'44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది': ఓప్రా సలహాపై త్రిష రిప్లై ఇదే..! | Trisha Krishnan recently shared a clip of Oprah Winfrey discussing | Sakshi
Sakshi News home page

'44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది': ఓప్రా సలహాపై త్రిష రిప్లై ఇదే..!

Jul 27 2026 11:10 AM | Updated on Jul 27 2026 11:33 AM

Trisha Krishnan recently shared a clip of Oprah Winfrey discussing

వృద్ధాప్య, స్వీయ అభివృద్ధికి సంబంధించిన పోస్ట్‌ని త్రిషా కృష్ణన్‌ షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌లో మీడియా ఐకాన్ ఓప్రా విన్‌ఫ్రే వృద్ధాప్యం, స్వీయ ఆవిష్కరణ, వ్యక్తిగత ఎదుగుదలపై ఆమె చర్చిస్తున్న వీడియో క్లిప్‌ని రీట్వీట్‌ చేస్తూ..ఇలా రాశారు. ఆ వీడియోలో క్లిప్‌లో ఓప్రా కీకీ పామర్‌ పాడ్‌కాస్ట్‌ 'బేబీ, దిస్ ఈజ్ కీకీ పామర్'కనిపిస్తారు. అక్కడ ఆమె, జీవితంలో తాను ఏ దశకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారో తన అభిప్రాయాలను పంచుకుంటుంది. 

మళ్లీ 30 ఏళ్ల వయస్సులో ఉండాలనుకుంటున్నారా అని ‍ప్రశ్నించగా, ఓప్రా ఇలా సమాధానమిచ్చారు. లేదు తాను తిరిగి 30 ఏళ్ల వయస్సులో ఉండాలనుకోవడం లేదన్నారు. ఎందుకంటే ఇతరులను మెప్పించడానికి ప్రయత్నించడం మానేసే విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. తాను ఇప్పుడు మార్గదర్శకత్వం వహించిన 30 ఏళ్ల ప్రారంభంలో ఉన్న కొందరు అమ్మాయిలు ఇంతకంటే ముందే దీనిలోకి వచ్చారు, కానీ తన విషయానికొస్తే  44 ఏళ్ల వయసులో తెలుసుకున్నా. ఫలితంగా తన ఎదుగుదలను తానే స్వయంగా చూడగలిగానంటోంది. 

ఎందుకంటే ఇతరుల కోసం, ఇతరుల్లా కనిపించడం కోసం గానీ పనిచేయడం..పూర్తి పట్టుదలతో ఒక లక్ష్యంతో తన కోసం తను జీవించడం నేర్చుకున్నా.. అంటూ తన సంభాషణను ముగిస్తుంది ఓప్రా . ఈ వీడియో క్లిప్‌ని షేర్‌ చేస్తూ.."ఆమెన్" అనే ఒక్క పదంతో రీపోస్ట్‌ చేశారు. గత మే4నే ఈ బ్యూటీ 43వ పుట్టినరోజు జరుపుకుంది. అది జరిగిన రెండు నెలలకే ఈ పోస్ట్‌ రావడంతో సర్వత్రా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. 

కాగా, దక్షిణాది సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తారలలో ఒకరైన త్రిష, రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథనాయికగా కొనసాగారు. అనేక విజయవంతమైన తెలుగు, తమిళ చిత్రాలలో మెరిశారు, అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన కథనాయికగా వెలుగొందుతున్నారు.

(చదవండి: ఫ్లైట్‌ జర్నీలో ఫేస్‌ షీట్‌మాస్క్‌తో త్రిష..ఇది చర్మానికి మంచిదేనా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement