రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్‌  | PM Narendra Modi highlights India rising defence production and exports | Sakshi
Sakshi News home page

రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్‌ 

Jul 27 2026 5:09 AM | Updated on Jul 27 2026 5:09 AM

PM Narendra Modi highlights India rising defence production and exports

రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు, మిత్రదేశాలతో రాజకీయ సహకారం వంటి రంగాల్లో భారత్‌ నిరంతరం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మనదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, స్వదేశీ పరిజ్ఞానంతో నూతన రికార్డులు సృష్టిస్తోందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం 136వ ‘మన్‌ కీ బాత్‌’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. 

దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువత సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే..  ‘ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ ఆర్బిటాల్‌ రాకెట్‌ ‘విక్రమ్‌–1’జూలై 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం చరిత్రాత్మక ఘట్టం. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘క్యాచ్‌ ది రెయిన్‌’, ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ పే’ కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి’’ అని అన్నారు. 

క్రీడలు, విద్యలో సత్తా చాటుతున్న యువత  
‘‘అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సష్టించింది. లండన్‌లోని చారిత్రక లార్డ్స్‌ మైదానంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో 270 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించడం మనందరికీ గర్వకారణం. 1983లో పురుషుల జట్టు ఇక్కడే తొలి ప్రపంచకప్‌ సాధించగా, ఇప్పుడు మన నారీశక్తి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టింది’’ అని అన్నారు. 

చేనేత కళాకారులను గౌరవించాలి
‘‘అంతర్జాతీయ సైన్స్‌ ఒలింపియాడ్స్‌లో సత్తా చాటిన భారత విద్యార్థులను నా అభినందలు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని సౌత్‌ చిట్టూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు అభిలాష్‌ ఫుట్‌బాల్‌ పదాలతో సంస్కృతం నేర్పిస్తున్న ‘అక్షర కందుక్‌’ ప్రాజెక్టు ప్రయోగం ప్రశంసనీయం. జూలై 27న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి జరుగనుంది. గురు పూరి్ణమ నిర్వహించుకోబోతున్నాం. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా ‘హర్‌ ఘర్‌ తిరంగా’కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఆగస్ట్‌ 7న ‘నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డే’జరుగనుంది. చేనేత వ్రస్తాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత కళాకారులను గౌరవించాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement