breaking news
exam
-
నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతాలు, అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం, అభ్యర్థుల ధృవీకరణ, మూల్యాంకన విధానాలు, పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్ తదితరులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.నందన్ నీలేకని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, టెక్నాలజీ నిపుణుడు. ప్రభుత్వ విధాన నిపుణుడు. 1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సేవలు అందించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచపు అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్ట్ అయిన ‘ఆధార్’ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గా విశేష సేవలందించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.ఇది కూడా చదవండి: ‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు -
MBBSలో రిజర్వేషన్లు.. కోర్టుకు 71 ఏళ్ల నీట్ అభ్యర్థి
లక్నో: నీట్ పరీక్షలో వృద్ధులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ లక్నోకు చెందిన అభ్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. 71 ఏళ్ల వయసులో నీట్ యూజీ పరీక్ష రాసిన అత్యంత వృద్ధ అభ్యర్థి అశోక్ బహార్, మెడికల్ సీట్ల భర్తీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా 1శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అశోక్ బహార్ అనే 71 ఏళ్ల వృద్ధుడు ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. చదువుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తూ, తన డాక్టర్ కలని నెరవేర్చుకునేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. అయితే, కేవలం పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తే సరిపోదని, వృద్ధులకు కూడా వైద్య కళాశాలల్లో సీట్లు దక్కేలా 1శాతం ప్రత్యేక కోటా కేటాయించాలని కోరుతూ ఆయన అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్,సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేదు. వయసు అడ్డుకాదన్నప్పుడు, సీట్ల భర్తీలోనూ సీనియర్ సిటిజన్లకు న్యాయం జరగాలని ఆయన వాదించారు. నీట్ ప్రవేశాల్లో వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేదా ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు, సీనియర్ సిటిజన్లను ఎందుకు విస్మరిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు.ఈ విషయమై అంతకుముందే మే, జూన్ నెలల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. అయితే అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో సరికొత్త చర్చదేశంలో వైద్య విద్యకు విపరీతమైన పోటీ ఉన్న తరుణంలో ఈ డిమాండ్ జాతీయ స్థాయిలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సాధారణంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైద్య సీట్లను కేటాయిస్తారు. అయితే, వృద్ధాప్యంలో కూడా చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నవారికి సమాన అవకాశాలు కల్పించాలా వద్దా అనే చట్టపరమైన ప్రశ్న ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్‌పై జూలై 21న విచారణ జరపనుంది. -
వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు
బిహార్‌లో పాఠశాల త్రైమాసిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, బక్సర్‌లోని ఓ విద్యా కేంద్రంలో ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పరీక్షా సామగ్రి నిర్వహణ తీరు ఉండాల్సింది ఇలాగేనా? అని విమర్శలు వస్తున్నాయి.ఈ ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాలను 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల కోసం బిహార్ బోర్డు పంపింది. అవి బక్సర్‌లోని బునియాది పాఠశాలకు చేరాయని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.వైరల్ దృశ్యాలు.. ప్రజల్లో ఆగ్రహంఅయితే, భారీ వర్షంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు నీటిలో పడి కనిపించాయి. ఇంత కీలకమైన పరీక్షా సామగ్రిని వర్షంలో నిర్లక్ష్యంగా వదిలేశారని పలువురు అధికారులపై విమర్శలు చేశారు. ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి. సున్నితమైన పరీక్షా సామగ్రి వర్షంలోకొట్టుకుపోయేలా ఎలా చేశారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. చాలామంది దృష్టిలో ఈ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకగా మారింది. మరోవైపు, పరీక్షా సామగ్రికి ఎలాంటి నష్టం జరగలేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అకస్మాత్తుగా వర్షం పడటంతో కట్టలు నీటిలో కనిపించినా, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని, పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Bharat Desh (@desh) -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీల పరంపరకు పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. సంచలనం రేపిన నీట్ లీకేజీ వ్యవహారం మరువక మునుపే తాజాగా మహారాష్ట్రలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం, ఈ నెల 28న జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (మహా–టెట్) 2026 ప్రశ్నపత్రం లీకైంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసుల ఆకస్మిక దాడులు.. మహారాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సిన టెట్ పరీక్షకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే శనివారం తెల్లవారుజామున థానే జిల్లా పరిధిలోని భివండీలో కొందరి వద్ద టెట్ ప్రశ్నపత్రాలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. వెంటనే పోలీసులు భివండీలోని ఓ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో పరీక్షకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యం కావడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఎస్‌సీఈ అధికారుల నిర్ధారణ అనుమానితుల వద్ద లభ్యమైన పత్రాలను పరిశీలించేందుకు పోలీసులు వెంటనే పుణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న విద్యాశాఖ, పరీక్షల మండలి అధికారులు ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలు, ఆదివారం జరగాల్సిన అసలు టెట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నట్లు నిర్ధారించారు. దీంతో పేపర్ లీకైనట్లు అధికారికంగా స్పష్టమైంది. త్వరలో కొత్త తేదీల ప్రకటన .. పేపర్ లీకైనట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి ప్రకటించింది. ఈ స్థాయిలో పరీక్షను నిర్వహించేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరమవుతుందని ఎంఎస్‌సీఈ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే చెప్పారు. పారదర్శకతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే, అభ్యర్థులు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తదుపరి అధికారిక అప్డేట్స్ కోసం అభ్యర్థులు వేచిచూడాలని సూచించారు. కాగా, లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కాలంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇలా చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ముగ్గురిపై క్రిమినల్ కేసు ఈ వ్యవహారంపై భివండీ పోలీస్ స్టేషన్లో ముగ్గురు అనుమానితులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ లీకేజీ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.యువత భవిష్యత్తును దోచుకోవడమే: రాహుల్ గాంధీ మహారాష్ట్ర–టెట్‌ను లీకేజీ ఆరోపణలతో వాయిదా వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం పరీక్ష పత్రం లీక్ మాత్రమే కాదు..యువత భవితను దోచుకోవడమేనన్నారు. ‘మరో పేపర్ లీక్. మరో పరీక్ష రద్దు, ఈసారి మహారాష్ట్ర టెట్ వంతు..!’అంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. పరీక్షల విధానాన్ని వసూళ్ల దందాకు అడ్డాగా మార్చుకున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు. లీకేజీ సూత్రధారులు అన్ని రకాలుగా ప్రభుత్వం రక్షణలను పొందుతున్నారన్నారు. లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పత్రమే లీకైనప్పుడు ఇక ఏ పరీక్ష కూడా సురక్షితంగా కానేకాదని ఎన్సీపీ(ఎస్పీ) వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యవస్థలపై నమ్మకం కల్పించాలని పేర్కొంది. -
ముగిసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్
నీట్ యూజీ అప్డేట్స్ముగిసిన రీ-ఎగ్జామ్నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష ముగిసింది మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగిందికొనసాగుతున్న పరీక్షకొనసాగుతున్న నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షపెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ యూజీనీట్ యూజీ ప్రారంభం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష నేటి (జూన్ 21, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల ప్రారంభమైంది. అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు నేషనల్... టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.మాల్‌ప్రాక్టీస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు మరియు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియలను అమలు చేస్తున్నారు. హై-సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులకు క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్టీఏ ముందే సూచించింది. -
ఈ రోజే నీట్ రీఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత
ఈ రోజు జరగనున్న నీట్ రీఎగ్జామ్‌కు ఎన్టీఏ దేశ వ్యాప్తంగా అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని పేర్కొంది. పరీక్షలు ఎటువంటి అక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు మానటరింగ్ చేయనున్నట్లు పేర్కొంది.అదేవిధంగా ఏఐ ఆధారిత సీసీటీవీలు, 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ చేపట్టనుంది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో నీట్ రీఎగ్జామ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది నీట్ పరీక్ష రాయనున్నారు.వీరికోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు.కాగా దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ-ఎగ్జామ్ కేవలం 22 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. కాగా మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత పరీక్షను రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, ఈ ఘటనపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... తాము పారదర్శకతకే ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేసిందిదీంతో ఈ పరీక్ష వైద్య విద్యార్థులకే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మే నెలలో జరిగిన మొదటి విడత పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం చెలరేగడంతో, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి కేంద్రం ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది.పరీక్ష సమయాలు పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.దివ్యాంగులకు మినహాయింపు: అదనపు సమయానికి అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు సమయం కేటాయించారు.రిపోర్టింగ్ సమయం: విద్యార్థులు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని NTA స్పష్టం చేసింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026 పునఃపరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ఈ గడువుకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా, మే 3న నిర్వహించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పునఃపరీక్ష నిర్వహణ పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారైనా పరీక్షను సక్రమంగా నిర్వహిస్తారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు పెన్ను, పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో దేశవ్యాప్తంగా 551, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పునఃపరీక్షను నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ రాయనున్నారు. మన రాష్ట్రంలోని 27 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 185 కేంద్రాల్లో 65,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 1,500 మంది కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఈ కేంద్రాలన్నింటిలో నీట్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆదివారం ప్రశ్నాపత్రాలను పోలీస్ భద్రతతో కేంద్రాలకు తరలించనున్నారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషే«ధాజ్ఙలు అమలు చేయనున్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. దివ్యాంగ విద్యార్థులకే అదనపు సమయం అదనపు సమయం దివ్యాంగ విద్యార్థులకేనని శనివారం ఎన్టీఏ ప్రకటించింది. దివ్యాంగ విద్యార్థులు సాయంత్రం 6.20 గంటల వరకూ పరీక్ష రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. అయితే ఈ అదనపు సమయం కేటాయింపుపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని, ఆ విషయంపై ఎన్టీఏ మరోమారు స్పష్టతనిచ్చింది. కొందరు సాధారణ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో అదనపు సమయం కాలమ్ దగ్గర ‘వై’ అని ముద్రించి ఉండటంతో గందరగోళం నెలకొందని, ఆ కాలమ్ దగ్గర ‘వైఈఎస్’ అని ముద్రించిన దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే అదనపు సమయం కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. శనివారం రాత్రి ఏడు గంటల వరకూ కూడా కొందరు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేదని, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్‌కు అడ్మిట్ కార్డులు పంపామని ఎన్టీఏ తెలిపింది.‘నీట్’కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి: సీఎస్రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న నీట్ యూజీ–2026 రీ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నీట్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించాలని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఉంటుందని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఫొటోస్టాట్ షాపులు, సైబర్ కేఫ్‌లు, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నిషేధ ఆజ్ఞలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ వంటి వదంతులు సృష్టించేవారిపై నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.నిబంధనలు ఇవే..డ్రెస్ కోడ్: విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరలించాలి. పూర్తి చేతులు(ఫుల్ స్లీవ్స్) చొక్కాలు, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికన్నా ముందే చేరుకోవాలి. సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా కేంద్రంలో చాలా ముందుగానే రిపోర్ట్ చేయాలి. కేవలం స్లిప్పర్స్, ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి: అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణపత్రాలు), ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎల్రక్టానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. -
మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్
నీట్ రీటెస్ట్‌కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థికి ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అభ్యర్థి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగా.. పరీక్షా కేంద్రం ఏకంగా యూఏఈలోని అబుదాబిగా కనిపించింది. పాస్‌పోర్టే లేని విద్యార్థికి విదేశంలో పరీక్షా కేంద్రం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..రేపు(జూన్ 21న) జరగనున్న రీ-నీట్ యూజీ 2026 పరీక్ష కోసం నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అందులో పరీక్షా కేంద్రంగా భారత్‌లోని నగరం కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలోని ఓ భారతీయ పాఠశాల పేరు కనిపించింది. నాగ్‌పూర్ నుంచి దరఖాస్తు చేసుకున్న తాను విదేశీ పరీక్షా కేంద్రం ఎలా పొందానని విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.పాస్‌పోర్టే లేదు.. పరీక్ష ఎలా?..ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అబ్దుల్లా వద్ద పాస్‌పోర్టు కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అబుదాబికి వెళ్లి పరీక్ష రాయడం అసాధ్యమని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులోని వివరాల స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.ఎన్టీఏ స్పందనఈ విషయాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఇది టెక్నికల్ గ్లిచ్ (సాంకేతిక లోపం) కారణంగా జరిగిందని అంగీకరించినట్లు సమాచారం. అలాగే తప్పును సరిదిద్ది, సరైన పరీక్షా కేంద్రంతో కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఏ నుంచి ఈ-మెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు.ఇదేకాదు.. రేపటి రీటెస్ట్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్లక్ష్యం బయటపడుతోంది. హాల్ టికెట్స్, ఎగ్జామ్ టైమింగ్.. సెంటర్లలో గందరగోళం నెలకొంది. మరో విద్యార్థికి సాయంత్రం 4గం.ఎగ్జామ్ అని సమాచారం. అయితే కంగారుపడక్కర్లేదంటూ ఆయా విద్యార్థులకు ఎన్టీఏ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. #UPDATE | Responding to reports of a Nagpur student being allotted an Abu Dhabi examination centre for the NEET UG 2026 re-exam, NTA DG Abhishek Singh tells ANI that the issue has been resolved and the “candidate has now been allotted a centre in Nagpur.”(File photo) https://t.co/dvlYNBdYPN pic.twitter.com/Q6S5l8g1SL— ANI (@ANI) June 20, 2026నీట్ యూజీ పరీక్ష కోసం విదేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, NRIలు, OCI అభ్యర్థుల కోసం ఎన్టీఏ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. గత కొన్నేళ్లుగా అబుదాబి, దుబాయ్, దోహా, కువైట్ సిటీ, మస్కట్, మనామా, రియాద్, షార్జా, సింగపూర్, కౌలాలంపూర్ వంటి నగరాల్లో NEET పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.నాగ్‌పూర్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థికి పొరపాటున అబుదాబి కేంద్రం కేటాయించడమే ఈ వివాదానికి కారణమైంది.జూన్ 21న రీ-నీట్‌పేపర్ లీకేజీ నేపథ్యంలో రద్దైన నీట్ పరీక్షను.. రేపు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం తదితర అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఎన్టీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మాక్‌డ్రిల్ కూడా నిర్వహించబోతోంది. -
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని, ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్ధులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. -
హాల్ టికెట్ పొందడమే ఓ ప్రహసనం
సాక్షి, అమరావతి: నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యూజీ–2026 పరీక్ష అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడం ఓ ప్రహసనంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పేపర్ లీక్ కావడంతో గత నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి ఈ నెల 21న(ఆదివారం) తిరిగి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రీ–ఎగ్జామినేషన్‌కు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 14న ఎన్టీఏ విడుదల చేసింది. ఎన్టీఏ వెబ్సైట్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నాలుగు రోజులైనా అభ్యర్థులందరూ హాల్‌టికెట్లు పొందలేని దుస్థితి నెలకొంది. దాదాపు 23 లక్షల మంది నీట్ రాయాల్సి ఉండగా, బుధవారం రాత్రికి 16 లక్షల మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్టీఏ ప్రకటించింది. రోజుల తరబడి కుస్తీ వాస్తవానికి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం అనేది కొన్ని నిమిషాల్లో ముగిసే ప్రక్రియ. అలాంటి ప్రక్రియకు ఏకంగా రోజుల తరబడి పడుతోందని విద్యార్థు లు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నీట్ పరీక్ష రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు చెల్లించిన దరఖాస్తు రుసుమును రిఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాలని తొలుత ఎన్టీఏ నిబంధన పెట్టింది.ఒక్కసారిగా సర్వర్లపై లోడ్ పెరగడంతో చాలామందికి అకౌంట్ వివరాలు సబ్మిట్ కాకపోగా, హాల్‌టికెట్లు హోల్డ్‌లో పడిపోయి విద్యార్థులు అవస్థలుపడ్డారు. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్యాంక్ వివరాలు తర్వాత సమర్పించేలా ఎన్టీఏ ప్రత్యామ్నాయ ఆప్షన్లు ఇచ్చింది. అయినప్పటికీ గురువారం కూడా కొందరు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. షెడ్యూల్ ప్రకారమే నీట్ నీట్ యూజీ పునఃపరీక్ష వాయిదా పడిందని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై గురువారం ఎన్టీఏ స్పందించింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21న పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. వదంతులు, సోషల్ మీడియా ప్రచారాలను అభ్యర్థులు నమ్మవద్దంటూ ‘ఎక్స్’లో ఎన్టీఏ పోస్ట్ చేసింది. తేలికపాటి దుస్తులు ధరించాలి ఈ నెల 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించడంతోపాటు ట్రాన్సపరెంట్ వాటర్ బాటిళ్లనే తెచ్చుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు భద్రతా తనిఖీలు సజావుగా సాగాలంటే అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. » సాంకేతిక, ఇతర కారణాలతో నీట్ రాసే విద్యార్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తికాకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి » ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో హాల్ టికెట్లు తడిసిపోకుండా ఉండేందుకు పారదర్శక ప్లాస్టిక్ పౌచ్‌లకు అనుమతి. » విద్యార్థులు మతపరమైన నమ్మకాలకు సంబంధించిన వస్తువులు ధరించడానికి అనుమతి ఉంది. అయితే, పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి వీలుగా విద్యార్థులు ముందుగానే చేరుకోవాలి. » స్లిప్పర్స్, లో–హీల్స్ పాదరక్షలు ధరించాలి. హై–హీల్స్ ధరిస్తే తనిఖీలు ఎదుర్కోవాలి. వీటిపై నిషేధం » మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ డివైజ్‌లు, ఇయర్ ఫోన్లు వంటి ఇతరæ కమ్యూనికేషన్ పరికరాలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు. » లోహపు వస్తువులు, పెద్ద బకిల్స్ ఉన్న బెల్టులు, భారీ ఆభరణాలు, ఇతర మెటల్ యాక్సెసరీస్‌ను అనుమతించరు. -
నీట్ ‘రీ–ఎగ్జామ్’ విచారణ జూలైకి వాయిదా!
సాక్షి , న్యూఢిల్లీ: నీట్ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్) నిర్వహించాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టింది.అయితే, ఈ వ్యవహారంపై ధర్మా సనం ఎలాంటి లోతైన వ్యాఖ్యలు చేయకుండా, కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీట్ వివాదానికి సంబంధించిన ఇతర కేసులను ఇప్పటికే విచారిస్తున్న జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాస నానికే ఈ పిటిషన్‌ను బదిలీచేస్తున్నట్లు సీజేఐ సారథ్యంలోని ధర్మా సనం వివరించింది. వేసవి సెలవుల అనంతరం జూలై 13 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహ ధర్మాసనం అప్పుడు ఈ కేసును విచారించనుందని స్పష్టం చేసింది.ఏ తప్పూ చేయని విద్యార్థులను బలిచేస్తారా?ఈ కేసులో పిటిషనర్ తన వాదనలు విన్పించారు. మే 3న జరిగిన నీట్–2026 పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల కు మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న ఎన్టీఏ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆరోగ్య సేవల విభాగం మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగళా కోహ్లీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.కొందరు వ్యక్తులు, నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో జరిగిన అవకతవకలకు ఏ తప్పూ చేయని లక్షలాది మంది విద్యార్థులను బలిచేయడం అన్యాయమని పిటిషనర్ వాదించారు. ‘‘పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలే కానీ, సంస్థాగత వైఫల్యాలకు విద్యార్థుల రాజ్యాంగ హక్కులను కాలరాయడం సరికాదు. మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(జీ), 21లకు విరుద్ధం, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం’’ అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు.ఎన్టీఏ ప్రక్షాళనకు నిపుణుల కమిటీ వేయాలిజాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో సమూల ప్రక్షాళన, సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని పిటి షనర్ కోర్టును కోరారు. ‘ఎన్క్రిప్టెడ్ డిజిటల్ క్వశ్చన్ డెలివరీ’, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఏఐ మాని టరింగ్ లాంటి పటిష్టమైన సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఎన్టీఏలో ఉన్న లోపాలను అధ్యయనం చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. -
టెలిగ్రామ్ బ్యాన్‌తో లీకులు ఆగుతాయా?
నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తీవ్రంగా తప్పుబట్టారు. "లీకులు ఆగలేదు.. కేవలం వేరే యాప్‌లకు మారిపోయాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. అసలు పేపర్ లీక్‌లకు టెలిగ్రామ్ కారణమా? అంటే.. లీకుల బెడద ఇంకా మిగిలే ఉందా?? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.భారత్‌లో 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ వినియోగదారులు ఉన్నారని, కొందరు దుర్వినియోగం చేశారనే కారణంతో మొత్తం ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయడం సామాన్య వినియోగదారులకు శిక్ష విధించినట్టేనని దురోవ్ వ్యాఖ్యానించారు. పరీక్షా పత్రాల లీక్‌లు, మోసాలు టెలిగ్రామ్‌తో ఆగిపోవని, అవి ఇతర యాప్‌లకు మారిపోతాయని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో లీక్‌లు, స్కామ్‌లకు సంబంధించిన వందలాది ఛానెళ్లను తొలగించామని కూడా చెప్పారు.నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు "PAPER LEAKED NEET", "RE-NEET 2026", "PRIVATE MAFIA" వంటి పేర్లతో నడుస్తున్న టెలిగ్రామ్ ఛానెళ్లు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. ప్రశ్నాపత్రాలు ఉన్నాయని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలు టెలిగ్రామ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఆరోపించింది.అలాగే టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా అధికారుల ఆందోళనకు కారణమైంది. పరీక్షకు ముందు సాధారణ పోస్టులు పెట్టి, పరీక్ష తర్వాత వాటిని ఎడిట్ చేసి అసలు ప్రశ్నాపత్రాలను జతచేసి "ముందే లీక్ చేశాం" అంటూ స్క్రీన్షాట్లు వైరల్ చేస్తున్నారని ఎన్టీఏ పేర్కొంది. అందుకే జూన్ 30 వరకు ఆ ఫీచర్‌పై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.వేరే యాప్‌లకు మారతాయా?సాంకేతికంగా చూస్తే అవును అనే నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రశ్నాపత్రం లేదా సున్నిత సమాచారం బయటకు వస్తే అది టెలిగ్రామ్, వాట్సాప్, సిగ్నల్, డిస్కార్డ్, ఇ-మెయిల్, క్లౌడ్ డ్రైవ్‌లు లేదంటే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా క్షణాల్లో వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురోవ్(pavel durov) కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.అయితే టెలిగ్రామ్‌లో లక్షల మంది సభ్యులతో పబ్లిక్ గ్రూపులు, భారీ ఫైల్ షేరింగ్, సెర్చ్ ద్వారా ఎవరైనా సులభంగా ఛానెళ్లను కనుగొనే సౌకర్యం ఉండటంతో మోసగాళ్లకు అది మరింత అనుకూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు.టెలిగ్రామ్‌ను ఆపడం సాధ్యమేనా?సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టెలిగ్రామ్‌ను పూర్తిగా అడ్డుకోవడం అంత సులభం కాదు. వీపీఎన్‌లు, ప్రాక్సీ సర్వర్లు, ప్రత్యేక ఎన్క్రిప్షన్ టెక్నాలజీల కారణంగా వినియోగదారులు పలు మార్గాల్లో యాప్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చర్య ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తర్వాత అది ఏ యాప్‌లో షేర్ అయ్యిందన్నది తర్వాతి విషయం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రశ్నాపత్రం పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అనేది. ప్రింటింగ్, రవాణా, భద్రతా వ్యవస్థలు, అంతర్గత ఉద్యోగుల పాత్ర, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవడం పూర్తి పరిష్కారం కాదని వారు చెబుతున్నారు.జూన్ 22 తర్వాత..ప్రభుత్వం ఈ చర్యను శాశ్వత నిషేధంగా కాకుండా తాత్కాలిక అత్యవసర చర్యగా పేర్కొంది. జూన్ 21న రీ-ఎగ్జామ్ పూర్తయ్యాక, జూన్ 22 నుంచి టెలిగ్రామ్ సేవలను పునరుద్ధరించే అవకాశముందని సమాచారం. అయితే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై ఉన్న పరిమితులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు. అయితే.. అయితే.. ఇదే అంశంపై డిజిటల్ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పరీక్షల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేతలు కనిపించేవి. కానీ దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట ప్లాట్‌ఫామ్‌పై నిషేధం విధించడం కొత్త పరిణామమని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇతర సందర్భాల్లోనూ ఇలాంటి చర్యలకు ఇది నిదర్శనంగా మారుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు, టెలిగ్రామ్‌పై వేటు వేయడం వల్ల కొంతకాలం మోసపూరిత ప్రచారానికి బ్రేక్ పడొచ్చు. కానీ దాంతో పేపర్ లీక్‌ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అసలు ప్రశ్న టెలిగ్రామ్‌లో ఏమి షేర్ అయ్యిందన్నది కాదు... ప్రశ్నాపత్రం మొదట పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అన్నదే. ఆ లీకేజీ మూలాలను గుర్తించి మూసేయకపోతే, వేదికలు మారినా సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నీట్ వివాదంలోనూ ఇదే కేంద్ర ప్రశ్నగా మారింది. -
నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్
ముజఫర్‌పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైన వేళ బీహార్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మాకు డబ్బులు అందాయి, నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పంపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు.సోషల్ మీడియా వేదికగా ఫేక్ పేపర్ల దందాబీహార్లోని ముజఫర్‌పూర్‌లో పట్టుబడిన ఈ ముఠా.. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నీట్ అభ్యర్థులను ట్రాప్ చేసినట్లు ఎస్ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ, అవే అసలైన పేపర్లు అని నమ్మించి నిందితులు ఆన్లైన్ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని ఆపై చేతులెత్తేయడం ఈ ముఠా ప్రధాన వ్యూహం.మనీష్ ఇచ్చిన సమాచారంతో గ్యాంగ్ అరెస్ట్ఈ నెల జూన్ 2వ తేదీన సికింద్‌పూర్ పోలీసులు మనీష్ అనే వ్యక్తిని నకిలీ పేపర్లు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ నీట్ ఫేక్ పేపర్ల స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. మనీష్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ముజఫర్‌పూర్ పోలీసులు.. హర్ష్, అమన్ కుమార్, కన్హయ్య కుమార్, హర్ష్ కనేడియా అనే మరో నలుగురు నిందితులను వేటాడి పట్టుకున్నారు.జూన్ 21న కట్టుదిట్టంగా నీట్ రీ-ఎగ్జామ్మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా రద్దయిన ఈ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష పారదర్శకత కోసం అధికారులు ‘పరీక్ష కర్మయోగి’ అనే ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. -
పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ–2025లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ, క్రీడా శాఖల మంత్రులు అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తప్పుకున్నారు. దగా డీఎస్సీపై గత 20 రోజులుగా ఆధారాలతో సహా వస్తున్న వరుస కథనాలపై నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం సంయుక్తంగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. నిజానికి స్పోర్ట్స్ డీఎస్సీలో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, పోటీల్లో పాల్గొన్న వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం నిర్ణయం మేరకు జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డీఎస్సీ లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నియామక ప్రక్రియ ముగిశాక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని జీవో ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఆ మేరకు తాము పని చేశామని వివరణ ఇచ్చారు. కీలక ఆరోపణలపై సమాధానం దాటవేత కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌లో జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు సమాధానం దాటవేశారు. నవీన్ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి నవీన్‌కు కాల్ లెటర్ రాకుండా అతడి లాగిన్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేసింది. కాల్ లెటర్ లేకుండా ఎలా హాజరు కాగలడన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. డీఎస్సీ కన్వీనర్‌ను తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ను నియమించడం, ప్రశ్నావళిని రూపొందించే వారికే పగ్గాలు అప్పగించడాన్ని కూడా అధికారులు సమర్థించుకున్నారు. ఈ రెండు విభాగాలు విద్యా శాఖలోనే ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వ పాలసీ మేరకు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిందని మరోమారు వెల్లడించారు. పరీక్ష లేకుండా పోస్టు.. ప్రభుత్వ పాలసీ స్పోర్ట్స్ డీఎస్సీలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా, అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు ఐదేళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీగా చెప్పడం గమనార్హం. తమిళనాడులో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తున్నారని, స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం ఇచ్చేందుకు అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. మళ్లీ క్రీడా పాలసీ జీవో మార్చి.. ఇకపై పరీక్షలు ఉంటాయని ఎందుకు పెట్టారన్న అంశంపైనా సరైన సమాధానం రాలేదు. అది ప్రభుత్వ పాలసీ అని, తామేమీ చేయలేమన్నారు. అంతా పారదర్శకంగానే చేశామంటూ.. 1:1 నిష్పత్తి డైనమిక్ థింగ్ అని చెప్పుకొచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లు పరిశీలించిన తర్వాతే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపినప్పుడు.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అధికారులు చెప్పడం చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే అక్రమాలను దాస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. వాస్తవానికి మెరిట్లో ఉండి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో మొదటి విడత సర్టిఫికెట్ పరిశీలనకు తొలిరోజు హాజరైన వారే అధికంగా ఉన్నారు. వారంతా రిజర్వేషన్ పరిధిలో ఉన్నప్పటికీ, లేరని చెప్పడం విస్తుగొల్పుతోంది. -
పోలీస్ రిక్రూట్మెంట్ ఉందని వెళితే పొలంలో పనిష్మెంట్!
లక్నో: ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్, గూగుల్ మ్యాప్స్ తోడు లేకుండా అడుగు బయటకు అడుగువేయలేం. అయితే అదే టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే జీవితాలే తలకిందులవుతాయని నిరూపించే ఒక ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లో యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి బయల్దేరిన నలుగురు అభ్యర్థులు, గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి, పరీక్షా కేంద్రానికి బదులు పంట పొలాల్లోకి చేరుకున్నారు. తప్పు తెలుసుకుని పరీక్షా కేంద్రానికి పరుగులు తీసేసరికి సమయం దాటిపోవడంతో, వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది.గూగుల్ మ్యాప్స్ మాయవిశాల్, ధర్మేంద్ర మాలిక్, అరుణ్ కుమార్, నకుల్ కుమార్ అనే నలుగురు అభ్యర్థులు ముజఫర్‌నగర్‌లోని ‘దీప్‌చంద్ గ్రెయిన్ ఛాంబర్ ఇంటర్ కాలేజ్’లో పరీక్ష రాయాల్సి ఉంది. వారు తమ అడ్మిట్ కార్డ్‌లోని సెంటర్ కోడ్‌ను గూగుల్ మ్యాప్స్‌లో ఎంటర్ చేసి ప్రయాణమయ్యారు. అయితే, ఆ మ్యాప్ వారిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సింది పోయి, షామ్లీ జిల్లాలోని జాంధేరి గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్యకు తీసుకెళ్లింది. చుట్టూ చూస్తే కాలేజీ కాకుండా పంట పొలాలు కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. తాము తప్పుడు లొకేషన్‌కు వచ్చామని గ్రహించేసరికే జరగకూడనంత నష్టం జరిగిపోయింది.సమయంతో పోరాటం.. చేజారిన అవకాశంసమయం మించిపోతుండటంతో ఆ నలుగురు అభ్యర్థులు తీవ్ర ఆందోళనతో ముజఫర్‌నగర్ వైపు పరుగులు తీశారు. స్థానికులను దారి అడుగుతూ, పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎలాగోలా ముజఫర్‌నగర్ చేరుకునేసరికి పరీక్షా కేంద్రం గేట్లు మూతపడ్డాయి. పరీక్ష ప్రారంభ ప్రక్రియ ముగిసిపోవడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో రాత్రింబవళ్లు కష్టపడి చదివినా పరీక్ష రాయకుండానే వారు వెనుదిరగాల్సి వచ్చింది. -
నీట్ పరీక్ష భద్రత కోసం ఎన్టీఏ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల జూన్ 21న జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తరలించేందుకు భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించుతోంది. ఈ వివరాలను NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీంతో ఒక పరీక్ష కోసం విమానాల్ని వాడిన ఎగ్జామ్‌గా నీట్ రికార్డు సృష్టించనుంది.నీట్‌పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో అభిషేక్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షల పారదర్శకతను, భద్రతను కాపాడటానికి ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "పరీక్షా ప్రక్రియ సమగ్రతను, భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రశ్నపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.కాగా వైమానిక దళ అంశంపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జూన్ నెలలో ఉండే వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రశ్నపత్రాలను సురక్షితంగా, సకాలంలో చేరవేసేందుకు వైమానిక దళ సహాయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే కేవలం ప్రశ్నాపత్రాల కోసం మాత్రమే వైమానిక దళం సహాయం తీసుకుంటామని భద్రత కోసం మరే సాయం తీసుకోమని స్పష్టం చేశారు.గత మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల రద్దు చేస్తున్నట్లు మే 12న ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు. -
కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్’ చైర్మన్?
సాక్షి, అమరావతి: పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్‌గా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు. వారు చెబుతున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాకా ఊదే ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో భాగంగా జరిగిన మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు) హాజరయ్యారు.ఆ సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాల ప్రకారం.. పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా హాల్లోకి వెళ్లి ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్‌కు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి వెనుక ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడేమంటారో!! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అవన్నీ నిరాధార ఆరోపణలని, బాధితులు కూడా లేరని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని శాప్ చైర్మన్ ప్రగల్బాలు పలికారు. ఆయన సవాల్‌కు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గట్టి సమాధానం ఇస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ సమయంలో బంగారు పతకం సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా కాంస్య పతకం, పార్టిసిపేషన్ సరి్టఫికెట్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటూ ఆధారాలతో సహా చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలను రవికుమార్ సవాల్‌కు చెంపపెట్టుగా నెటిజన్లు చూపిస్తున్నారు. -
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో..
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) రాయాలి. కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని స్పష్టంగా చెప్పింది. అంటే, ఏడాదికి కనీసం రెండు సార్లు టెట్ తప్పనిసరిగా జరుగుతుంది. అదనంగా, ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా మరో రెండు అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఈ గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఆ లోపు టెట్ పాస్ కావడం తప్పనిసరి.టెట్‌లో ఫెయిల్ అయితే ఉపాధ్యాయులకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగం కొనసాగించలేరు, అలాగే ప్రమోషన్లు పొందలేరు. కోర్టు స్పష్టంగా తెలిపినట్లుగా, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలి. ఫెయిల్ అయినా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహించబడుతుండటంతో, మరోసారి రాసే అవకాశం ఉంటుంది. కానీ గడువు ముగిసేలోపు పాస్ కాకపోతే, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం తప్పదు.ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా వేలాది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాయాల్సి ఉంటుంది. విద్యా ప్రమాణాలను పెంచడం, నాణ్యమైన బోధన అందించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై మరిన్ని పొడిగింపులు ఇవ్వబోమని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణలో పారదర్శకత పాటించి, ఉపాధ్యాయులకు సమయానికి పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. -
మరో వివాదంలో ఎన్టీఏ.. దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’ పరీక్ష నిర్వహణ వైఫల్యంతో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఇప్పుడు మరో సమస్య చుట్టుముట్టింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్ ఐఏటీ) ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ ఒకే రోజున అంటే జూన్ 7వ తేదీనే నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జాతీయ స్థాయి పరీక్షలు ఒకే రోజు ఉండటంతో, తాము దేనిని ఎంచుకోవాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.పరీక్షల తేదీల క్లాష్‌తో సందిగ్ధంలో విద్యార్థులుదేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే, జూన్ 7న ఈ రెండు పరీక్షలు ఒకే సమయంలో జరగడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే పరీక్షల వాయిదాలతో ఒత్తిడికి గురైన విద్యార్థులకు, ఈ తేదీల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాలకు వెళ్లడం అసాధ్యమని, దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.ఎన్టీఏ తక్షణ స్పందనఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. పరీక్షా షెడ్యూల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థి వివరాలను వెంటనే cuet-ug@nta.ac.in ఈమెయిల్ ద్వారా పంపాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులకు తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.మొదలైన విమర్శలు, ఆందోళనలుఇప్పటికే సీయూఈటీ-యూజీ పరీక్షా నిర్వహణలో సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు తాజాగా చోటుచేసుకున్న ఈ తేదీల వివాదంతో ఎన్టీఏ తీరుపై మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ముందుగానే సమన్వయం చేసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఏ ఈ పరీక్షల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందోనని విద్యార్థులు వేచి చూస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎబోలా విలయం: రెండు రోజుల్లో రెండింతలైన కేసులు -
అరాచకమే విధానం
మన విద్యావిధానానికేమైంది? ‘నీట్’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌తో మొదలై ఇప్పుడు సీబీఎస్ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్‌లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. నీట్ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్ చేసి వాటి డిజిటల్ ఫైళ్లను అప్లోడ్ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్ఈ సంపాదించుకుంది.ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్’ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఏమైంది? సీబీఎస్ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి. -
పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఎగ్జామ్ సిరీస్ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కానీ ఇప్పటి పరిస్థితులలో చదువుకునేవారు తక్కువయ్యారు... చదువు కొనేవారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ‘ఎగ్జామ్’. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది. దాదాపుగా వాస్తవిక ఘటనలతో, చిన్నపాటి సినిమాటిక్ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సర్గుణమ్. ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికి వస్తే... తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డీఎస్పీ మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో మారుమల్లిని ఝాన్సీ కిడ్నాప్ చేసి తైకారాకు తాను డీఎస్పీగా వెళుతుంది. ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతారు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది? స్టేషన్‌కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా? లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్‌లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్యా వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా... ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసల మీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. – హరికృష్ణ ఇంటూరు -
OTT: ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ రివ్యూ
ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా,చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బ్రతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాని ఇప్పటి పరిస్థితులలో చదువుకునే వారు తక్కువయ్యారు చదువు కొనే వారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కుట్రదారులు కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ఎగ్జామ్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది.దాదాపుగా వాస్తవిక ఘటనలతో , చిన్నపాటి సినీ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు సర్కుణమ్.ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికొస్తే తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డిఎస్ పి మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో ఝాన్సీ మారుమల్లిని కిడ్నాప్ చేసి తైకారాకు తాను డిఎస్ పిగా వెళుతుంది. ఓ డిఎస్ పి స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమా లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు.కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతాడు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది, స్టేషన్ కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్ లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్య వ్యవస్థ లో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసలమీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్. -
నీట్ పేపర్ లీకేజ్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగీలాల్, దినేష్ బివాల్ సోదరులు గత సంవత్సరాలలో సైతం పరీక్ష పత్రాలు లీక్ చేశారని అధికారులు భావిస్తున్నారు. బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలకు పరీక్షకు ముందే నీట్ 2025 ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంగీలాల్ కుమారుడు వికాస్ బివాల్ ప్రస్తుతం సవాయ్ మాధోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. లీకైన పేపర్‌ను నెట్‌వర్క్‌లో ముందుకు విక్రయించడంలో ఇతని పాత్ర కూడా ఉందని సమాచారం. ఈ ప్రశ్నపత్రాన్ని ముందుగానే సేకరించి పంపిణీ చేయడానికి 65 లక్షల రూపాయలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.మహారాష్ట్రలో అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు (ఒక మహిళతో సహా) అడ్మిషన్ కౌన్సెలర్ల ముఠాలో సభ్యులని, వీరు కూడా వైద్య నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చారని తేలింది. లీకైన పేపర్‌కు మూలకర్తగా గుర్తించిన శుభమ్ ఖైర్నార్ స్వయంగా మెడికల్ విద్యార్థని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కుమారుడని అధికారులు గుర్తించారు. అయితే గతేడాది లీకైన నీట్ పేపర్ గుర్గావ్లో యష్ యాదవ్‌కు లీకైన పేపర్‌ను అందజేశాడని, అక్కడి నుండి యాదవ్ దానిని రాజస్థాన్‌కు చెందిన మాంగీలాల్ బివాల్‌కు పంపాడని సమాచారం. మాంగీలాల్ తన కుమారుడు వికాస్ బివాల్ తన మేనల్లుళ్ల కోసం ఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం రాకెట్‌ను కోచింగ్ మాఫియానే నడిపిస్తోందని, ఇప్పటి వరకు అరెస్టు అయిన వారు కేవలం ఒక పెద్ద నెట్‌వర్క్‌లో భాగం మాత్రమేనని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. సికార్‌లోని కోచింగ్ సెంటర్లు సైతం నిఘాలో ఉన్నాయి. బివాల్ కుటుంబం ఎవరి కోసం పనిచేస్తుందో ఆ ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీట్ 2026 పేపర్ లీకేజీ కేసు ఏదో సాధారణ లీక్ కాదని, ఇది ఏళ్ల తరబడి వ్యవస్థీకృతంగా నడుస్తున్న నెట్వర్క్ అని అధికారులు భావిస్తున్నారు. పేపర్ లీక్ బయటపడిందిలారాజస్తాన్లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్‌కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్‌ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్‌గఢ్ నుంచే పేపర్ సికార్‌లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్‌కు చేరింది. అతడు ఈ పేపర్‌ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్‌లో హాస్టల్‌ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్‌ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
నీట్ పరీక్ష..కొత్త తేదీలు ప్రకటన
పేపర్ లీక్ నిర్ధారణ కారణంగానే నీట్ పరీక్ష రద్దు చేశామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమకెంతో కీలకమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే రీ ఎగ్జామ్ పెట్టే నిర్ణయం తీసుకున్నాం. ప్రతిభ గల విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేశామని తెలిపారు.సీబీఐ ఈ అంశంపై విచారణ చేపడుతుంది త్వరలోనే లీకు మాఫియాను పట్టుకుంటుందని ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో మాల్‌ప్రాక్టిస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీఎగ్జామ్‌కు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. జూన్ 14 లోపు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గతంతో పోలిస్తే ఎగ్జామ్ సమయాన్ని 15 నిమిషాలు పెంచామన్నారు. కాగా కొద్ది సేపటి క్రితమే నీట్ ఎగ్జామ్ కొత్త తేదీలను NTA ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్ష ఉండనున్నట్లు తెలిపింది. ఈ నెల 3న జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ కారణాలతో రద్దైన నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది.దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షరద్దైంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్‌తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది. -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఐపీఎల్, వేసవి ఎండలు మండిపోతున్న కారణంగా జనాలు బయట తిరగట్లేదు. చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడంతో థియేటర్లకు కూడా వెళ్లట్లేదు. ఇకపోతే ఈ వారం సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి కానీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)మరోవైపు ఓటీటీల్లో 14 సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. నంబర్ తక్కువగానే ఉన్నప్పటికీ వీటిలో చూడదగ్గవి కొన్ని ఉన్నాయి. ధురంధర్ 2 మూవీ ఈ వీకెండే విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది గానీ మన దేశంలోనే ఈ వారం వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'కర్తవ్య', 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలతో పాటు 'ఎగ్జామ్' అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 11 నుంచి 17 వరకు)నెట్ఫ్లిక్స్ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13నెమిసిస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 14సోల్‌మేట్ (జపనీస్ సిరీస్) - మే 14ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15అమెజాన్ ప్రైమ్ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 13ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15హాట్స్టార్ద పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్ సినిమా) - మే 12తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 12ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహాతిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్స్ట్కాళిదాస్ 2 (తమిళ చిత్రం) - మే 12జీ5టిఘీ (మరాఠీ మూవీ) - మే 15(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి) -
Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..!
