నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు? | Who Is Nandan Nilekani? Why PM Modi Chose Him To Lead NTA Exam Reforms, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు?

Jul 27 2026 8:34 AM | Updated on Jul 27 2026 10:16 AM

Who is Nandan Nilekani Why was he chosen for the NTA reforms

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతాలు, అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు.
 

పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం, అభ్యర్థుల ధృవీకరణ, మూల్యాంకన విధానాలు, పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్ తదితరులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.

నందన్ నీలేకని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, టెక్నాలజీ నిపుణుడు. ప్రభుత్వ విధాన నిపుణుడు. 1981లో ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సేవలు అందించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచపు అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్ట్ అయిన ‘ఆధార్’ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గా విశేష సేవలందించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.

ఇది కూడా చదవండి: ‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement