతర్జాతీయ రాజకీయాల్లో సంయమనంతో అడుగులేస్తున్న భారత ప్రభుత్వంలో తీవ్ర కదలిక మొదలైంది. యుద్ధాల సమయంలో కూడా రద్దు చేసుకోని ఒప్పందాన్ని కొనసాగించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. రక్తం నీరూ కలిసి ఒకేసారి ప్రవహించలేవంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా. నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఒక్కటే రద్దు చేసుకోలేదని పాక్ చేస్తున్న వ్యాఖ్యలు ఉత్తి మాటలే. భారత్ తలుచుకుంటే ఒప్పందాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. ఇందుకు సంకేతాలను కూడా ఇప్పటికే భారత్ బయటపెట్టింది. ఒప్పందానికి సంబంధించిన వివరాలు: సింధు జలాల శాశ్వత కమిషన్ ఒప్పందం ప్రకారం సింధు జలాలను పంపీణీ చేసే క్రమంలో శాశ్వత కమిషన్ ను నియమించారు. ఉగ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఇరుదేశాల్లో లేనప్పుడే సింధు జలాల కమిషనర్లు సమావేశం అవుతారు. ఇలా సంవత్సరానికి రెండు సార్లు ఇరుదేశాల కమిషనర్లు సమావేశమౌతారు. ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకూ(1965,1971,కార్గిల్ యుద్ధ సమయాల్లో కూడా) ప్రతి ఏటా కమిషనర్లు సమావేశమౌతూనే ఉన్నారు. ప్రభావం పాకిస్తాన్ ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఎలా అంటే.. - ఒప్పందం ప్రకారం ఇరుదేశాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడితే మూడు దశల్లో పరిష్కరించుకోవచ్చు. ఇరు దేశాలు రెండేళ్ల పాటు వివాదంపై సంప్రదింపులు జరుపుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే..ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసిన నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇదీ సఫలం చెందకపోతే ఇరువర్గాలు యూఎన్ కోర్టును ఆశ్రయించవచ్చు. - అయితే, ఇందులో ఒక మెలిక ఉంది. ఆ మెలికే ఇప్పుడు పాక్ మెడకు ఉరితాడు కానుంది. ఇరుదేశాలు రెండేళ్ల పాటు జరగాల్పిన చర్చల్లో ఏదైనా ఒక దేశం చర్చలకు ముందుకు రాకపోతే మిగిలిన రెండు దశలకు వెళ్లే అవకాశాన్ని అవతలి దేశం కోల్పోతుంది. ఇప్పుడు ఈ మెలికనే భారత్ పావుగా వాడుకుంటోంది. పాకిస్తాన్ రాయబారి సర్తాజ్ అజీజ్ నీటి సమస్యపై భారత్ ను చర్చలకు ఆహ్వానించినా అందుకు తిరస్కరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్ధితిలో ఉన్న పాకిస్తాన్ ప్రపంచ బలమైన ఆర్ధిక వ్యవస్ధల వద్దకు తీసుకెళతాం అంటూ భీకరంగా నటిస్తోంది. నీటి పంపకాలపై చర్చలకు 'నో' చెప్పేసిన భారత్ కు పాక్ ను ఇంకా ముప్పతిప్పలు పెట్టేందుకు రెండు భారీ అవకాశాలున్నాయి. వీటిని భారత్ గనుక వినియోగించుకుందంటే పాకిస్తాన్ అన్నివిధాల తీవ్రపరిణామాలను ఎదుర్కొంటుంది.అవేంటో చూద్దాం. 1.తుల్ బుల్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడం 1987లో పాకిస్తాన్ తుల్ బుల్ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో భారత్ నిర్మాణాన్ని నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత భారత్ ఈ ప్రాజెక్టును పక్కనబెట్టినట్లు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పేర్కొంది. పాక్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి చేపట్టే యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. ప్రభావం 439 అడుగుల తుల్ బుల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జీలం నదీ జలాలపై భారత్ పట్టు సాధిస్తుంది. ఇది పాకిస్తాన్ ను వ్యవసాయపరంగా సంక్షోభంలోకి నెడుతుంది. - జీలం-చీనాబ్ నదులను కలుపుతూ ఉండే అప్పర్ బారీ డోఆబ్ కెనాల్(దీన్ని పాకిస్తానీలు ట్రిపుల్ కెనాల్ ప్రాజెక్టు అంటారు)కు తుల్ బుల్ నిర్మాణం సమస్యలను తెస్తుంది. - ఈ ప్రాజెక్టు ద్వారా జీలం నదిపై భారత్ పట్టు సంపాదించడం వల్ల పాక్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్(పీఓకే)ల్లో వరదలు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. 2. ఇంటర్ మినిస్టేరియల్ టాస్క్ ఫోర్స్ పశ్చిమ దిశ నుంచి వచ్చే నదుల్లో నీటి వినియోగంపై భారత్ టాస్క్ ఫోర్స్ ను వేసింది. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి సంపదను భారత్ ఎంతైనా వినియోగించుకోవచ్చు. కానీ, పశ్చిమంగా ప్రవహించే నదుల నుంచి కేవలం 20శాతం నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రభావం భారత్ కావాలనుకుంటే జీలం, చినాబ్, సింధు నదుల నీటిని కూడా అపరిమితంగా వాడుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ నీటి కొరతతో అల్లాడుతుంది. -
'పాక్, ఇండియాలు దగ్గరవ్వాలి: చైనా
బీజింగ్: ఉడీ ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సింధూ జలాల ఒప్పందం రద్దు, సీమాంతర ఉగ్రవాదం తదితర విషయాలపై చైనా ఆచితూచి స్పందించింది. అసలు వైఖరి ఎలా ఉన్నప్పటికీ పైకి మాత్రం శాంతివచనాలు వల్లెవేసింది. ఇండియా-పాకిస్థాన్ లు కలిసి కూర్చుని చర్చించుకోవడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుంగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. 'పాకిస్థాన్, ఇండియాలు పరస్పరం చర్చించుకుని, సంప్రదింపుల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందంపై ఒక నిర్ణయానికి వస్తాయని ఆశిస్తున్నాం. ఇరువురి మధ్య మైత్రినెలకొనాలని బాధ్యతగల పొరుగుదేశంగా చైనా కోరుకుంటోంది. ఆసియాలో శాంతి, సుస్థిరతలకు భారత్-పాక్ ల స్నేహం ఎంతో కీలకం. అయితే సీమాంతర ఉగ్రవాదం లేనప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆమేరకు ఇరు దేశాలూ దగ్గరవ్వాలి'అని జెంగ్ షుంగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. '1960 నాటి సింధూ జలాల ఒప్పందం'పై సోమవారం ఢిల్లీలో సమీక్షజరిపిన ప్రధాని మోదీ.. పాక్ వైపునకు ప్రవహిస్తోన్న నదీ జలాల్లో భారత్ కు ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింధూ ఒప్పందం రద్దుపై స్పష్టత రావాల్సిఉన్నది. మరోవైపు పాక్.. సింధూ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దుచేసుకోలేదని, ఒకవేళ అలా చేస్తే ఐక్యరాజ్యసమితికి, భద్రతామండలికి ఫిర్యాదుచేస్తామని ప్రకటించింది. -
నెత్తురు, నీళ్లు కలసి ప్రవహించలేవు
పాక్‌తో సింధు నీటి ఒప్పందం సమీక్షలో ప్రధాని మోదీ - పాకిస్తాన్ నియంత్రణలోని నదుల నీటిని గరిష్టంగా - వాడాలని నిర్ణయం ఒప్పంద అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల నీటి ని గరిష్టంగా వినియోగించుకోవాలని భారత్ నిర్ణయించింది. 56 ఏళ్ల నాటి భారత్-పాక్ సింధు జలాల ఒప్పందంపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. నెత్తురు, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయి నీటిని వినియోగించాలంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌పై ఎదురుదాడిని ఉధృతం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. నదీ జలాల ఒప్పందంపై పూర్తి వివరాల అధ్యయనానికి అంతర్ మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఒప్పందం పూర్తిస్థాయిలో తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. టాస్క్‌ఫోర్స్ బృందంలో జలవనరులు, విదేశాంగ, విద్యుత్, ఆర్థిక శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తూర్పుకు ప్రవహించే నదుల్లో(సింధు, చినాబ్, జీలం) భారత్ హక్కులపై బృందం అధ్యయనం చేస్తుంది. చీనాబ్‌పై పాకల్‌డల్, సవాల్కోట్, బుర్సార్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, జలవనరుల కార్యదర్శితో పాటు పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింధు ఒప్పందం, నదులపై ఉన్న ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రధానికి కూలంకషంగా వివరించారు. భవిష్యత్తులో ‘ఇండస్ వాటర్ కమిషన్’ సమావేశాలు ఉగ్రవాద రహిత వాతావరణంలోనే సాధ్యమంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. అలాగే 1987 నాటి టుల్బుల్ నావికా మార్గం రద్దుపై సమీక్షించాలని కూడా నిర్ణయించారు. 2007లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారు. భారత్, పాక్‌ల మధ్య నదీ జలాల ఒప్పందం తమకు అనుకూలంగా లేదని గతంలో జమ్మూ కశ్మీర్ ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో తాజా నిర్ణయాలతో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు. ఒప్పందం ఇదీ.. 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సింధు(ఇండస్) జలాల ఒప్పందంపై సంతకం చేశారు. దాని ప్రకారం భారత్.. బియాస్, రావి, సట్లేజ్ నదుల నీటిని, పాక్ సింధు, చీనాబ్, జీలంల నీటిని వాడుకోవాలి. 9.12 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని భారత్ వాడుకోవచ్చు. దీన్ని మరో 4.2 లక్షల ఎకరాలకు విస్తరించవచ్చు. భారత్ 8 లక్షల ఎకరాలకు సరిపడా నీటినే వాడుతోంది. అలాగే భారత్ 18,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 3,034 మెగావాట్లే ఉత్పత్తి చేస్తోంది. మరో 2,526 మెగావాట్ల ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. 5,846 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి తుది దశలో ఉంది. తమకు తగినంత నీరు రావడం లేదంటూ పాక్ చాలాసార్లు అంతర్జాతీయ కోర్టుకెక్కింది.