ముంబై: మహానగరం ముంబైలో సంచలనం సృష్టించిన ‘పుచ్చకాయ మరణాల’ కేసులో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో సహా సహా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన 16 ఏళ్ల ఆయేషా డొకాడియా, తాజాగా విడుదలైన మహారాష్ట్ర ఎస్ఎస్సీ ఫలితాల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.మరణం తర్వాత వచ్చిన విజయంముంబైలోని పైధోనీ ప్రాంతానికి చెందిన ఆయేషా డొకాడియా ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్‌పై కలులుగనేది. అయితే విధి ఆ కలను కల్లలు చేసింది. మే 8న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 70 శాతం మార్కులు సాధించింది. అయితే ఈ వార్త వినడానికి ఆయేషా మాత్రం మన మధ్య లేదు. ఏప్రిల్ 26న తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఆమె మృతి చెందింది. పరీక్షల ఫలితాలు రావడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఈ ఘోరం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పుచ్చకాయలో విషపు ఛాయలుఈ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు. కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు వారు తిన్న పుచ్చకాయ నమూనాలలో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే విష రసాయనాన్ని ల్యాబ్ నిపుణులు గుర్తించారు. సాధారణంగా ఎలుకల మందులో వాడే ఈ రసాయనం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి పుచ్చకాయ తిన్న వెంటనే కుటుంబం మొత్తానికి వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజే ఆ నలుగురు జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారు.మిస్టరీగా మారిన మరణాలుఇది ఆత్మహత్యా లేక ఎవరైనా పథకం ప్రకారం విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలను సర్ జేజే ఆసుపత్రి వైద్య బృందం క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను, బాధితుల శరీరంలో విషం ఏ విధంగా ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు వైద్య నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
నిరాశ చెందవద్దు ఉత్కంఠల నడుమ.. విజయ్ ట్వీట్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా ఇతర పార్టీలు పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇంత ఉద్రిక్తతల నడుమ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఫలితాలలో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విజయ్ ట్వీట్ చేశారు. " 12వ తరగతి పబ్లిక్ పరీక్షలో అచంచలమైన పట్టుదలతో విజయం సాధించిన నా ప్రియమైన సోదరులకు, నీ సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ కఠోర శ్రమకు లభించిన గుర్తింపు. ఉన్నత విద్యలో తదుపరి దశకు ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టండి. అదే సమయంలో, ఈసారి విజయం సాధించలేని వారు నిరాశ చెందవద్దు. మళ్ళీ ప్రయత్నించండి. మనం విజయపు అంచున ఉన్నామని గుర్తుంచుకోండి.మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను." అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీకి ఇంకా ఐదు స్థానాల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో కమ్యునిస్టులు,వీసీకే పార్టీ మద్దతు ఇస్తారా లేదా అన్న అంశం ఈ రోజు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. -
నేను, దుషారా గొడవపడ్డాం, కొట్టుకున్నాం : అదితిబాలన్
‘నటి దుషారా విజయన్ నేను గట్టిగానే కొట్టుకున్నాం. నాకు బాగా దెబ్బలు తగిలాయి’ అని నటి అదితిబాలన్ అన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ ఎగ్జామ్. వాల్ వాచర్ పతాకంపై దర్శక నిర్మాతల ద్వయం పుష్కర్ –గాయత్రి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు కథ, దర్శకత్వం బాధ్యతలను సద్గుణం నిర్వహించారు. ఇది ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ అన్నది గమనార్హం. అబ్బాస్ ముఖ్యపాత్ర పోషించిన 7 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ మే 15వ తేదీ నుంచి ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దుషారా విజయన్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు నటించిన సార్పట్ట పరంపరై చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తరువాత తాజాగా నటించిన ఎగ్జామ్ వెబ్ సిరీస్ అదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం సంతోషంగా ఉంది. ఇందులో నటించడానికి ఎలాంటి ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. ఇందులో నేను ఝాన్సీ అనే పోలీస్ అధికారిగా నటించాను. అదితిబాలన్ మాట్లాడుతూ తన పాత్ర మొదట్లో కొంచెం నెగిటివ్‌గా కనిపిస్తుంది. ఇప్పటికి అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఈ సిరీస్‌లో చాలా ఫైట్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. నేను, దుషారా విజయన్ కొట్టుకున్నాం. చాలా దెబ్బలు కూడా తగిలాయి అని చెప్పారు. మధ్య తరగతి ప్రజల పెద్ద కల ప్రభుత్వ కొలువుల ఎంపిక. అందులో జరిగే అక్రమాలను ఆవిష్కరించే ఇతివృత్తంతో తెరకెక్కించిన సిరీస్ ఇది అని దర్శకుడు సర్గుణం పేర్కొన్నారు. -
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సినిమాల్లో కమర్షియల్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటేనే థియేటర్లలో ఆడతాయి. సమాజంలో జరిగే చాలా సంఘటనలని చూపించాలనుకుంటే మాత్రం వెబ్ సిరీస్‌లు బెస్ట్ ఆప్షన్. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై ఓ సిరీస్ తీశారు. దాని స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)'ప్రేమదేశం' లాంటి సినిమాతో హీరోగా అప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. తర్వాత కాలంలో నటనకు దూరమైపోయాడు. రీసెంట్‌గానే 'హ్యాపీరాజ్' అనే తమిళ సినిమాలో తండ్రిగా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 'ఎగ్జామ్' అనే సోషల్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు ఇదే ఓటీటీ అరంగేట్రం కావడం విశేషం.దుశారా విజయన్, అదితీ బాలన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎగ్జామ్' సిరీస్.. మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కాగా ఏ.సర్కుణం దర్శకత్వం వహించారు. మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్, మరి ఎగ్జామ్‌ని డిసైడ్ చేసేది ఎవరు? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. చూస్తుంటే పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులు ఇందులో చూపించబోతున్నారనిపిస్తోంది.(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైంది. గతేడాది 93.66 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 94.99శాతం ఉండగా బాలురుది 92.69శాతంగా ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే త్రివేండ్రం అత్యధికంగా 99.79శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సంస్థల వారీగా చూస్తే కేంద్ర విద్యాలయాలు (KV) అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. వీటి ఉత్తీర్ణత శాతం 99.57శాతంగా నమోదైంది. ఫలితాల తర్వాత సప్లమెంటరీ పరీక్షలు మే మధ్యలో ప్రారంభం కానున్నాయి. అలాగే లిస్ట్ ఆఫ్ కాండిడేట్స్ విండో ఏప్రిల్ 16 నుండి 20 వరకు అందుబాటులో ఉంటుంది. గతంలో ఫలితాల సమయంలో వెబ్సైట్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా డిజీలాకర్, ఉమాంగ్ యాప్స్‌లలో అందుబాటులోకి తెచ్చింది. తద్వారా విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే కేవలం నిమిషాల వ్యవధిలో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?
ఇది పరీక్షల కాలం. పిల్లలతోపాటు పెద్దలూ హడావిడి పడుతుంటారు. అసలీ పరీక్షలు ఎవరు కనిపెట్టారంటూ కొందరు పిల్లలు విసుక్కుంటుంటారు. లిఖిత పూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం ఏదో తెలుసా? చైనా. అవును! ప్రామాణికతో కూడిన లిఖిత పరీక్షలను మొదట చైనాలో అమలు చేశారు. వీటిని ‘కేజు’ అని పిలిచేవారు. సుయి రాజవంశం క్రీ.శ. 605లో ఉద్భవించింది. దాని వారసురాలైన టాంగ్ రాజవంశం, వు జెటియాన్ పాలనలో పరీక్షా విధానం మొదలైంది. సాంగ్ రాజవంశం కాలంలో కేవలం గొప్ప ఇళ్ల వాళ్లే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారులు అయ్యేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించేవారు. కన్ఫ్యూషియస్ క్లాసిక్స్‌ను సిలబస్‌గా చదువుకుని పరీక్షలకు కూచునేవారు. అలా పాసైన వారికి ఉద్యోగాలు దక్కేవి. 13వ శతాబ్దంలో మంగోల్ యువాన్ రాజవంశం ప్రారంభంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత మంగోలులకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండే ప్రాతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్నీ దేశాలలోకి వచ్చాయి. -
తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్ మల్టీ టాస్కింగ్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్(ఎంఎంఎల్యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్ఎల్ఈ). ఎంఎంఎల్యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్‌మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన హెచ్ఎల్ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.ఏమిటీ హెచ్ఎల్ఈ? ఎందుకంత కఠినం?ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్ఎల్ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్‌లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్‌ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.గెలుపు ఎవరిది?ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)GPT-4o2.7%-OpenAI o18.0%-DeepSeek-R18.5%-GPT-5-25.3%Gemini 2.5 Pro-21.6%Gemini 3 Pro (Live)-38.3% ఆందోళన కలిగిస్తున్న అంశాలుఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.కొలమానమే కరిగిపోతోందా?ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్‌స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్ఎల్ఈ రోలింగ్’ పేరుతో నిరంతరం అప్డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
గాలికి ఎగిరిపోయిన టెన్త్ ఓఎంఆర్ షీటు
తాడేపల్లి రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా గాలి రావడంతో ఓ విద్యార్థి దగ్గర నుంచి ఆప్టికల్ మార్క్ రికగి్నషన్ (ఓఎంఆర్) షీటు ఎగిరిపోయింది. పది నిమిషాల వెతుకులాట అనంతరం దానిని ఓ కానిస్టేబుల్ పట్టుకుని ఇవ్వడంతో విద్యార్థి ఊపిరిపీల్చుకున్నాడు. తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో సోమవారం జరిగింది. తాడేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ నంబర్ గదిలో తలుపు పక్కనే కూర్చుని ఓ విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు. ఒక్కసారిగా గాలి ఎక్కువగా రావడంతో అతడి ఓఎంఆర్ షీటు కింద పడింది. దీంతో కంగారు పడిన ఆ విద్యార్థి జరిగిన విషయాన్ని అక్కడున్న ఉపాధ్యాయులకు చెప్పాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రవి..సూ్కల్ వెనుక భాగంలో వెతికినప్పటికీ ఓఎంఆర్ షీటు దొరకలేదు. అతడితో పాటు ఎగ్జామ్ సెంటర్ వద్ద వేచి ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా 10 నిమిషాల పాటు ఓఎంఆర్ షీటును వెతికారు. పాఠశాల బిల్డింగ్‌కు చిన్నపాటి సన్‌షేడ్ ఉండటంతో దానిపై ఉందేమోనని అనుమానంతో రవి వేరే బిల్డింగ్ ఎక్కి పరిశీలించగా అక్కడ ఓఎంఆర్ షీటు కనపడింది. వెంటనే ఆయన కిందకు దిగి పాఠశాలలో కర్రకు కట్టి వున్న చీపురు తీసుకుని కిందకు ఊడ్చాడు. బిల్డింగ్ వెనుక పెద్ద డ్రైనేజీ ఉండటంతో ఆ షీటు దానిలో పడుతుందని తల్లిదండ్రులు డ్రైనేజీపై నిలబడి ఓఎంఆర్ షీటును పట్టుకున్నారు. అనంతరం దాన్ని విద్యార్థికి ఇవ్వడంతో అతడు పరీక్ష రాశాడు. -
నో టెన్షన్... ఓన్లీ అటెన్షన్...
వసంత కాలం రాకతో ప్రకృతిలో కొత్త చిగుళ్లు ఎలా వస్తాయో, విద్యార్థుల జీవితంలో ‘పరీక్షల సీజన్’ కూడా వారి మేధస్సుకు కొత్త రెక్కలు ఇచ్చే సమయం. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో ‘పరీక్ష’ అనే పదం వినగానే విద్యార్థుల గుండెల్లో ఒక తెలియని వణుకు, మెదడులో ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం మొదలవుతున్నాయి. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా ఒక రకమైన ఆందోళనలోకి జారిపోతున్నారు. ఇళ్లలో పండుగ వాతావరణం పోయి, ఒక రకమైన ‘యుద్ధ ప్రాతిపదిక’ వాతావరణం మొదలవుతుంది.అసలు పరీక్ష అంటే ఏమిటి? అదంటే ఎందుకంత భయం? అది కేవలం మూడు గంటల పాటు కాగితంపై పెన్నుతో చేసే యుద్ధమా? లేక మన జ్ఞాపకశక్తిని, సహనాన్ని పరీక్షించే కొలమానమా? పరీక్షల్లో విజయం సాధించడమెలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. పరీక్షలంటే ఎందుకు భయం? మన మెదడు పరిణామ క్రమంలో ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికి ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ (పోరాడు లేదా పారిపో) అనే మెకానిజాన్ని అభివృద్ధి చేసుకుంది. పూర్వకాలంలో అడవిలో పులి కనిపిస్తే మెదడులోని ‘అమిగ్డలా’ అనే భాగం అలర్ట్ అయ్యి, ఒంట్లో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేసేది. తద్వారా మనం ఆ పులితో పోరాడడమో లేదా అక్కడి నుంచి పారిపోవడమో చేసేవాళ్లం.నేటి కాలంలో విద్యార్థులకు ఆ ‘పులి’ మరేదో కాదు– ‘పరీక్ష’. ప్రశ్నపత్రం చూడగానే లేదా పరీక్ష గురించి ఆలోచించగానే, మెదడు దాన్ని ఒక ప్రాణాపాయ స్థితిగా గుర్తిస్తుంది. అందుకే చేతులు వణకడం, చెమటలు పట్టడం, చదివింది మరచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే, ఇది మీ అసమర్థత కాదు.. మీ మెదడు మిమ్మల్ని రక్షించడానికి చూపిస్తున్న అతి స్పందన మాత్రమే! ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సగం భయం పోతుంది.జ్ఞాపకశక్తి వర్సెస్ వ్యక్తిత్వం చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, పరీక్షల్లో వచ్చే మార్కులను విద్యార్థి తెలివితేటలతో లేదా వ్యక్తిత్వంతో ముడిపెట్టడం.» మీరు ఒక నిర్ణీత సమయంలో ఎంత సమాచారాన్ని గుర్తుంచుకోగలరు? దాన్ని పేపర్ మీద ఎంత స్పష్టంగా ప్రెజెంట్ చేయగలరు? మీ ప్రిపరేషన్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నారు? అనే విషయాలను మాత్రమే పరీక్షలు కొలుస్తాయి.»మీలో ఉన్న సృజనాత్మకత, మీ నాయకత్వ లక్షణాలు, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు స్పందించే తీరు, మీ జీవితంలోని అసలైన ప్రతిభను పరీక్షలు ఎప్పటికీ కొలవలేవు.అందుకే మనం మొదట మన మెదడులో ఉన్న ‘పరీక్ష అంటే భయం’ అనే పాత ప్రోగ్రామింగ్‌ను బ్రేక్ చేయాలి. పరీక్షను ఒక గండంలా కాకుండా, ఒక అవకాశంగా చూడటం అలవాటు చేసుకోవాలి.థామస్ ఆల్వా ఎడిసన్ నుంచి స్టీవ్ జాబ్స్ వరకు ఎందరో మహానుభావులు అకడమిక్ పరీక్షల్లో విఫలమైనవారే! కాని, వారు జీవితం అనే పరీక్షలో నెగ్గారు ఎందుకంటే వారు తమ మెదడును గొప్ప లక్ష్యాల కోసం తీర్చిదిద్దుకున్నారు. ఈ పరీక్షలు కేవలం మీ విద్యా ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమే! ఈ మలుపు దగ్గర ఆగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే అసలైన విజయం.గుర్తున్నది గుర్తున్నట్లుగా రాయాలంటే? చాలామంది విద్యార్థులు రాత్రుళ్లు నిద్ర మానేసి గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటారు. కాని, పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అంతా ‘బ్లాంక్’ అయిపోతుంది. దీనికి కారణం మనం చదివే పద్ధతిలో లోపం ఉండటమే. మన మెదడు ఒక లైబ్రరీ వంటిది. అక్కడ పుస్తకాలు (సమాచారం) పేర్చడమే కాదు, అవసరమైనప్పుడు వాటిని వెతికి పట్టుకోవడం కూడా తెలియాలి. జ్ఞాపకశక్తి దేవుడిచ్చిన వరం కాదు, అది ఒక నైపుణ్యం. పైన చెప్పిన మెలకువలు వాడితే సగటు విద్యార్థి కూడా అసాధారణ ఫలితాలను సాధించగలడు. చదవడం అంటే కష్టపడటం కాదు, ‘స్మార్ట్’గా మెదడుకు నచ్చినట్లుగా నేర్చుకోవడం. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా టాపర్స్ వాడే టాప్ టెక్నిక్స్ మీకోసం... 1. స్పేస్డ్ రివిజన్మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న 24 గంటల్లోనే దానిలో దాదాపు 70శాతం మర్చిపోతాం. జర్మన్ సైకాలజిస్ట్ హెర్మాన్ ఎబ్బింగ్హాస్ దీన్ని‘ఫర్ గెట్టింగ్ కర్వ్’ అన్నారు. దీనికి పరిష్కారం ఒకే రోజు ఒక విషయాన్ని పదిసార్లు చదవడం కంటే, నిర్ణీత కాలవ్యవధుల్లో దాన్ని రివిజన్ చేయాలి. ఈరోజు ఒక టాపిక్ చదివితే, దాన్ని రేపు ఒకసారి, వారం తర్వాత ఒకసారి, నెల తర్వాత ఒకసారి రివైజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సమాచారం మీ షార్ట్ టెర్మ్ మెమరీ నుంచి లాంగ్ టెర్మ్ మెమరీలోకి మారుతుంది. ఇది మీ మెదడులో శాశ్వతంగా నిలిచిపోతుంది.2. యాక్టివ్ రీకాల్చాలామంది విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు ‘పాసివ్ రీడింగ్’. అంటే పుస్తకం ముందు పెట్టుకుని పదే పదే చదువుతూ వెళ్లడం. ఇది మనకు ‘అన్నీ తెలుసు’ అనే భ్రమను కలిగిస్తుంది. ఒక పేజీ చదివిన తర్వాత పుస్తకాన్ని మూసేయండి. ‘ఇప్పుడే నేను ఏం చదివాను?’ అని మీకు మీరు ప్రశ్నించుకోండి. కళ్లు మూసుకుని ఆ సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సమాచారాన్ని మెదడులోకి పంపడం కంటే, మెదడు నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడే న్యూరాన్ల మధ్య సంబంధాలు బలపడతాయి. పరీక్షలో మనం చేసేది ఇదే.. కాబట్టి ఇంట్లోనే ఆ ‘ప్రాక్టీస్’ చేయాలి.3. ఫైన్మాన్ టెక్నిక్నోబెల్ విజేత రిచర్డ్ ఫైన్మాన్ అభివృద్ధి చేసిన ఈ టెక్నిక్, ఒక విషయం మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి బెస్ట్ టూల్. మీరు ఒక క్లిష్టమైన టాపిక్ నేర్చుకున్నప్పుడు, దాన్ని ఒక పదేళ్ల పిల్లాడికి వివరిస్తున్నట్లుగా ఊహించుకోండి. మనం ఇతరులకు వివరించాలి అనుకున్నప్పుడు క్లిష్టమైన పదాలను వాడలేము. సరళమైన ఉదాహరణల కోసం వెతుకుతాము. ఆ క్రమంలో మనకు ఎక్కడైతే వివరించడం రాదో, అక్కడ మనకు ‘సబ్జెక్ట్ గ్యాప్’ ఉందని అర్థమవుతుంది. ఆ గ్యాప్స్‌ను మళ్ళీ చదివి భర్తీ చేసుకోవాలి. మీకు ఒక విషయం సరళంగా వివరించడం రాకపోతే, మీకు ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం.4. నిమోనిక్స్–విజువలైజేషన్మన మెదడుకు అక్షరాల కంటే ‘బొమ్మలు’, ‘కథలు’, ‘రంగులు’ అంటే ఎక్కువ ఇష్టం.» ఇంద్రధనుస్సులోని రంగులను గుర్తుంచుకోవడానికి ’VIBGYOR’ అనే పదాన్ని వాడతాం. ఇలా కీవర్డ్స్‌తో నిమోనిక్స్ తయారు చేసుకోండి.» మీ ఇంట్లోని గదులను గుర్తు తెచ్చుకుని, ఒక్కో గదిలో ఒక్కో ఇంపార్టెంట్ పాయింట్‌ను ‘పెట్టినట్లు’ ఊహించుకోండి (మెమరీ ప్యాలెస్) పరీక్షలో ఆ గదిని తలచుకోగానే ఆ పాయింట్ గుర్తొస్తుంది.5. పోమోడోరో టెక్నిక్ మెదడు ఏకాగ్రత సుమారు 25 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది అలసిపోతుంది. అందుకే, 25 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో చదవండి. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్‌లో ఫోన్ చూడకూడదు! కేవలం నీళ్లు తాగడం లేదా చిన్నపాటి నడక చేయాలి. 4 సైకిల్స్ తర్వాత 15–20 నిమిషాల పెద్ద బ్రేక్ తీసుకోండి. ఇది మీ మెదడును మళ్ళీ రీచార్జ్ చేస్తుంది.6. ‘క్యూ3ఆర్’ మెథడ్ ఇది ఒక టెక్స్ట్ బుక్ చదవడానికి అత్యుత్తమ పద్ధతి.సర్వే: ముందుగా లెసన్ హెడ్డింగ్స్, బొమ్మలు, హైలైట్ చేసిన పదాలను చూడండి.క్వశ్చన్: ఆ లెసన్ నుండి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? అని ప్రశ్నలు వేసుకోండి.రీడ్: ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ చదవండి.రిసైట్: చదివింది గట్టిగా లేదా మనసులో నెమరువేసుకోండి.రివ్యూ: చివరగా ఒకసారి అంతా రివైజ్ చేయండి.ఎగ్జామ్ డే స్ట్రాటజీ: ఫైనల్ టచ్క్రికెట్లో బ్యాటర్ నెట్స్‌లో ఎంత ప్రాక్టీస్ చేసినా, మైదానంలో ఆ బంతిని ఎలా ఎదుర్కొంటాడనేదే ముఖ్యం. అలాగే, మీరు నెలల తరబడి పడ్డ కష్టం, మీ మెదడులో నిక్షిప్తమైన వేల పేజీల సమాచారం మూడు గంటల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయి. పరీక్ష రోజున మీ మెదడును మీరు ఎలా ‘హ్యాండిల్’ చేస్తారనేదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. దీనిని సైకాలజీలో ‘పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్’ అంటారు.పరీక్షకు ముందు రాత్రి: ప్లాన్ ‘అ’చాలామంది విద్యార్థులు పరీక్షకు ముందు రాత్రి ‘అవుట్ ఆఫ్ సిలబస్’లాగా రాత్రంతా మేల్కొని చదువుతుంటారు. ఇది అతిపెద్ద పొరపాటు.మెదడును చల్లబరచండి: పరీక్షకు ముందు రాత్రి తొమ్మిది గంటలకల్లా పుస్తకాలు మూసేయండి. కొత్త విషయాలు అస్సలు ముట్టుకోవద్దు. ఆ సమయంలో కొత్తవి చదివితే మెదడులో ‘కాగ్నిటివ్ ఓవర్‌లోడ్’ జరిగి, పాతవి కూడా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది.వస్తువుల సిద్ధం: హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్స్ అన్నీ ముందురోజే ఒక బ్యాగులో పెట్టుకోండి. ఉదయాన్నే వాటి కోసం వెతుక్కోవడం వల్ల కలిగే ఒత్తిడి మీ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది.పరీక్ష రోజు ఉదయం: పాజిటివ్ వైబ్రేషన్స్లైట్ ఫుడ్: ఖాళీ కడుపుతో వెళ్లొద్దు, అలాగని భారీగా తినొద్దు. పండ్లు లేదా ఇడ్లీ లాంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. మెదడుకు శక్తి కావాలి, కాని, అది జీర్ణం కావడానికి ఎక్కువ రక్తం కడుపుకు వెళ్తే, మెదడు మొద్దుబారుతుంది.ఆందోళన కలిగించే మిత్రులకు దూరం: పరీక్ష సెంటర్ దగ్గర ‘ఈ క్వశ్చన్ చదివావా? అది చాలా ఇంపార్టెంట్ అంట కదా!’ అని భయపెట్టే స్నేహితులతో చర్చలు వద్దు. అది మీలో ‘యాంగ్జయిటీ స్పైక్’ కలిగిస్తుంది. మీకు మీరే ‘నేను సిద్ధంగా ఉన్నాను‘ అని చెప్పుకోండి.పరీక్ష హాలులో: ఆ మూడు గంటల మంత్రం1. మొదటి 15 నిమిషాలు ‘ది స్కాన్’:ప్రశ్నపత్రం చేతికి రాగానే కంగారు పడకండి. న్యూరోసై¯న్స్ ప్రకారం, ప్రశ్నలు చదువుతున్నప్పుడు మీ మెదడు లోపల సమాచారాన్ని వెతకడం మొదలుపెడుతుంది.పేపర్ మొత్తం ఒకసారి స్కాన్ చేయండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా గుర్తించండి. ఇది మీ మెదడులో ‘డోపమైన్’ విడుదల చేసి, భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.2. అమిగ్డలా హైజాక్ – బ్రెయిన్ ఫ్రీజ్ అయితే?:ఒక్కోసారి కష్టమైన ప్రశ్న చూడగానే మైండ్ బ్లాంక్ అవుతుంది. దీనిని ‘బ్రెయిన్ ఫ్రీజ్’ అంటారు.అలా జరిగినప్పుడు, పెన్ను కింద పెట్టి, వెనక్కి ఆనుకుని కూర్చోండి. ఒక 30 సెకన్ల పాటు లోతైన శ్వాస తీసుకోండి. మీ శరీరానికి ఆక్సిజన్ అందగానే, భయం వల్ల ఆగిపోయిన మీ ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ (ఆలోచించే భాగం) తిరిగి పనిచేయడం మొదలుపెడుతుంది.3. ది త్రీ అండ్ పాస్ మెథడ్ఫస్ట్ పాస్: అతి సులభమైన, మీకు 100శాతం తెలిసిన సమాధానాలు రాసేయండి.సెకండ్ పాస్: కొంచెం ఆలోచిస్తే వచ్చే సమాధానాలపై దృష్టి పెట్టండి.థర్డ్ పాస్: చివరగా కష్టమైన, అసలు తెలియని ప్రశ్నలను లాజిక్‌తో రాయడానికి ప్రయత్నించండి.ప్రజెంటేషన్: ది సైకాలజీ ఆఫ్ ఇంప్రెషన్ ఎగ్జామినర్ మీ పేపర్ దిద్దేటప్పుడు వారి మనసును మీరు గెలవాలి. సమాధానాల మధ్య గ్యాప్ వదలండి. ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయండి. బొమ్మలు, ఫ్లో చార్ట్స్ వేయండి. ఎగ్జామినర్‌కు మీ సమాధానం ఎంత సులభంగా అర్థమైతే, వారు అన్ని ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. దీనినే సైకాలజీలో ‘హాలో ఎఫెక్ట్’ అంటారు.సమయ పాలన...ప్రతి సెక్షన్‌కు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోవద్దు. వాచ్ చూసుకుంటూ, చివరి 15 నిమిషాలు కేవలం తప్పులు సరిచూసుకోవడానికి కేటాయించండి.పరీక్ష అయిపోయిన తర్వాత..ఒక పరీక్ష అయిపోగానే దాని గురించి పోస్ట్ మార్టం వద్దు. ‘ఆ ప్రశ్న తప్పు రాశాను’ అని బాధపడటం వల్ల తదుపరి పరీక్షపై ప్రభావం పడుతుంది. ‘గతం గతః’. మీ దృష్టి మరుసటి రోజు జరగబోయే యుద్ధంపైనే ఉండాలి.మీ లెగసీకి మీరే సృష్టికర్తలుడియర్ స్టూడెంట్స్, మీరు కేవలం ఒక రోల్ నంబర్ కాదు. మీరు ఒక అద్భుతమైన మేధస్సు కలిగిన వ్యక్తులు. పరీక్ష అనేది కేవలం మార్కుల కోసం కాదు, మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం కోసం. ఈ పరీక్షలు మీ క్రమశిక్షణను, మీ పట్టుదలను నిరూపించుకోవడానికి ఒక వేదిక మాత్రమే! నేడు మీరు పడుతున్న కష్టం, రేపు మీరు నిర్మించబోయే సామ్రాజ్యానికి పునాది. కాబట్టి ఆందోళనను వదిలేయండి, ప్లానింగ్‌ను నమ్మండి. మీ మెదడును మీరు సరైన విధంగా డిజైన్ చేసుకుంటే, ఏ పరీక్షా మీకు అసాధ్యం కాదు.2 నిమిషాల్లో ప్రశాంతత!ఒత్తిడి శత్రువు కాదు, అది మీ శరీరం మిమ్మల్ని సిద్ధం చేస్తున్న తీరు మాత్రమే! దాన్ని భయంగా కాకుండా, ఒక ‘ఎనర్జీ’గా భావించండి! పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం చూడగానే మైండ్ బ్లాక్ అయినా లేదా చదివేటప్పుడు విపరీతమైన ఆందోళన కలిగినా ఈ పద్ధతులను పాటించండి:బాక్స్ బ్రీతింగ్ఇది మన నాడీ వ్యవస్థను వెంటనే శాంతపరుస్తుంది. నాలుగు సెకన్లు నెమ్మదిగా ముక్కుతో గాలి పీల్చుకోండి. నాలుగు సెకన్లు గాలిని లోపలే పట్టి ఉంచండి. 4 సెకన్లు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలండి. నాలుగు సెకన్లు గాలి పీల్చకుండా ఖాళీగా ఉండండి. ఇలా 3–4 సార్లు చేస్తే మెదడుకు ఆక్సిజన్ అంది, ఆందోళన మాయమవుతుంది.ఇన్స్టంట్ మజిల్ రిలాక్సేషన్మీ అరచేతులను గట్టిగా ముడిచి, భుజాలను పైకి బిగబట్టండి. ఐదు సెకన్ల పాటు అలాగే ఉంచి, ఒక్కసారిగా వదిలేయండి. మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఒత్తిడితో పాటే బయటకు పోయినట్లు అనిపిస్తుంది.గ్రౌండింగ్ టెక్నిక్ మీ ఆలోచనలు భవిష్యత్తు గురించి భయపడుతున్నప్పుడు, మీ మనస్సును ప్రస్తుత క్షణంలోకి తీసుకురావడానికి ఇది బెస్ట్ మెథడ్. కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న ఐదు వస్తువులను చూడండి. నాలుగు వస్తువులను తాకండి. మూడు రకాల శబ్దాలను వినండి. రెండు రకాల వాసనలను పీల్చండి. ఒక మంచి విషయాన్ని తలచుకోండి.పాజిటివ్ అఫర్మేషన్కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ, మనసులో ‘నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను దీన్ని చేయగలను’ అని మూడుసార్లు చెప్పుకోండి. ఇది మీ సబ్–కాన్షియస్ మైండ్‌కు ధైర్యాన్ని ఇస్తుంది.పిల్లల విజయంలో పేరెంట్స్‌దే ప్రధాన పాత్ర!పరీక్షల సీజన్ రాగానే ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. టీవీలు ఆగిపోతాయి, శుభకార్యాలకు వెళ్లడం మానేస్తారు, అంతా ఒక రకమైన ‘కర్ఫ్యూ’ వాతావరణం నెలకొంటుంది. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. తల్లిదండ్రులు సృష్టించే ఈ అతి జాగ్రత్తే పిల్లల్లో తెలియని ఒత్తిడిని పెంచుతుంది. అందుకే పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఒక వార్డెన్‌లా కాకుండా ఒక కోచ్‌లా వ్యవహరించాలి. ఈ కష్ట సమయంలో మీరు వారికి ఇచ్చే మద్దతు, ప్రేమ వారి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. వారి మీద నమ్మకం ఉంచండి, వారు అద్భుతాలు సృష్టిస్తారు.పోలిక అనే విషం: చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు – తమ పిల్లలను పక్కింటి పిల్లలతోనో లేదా బంధువుల పిల్లలతోనో పోల్చడం. మీరు పోల్చిన ప్రతిసారీ పిల్లల సెల్ఫ్–ఎస్టీమ్ దెబ్బతింటుంది. ‘మా నాన్నకు నాకంటే నా మార్కుల మీదనే ప్రేమ ఎక్కువ’ అనే భావన వారిలో కలుగుతుంది. దీనివల్ల వారి మెదడులో అమిగ్డాలా యాక్టివేట్ అయ్యి, చదువు మీద ఆసక్తి తగ్గుతుంది.గుర్తుంచుకోండి, ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన ‘జీనియస్’. ఒక చేపను చెట్టు ఎక్కలేదని తిడితే అది జీవితాంతం తనను తాను తక్కువ చేసుకుంటుంది. మీ పిల్లల ఎదుగుదలను వారి నిన్నటి పర్ఫార్మెన్స్తో మాత్రమే పోల్చండి.సేఫ్ స్పేస్: పిల్లలు పరీక్షల గురించి భయపడుతున్నప్పుడు వారికి కావాల్సింది ఉపన్యాసాలు కాదు, ఒక భరోసా. ‘నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’, ‘పరీక్ష పోతే జీవితం అయిపోదు, మేము నీకు తోడున్నాం’ అనే మాటలు పిల్లల మెదడులో భయాన్ని పోగొట్టి, వారిని మరింత ఏకాగ్రతతో చదివేలా చేస్తాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులు టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండి పిల్లలకు చదువుకునే వాతావరణం కల్పించాలి.వినడం నేర్చుకోండి: చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం అంటే లెక్చర్ ఇవ్వడం అనుకుంటారు. పిల్లవాడు ‘నాకు ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది’ అన్నప్పుడు, ‘నువ్వు సరిగ్గా చదవట్లేదు’ అని అనకుండా, ‘అవునా, ఏ పార్ట్ కష్టంగా ఉంది? మనం ఎవరినైనా అడుగుదామా?’ అని అడగండి. వారి బాధను మీరు అర్థం చేసుకుంటున్నారని తెలిస్తే, వారి సగం ఒత్తిడి తగ్గిపోతుంది.ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి: ‘నీకు 95% రావాలి’ అని టార్గెట్లు పెట్టకండి. దానికి బదులుగా ‘ఈరోజు నువ్వు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేశావా?’ అని అడగండి. ఫలితం మన చేతుల్లో లేదు కాని, ప్రయత్నం మన చేతుల్లో ఉంది. ప్రక్రియ సరిగ్గా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మద్దతు: పరీక్షల సమయంలో పిల్లల ఆహారం, నిద్ర విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పండ్లు, నట్స్, మరియు తగినంత నీరు అందిస్తూ ఉండాలి. రాత్రంతా మేల్కొని చదవమని ఒత్తిడి చేయకండి. ఏడు గంటల నిద్ర ఉంటేనే వారు పరీక్షలో చదివింది రాయగలరని గుర్తుంచుకోండి.మెదడుకు శక్తినిచ్చే ఇంధనం! మన మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతంమాత్రమే ఉంటుంది, కాని, మనం తీసుకునే శక్తిలో 20 శాతం మెదడుకే అవసరం. పరీక్షల సమయంలో విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు – చదువు మీద పెట్టిన దృష్టిని శరీరం మీద పెట్టకపోవడం. మీ మెదడు ఒక రేసింగ్ కార్ అనుకుంటే, దానికి సరైన పెట్రోల్, టైర్ల మెయింటెనెన్స్ ఎంత అవసరమో, పరీక్షల సమయంలో విద్యార్థికి ‘బయోలాజికల్ సపోర్ట్’ కూడా అంతే ముఖ్యం.నిద్ర: మెమరీ సేవర్ చాలామంది విద్యార్థులు రాత్రంతా మేల్కొని చదువుతారు. కాని, సైన్స్ ఏం చెబుతుందంటే.. మీరు పగలు చదివిన విషయాలన్నీ నిద్రలోనే మెదడులో స్థిరపడతాయి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నిద్ర తక్కువైతే, మీరు ఎంత చదివినా అది ‘షార్ట్ టర్మ్ మెమరీ’లోనే ఉండిపోయి, పరీక్ష సమయంలో గుర్తుకు రాదు.పరీక్షల సమయంలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రకు ముందు ఫోన్ చూడటం మానేయాలి, ఎందుకంటే ఆ బ్లూలైట్ నిద్రను దూరం చేస్తుంది.హైడ్రేషన్–డైట్ మెదడులో 75 శాతంనీరు ఉంటుంది. కేవలం రెండు శాతం నీరు తగ్గినా మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల మెదడు అలసిపోకుండా ఉంటుంది.ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే బాదం, వాల్నట్స్, గుడ్లు, తాజా ఆకుకూరలు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, జంక్ ఫుడ్ తినకండి. ఇవి ‘షుగర్ క్రాష్’ కలిగించి మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తాయి.వ్యాయామం: మెదడుకు ఆక్సిజన్ పరీక్షల సమయంలో వ్యాయామం అంటే సమయం వృథా అనుకుంటారు. కాని, అది తప్పు. మీరు ఒక 15–20 నిమిషాలు వేగంగా నడిచినా లేదా వ్యాయామం చేసినా మెదడులో ‘బీడీఎన్ఎఫ్’ (బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోపతిక్ ఫ్యాక్టర్) అనే ప్రోటీన్ విడుదలవుతుంది. ఇది మెదడు కణాలను రిపేర్ చేసి, కొత్త విషయాలను వేగంగా నేర్చుకునేలా చేస్తుంది. అందుకే చదువు మధ్యలో ‘బ్రేక్’ తీసుకున్నప్పుడు ఫోన్ చూడకుండా, కాసేపు డాబా మీద నడవండి లేదా చిన్నపాటి స్ట్రెచింగ్ చేయండి. -
10th పేపర్ లీక్.. 80 గ్రాముల బంగారం టోకరా
బెంగళూరు: కర్ణాటకలో ఓ టీచర్ పరీక్ష పేపర్ లీక్ చేస్తానని విద్యార్థికి ఆశ చూపి 80 గ్రాముల బంగారం కాజేసింది. ఈ వివరాలు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ స్టూడెంట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ధార్వాడ్‌లోని విద్యారణ్య పాఠశాలలో SSLV ( 10 వతరగతి) పరీక్ష పత్రాన్ని లీక్ చేస్తానని ఆ విద్యార్థికి, టీచర్ ఆశచూపింది. దీనికి గాను మెుదటగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే విద్యార్థి దగ్గర డబ్బు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న బంగారం తేవాలని చెప్పింది. దానికి విద్యార్థి తొలుత భయపడ్డాడు. అయితే తను ఆ నగలు తిరిగి ఇచ్చేస్తానని భయపడాల్సిన అవసరం ఏమి లేదని విద్యార్థికి నచ్చజెప్పింది.దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయితాననే ఆశతో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారం దాదాపు రూ. 12 లక్షలు విలువ తీసుకొచ్చి ఆ టీచర్‌కు ఇచ్చాడు. కొద్దిరోజులకు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆ టీచర్ అతనిని తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించింది. అయితే ఇంతలోనే బంగారం పోయిన సంగతి ఆ ఇంట్లో వారు గమనించారు. దీంతో ఆ పిల్లాడిని నిలదీయగా అతన అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో ఆ విద్యార్థి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్నపోలీసులు ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా మరేవరైనా విద్యార్థుల వద్ద నగదు కాజేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో తల్లి మృతదేహం.. ఇంటర్ పరీక్షకు..
జగిత్యాల జిల్లా: ఇంట్లో తల్లి మృతదేహం.. ఆపుకోలేని దుఃఖం.. ఇంతలోనే ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు రాయాల్సి రావడం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.. అయినా, ధైర్యం తెచ్చుకున్న ఆ విద్యార్థిని.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరైంది. ఏపీలోని విజయవాడకు చెందిన అనూష–లక్ష్మణ్ దంపతులు ఉపాధి కోసం జగిత్యాల శివారులోని నూకపెల్లి అర్బన్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు. అనూష టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తెలిసినవారి వద్ద కొంత అప్పు చేసింది. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురైన అనూష ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె పెద్దకూతురు రమ్యశ్రీ బుధవారం ఇంటర్ తెలుగు పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష పూర్తయ్యాక తల్లి అంత్యక్రియలకు హాజరైంది. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.హాల్‌కు వెళ్లడమే పెద్ద పరీక్షభద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన దివ్యాంగ విద్యార్థి ఆశాజ్యోతి టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం హెచ్ఈసీ చదువుతోంది. ఆమె నడిచే పరిస్థితి లేక ఎక్కడికైనా వీల్‌చైర్‌పైనే వెళ్లి వస్తుంది. బుధవారం ఇంటర్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ కేంద్రానికి వీల్‌చైర్‌లో వచ్చింది. అయితే ఆమె పరీక్ష రాయాల్సిన రూమ్ మొదటి అంతస్తులో ఉంది. దీంతో మెట్లు ఎక్కలేకపోవడంతో కాలేజీ సిబ్బంది, ఆశా వర్కర్ కలిసి మొదటి అంతస్తులోని హాల్ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ విషయమై సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ బసవమ్మ, డిపార్ట్మెంటల్ అధికారి ఖాసీంను వివరణ కోరగా.. ఆశాజ్యోతికి తర్వాతి పరీక్షలకు కిందనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
సీబీఎస్ఈ వార్నింగ్: విశ్లేషకులపై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుతం జరుగుతున్న పది, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు, సబ్జెక్ట్ నిపుణులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారం కోసం కొన్ని విద్యాసంస్థలు పరీక్ష జరుగుతుండగానే లేదా ముగిసిన మరుక్షణమే ‘ప్రశ్నాపత్రం విశ్లేషణ’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తీరుపై బోర్డు మండిపడింది.పరీక్ష కొనసాగుతున్న సమయంలో ప్రశ్నాపత్రం బయటకు రావడం అసాధ్యమని, ఒకవేళ ఎవరైనా విశ్లేషణలు జరిపితే దానిని ‘స్కామ్’ లేదా ‘ఫేక్ అనాలసిస్’గా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు పద్ధతులకు పాల్పడే పాఠశాలలు, నిపుణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, ప్రశ్నాపత్రాల లీకేజీ పుకార్ల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్ఈ సూచించింది.పరీక్షల సమయంలో కొంతమంది అక్రమార్కులు నకిలీ ప్రశ్నాపత్రాలను చలామణి చేస్తున్నారని బోర్డు పేర్కొంది. పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ‘ఎసెన్షియల్ రిపీట్’ నిబంధనపై కూడా బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన బోర్డు పరీక్షల్లో మొదటి విడతలో హాజరుకావడం ప్రతి విద్యార్థికి తప్పనిసరి. కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరుకాని పక్షంలో వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీ కింద పరిగణిస్తారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మొదటి విడత పరీక్షలు రాయలేమని, నేరుగా రెండో విడతకు అనుమతించాలని విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాలను బోర్డు తోసిపుచ్చింది.ఇది కూడా చదవండి: ఏఐ విప్లవం: భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ -
TG: రాష్ట్రంలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలు సిద్దం చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18తో ఇవి ముగుస్తాయి. అయితే పరీక్షల సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మెుత్తంగా 9,97,075 మంది పరీక్షలకు హాజరవుతుండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది కాగా ద్వితీయ సంవత్సరం 5,07,949 మంది అని ఇంటర్ బోర్టు తెలిపింది.ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందు గానే చేరుకోవాలని తెలిపింది. పరీక్షలు పకడ్బందీగా జరగడానికి 7,500 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్షా కేంద్రాలలో ప్రత్యేకంగా తాగునీరు, ఫర్నీచర్, గోడ గడియారాలు అధికారులు తెలిపారు.మానసిక ఒత్తిడికి టెలిమానస్పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు లోనయితే సైకాలజిస్టుల సలహాలు తీసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. అందుకోసం 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాలని పేర్కొంది. ఈ సేవలు నిరంతరాయంగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
Andhra Pradesh: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సోమవారం మొదటి ఏడాది, మంగళవారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. ఈ ఏడాది మొదటి, రెండో ఏడాది పరీక్షలకు 10,57,312 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించినట్లు బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా చెప్పారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పరీక్ష కమిటీలు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తాయని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆరీ్టసీని కోరామని చెప్పారు. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎల్రక్టానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఏమైనా సందేహాలు, సమస్యలుంటే విద్యార్థులు 1800–425–1531(టోల్ ఫ్రీ) నంబర్‌ను ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. -
వైభవ్ సూర్యవంశీ తండ్రి కీలక వ్యాఖ్యలు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులోనే విధ్వంసకర శతకం బాదిన ఈ బిహారీ పిల్లాడు.. యూత్ వన్డే, టెస్టుల్లోనూ శతకాల మోత మోగించాడు.ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో మెరుపు, భారీ శతకం (80 బంతుల్లో 175) బాది.. భారత్ ఆరో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.ఐపీఎల్-2026కు సన్నద్ధంఇక వైభవ్ సూర్యవంశీ తదుపరి ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతడు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలకు హాజరవుతాడని.. ఇందుకోసం ఆటకు విరామం ఇస్తాడనే వార్తలు వచ్చాయి.పరీక్షలకు దూరంఅయితే, వైభవ్ చదివే స్కూల్ డైరెక్టర్ మాత్రం అతడు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తాజాగా ధ్రువీకరించారు. ‘మిడ్డే’తో మాట్లాడుతూ..అవును.. మాకు అదే ముఖ్యం‘‘అవును.. నా కుమారుడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి వైభవ్ పరీక్షల గురించి చాలా చర్చ నడుస్తోంది. అందుకే అతడు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు.వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది ఒకవేళ పరీక్షలకు హాజరైనా అతడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పనీ చేయకూడదు. నిజానికి చదువులో వైభవ్ ఎప్పుడూ ముందే ఉంటాడు.అన్ని సబ్జెక్టులలోనూ వాడికి 90 శాతానికి పైగా మార్కులు వచ్చేవి. అయితే, ఇప్పుడు మా ప్రాధాన్యం క్రికెట్ మాత్రమే’’ అని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలో భాగంగా వైభవ్ బిహార్‌లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎగ్జామ్‌కు హాజరుకావాల్సింది. అయితే, అతడు పరీక్షా కేంద్రానికి రాలేదని.. అతడికి ఆబ్సెంట్ వేశామని పాఠశాల ప్రిన్సిపల్ ఎన్కే సిన్హా ANIకి తెలిపారు.చదవండి: అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్ -
ఎప్ సెట్ రాసిన వెంటనే ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సాంకేతికతను జోడించి ఈసారి మరింత మెరుగైన రీతిలో ఎప్‌సెట్‌ను నిర్వహిస్తున్నామని సెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ లాగవుట్ అయిన వెంటనే మార్కులు డిస్ప్లే అవుతాయని తెలిపారు.ఈ మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో సెట్ పూర్తయిన మరుక్షణమే తెలుసుకోవచ్చని చెప్పారు. దీన్ని ఈ ఏడాది నుంచే ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. మే నెలలో జరిగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏప్సెట్)కు ఈ నెల19వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టికేకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, సెట్ ఉప కన్వీనర్ ప్రొఫెసర్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. సెట్‌కు ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఇదే నెల 23న హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రూ. 10 వేల ఫైన్‌తో పరీక్ష మొదలయ్యే రెండు రోజుల ముందు (ఏప్రిల్ 2 వరకూ) దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... తప్పు చేశారో... ఇట్టే పట్టేస్తుంది! ఇంటర్ బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ సెట్‌కు, ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ సెట్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. కానీ ఆన్లైన్లో ఇందుకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తున్నారు. దీనివల్ల ఆఖరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది నుంచి ఈ సమస్య ఉండదు. ఇంటర్ బోర్డ్‌తో సమన్వయం చేసుకుని ఇంటర్ హాల్ టిక్కెట్‌ను ఆన్లైన్ ద్వారా సెట్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థి తప్పు చేస్తే సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థికి చెప్పేందుకు హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నుంచి వెంటనే విద్యార్థి రిజిస్టర్ మొబైల్‌కు ఫోన్ వెళ్తుంది. సెట్‌కు హాజరైన విద్యార్థులు ప్రాథమిక కీ విడుదలవ్వగానే తప్పులుంటే తెలియజేయవచ్చు. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి ప్రతీ సందేహానికి రూ. 500 చెల్లించాలి. లేవనెత్తిన తప్పు నిజమని తేలితే సొమ్ము వాపస్ ఇస్తారు. విద్యార్థి తన మొబైల్ నుంచే ఏప్సెట్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఈసారి కొత్తగా కలి్పంచారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ విద్యార్థి మీ సేవ కేంద్రం నుంచి దరఖాస్తు చేసేవాళ్ళు. దీనివల్ల కేంద్రం నిర్వాహకుడు దరఖాస్తులు తప్పుగా నింపుతున్నారు. ఇది చివరి నిమిషంలో సమస్యలకు తావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మొబైల్ కంపాటబులిటీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన హయాంలో జరిగిన పురోగతిని వీసీ ప్రొఫెసర్ టికెకె రెడ్డి వివరించారు. ఈ పట్టణాల్లో పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల్లో ఏప్సెట్ జరుగుతుంది. వీటి పరిధిలో 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో నాలుగు జోన్లు ఉంటాయి. ఈ జోన్లల్లో 32 పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. బాలికలకు ఈసారి సమీపంలోనే పరీక్ష కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఫైన్‌తో దరఖాస్తు చేసే విద్యార్థులకు హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి. -
ఇల్లు ఎగ్జామ్ సెంటర్ కాదు
పరీక్షలు వస్తే... పిల్లలు ఎలా ఉండాలో చెప్పడంతోపాటు తల్లిదండ్రులు ఎలా ఉండాలో కూడా చెప్పాల్సి వస్తోంది. ఇరు పక్షాలు బాగా వత్తిడి ఎదుర్కోక తప్పని సమయం ఇది. చదువు ముఖ్యమే అయినా పిల్లల శక్తి, స్వభావం గమనించుకుని తల్లిదండ్రులు తమను తాము అర్థం చేసుకుని ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన సమయం ఇదని అంటున్నారు నిపుణులు.ఫిబ్రవరి వచ్చిందంటే పరీక్షల కాలం మొదలైనట్లే. ఏడాది మొత్తం చదివినదంతా ఈ పరీక్షల్లో రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. లేకపోతే అమ్మా నాన్న ఏమనుకుంటారోనని పిల్లల టెన్షన్. అదే సమయంలో పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఇరుగూ పొరుగూ వారు ఏమనుకుంటారోనని తల్లిదండ్రులకు టెన్షన్. ఇంత టెన్షన్ అవసరమా? ఎగ్జామ్స్ వస్తే ఇళ్లు ప్రశాంతంగా ఉండటం మంచిదేగాని చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దంతో ‘పిల్లాడు చదువుకుంటున్నాడు. అరవకండి’ అనే గుసగుసలతో విడ్డూరంగా ఉండటం సమంజసమా? పరీక్షలు రాయాలి కాబట్టి పిల్లలకు టెన్షన్ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఒత్తిడితో ఆరోగ్యంపాడుచేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు.తల్లులూ... జాగ్రత్తపరీక్షల్లో మార్కులు బాగా రావాలని చాలామంది విద్యార్థులు రాత్రిపూట చదువుకుంటూ ఉంటారు. పిల్లలు వద్దంటున్నా కొందరు పెద్దలు నిద్రమానేసి వారి పక్కనే కూర్చుంటారు. నిద్రపోకుండా టీ, కాఫీ వంటివి అందిస్తుంటారు. కలత నిద్రతోనే పొద్దున్న లేచి మళ్లీ అన్ని పనులు చేస్తుంటారు. ఈ నిద్రలేమి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజంతా ఇంటి పనులు చేసే తల్లులు రాత్రుళ్లు నిద్రపోకపోవడంతో అలసిపోయి అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు. పరీక్షల వేళ పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తల్లి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.తండ్రులూ... శాంతంపిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొందరు తండ్రులు తమ పిల్లలే ఫస్ట్ రావాలన్న పట్టుదలతో ఉంటారు. పరీక్షల సమయంలో పిల్లలకన్నా వీరే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. చదువుతున్న పిల్లల్ని గదమాయించడం, అన్నీ చదివావా అని మాటిమాటికీ అడగటం, కాసేపు పక్కన వెళ్లినా కసురుకోవడం, వేరేవాళ్లతో కలవనివ్వకుండా చదవమనడం వంటివి చేస్తుంటారు. పిల్లలు పరీక్ష సరిగ్గా రాస్తారా లేదా అన్న భయంతో బీపీ తెచ్చుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివీ జరుగుతుంటాయి. ఇవన్నీ చిన్నారుల మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపి, వారిని మరింత అభద్రతకు గురిచేస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అటు తల్లిదండ్రుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటే, ఇటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. కాబట్టి పరీక్షల వేళ శాంతం వహించి చదివించాలి.చిరాకు తెప్పిస్తే ఎలా?పరీక్షలు వస్తే తల్లిదండ్రుల రోజువారీ కార్యక్రమాలు మారిపోతుంటాయి. పొద్దున్నే లేచి పిల్లల్ని లేపడం, వారిని చదువుకోమని చెప్పి పనులు చేసుకోవడం, ఎవరినీ ఇంటికి రానివ్వకుండా కట్టుదిట్టం చేయడం వంటివి చేస్తుంటారు. బయటకు వెళ్లాల్సిన పనులను వాయిదా వేసి 24 గంటలూ పిల్లల పక్కనే ఉంటారు. ఇదంతా వారు ప్రేమతో చేసినా పిల్లలపై చూపే అతి నియంత్రణ ఇబ్బందిగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద భయం, కోపం, చిరాకు పెరుగుతాయని అంటున్నారు.ఇలా చేస్తే మేలుపరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత బాగా చదువుతారని నిపుణులు అంటున్నారు. ‘చదువు..బాగా చదువు..చదవకపోతే జీవితం వేస్ట్’ లాంటి మాటలు మాట్లాడకూడదంటున్నారు. ఏయే సబ్జెక్టుల్లో వారు ఇబ్బంది పడుతున్నారో కనుక్కొని అందులో వారి సందేహాలు తీర్చాలి. అవసరమైతే యూట్యూబ్ వీడియోలు చూసి తగిన అంశాలు రాసుకొని వారికి వివరించాలి. రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టాలని కోరకుండా కాసేపు పిల్లల్ని బయటకు పంపాలి. కంబై¯Œ ్డ స్టడీ చేయాలని పిల్లలు కోరితే అందుకు సహకరించాలి. రాత్రిపూట భోజనం అయ్యాక ఒక పదిహేను నిమిషాలపాటు వారితో కలిసి వాకింగ్ చేయాలి. ఆ సమయంలో పరీక్షల గురించి వారితో చర్చించాలి. వారిలో ఉన్న భయాలు పోగొట్టాలి. పరీక్ష రాసి వచ్చాక వారిని ప్రశ్నలతో వేధించకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.ఈ ఆహారం బెటర్పరీక్షల సమయంలో పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంపై తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉంటాయి. కొందరు ఆహారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తే, మరికొందరు అమితంగా తినిపిస్తుంటారు. రెండూ సరికాదని నిపుణులు అంటున్నారు. పరీక్ష సమయంలో కాఫీ, టీ, బ్రెడ్ వంటివి మంచివి కాదని వైద్యులు అంటున్నారు. పోహ, ఉ΄్మా, అవకాడో పనీర్ టోస్ట్, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు, మొలకెత్తిన గింజలు తినిపించడం మంచిదని అంటున్నారు. టిఫిన్లలో కిచిడీ, ఊతప్పం, ఇడ్లీసాంబార్ వంటివి మేలంటున్నారు. పిల్లలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆహారం పెట్టొద్దని, వారికి ఆకలి వేసినప్పుడు అడిగినంత మాత్రమే పెట్టాలంటున్నారు. -
జేఈఈ టాపర్స్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు -
విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు!
న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థులకు శుభవార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకన విధానంలో కీలక మార్పును ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 2026 బోర్డు పరీక్షల సమాధాన పత్రాలను ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) విధానంలో దిద్దనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ నూతన విధానంతో మార్కుల లెక్కింపులో పారదర్శకత పెరుగుతుందని సీబీఎస్ఈ పేర్కొంది. భారతదేశంతో పాటు 26 దేశాల్లోని దాదాపు 46 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతి ఏటా సీబీఎస్ఈ బోర్టు పరీక్షలు నిర్వహిస్తుంటుంది.సీనియర్ సెకండరీ స్థాయికి పూర్తి డిజిటల్ మూల్యాంకనాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సీబీఎస్ఈ ప్రస్తుతానికి 10వ తరగతి సమాధాన పత్రాలను పాత పద్ధతిలోనే (ఫిజికల్ మోడ్) దిద్దుతారని స్పష్టం చేసింది. డిజిటల్ మార్కింగ్ విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ పద్ధతి ద్వారా మార్కుల లెక్కింపులో జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయని, ఆటోమేటెడ్ వ్యవస్థ వల్ల మానవ ప్రమేయం తగ్గి, సమన్వయం వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు.ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్దడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాలల్లోనే ఉంటూ విధులకు ఆటంకం కలగకుండా మూల్యాంకనం చేయవచ్చని భరద్వాజ్ తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అవడమే కాకుండా, ఫలితాల తర్వాత మార్కుల ధృవీకరణ అవసరం కూడా ఉండదని స్పష్టం చేశారు. ఈ నూతన విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీలుగా అనుబంధ పాఠశాలలన్నీ తగిన సాంకేతిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సీబీఎస్ఈ ఆదేశించింది. సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంపై ఢిల్లీలోని ఐటీఎల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధా ఆచార్య స్పందిస్తూ, ఇది మానవ తప్పిదాలను తగ్గించే అద్భుతమైన పని విధానం అని అన్నారు. -
అక్క కోసం దాచిన డబ్బుల్ని దొంగిలించి.. గోవాలో తమ్ముడు ఎంజాయ్
ఢిల్లీ: పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి, మంచి కెరీర్ నిర్మించుకోవాలని విద్యార్థులు ఎన్నో ఆశలు పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు భరించలేని ఒత్తిడితో ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించే పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఓ విద్యార్థి మాత్రం అలా చేయలేదు. ఒత్తిడిని దూరం పెట్టి, ఎంజాయ్ చేయాలని గోవాకు వెళ్లిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నా.. గోవాకు వెళ్లే ముందు ఆ విద్యార్థి చేసిన పనికి కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలుడు పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే తన అక్క యూపీఎస్సీ ఫీజు కోసం ఇంట్లో దాచి పెట్టిన రూ.3లక్షల్ని దొంగిలించాడు. అనంతరం, ఎంజాయ్ చేసేందుకు గోవా వెళ్లాడు.అయితే, కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులు సైబర్ ట్రాకింగ్ ద్వారా బాలుడిని గుర్తించారు. గోవాలో ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక గోవా పారిపోయినట్లు చెప్పుకొచ్చాడు. గోవా వెళ్లేందుకు తన అక్క కోసం దాచిన మూడు లక్షల్ని దొంగించినట్లు నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విద్యార్థులపై పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై అధిక ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,అమరావతి: ఇంటర్మీడియట్ బోర్టు 2026 ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియల్ తొలి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు బోర్టు ప్రకటించింది. రెండవ సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 24 నుంచి మెుదలు కానున్నట్లు పేర్కొంది. పరీక్షలు ఉ.9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరగనున్నాయి. మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2ఏ మార్చి 21న.. మార్చి3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ పేపర్ 2లను మార్చి 4వతేదీకి మారుస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. మిగతా పరీక్షలలో ఏటువంటి మార్పులు లేనట్లు తెలిపింది.ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్వూస్ పరీక్ష జనవరి 21వ తేదీన ఉండగా, ఇన్విరాల్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీన జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షల అనంతరం హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు బోర్టు అధికారికంగా వెల్లడించింది. -
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
-
అమ్మా.. భయమేస్తోందే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మందిలో పరీక్షల భయం కనిపిస్తోంది. ‘మమ్మీ.. భయమేస్తోందే..’అంటూ ఇంటర్ హాస్టల్ విద్యార్థులు తల్లులకు ఫోన్లు చేసి వాపోతున్నారు. జిల్లా ఇంటర్ అధికారులు ఈ విషయాన్ని ఇటీవల బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాలేజీల్లో ఒక్కసారిగా బోధన సమయం పెరగడం.. అంతర్గత పరీక్షలు ఎక్కువ నిర్వహించాలనే ఆలోచన విద్యార్థుల భయానికి కారణంగా పేర్కొంటున్నారు.దీనికితోడు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. బోధన సమయాన్ని ఎక్కువ చేశాయి. ఇంటర్ సిలబస్‌తోపాటు జేఈఈ, ఈఏపీసెట్, నీట్ వంటి పరీక్షల శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రోజువారీ, వారాంతపు, నెలవారీ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విడగొడుతున్నాయి. ఇవన్నీ విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో సుమారు 90 వేల మందే ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు. ఇక ఇంటికి పంపలేం పరీక్షలయ్యే వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇంటికి పంపలేమని ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. ‘మీ వాడు మేథ్స్‌లో వీక్‌గా ఉన్నాడు. సెక్షన్ మారుస్తున్నాం’అని చెప్పే కాలేజీలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ‘చదవడం లేదా?.. ఇలా అయితే ఎలా’అంటూ నిలదీస్తున్నారు. ఒక్కసారిగా కట్టడి చేయడం, కఠిన నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు భయపడుతున్నారు.ప్రైవేటు హాస్టళ్లలో సమయ పాలన మార్చారు. ఉదయం 4 గంటలకే లేపడం, రాత్రి 11 గంటల వరకూ స్టడీ అవర్స్ పేరుతో కూర్చోబెట్టడం విద్యార్థులకు కొత్తగా ఉంది. ఇప్పటివరకు క్లాస్ రూంలో చెప్పిన పాఠాలకు భిన్నంగా షార్ట్‌కట్ పేరుతో బోధన చేయడం కూడా కొత్తగా ఉందని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి శశాంక్ పేర్కొన్నాడు. చాలాచోట్ల భోజనం చేసేందుకు తగిన సమయం కూడా ఇవ్వడం లేదు. ఆటలు పూర్తిగా రద్దు చేశారు. పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌కే పరిమితం చేశారు. ఇంటికి ఫోన్ చేసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు ఆదివారం మాత్రమే తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయి. ఆ చాప్టర్లంటే వణికి పోతున్నారు కొన్ని చాప్టర్లు ఎంత చదివినా విద్యార్థులకు బోధపడటం లేదు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అకడమిక్‌గానే ఇప్పటివరకు చదివినట్టు విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ పోటీపరీక్షల కోసం భిన్నంగా చెబుతున్నారని వారు అంటున్నారు. గతంలో చదివింది ఇప్పుడు చదివే దానికి పొంతనే ఉండటం లేదంటున్నారు. మేథ్స్‌లో మ్యాట్రిక్స్ అండ్ డిటరి్మనేట్స్‌లో ఎడ్‌జాయింట్, ఇన్వర్స్, ప్రాపర్టీస్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్‌లో కొత్త విధానం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సి వస్తోందని ఇంటర్ విద్యార్థి సందీప్ చెప్పాడు. ప్రాబబులిటీ డిస్ట్రిబ్యూషన్స్‌లో నార్మల్ చాప్టర్స్‌ను ఇప్పుడు సుదీర్ఘంగా చేయాల్సి వస్తోందంటున్నారు.సర్కిల్స్, పారా»ొలా, ఎల్లిప్స్, హైపర్బోలా, వెక్టర్ ఆల్జీబ్రాలో స్కాలర్ ప్రొడక్ట్, వెక్టర్ ప్రొడక్ట్ వంటివి సాధారణ సెక్షన్లో ఉండే విద్యార్థులకు అంతుబట్టడం లేదు. ఒక్కసారిగా వాటిని భిన్నమైన రీతిలో బోధించడమే అందుకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో ఎలక్రి్టక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ వంటి చాప్టర్లలో కొత్త అంశాలను జాతీయ పరీక్షల కోసం అధ్యాపకులు చెబుతున్నారు. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయంటున్నారు. కెమెస్ట్రీలోనూ సెల్ పొటెన్షియల్స్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మెకానిజం బేస్డ్ రియాక్షన్స్‌ను పాఠ్యపుస్తకంలో లేని కొత్త అంశాలతో పరీక్షల కోణంలో చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యలు.. కొన్నేళ్లుగా ఇంటర్ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. బోధన సమయంలో ఒత్తిడి, ఫలితాలు తారుమారు కావడం, జాతీయ స్థాయిలో ర్యాంకులు వారిని కుంగదీస్తున్నాయి. 2019లో 22 మంది, 2022లో 543 మంది, 2024లో ఏడుగురు, 2025లో ముగ్గురు విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెడతామని.. ఒత్తిడి పెంచుతున్న కాలేజీల వివరాలు సేకరించాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించినట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించేలా బోధించాలని కాలేజీల యాజమాన్యాలు మాకు తేల్చిచెబుతున్నాయి. దీంతో విద్యార్థులపై మేం ఒత్తిడి పెంచక తప్పడం లేదు. కానీ దీనివల్ల దుష్ఫలితాలు ఎదురుకావచ్చు. – రణదీప్ పల్లవ్, ఇంటర్ అధ్యాపకుడు ర్యాంకుల ఆందోళనలో విద్యార్థులు నెల రోజుల వ్యవధిలో 10 మంది ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చా. మాకు ర్యాంకులు వస్తాయా? మేం ఏం చదవాలనే ఆందోళన వారిలో కనిపించింది. – సరితా వినీత్, మానసిక వైద్యురాలు -
ఎక్కడ వెనుకబడి ఉన్నారు?
సాక్షి, హైదరాబాద్: పరీక్షలపై ఇంటర్ బోర్డ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య క్షేత్రస్థాయి ఇంటర్ అధికారులతో రెండు రోజులుగా టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాలేజీల్లో పునఃశ్చరణ, విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఇక నుంచి రెగ్యులర్‌గా పర్యవేక్షించాలని అధికారులకు చెబుతున్నారు.వరుసగా క్లాసులకు హాజరవ్వని విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలని, కారణాలు తెలుసుకోవాలంటున్నారు. ఇంటర్ బోర్డ్ ప్రతీ కాలేజీని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది. కాలేజీల్లోని కెమెరాలు బోర్డ్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు. వీటిని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోధన పద్ధతులు, హాజరు శాతాన్ని గమనిస్తున్నారు. మంచి ఫలితాలు సాధించిన కాలేజీలకు ఈసారి ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జేఈఈ, నీట్‌పై కూడా.... ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నీట్, జేఈఈపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి మరింత పెంచాలని నిర్ణయించారు. అన్ని కాలేజీల్లోనూ అవసరమైతే ప్రత్యేక నిపుణులను కూడా ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షలకు రూ.లక్షల్లో వెచ్చించాల్సిన అవసరం లేదని, ప్రభు త్వ ఇంటర్ కాలేజీల్లో మెరుగైన శిక్షణ ఇస్తామని తల్లిదండ్రులకు కాలేజీల సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. నీట్, జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఏయే చాప్టర్లలో మెరుగ్గా ఉన్నారు? ఎందులో వెనుకబడి ఉన్నారు? అనే వివరాలను ప్రతీ కాలేజీ జిల్లా అధికారులకు పంపుతోంది.జిల్లా అధికార బృందం వీటిని విశ్లేషించి అవసరమైన సలహాలు ఇస్తోంది. దీని ఆధారంగా విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని నిర్ణయించారు. నీట్, మెయిన్స్‌కు అవసరమైన మెటీరియల్ రూప కల్పనలోనూ అధికారులు ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొన్నేళ్లుగా వస్తున్న ప్రశ్నల నమూనాలను నిశితంగా పరిశీలించి, వాటి ఆధారంగానే మాదిరి ప్రశ్నపత్రాలు, మెటీరియల్ రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నాం ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సీసీ కెమెరాల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణ జవాబుదారీతనాన్ని పెంచాం. పోటీ పరీక్షలకు కూడా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. బయట కోచింగ్ కేంద్రాలకన్నా నాణ్యమైన శిక్షణ ఇవ్వబోతున్నాం. – కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
పరీక్షల్లో ప్రభుత్వం ఫెయిల్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు 2025–26 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెచ్చిన కొత్త విధానం అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కనీస అవగాహన కల్పించకుండా తెచ్చిన అసెస్మెంట్ పుస్తకాలు అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు పరీక్ష పెడుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ 1) జవాబులను విద్యార్థులు ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ 2)లో రాశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్ఏ–2 పరీక్షల జవాబులు ఎక్కడ రాయించాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 32 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసి 1.50 కోట్ల అసెస్మెంట్ పుస్తకాలను ముద్రించారు. ఈ పుస్తకాల్లో పరీక్షలు రాయడంలో విద్యార్థులు తికమక పడుతున్నా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.టీచర్లకు తలకు మించిన భారం..పాత విధానంలో సమాధానానికి తగినట్లుగా ఉపాధ్యాయులే మార్కులు వేసేవారు. కానీ కొత్త విధానంలో మార్కులను ఉపాధ్యాయులు బబ్లింగ్ చేయాలి. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులు అనుకుంటే విద్యార్థి రాసిన జవాబుకు 0 – 8 మార్కులు కేటాయిస్తారు. ఆ మార్కులను నంబర్ రూపంలో కాకుండా ఓఎంఆర్ షీట్‌పై టీచర్ బబుల్ చేయాలి. అసెస్మెంట్ బుక్‌లో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడి నివేదిక రాత రూపంలో కచ్చితంగా చూపించాలి. దీంతోపాటు విద్యార్థులు రాసిన జవాబు పత్రాల ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ప్రాథమిక తరగతుల్లో నాలుగు చొప్పున, ఉన్నత తరగతుల్లో ఆరు పరీక్షలకు సంబంధించిన పత్రాలను స్కాన్ చేయాలి. ఇది ఉపాధ్యాయులకు తలకు మించిన భారమని వాపోతున్నారు. ఎఫ్ఏ–1 పరీక్షల జవాబులు మూల్యాంకనం చేసేందుకు ఉపాధ్యాయులు నానా కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో పరీక్షలంటేనే హడలిపోతున్నారు.రూ.75 కోట్లు వృథా ఖర్చు!విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణలో రూ.30 కోట్లు ఆదా చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. అసెస్మెంట్ పుస్తకాలకు రూ.75 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన ప్రింటర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించి విఫల విధానాన్ని బలవంతంగా అమలు చేస్తోందని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఇప్పటికే ఉపాధ్యాయులు ‘యాప్ డౌన్’ విధానాన్ని ప్రకటించారు. హాజరు, మధ్యాహ్న భోజనం యాప్‌లు మినహా మిగతా ఆన్లైన్ సర్వీసులు నిర్వహించబోమని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల మూల్యాంకనం సైతం యాప్‌లో నమోదు చేసే పరిస్థితి కనిపించడం లేదు.ఆరు పరీక్షలకు ఒక్కటే పుస్తకం..గతంలో సంప్రదాయ పరీక్షా విధానంలో ప్రశ్నా పత్రం ఇచ్చి పేపర్‌పై జవాబులు రాయించేవారు. జవాబు పత్రాలను ఉపాధ్యాయులు సులభంగా మూల్యాంకనం చేసేందుకు వీలుండేది. కూటమి ప్రభుత్వం పరీక్షల కోసం ఈ ఏడాది కొత్తగా అసెస్మెంట్ పుస్తకం విధానాన్ని తెచ్చింది. విద్యార్థులు మొత్తం ఆరు పరీక్షలను ఇదే పుస్తకంలో రాయాలి. అయితే చాలా మంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక ముగిసిన ఎఫ్ఏ–1 పరీక్షల జవాబులను ఎఫ్ఏ–2, ఎస్ఏ–1 (అర్ధవార్షిక పరీక్ష)లో రాశారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎఫ్ఏ–2 జవాబులు ఎక్కడ రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
పీఎస్సీలో హైటెక్ చీటింగ్.. షర్టు కాలర్‌లో ఇయర్‌ఫోన్, కెమెరా..
కన్నూర్: ఆధునిక టెక్నాలజీ అందించిన పరికరాలను సక్రమ రీతిలో వినియోగించాల్సిన కొందరు వాటిని అక్రమ పద్ధతులకు ఉపయోగిస్తూ, లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేరళలోని కన్నూర్‌లో జరిగిన పీఎస్సీ సెక్రటేరియట్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలో ఒక యువకుడు హైటెక్ మోసానికి పాల్పడి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.‘మనోరమ’లో ప్రచురితమైన కథనం ప్రకారం కన్నూర్‌లోని ముండలూర్లోని పెరలస్సేరీలోని సురూర్ నివాస్‌కు చెందిన ఎంపీ ముహమ్మద్ సహద్ (25) పరీక్షలో చీటింగ్‌కు పాల్పడుతూ ఇన్విజిలేటర్ల కంటపడ్డాడు. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగునందుకున్నాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పయ్యంబలం ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగింది. ముహమ్మద్ సహద్ తన షర్టు కాలర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. బయటకు కనిపించని విధంగా ఇయర్‌ఫోన్స్ కూడా అమర్చుకున్నాడు.ప్రశ్నాపత్రాన్ని కెమెరా ద్వారా బయటి వ్యక్తులకు చూపించి, ఇయర్ ఫోన్ ద్వారా సమాధానాలు వింటూ, పరీక్ష రాసే ప్రయత్నం చేశాడు. అయితే పరీక్షా హాలులోని అధికారులు అతనిని తనిఖీ చేసి,కెమెరా, పెన్ డ్రైవ్,హెడ్‌సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తాను గతంలో కూడా ఇదే విధంగా పరీక్షలలో మోసం చేసినట్లు అంగీకరించాడు. సహద్ గత నెలలో జరిగిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలోనూ ఇదే విధంగా కాపీ కొట్టాడు. నిందితుడు ఇప్పటివరకు రాసిన పరీక్షల సమాధాన పత్రాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. -
స్లీప్..స్క్రీన్..స్టడీ..!
ఈతరం విద్యార్థులు ప్రతిరోజూ పరీక్షలు, అసైన్మెంట్లు, పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, బెస్ట్ రిజల్ట్స్‌కు ఉపయోగపడే అంశాలు నిద్ర, స్క్రీన్ టైమ్. స్టడీ హేబిట్స్. ఏమాత్రం వ్యాయామం చేయకుండా అర్ధరాత్రి వరకూ స్క్రీన్ చూసుకుంటూ గడిపేస్తే ఫోకస్ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అకడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్లీప్, స్క్రీన్, స్టడీ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అందుకే ఈ రోజు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. 1. నిద్రతోనే మేధస్సు పునరుజ్జీవంనిద్ర మన జీవితంలో విడదీయలేని భాగం. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మానసిక శక్తి, రోజువారీ పనులు నిర్వహించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యార్థుల విజయంలో హార్డ్ వర్క్‌తో పాటు వారి నిద్ర కూడా ముఖ్యమైన అంశం.మనం పగలు నేర్చుకున్న అంశాలు రాత్రి నిద్రలో మెదడులో నిక్షిప్తమవుతాయి. నిద్ర తగ్గితే మెమరీ కెపాసిటీ కూడా 40 శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాల్లో వెల్లడైంది.నిద్ర అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి అవసరమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను ప్రభావితం చేస్తుంది. నిద్ర లేని పిల్లలు ఎక్కువగా కోపం, తీరని భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇది వారి ఫోకస్‌ను, నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు.2. నిద్ర, మార్కులు తగ్గించే స్క్రీన్ టైమ్ ఈ డిజిటల్ యుగంలో ప్రతి చోటాస్క్రీన్లు ఉన్నాయి. పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా వీడియో గేమ్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచీ వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్లు ఉత్పత్తి చేసే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్‌ను కదిలించి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు వెళ్లడానికి గంట ముందు వరకూ స్క్రీన్ చూస్తుంటే అది నిద్రపట్టడాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. రీల్స్, వీడియోలు చూడటం వల్ల సంతోషాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక పెరుగుతుంది. స్క్రీన్కు అడిక్ట్ అవుతారు. దీంతో చదువుకునే సమయం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు మూడు గంటలుంటే వారి అకడమిక్ స్కోర్లు తగ్గినట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 3. ఫోకస్, రిటెన్షన్ మెరుగుపరచడంనిద్రను, స్క్రీన్ టైమ్‌ను సరిగా సెట్ చేస్తేనే విద్యార్థులు సరిగా చదవగలుగుతారని, మార్కులు పెరుగుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. 25 నిమిషాల చదువు తర్వాత ఐదునిమిషాల విరామం తీసుకోవడం, మానసిక అలసట నుండి రీచార్జ్ కావడం అకడమిక్ సక్సెస్‌లో చాలా కీలకమైన విషయం.ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం మొక్కుబడిగా చదవడం కంటే ఇష్టంగా చదవడం, చదివిన దాన్ని ఇతరులతో చర్చించడం వల్ల సమాచారం నిలుపుకోగల శక్తి 50 శాతం పెరుగుతుంది. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఫోకస్‌తో చదివి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. కనీసం7–8 గంటలు నిద్రపోవాలి.నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వాడకండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను తగ్గిస్తుంది.మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఒకేసారి ఒక్క పనిపై ఫోకస్ చేయండి. చదువుతో పాటు మొబైల్ చూడడం ఏకాగ్రతను తగ్గిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ చేయండి. సబ్జెక్ట్‌ను మళ్లీ మళ్లీ చదవకుండా, ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.రోజూ వ్యాయామం చేయండి. 20–30 నిమిషాల వాకింగ్, యోగా లేదా క్రీడలు ఆడడం ఏకాగ్రతను పెంచుతుంది.చదువుల మధ్యలో ఐదునిమిషాలు మైండ్‌ఫుల్ బ్రేక్‌లు తీసుకోండి. డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఒకేసారి ఎక్కువగా చదవకండి. కొన్ని రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే మెదడులో నిలుస్తుంది.జంక్ ఫుడ్ తగ్గించి, పళ్లు, గింజలు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినండి. ఇవి మెదడుకు శక్తినిస్తాయి.రోజులో కనీసం రెండు గంటలు మొబైల్ లేకుండా గడపండి. ఆ టైమ్‌లో పుస్తకం చదవండి లేదా కుటుంబంతో మాట్లాడండి. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
కాకినాడలో మాస్ కాపీయింగ్ కలకలం..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా జీఎన్ఎం, ఏఎన్ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బట్టబయలైంది. స్లిప్పులు పెట్టుకుని విద్యార్థులు దర్జాగా పరీక్షలు రాశారు. ఆర్ఎంసీ కాలేజీలో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు ముడుపులు తీసుకుని మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.గత రెండు రోజులుగా రంగరాయ మెడికల్ కాలేజీలో జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఇన్విజిలేటర్లతో పాటు కళాశాల సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒత్తిడి తగ్గించే ఓపెన్‌బుక్ పరీక్ష
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026–27 సంవత్సరం నుంచి ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. తొలుత దీన్ని 9వ తరగతికే పరిమితం చేయాలని నిర్ణయించింది. సీబీఎస్ఈ గవర్నింగ్ బాడీ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ స్కూళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులు 18 లక్షల వరకు ఉంటారు. వీళ్లంతా 2026లో జరిగే వార్షిక పరీక్షలను బోర్డ్ సూచించిన పుస్తకాలు చూసి రాయవచ్చు. కోవిడ్ తర్వాత వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ విధానం అవసరమని బోర్డ్ భావించింది. జాతీయ విద్యావిధానం–2020లో కూడా పరోక్షంగా దీన్ని సూచించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఓపెన్ బుక్ విధానంపై మంచి ఫలితాలు సాధిస్తున్నాయని సీబీఎస్ఈ బోర్డ్ అధ్యయనం ద్వారా వెల్లడించింది. - సాక్షి, హైదరాబాద్ఎందుకీ విధానం?ఓపెన్ బుక్ విధానం ఉపయోగాలపై సీబీఎస్ఈ స్పష్టత ఇచ్చింది. దీనివల్ల విద్యార్థుల్లో పరీక్షల భయం పోతుంది. సమాధానం తెలిసినా పరీక్ష సమయంలో మర్చిపోతుంటారు. పరీక్ష కేంద్రంలో ఓసారి రీకాల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పరీక్షలో సమాధానాలు పాఠ్యపుస్తకాల నుంచే రాయాలి. కాబట్టి విద్యార్థి ముందు నుంచే పుస్తకం చదివే అలవాటు చేసుకుంటాడు. దీనివల్ల బట్టీ పట్టే విధానం కాకుండా, సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. ఈ అలవాటుతో విద్యార్థి పోటీ పరీక్షల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థిలో సృజనాత్మకత పెరుగుతుందని బోర్డ్ భావిస్తోంది. పరీక్ష ఎలా ఉంటుంది?ఈ పరీక్ష కోసం బోర్డ్ ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని రూ పొందిస్తుంది. సాధారణంగా ఉండే పరీక్ష సమ యాన్ని గంటకు కుదిస్తారు. పరీక్షకు బోర్డ్ సూచించిన పుస్తకాలను అనుమతిస్తారు. పాఠ్యపుస్త కాలు, క్లాస్ నోట్స్, కొన్ని రకాల మెటీరియల్స్‌ను తీసుకెళ్లే అవకాశం కల్పిస్తారు. అయితే, పరీక్షలో ఇచ్చే ప్రశ్న లు నేరుగా కాకుండా, ట్విస్ట్ చేసి ఇస్తా రు. ఏ కోణం నుంచి ప్రశ్నలు వచ్చినా సమాధానం ఇచ్చే నేర్పు విద్యార్థుల్లో ఉండాలి. చాప్టర్ పూర్తిగా చదవడం, దా న్ని విశ్లేషణాత్మకంగా ముందు నుంచి అధ్య యనం చేస్తేనే ఓపెన్ బుక్ విధానంలో తేలికగా పరీక్ష రాయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఓ రకంగా క్రిటికల్ థింకింగ్ ఉంటేనే పరీక్ష సులువు అవుతుంది. 2014 నుంచి కసరత్తుసీబీఎస్ఈ ఈ విధానంపై 2014 నుంచి కసరత్తు చేస్తోంది. దీనికోసం కొన్ని స్కూళ్లను ఎంపిక చేసింది. ఆ సూళ్ల విద్యా ర్థులకు 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్.. 11వ క్లాస్ విద్యార్థులకు ఎకనమిక్స్, బయా లజీ, జాగ్రఫీ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించింది. దీనివల్ల 85% మంది విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోయి, పఠన సామర్థ్యం పెరిగిందని గుర్తించారు. 2023లో అన్ని పరీక్షలపై బోర్డ్ అధ్యయనం చేసింది. ఎక్కడ ఎలా ఉంది?» అమెరికా, బ్రిటన్‌లో పలు విశ్వవిద్యాలయాలు ఓపెన్ బుక్ విధానంపై అధ్యయనం చేశాయి. చదువులో వెనుకబడ్డ విద్యార్థి ఈ విధానం వల్ల మంచి ఫలితాలు సాధించినట్టు ఎక్స్‌లెన్స్ జర్నల్‌లో రచయితలు మమత, నితిన్ పిళ్లై పేర్కొన్నారు. » ఢిల్లీ యూనివర్సిటీ 2020 ఆగస్టు, 2022 మార్చిలో ఈ తరహా పరీక్షలు నిర్వహించింది. ఈ వర్సిటీ దీనిపై ఇంకా అధ్యయనం చేస్తోంది. తాజాగా కేరళ ఉన్నత విద్య విభాగం కూడా ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు ఓపెన్ బుక్ విధానాన్ని సూచించింది.» ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, భువ నేశ్వర్ 98 మంది వైద్య విద్యార్థులకు ఈ విధానంలో పరీక్షలు నిర్వహించింది. వీరిలో 78.6% ఉత్తీర్ణులయ్యా రు. వీరిలో మానసిక ఒత్తిడి దూరమైందని ఎయిమ్స్ పేర్కొంది. -
మార్క్స్ వర్సెస్ మైండ్‌సెట్..! గెలిచేదెవరు..?
‘‘సర్, మా అబ్బాయికి 75 శాతం మార్కులు మాత్రమే వస్తున్నాయి. 95 శాతం వచ్చేలా మీరు ట్రైనింగ్ ఇవ్వగలరా?’’‘‘సర్, మా అమ్మాయిని బెస్ట్ కోచింగ్ సెంటర్లో చేర్పించాం. కాని, అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ లేదు. ఎలాగైనా నీట్లో సీట్ వచ్చేలా మైండ్ సెట్ మార్చగలరా?’’ ఇలా చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతుంటారు. కొంతమంది సెషన్లో అడుగుతుంటారు. ‘‘మీ బిడ్డ ఎగ్జామ్‌లో సక్సెస్ అయితే చాలా లేక లైఫ్‌లో కూడా పాసవ్వాలని అనుకుంటున్నారా?’’ అని అడుగుతా. ‘‘లైఫ్‌లో పాసవ్వాలంటే మంచి మార్కులు రావాలి కదా సర్?’’ అని అడుగుతుంటారు అమాయకంగా. చాలామంది తల్లిదండ్రుల్లో ఇలాంటి అభిప్రాయమే ఉంది. మార్కుల విలువ... ఐఐటీ, ఎన్ఐటీ, నీట్‌లలో సీటు రావాలంటే మార్కులు కావాల్సిందే! కాని, ఒక బిడ్డ ప్రతిభకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. మార్కులు విద్యార్థి నేర్చుకున్న విషయాలలో రాసే సామర్థ్యం, మీ జ్ఞాపకశక్తిని కొలుస్తాయి. కాని, మీ బిడ్డలోని సృజనాత్మకత, నాయకత్వం, భావోద్వేగ ప్రజ్ఞ, నిర్ణయ సామర్థ్యం, ఇన్నోవేషన్లను కొలవలేవు. ఇప్పుడు ప్రపంచం ఈ నైపుణ్యాలనే కోరుకుంటుంది.ఐక్యూ వల్లనే సక్సెస్ రాదని హార్వర్డ్ పరిశోధన కూడా చెబుతోంది. విజయంలో తెలివితేటలు 15 శాతం పాత్ర పోషిస్తే, సోషల్ స్కిల్స్ 85 శాతం పాత్ర పోషిస్తాయని ఆ పరిశోధనలో తేలింది.సైన్స్ ఏం చెబుతోంది?స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు డాక్టర్ కరోల్ డ్వెక్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ప్రకారం రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయి. 1. ‘నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను’, ‘నాకు ఇన్నే మార్కులు వస్తాయి’ అనుకునే ఫిక్స్డ్ మైండ్ సెట్. 2. ‘ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు’, ‘తప్పుల వల్ల నష్టంలేదు, నేర్చుకోవచ్చు’ అనుకునే గ్రోత్ మైండ్ సెట్.. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని, లాంగ్ టర్మ్ సక్సెస్ సాధిస్తారు. మైండ్ సెట్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో, ఆత్మవిశ్వాసంలో 40 శాతం మెరుగుదల చూపించారు. మైండ్ సెట్‌తోనే అసలైన విజయంకొన్నేళ్ల కిందట ఓ విద్యార్థి కోచింగ్ కోసం వచ్చాడు. అతను ఇంటర్మీడియట్లో 60 శాతం మాత్రమే సాధించాడు. దాంతో పేరెంట్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. కాని, అతనిలో నాకు కసి, ఉత్సుకత కనిపించాయి. దాంతో అతనికి జీనియస్ మైండ్ సెట్ కోచింగ్ మొదలు పెట్టా. ఇప్పుడతను బెంగళూరులో ఒక స్టార్టప్ ఫౌండర్. ఐఐటీల్లో చదివినవాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకంటే అతనికి నేర్పించింది సిలబస్ కాదు, సెల్ఫ్–బిలీఫ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జీనియస్ మైండ్ సెట్. జీనియస్ పుడతాడనేది భ్రమ, జీనియస్ డెవలప్ అవుతాడనేది సైన్స్2030లో క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాప్ స్కిల్స్గా ఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెబుతోంది. ఉత్తమ ఉద్యోగుల్లో కమ్యూనికేషన్, కొలాబరేషన్, అడాప్టబిలిటీ ముఖ్యమైన లక్షణమని గూగుల్ చేసిన ప్రాజెక్ట్ ఆక్సిజన్ రీసెర్చ్‌లో కూడా వెల్లడైంది. జీనియస్ మేట్రిక్స్ కోచింగ్‌లో నేర్పేవి ఇవే!పేరెంట్స్ ఏం చేయాలి..ఐక్యూ కాకుండా ప్రాసెస్‌ను ప్రశంసించండి. ‘నువ్వు స్మార్ట్’ అని కాకుండా ‘నువ్వు కష్టపడి ప్రయత్నించిన తీరు నచ్చింది’ అని చెప్పండి. దీనివల్ల పిల్లల్లో ప్రేరణ కలుగుతుంది. మెదడులో కొత్త మార్గాలు ఏర్పడుతాయి. తప్పు చేసినప్పుడు శిక్షించకుండా ‘ఈ తప్పు నీకు ఏం నేర్పింది?’ అని అడగండి. తప్పులను నార్మలైజ్ చేయండి. ‘నేను లెక్కలు చేయలేను’ అని కాకుండా, ‘నేను ఇప్పటికీ లెక్కలు చేయలేను’ అని చెప్పండి. ఈ చిన్న పదం అద్భుతం చేస్తుంది. మీ పరాజయాలను, వాటి నుంచి ఏం నేర్చుకున్నారో, ఎలా తిరిగి నిలదొక్కుకున్నారో పిల్లలతో పంచుకోండి. మీ పిల్లలు దాన్ని పాటిస్తారు. ‘‘ఎన్ని మార్కులు వచ్చాయి?’’ అని కాకుండా, ‘‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’’, ‘‘ఈ తప్పు నీకు ఏం నేర్పించింది?’’ అని అడగండి. మార్కుల గురించి కాదు, ప్రయత్నం ఆపేయడంపై టెన్షన్ పడండి. సెల్ఫ్ బిలీఫ్ ఉన్నవాడు ఎక్కడైనా గెలుస్తారు. మార్కులు మాత్రమే ఉన్నవాడు మైండ్ సెట్ లేకపోతే ఆగిపోతారు. (చదవండి: డాల్ డామినేషన్! ఈ బొమ్మ ధర తెలిస్తే షాకవ్వుతారు) -
20, 21 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో 20, 21 తేదీల్లో జరిగే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వచ్చేనెల 1, 2 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. మారిన పరీక్షా కేంద్రాలు, తేదీలతో హాల్ టికెట్లు ఈనెల 25 నుంచి https://apdsc.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. -
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు ఇవాళ (గురువారం) సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.బాలురలో 73.55 శాతం, బాలికల్లో 80.10 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 👉ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 కోసం క్లిక్ చేయండి -
అప్పుడు 18.. ఇప్పుడు 65
దేవరాపల్లి(విశాఖపట్నం): ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదంతో ఓ విద్యార్థి తీవ్ర వేదనకు గురయ్యాడు. రీవాల్యుయేషన్లో ఫెయిల్ కాదు.. ఫస్ట్ క్లాస్ అని తేలింది. దేవరాపల్లి మండలం తెనుగుపూడి డా. బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యార్థి లింగాల ఆకర్ష్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ కాగా సాంఘిక శాస్త్రంలో కేవలం 18 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో విద్యార్థితోపాటు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మూల్యాంకనంపై అనుమానం వచ్చి విద్యార్థి తల్లిదండ్రులు ఎస్ఎస్సీ బోర్డుకు రూ.1000 చలానా చెల్లించి సోషల్ పేపర్ జవాబు పత్రాన్ని రీ వాల్యుయేషన్ చేయించారు. పునర్ మూల్యాంకనంలో 65 మార్కులు వచ్చాయంటూ ఎస్ఎస్సీ బోర్డు నుంచి లింగాల ఆకర్ష్ ఫోనును సమాచారం వచ్చింది. అంతే కాకుండా అతని జవాబు పత్రంలోని పేజీలను పంపించారు. దీంతో తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ కాలేదని, పాసయ్యాడని తెలిసిన అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో నిర్లక్ష్యంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని బాధిత విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి!
సాక్షి,విశాఖ: ఏపీలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్- 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాల్లో 95.86శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో విశాఖకు చెందిన మేక మనోజ్ మొదటి ర్యాంక్ సాధించగా.. వైఎస్సార్ జిల్లాకు చెందిన సందీప్‌రెడ్డి రెండో ర్యాంక్‌ను సాధించారు. 👉 ఏపీ ఐసెట్-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: పాలనాపరమైన కారణాలతో జూన్‌లో జరగాల్సిన పలు లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులతో పాటు టీటీడీ డిగ్రీ, ఓరియంటల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. వారికి మరో అవకాశం గ్రూప్–2 మెయిన్స్‌కు అర్హత సాధించినవారిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎఫ్ఆర్వో పరీక్షలు రాసేవారికి ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏపీపీఎస్సీ జూలై 10 వరకు అదనపు అవకాశం కల్పించింది. తదుపరి తేదీ కోసం అభ్యర్థులు కమిషన్‌ను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ప్రశ్నాపత్రాల తయారీ వేతనం పెంపు ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలు తయారు చేసే నిపుణులకు చెల్లించే వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రం, కీ తయారీలో ప్రతి ప్రశ్నకి రూ.150 ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.200కి, జవాబు పత్రాల వేల్యూయేషన్ కోసం ఒక్కో స్క్రిప్్టకి రూ.100 ఇస్తుండగా, దాన్ని రూ.300కి పెంచారు. -
ఎన్పీటీఈఎల్ పరీక్షలు రాసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఆర్జియూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లోని ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు సోమవారం నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) పరీక్షలను రాశారు. ఈ పరీక్షలకు నాలుగు క్యాంపస్‌లలో కలిపి 10,300 మందికిపైగా విద్యార్థులు హాజరైనట్టు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఎన్పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రంగంలో సైతం అతి వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఉన్నవారికే సాంకేతిక రంగంలో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తున్న 500కు పైగా ఎన్పీటీఈఎల్ కోర్సులను నేర్చుకునేందుకు నాలుగు ట్రిపుల్ ఐటీలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఆసక్తి కనబర్చడంతో మద్రాస్ ఐఐటీతో ఆర్జీయూకేటీ ఒప్పందం చేసుకుంది. యాక్సెలరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ నెట్వర్క్ అనాలసిస్, ఆప్టిమైజేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్, ఆన్లైన్ ప్రైవసీ, బ్లాక్ చైన్, డేటాబేస్ సిస్టమ్స్, ఎథికల్ హ్యాకింగ్ తదితర అనేక సర్టిఫికెట్ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఐఐటీ మద్రాస్ రూపొందించిన ఈ కోర్సులు ప్రత్యేకమైనవి. విద్యార్థులు తమ సిలబస్ లేదా బ్రాంచ్‌కు సంబంధం లేకుండా, నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా అదనపు జ్ఞానం, నైపుణ్యాలను పొందడానికి ఈ కోర్సులు దోహదపడతాయి. ఈ కోర్సులను నేర్చుకోవడానికి సాధారణ ఫీజు రూ.1000 కాగా, ఆర్జీయూకేటీ విద్యార్థులకు రూ.500 రాయితీ ఇచ్చింది., మిగిలిన మొత్తం యాజమాన్యం చెల్లిస్తుండటంతో విద్యార్థులపై ఏమాత్రం ఆర్థిక భారం పడట్లేదు.విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన డైరెక్టర్ఇదిలా ఉండగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. దీంతో పరీక్ష హాలులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తోటి విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు డైరెక్టర్ ఇలా పరీక్ష రాశారు. -
కొడుకు బాధను అర్థం చేసుకునేది తల్లిదండ్రులేగా!
బెంగళూరు: పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయినట్లు ఫీలైపోయి ప్రాణాలు తీసుకునే విద్యార్థులను చూసుంటాం. లేదంటే.. ఏదో నేరం చేసినట్లు పిల్లల్ని మందలించే.. దండించే పేరెంట్స్‌ను చూసుంటాం. కానీ, పరీక్ష తప్పితే ఇంటా.. బయటా అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అభిషేక్ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే.. ఎవరేం అనుకుంటే ఏమి అనుకుంటూ ఇలా కేక్ కట్ చేయించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు పరీక్ష తప్పితే.. చుట్టుపక్కల వాళ్లను పిలిచి.. కేక్ తెప్పించి కట్ చేయించి.. చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు. In a heartwarming gesture, the parents of Abhishek, a student at Basaveshwara English Medium High School in Bagalkot, chose to celebrate his effort rather than scold him for failing his exams. Despite scoring just 200 out of 625 marks and not clearing any subject, the family held… pic.twitter.com/RxnlTwrcHp— The Siasat Daily (@TheSiasatDaily) May 4, 2025టెన్త్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు అభిషేక్. మొత్తం 600 మార్కులకుగాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. లాగిపెట్టి కొట్టక.. ఇదేం పని అని తిట్టుకున్న వాళ్లు ఉన్నారు ఈ ఫొటోలు, వీడియో చూశాక. కానీ, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు బాధను అర్థం చేసుకునేది ఆ తల్లిదండ్రులేగా!. మరోసారి రాసి పాసవుదులేరా అని వెన్నుతట్టి ప్రొత్సహించారు. పరీక్షలలో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడం కాదు, భవిష్యత్తులో విజయానికి పట్టుదల కీలకం అని సందేశం ఇచ్చారు ఆ పేరెంట్స్. అఫ్కోర్స్.. అభిషేక్ తల్లిదండ్రులు చేసిన ఈ పని నచ్చనివాళ్లు కూడా ఉంటారనుకోండి. అది వేరే విషయం. -
నేడే నీట్ యూజీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెన్, పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. గతేడాది నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని అన్ని జిల్లాల యంత్రాంగాలను ఎన్టీఏ ఆదేశించింది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు.. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశముందని అంచనా. గతేడాది 24.06 లక్షల మంది దరఖాస్తు చేయగా 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి గతేడాది 66 వేల మంది దరఖాస్తు చేయగా.. 64 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే రాష్ట్రం నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 6,500 మేర సీట్లు ఉన్నాయి. -
EPCET కు హాజరైన విద్యార్థులు (ఫోటోలు)
-
Telangana: ఈనెల 30న టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని టెన్త్ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వాస్తవానికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ«దీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు.ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చే వరకూ నిరీక్షించారు. ఇటీవల అధికారులు సీఎంను కలవగా, ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్టు తెలిసింది. ఈనెల 30న భట్టి సమయం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మెమోల్లో మార్పులు టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేశాల్లో వెల్లడించారు.ఇప్పటివరకూ విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించడం కష్టం. ఇప్పుడీ విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్‌తో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కులుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేసేందుకు కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. -
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ -2024 ఫలితాలు విడుదల
ఢిల్లీ: యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాలు (UPSC CSE Final Result 2024) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 1009మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శక్తి దుబేకు మొదటి ర్యాంకు రాగా సాయి శివానీ 11వ ర్యాంక్, బన్నా వెంకటేష్‌కు 15వ ర్యాంక్, శ్రావణ్ కుమార్ రెడ్డిలు 63వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఏఎస్సీ అధికార వెబ్సైట్లో నేరుగో చూసుకోవచ్చు.👉యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాల పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండిఇక ఈ పరీక్షను మొత్తం 1,056 ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఏస్సీ గతేడాది నోటిఫికేషన్ విడదల చేసింది. ఫిబ్రవరి 14, 2024న విడుదల చేయగా, జూన్ 16, 2024న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది.తరువాత, సెప్టెంబర్‌లో 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షను నిర్వహించగా, ఇంటర్వ్యూలను ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు నిర్వహించిన యూపీఏఎస్సీ ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది.యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాల వివరాలుసివిల్స్కు ఎంపికైన అభ్యర్థులు- 1009జనరల్ కోటలో ఎంపికైన అభ్యర్థులు -335ఈడబ్ల్యూఎస్ కోటలో సివిల్స్ ఎంపికైన అభ్యర్థులు- 109సివిల్స్ ఎంపికైన ఓబిసి అభ్యర్థులు- 318ఎస్సీలు -160, ఎస్టీలు- 87 -
శాఖాపరమైన విచారణతోనే సరిపెట్టేస్తారా?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో కాపీయింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కనుసన్నల్లోనే వ్యవస్థీకృతంగా కాపీయింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ప్రైవేట్ కళాశాలలు, విద్యార్థుల నుంచి ‘గ్యారెంటీ పాస్’ హామీతో రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడి పరీక్షల అనంతరం జవాబు పత్రాలను అధికారులు తారుమారు చేస్తున్నారనే తీవ్రమైన నేరారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టి కాపీయింగ్ రాకెట్ వెనుక ఉన్న అధికారులను గుర్తించే ప్రయత్నం చేయకుండా శాఖాపరమైన విచారణతో ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. కాపీయింగ్ ఫిర్యాదులతో గతంలో రద్దయిన సిద్ధార్థ వైద్య కళాశాల సెంటర్‌కు హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చిoది. అదే సెంటర్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయి. యూనివర్సిటీపై ఆరోపణలు పట్టవా? ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా సిద్ధార్థ కాలేజీ సెంటర్లో ఈ నెల 9వ తేదీన హెల్త్ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేయగా, ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. అనంతరం దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ చర్యల అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు కాపీ కొడుతూ దొరికారు. దీంతో విచారణ చేపట్టాలని డీఎంఈని ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డీఎంఈ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, సిద్ధార్థ వ్యవహారంపై డీఎంఈని విచారణకు ఆదేశించానని మంగళవారం వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారే తప్ప యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించలేదు. ఇలా ప్రభుత్వం ఎంతసేపు సిద్ధార్థ ఘటన చుట్టూనే విచారణ పేరిట హడావుడి చేస్తోంది. దీన్నిబట్టి ఆ కళాశాలలోని ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని అక్కడితో అక్రమాలను కప్పిపుచ్చే యోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. హెల్త్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా, డీఎంఈగా డాక్టర్ నరసింహం ఒక్కరే ఉన్నారు. ప్రస్తుత వివాదం డీఎంఈ, విశ్వవిద్యాలయం చుట్టూనే తిరుగుతోంది. ఈ పరిస్థితుల్లో డీఎంఈ ద్వారానే విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగు చూస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం థర్డ్ పార్టీ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు బయటపడటానికి కొంతైనా ఆస్కారం ఉంటుంది. కర్నూల్, కాకినాడలో కాపీయింగ్‌పై ఫిర్యాదులు అందలేదు.. కాబట్టి తనిఖీలు చేయం! కర్నూల్, కాకినాడతోపాటు ఇతర ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో నిర్వహించిన ఎంబీబీఎస్ పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్టు తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. ‘హెల్త్ వర్సిటీలో కాపీయింగ్ కథలెన్నో!’ పేరుతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి వర్సిటీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ వరకు సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు. అయితే, ఈ వివరణ ద్వారా ఫిర్యాదులు వస్తే తప్ప తాము స్పందించబోమని యూనివర్సిటీ అధికారులు చెప్పకనే చెప్పారు. వాస్తవాన్ని వెలుగులోకి తెచి్చన ‘సాక్షి’ కథనాన్ని ఫిర్యాదుగా తీసుకుని కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యతను వదిలేసి... ఫిర్యాదు వస్తే మాత్రమే తనిఖీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. కాపీయింగ్‌ను వ్యవస్థీకృతం చేసి, ముడుపులతో మురిసిపోతున్న యంత్రాంగాన్ని సరిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. -
హెల్త్ వర్సిటీలో కాపీయింగ్ కథలెన్నో!
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు చంద్రబాబు ప్రభుత్వమే రాచబాట వేసింది. విద్యార్థుల నుంచి భారీగా ముడుపులు దండుకుని మాస్‌కాపీయింగ్‌కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ విభాగం, ఉన్నతాధికారులు సహకారం అందించడం గమనార్హం. గతంలో రద్దయిన సిద్ధార్థ సెంటర్‌ను విద్యార్థుల కన్వీనియెంట్(అనుకూలత)ను సాకుగా చూపి విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చింది.రద్దయిన సెంటర్‌కు తిరిగి అనుమతులు ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకున్న వర్సిటీ పరీక్షల విభాగం తమకు కావాల్సిన విద్యార్థుల కాపీయింగ్‌కు అడ్డంకులు సృష్టించకుండా, కాపీయింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పెద్దఎత్తున హడావుడి చేసింది. ఈ హడావుడి చూసి నిజంగానే కాపీయింగ్‌ను అడ్డుకోవడానికి చిత్తశుద్ధితో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, రిజిస్ట్రార్, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్నారనే భావన కల్పించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి కాపీయింగ్‌కు అవకాశం కల్పించినవారే.. ఇలా ఎందుకు హడావుడి చేశారని ఆరా తీస్తే అవాక్కయ్యే నిజాలు వెల్లడయ్యాయి.సిద్ధార్థలో మాస్‌కాపీయింగ్ జరుగుతున్న అంశంపై గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం విదితమే. ‘కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్’ (సీవోసీ)పై నిమ్రా కాలేజీతో పాటు పలువురు ఫిర్యాదు చేశారు. మళ్లీ అలాంటి ఫిర్యాదు రాకుండా ఉండటానికి తనిఖీల హడావుడి చేశారు. నిజానికి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. అవన్నీ వర్సిటీ సీవోఈ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. వారు గదిలో కూర్చుని వాటిని పరిశీలించి కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవచ్చు.కానీ.. అలా చేయకుండా తనిఖీలంటూ హడావుడి చేసి కొద్దిమంది విద్యార్థులను మాత్రమే పట్టుకున్నారు. మిగతా కాపీయింగ్ యథావిధిగా జరగడానికి సహకారం అందించడం ఎవరూ ఊహించని విషయం. ఇన్విజిలేటర్ల నియామకం నుంచే వర్సిటీ అధికారుల ‘కుమ్మక్కు’ మొదలవుతుంది. ‘కాపీయింగ్ గురు’ చెప్పిన వారినే అక్కడ నియమిస్తారు.డీఎంఈతో విచారణ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కాపీయింగ్ వ్యవహారంపై వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా పరీక్షల విభాగం తొక్కిపెడుతోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణ చేయాలని డీఎంఈనీ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డీఎంఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారినుంచి వివరణ వచ్చాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని డీఎంఈ డాక్టర్ నరసింహం వెల్లడించారు. వర్సిటీ అధికారుల కుమ్మక్కు గురించి మాత్రం విచారణ జరగడం లేదని సమాచారం.కోడ్–డీకోడ్ మాయాజాలమూ ఉందికేవలం కాపీయింగ్‌కు మాత్రమే వర్సిటీ పరీక్షల విభాగం సహకరిస్తోందన్న ఆరోపణలపై విచారణ పరిమితమైతే పూర్తిస్థాయిలో నిజాలు వెలుగుచూసే అవకాశం లేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల జవాబు పత్రాలను ‘రహస్య కోడ్’తో వ్యాల్యుయేషన్‌కు పంపిస్తారు. ఈ కోడ్–డీకోడ్ బాధ్యులు ప్రైవేటు ఏజెన్సీకి వర్సిటీ పరీక్షల విభాగం అప్పగిస్తుంది. ఈ బాధ్యతల్లో ఉన్న ఏజెన్సీకి, పరీక్షల విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న చీఫ్‌కి సన్నిహిత సంబంధాలున్నాయని వర్సిటీ ఉద్యోగులు చెబుతున్నారు.తమకు కావాల్సిన విద్యార్థి జవాబుపత్రంలో కొన్ని షీట్లు మార్చడం చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమేనని సమాచారం. ఈ అక్రమాలన్నీ వ్యవస్థీకృతంగా జరగడానికి ఆ చీఫ్ సహకారం అందిస్తున్నారని, ఈ దిశగా పోలీసు విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వర్సిటీ వర్గాల్లో ఉంది. కర్నూలు, కాకినాడలోనూ..రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ–ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి సమీపంలో ప్రభుత్వ కళాశాలలో అవకాశం కల్పిస్తారు. కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, కర్నూలు కాలేజీ, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలలో సప్లిమెంటరీ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. సిద్ధార్థలో కాపీయింగ్‌కు సహకరించినట్లుగానే కర్నూలు ప్రభుత్వ కళాశాల, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో విచ్చలవిడిగా కాపీయింగ్ జరిగింది. అక్కడ ఆకస్మిక తనిఖీలు కాదు కదా.. సాధారణ తనిఖీలు కూడా వర్సిటీ అధికారులు చేయలేదు. ఆ రెండు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వారితో వర్సిటీ అధికారులు కుమ్మక్కు కావడమే దీనికి కారణం. ముడుపులు భారీగా వసూలు చేసిన తర్వాతే వర్సిటీ అధికారులు కాపీయింగ్‌కు అనుకూలంగా వ్యవహారం నడుపుతారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కాపీయింగ్‌కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పడంతో వర్సిటీ అధికారుల కుమ్మక్కు ఆట సాగలేదు. -
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
పెందుర్తి: విశాఖలోని పెందుర్తి సమీపంలోని జియోన్ టెక్నాలజీస్ కేంద్రంలో డబ్బులు తీసుకుని పరీక్ష జవాబు పత్రాలను లీక్ చేస్తోన్న బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో సూపర్వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం శుక్రవారం చినముషిడివాడలోని జియోన్ టెక్నాలజీస్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ పరీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రాన్ని ముందే కొంత మంది అభ్యర్థులకు లీక్ చేశారు. ముగ్గురు (ప్రాథమికంగా తెలిసింది) అభ్యర్థులు 2 గంటలపాటు ఆన్లైన్లో రాయాల్సిన పరీక్షను 20 నిమిషాల్లో ముగించడంపై అనుమానం వచ్చిన తోటి అభ్యర్థులు వారిని నిలదీశారు. దీంతో వారి వద్ద అడ్మిట్ కార్డు వెనుక మైక్రో జెరాక్స్ ద్వారా తీసిన జవాబులు కనిపించడంతో మిగిలిన అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పరీక్ష జరుగుతుండగానే నిర్వాహకులను నిలదీశారు. కాపీకి పాల్పడిన అభ్యర్థుల వద్ద జవాబు పత్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంతరం కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఇది వరకే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. మార్చి 25న ఇదే కేంద్రంలో జరిగిన ఏపీపీసీబీ ఏఈఈ పరీక్షలో నిర్వాహకులు అవినీతికి పాల్పడి కొందరు అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థులకు బెదిరింపులు.. కాపీ వ్యవహారం బయటపడడంతో పరీక్ష నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. సాయంత్రం పరీక్ష ముగించుకుని బయటకు వస్తున్న అభ్యర్థులను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోపల ఏమీ జరగలేదని చెప్పాలని బెదిరించారు. బాధిత అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు పంపారు. లోపల జరిగిన విషయం బయటకు చెబితే పోలీసులతో కేసులు నమోదు చేయించి ఉద్యోగాలు రాకుండా చేస్తామని వారు బెదిరించినట్లు బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. -
అవును పవన్ సర్.. మీ కాన్వాయ్ కారణంగానే పరీక్షకు వెళ్లలేకపోయారు
విశాఖపట్నం, సాక్షి: తన కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నగర పోలీసులు సైతం విద్యార్థులదే తప్పిదమన్నట్లు ప్రకటన ఇచ్చేశారు. అయితే పవన్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులకు ఆలస్యమైందని.. ఇందుకు ఆధారాలతో సహా పక్కగా జనసేన ఎమ్మెల్యే దొరికిపోయారు.జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం వల్లే 30 మంది ఎమ్మెల్యేలు పరీక్ష రాయలేకపోయారు. పవన్‌కు గజమాల స్వాగతం ఏర్పాటు చేసిన ఆయన.. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయించారు. దీంతో సకాలంలో విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా బయటపడింది. -
పవన్ కళ్యాణ్ వల్ల అన్యాయమైపోయిన కుటుంబం
-
నేటి నుంచి 1–9 తరగతుల పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి 1–9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్–2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1–8వ తరగతి వరకు ఉదయం 9–12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9–12.15 గంటల వరకు పరీక్షలుంటాయి. షెడ్యూల్ ఇదీ.. ⇒ ఉన్నత తరగతులకు (6–9) ఏప్రిల్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న థర్డ్ లాంగ్వేజ్, 10న గణితం, 11న జనరల్ సైన్స్/ ఫిజికల్ సైన్స్, 12న బయాలజీ, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 16న కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం/ హిందీ, అరబిక్, పర్షియా లేదా ఓఎస్ఎస్సీ పేపర్–1, 17న ఓఎస్ఎస్సీ లేదా కాంపోజిట్ కోర్సు పేపర్–2 పరీక్ష ఉంటుంది. ⇒ ప్రాథమిక తరగతులకు (1–5) ఏప్రిల్ 9న ఫస్ట్ లాంగ్వేజ్, 10న ఇంగ్లి‹Ù, 11న గణితం, 12న ఈవీఎస్ (3, 4, 5 తరగతులు), 15న ఓఎస్ఎస్సీ (3, 4, 5 తరగతులు) పరీక్షలు జరుగుతాయి. పది రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు..! మరో 10 రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఈనెల ఒకటో తేదీ నుంచే ప్రారంభం కాగా, మొదటి సంవత్సరం ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి హాల్‌టికెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి, ఫలితాలు వచ్చాక అడ్మిషన్ ఖరారు చేయనున్నారు. -
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
పెడన: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓపెన్ ఇంటర్ మూల్యాంకనం ప్రక్రియ అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. అనర్హులతో అడ్డగోలుగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలోని బాలికోన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ జవాబు పత్రాల మూల్యంకనం ఈ నెల మూడో తేదీన ప్రారంభమైంది. ఇక్కడ సంబంధిత సబ్జెక్టుల్లో అర్హత లేనివారితో మూల్యాంకనం చేయిస్తున్నట్లు తెలిసింది. మచిలీపట్నంలోని ఒక ప్రైవేటు కళాశాలలో పౌరశాస్త్రం బోధించే అధ్యాపకులతో ఇంగ్లిష్ పరీక్ష జవాబు పత్రాలను దిద్దించినట్లు తెలిసింది. మరికొన్ని జవాబు పత్రాలను సైతం ఇదే తరహాలో మూల్యాంకనం చేయించినట్లు సమాచారం. సాధారణంగా రోజుకు ఒక అధ్యాపకుడు 30 నుంచి 40 మాత్రమే జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. ఇక్కడ మాత్రం ఒక్కొక్కరితో రోజుకు 70 నుంచి 100 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్లు తెలిసింది. తద్వారా వచ్చే డబ్బులను మూల్యాంకనం చేస్తున్నవారు, అధికారులు పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదో తరగతి మూల్యాంకనంలోనూ ఇదే దుస్థితి లేడీ యాంప్తిల్ కళాశాలలోనే పదో తరగతి రెగ్యులర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా చేస్తున్నారు. ఉపాధ్యాయులు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే దిద్దాలి. అయితే ఇక్కడ 50 నుంచి 60 పేపర్లను హడావుడిగా దిద్దుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆరా తీయడంతో దిద్దుబాటు చర్యలు అధికారులు ఇష్టారాజ్యంగా ఓపెన్ ఇంటర్, పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్న విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేవారి జాబితాలను తనకు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ ఆరా తీయడంతో కేవలం అర్హుల జాబితాలను మాత్రమే పంపించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఎవరు ఎన్ని పేపర్లు దిద్దినట్లు సంతకాలు చేశారు? అందులోని వారి పేర్లను, తాజాగా అధికారులు పంపించిన వారిపేర్లను రిజిస్టర్లతో సరిపోల్చితే అధికారుల బండారం బట్టబయలవుతుందని పలువురు అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. -
Exams Fear: ఈ టెక్నిక్స్‌తో ఎగ్జామ్ ఫియర్ మాయం
మీరు పరీక్ష హాలులో కూర్చున్నారు. ప్రశ్నపత్రం చేతిలో ఉంది, కానీ ఒక్క పదం కూడా గుర్తుకు రావడం లేదు! గుండె వేగంగా కొట్టుకుంటోంది, చెమటలు పట్టాయి, కాళ్లు చేతులు వణుకుతున్నాయి. ఏదైనా ప్రశ్నకు సమాధానం రాయాలని ప్రయత్నిస్తే, మెదడంతా ఖాళీగా మారిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? దీన్నే ‘పెర్ఫార్మెన్స్ ఆంగై్జటీ’ అంటారు. మన మెదడులో ‘అమిగ్డాలా’ అనే చిన్న భాగం ఉంది. ఇది ప్రమాదాన్ని గుర్తించి మనల్ని ‘ఫ్లైట్ అండ్ ఫైట్’ మోడ్‌లోకి నెడుతుంది. పరీక్షల ముందు మనలో భయాన్ని, ఆందోళనను తీసుకొచ్చేది ఇదే! వాస్తవానికి పరీక్ష అనేది ప్రమాదం కాదు కదా. కానీ మన బ్రెయిన్ దీన్ని ఒక పోటీగా లేదా ముప్పుగా గుర్తిస్తే ఒత్తిడి పెరుగుతుంది. అయితే, ఇదే మెదడును సరైన మార్గంలో ప్రోగ్రామ్ చేసుకుంటే, పరీక్ష భయాన్ని ఓడించగలం! అందుకోసం కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ తెలుసుకుందాం.1విజువలైజేషన్ టెక్నిక్విజువలైజేషన్ అనేది ఓ శక్తిమంతమైన వ్యాయామం. పరీక్ష హాలులో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే, ముందే మిమ్మల్ని మీరు అక్కడ చూసుకోవడం ప్రారంభించండి. మీరు ప్రశాంతంగా ఉండి సమాధానాలు సరిగ్గా రాస్తున్నట్లు రోజుకు 5 నిమిషాల పాటు ఊహించండి. ఇది మీ మెదడును సానుకూలత వైపు మళ్లిస్తుంది. ఇది చేయడం చాలా సులువు.కళ్లు మూసుకుని గాలి నెమ్మదిగా లోపలికి, బయటకు తీసుకోవాలి.మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశాన్ని ఊహించండి.మీరు ప్రశాంతంగా పరీక్ష రాస్తున్నట్లు ఊహించండి.ఈ టెక్నిక్‌ను ప్రఖ్యాత క్రీడాకారులు, బిజినెస్ లీడర్లు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే మన మెదడుకు ఊహకు, నిజానికీ తేడా తెలియదు. మనం ఊహించిన దాన్ని నిజమైందిగా గుర్తిస్తుంది! అలా మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తుంది.2‘సూపర్‌హీరో పోజ్’ టెక్నిక్పరీక్ష ముందు 2 నిమిషాల పాటు ‘సూపర్ హీరో’ పోజ్‌లో నిలబడటం ద్వారా, భయం తగ్గించుకోవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు నిరూపించాయి. ఇది చేయడం కూడా చాలా సింపుల్.మిమ్మల్ని మీరు ఓ సూపర్ హీరోలా ఊహించుకోండి.రెండు చేతులను నడుముపై ఉంచండి.వెన్నెముకను నిటారుగా ఉంచండి.రెండు కాళ్లను కొంచెం దూరంగా ఉంచి తలెత్తి నిలబడండి.ధైర్యంగా చూస్తూ చిరునవ్వు నవ్వండి.ఇలా కేవలం రెండే రెండు నిమిషాలు నిలబడితే భయాన్ని కలిగించే హార్మోన్ కార్టిసోల్ స్థాయిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచే హార్మోన్ టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. పరీక్ష హాలులో ప్రవేశించే ముందు ఈ టెక్నిక్ ట్రై చేయండి. సూపర్ హీరోలా ఎగ్జామ్ రాసేయండి. చెవులకు మసాజ్.. మెదడుకు యాక్టివేషన్పరీక్షకు 5 నిమిషాల ముందు చెవులపై మసాజ్ చేయడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ‘బ్రెయిన్ జిమ్’ పరిశోధన చెబుతోంది. చెవులకూ మెదడుకూ సంబంధం ఏమిటని తర్కించకుండా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసేయండి. ∙రెండు చెవులను మెత్తగా పట్టుకుని, పైకి, కిందికి, సైడ్‌కి తీయండి.రెండు చేతుల గోళ్లతో చెవుల వెనుక భాగాన్ని గీరండి.చెవులపై గుండ్రంగా మసాజ్ చేయండి.ఇలా చేయడం మెదడులో సిగ్నల్ ప్రాసెసింగ్ ఫాస్ట్ చేయడానికి సహాయపడుతుంది. పరీక్ష ముందు చెవులకు మసాజ్ చేస్తే, మెదడుకు స్ట్రెయిన్ తగ్గుతుంది, మతిమరుపు ఉండదు.యాంకరింగ్ టెక్నిక్యాంకరింగ్ టెక్నిక్మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న సిగ్నల్ సృష్టించండి. ఉదాహరణకు, రెండు వేళ్లను కలిపి సున్నా ముద్రను (ఓకే సింబల్) చేయండి, లేదా గట్టిగా అరచేతిని మెల్లగా నొక్కండి. ప్రతిసారి దీన్ని చేస్తే, మీ మెదడు దానిని ప్రశాంతతతో అనుసంధానం చేసుకుంటుంది. పరీక్ష హాలులో ఒత్తిడి పెరిగినప్పుడు ఇదే ముద్రను ఉపయోగిస్తే, మీ మెదడు తక్షణమే కూల్ మోడ్‌లోకి వస్తుంది.పరీక్ష అనేది ఒక మానసిక ఆట మాత్రమే! మీ మెదడును సరైన పద్ధతిలో ప్రోగ్రామ్ చేసుకుంటే, మీరు విజేతగా నిలుస్తారు. ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీ పరీక్ష భయాన్ని క్షణాల్లో హ్యాండిల్ చేయండి!.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?) -
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
అన్నానగర్: తల్లికి బదులు పరీక్షకు హాజరైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా గత 28వ తేదీ నుంచి 10వ తరగతి సాధారణ పరీక్ష జరుగుతోంది. నాగై వెలిప్పాలయం లోని నటరాజన్–దమయంతి పాఠశాలలో బుధవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందజేసి సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళ ముఖానికి మాస్క్ ధరించి ప్రత్యేకంగా కనిపించింది.అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ మాస్క్ తీయమని మహిళను అడిగాడు. అనంతరం అడ్మిట్ కార్డును పరిశీలించారు. ఆ సమయంలో అడ్మిట్ కార్డు పై పరీక్ష రాస్తున్న మహిళ ఫొటోను చూశారు. అయితే పరీక్ష గది ఇన్విజిలేటర్ వద్ద ఉన్న హాజరు రిజిస్టర్ లో వేరే వ్యక్తి ఫొటో ఉంది. ఇన్విజిలేటర్‌కు మహిళను పరీక్ష కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబాషిణి, జిల్లా విద్యాశాఖాధికారి (స్పెషల్ ఎగ్జామినేషన్) ముత్తుచ్చామి, పరీక్షల నియంత్రణ సహాయ సంచాలకులకు సమాచారం అందించారు.ఈ సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్ష కేంద్రం వద్ద ఉన్న పోలీసులు వెళ్లి మహిళను విచారించారు. విచారణలో ఆమె నాగై వెలిప్పాలయానికి చెందిన సెల్వాంబికై (25) అని తేలింది. ఈమెకి పెళ్లి అయ్యిందని, తల్లి సుగంతి కోసం మాస్క్ వేసుకొని హాజరైనట్లు తెలిసింది. అదేవిధంగా 28న మాస్క్ ధరించి తమిళ సబ్జెక్ట్ పరీక్ష రాసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. -
నేడు టెన్త్ సోషల్ పరీక్ష
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.విధి నిర్వహణలో భాగమైన అధికారులు, ఉపాధ్యాయులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం ఐచ్చిక సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పదో తరగతి పరీక్షలకు సెలవు వర్తించదని అధికారులు ప్రకటించారు. -
పరీక్ష తప్పదు.. సీనియారిటీ రాదు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలనాధికారుల (జీపీవో) పోస్టుల భర్తీలో మరో అడుగు ముందుకు పడింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను గ్రామ స్థాయిలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ శనివారం జీవో నం: 129 విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేసి వేరే శాఖల్లోకి వెళ్లిన వారిలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. వీరికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పరీక్ష వద్దని, తమను నేరుగా మళ్లీ రెవెన్యూలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా పరీక్ష నిర్వహణ వైపే మొగ్గు చూపింది. అలాగే మళ్లీ రెవెన్యూలోకి వస్తున్నంత మాత్రాన గతంలో రెవెన్యూ శాఖల్లో పనిచేసిన కామన్ సీనియార్టీ వర్తించదని, సర్వీసు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభం కావాల్సిందేనని జీవోలో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై వీఆర్వో, వీఆర్ఏల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎవరెవరు అర్హులు? జీవో నం.129 ప్రకారం ఈ గ్రామ పాలనాధికారుల పోస్టులను గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారితో మాత్రమే భర్తీ చేస్తారు. గతంలో వీఆర్వోలుగా పనిచేసి ఇతర శాఖల్లో విలీనమైన వారు, వీఆర్ఏలుగా పనిచేస్తూ ఇతర శాఖల్లో రికార్డ్/ జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారిని వారి అర్హతల ఆధారంగా ఈ పోస్టుల్లో నియమిస్తారు. అర్హతలేమిటి? గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉండి మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వీఆర్వోలు, వీఆర్ఏలు ఈ పోస్టుకు అర్హులు. అదే విధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటే వీఆర్వోలుగా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. లేదంటే వీఆర్ఏతో పాటు ఇతర శాఖల్లో నియమితులై ఐదేళ్లు పూర్తయి ఉండాలి. ఉద్యోగ బాధ్యతలివే గ్రామ పద్దుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల జారీకి తగిన విధంగా విచారణ జరపడం, ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర నీటి వనరుల ఆక్రమణలపై విచారించడం, భూసంబంధిత వివాదాల దర్యాప్తు, భూముల సర్వేలో సర్వేయర్లకు సహకారమందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో పనిచేయడం, అత్యవసర సర్వీసులందించడం, ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం లబ్దిదారులను గుర్తించడం, ఎన్నికల సంబంధిత విధులు, ప్రొటోకాల్ సహకారం, ఇతర ప్రభుత్వ శాఖలతో గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో అంతర్గత సహకారం, ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు నిర్దేశించే ఇతర పనులు. ఎంపిక ఎలా? దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. రెవెన్యూ వ్యవస్థపై దరఖాస్తుదారులకు ఉన్న అవగాహన, పట్టును అంచనా వేసే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. ఈ గ్రామపాలనాధికారులను ఎంపిక చేసి వారిని వివిధ జిల్లాల్లో నియమించే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) లేదా సీసీఎల్ఏ నియమించే అధికారికి ఉంటుంది. జిల్లాలకు పంపిన వారిని కలెక్టర్లు అక్కడి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన సర్వీసు నిబంధనలను త్వరలోనే రూపొందిస్తారు. తప్పుల తడక జీవోను అంగీకరించం: తెలంగాణ వీఆర్వోల జేఏసీ‘ఈ జీవో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చినట్టుగా లేదు. ఇంకా బీఆర్ఎస్ ఆనవాళ్లు ఉన్న వారి వారసులు కొందరు ఇచ్చినట్టుగా ఉంది. సీనియార్టీ కలపబోమని, పరీక్ష రాసిన తర్వాతే మళ్లీ రెవెన్యూ శాఖలోకి రావాలని ఈ జీవో ద్వారా చెబుతున్నారు. మళ్లీ పరీక్ష అంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే. సీనియార్టీ ఇవ్వడం లేదంటే మా శ్రమకు గుర్తింపు ఇవ్వనట్టే. అసలు జీవోలోనే ఎన్నో తప్పులున్నాయి. తప్పులతడక జీవోను మేం అంగీకరించబోం. కామన్ సీనియార్టీ ఇచ్చి ఎలాంటి పరీక్ష లేకుండా పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమ బాట తప్పదు..’అని వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, నేతలు హరాలే సుధాకర్‌రావు, పల్లెపాటి నరేశ్, కాందారి భిక్షపతి, ఎస్.కె.మౌలానా, సర్వేశ్వర్, ప్రతిభ, చింతల మురళి, వెంకట్‌రెడ్డిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. -
జేఈఈ మెయిన్స్ తేదీల్లో మార్పులు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్–2 పరీక్ష తేదీలు మారే అవకాశం కన్పిస్తోంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రెండో విడత జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఇదే రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్ష ఉంటుంది. సీబీఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజెస్, 3న హోం సైన్స్, 4న ఫిజియాలజీ ఉంటుంది.సీబీఎస్ఈ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగుతుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.దీంతో సీబీఎస్ఈ పరీక్ష రాసే విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోతుంది. లేదా మెయిన్స్ రాసే విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షను వదిలేయాల్సి ఉంటుంది. పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష మార్పు లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం ప్రకటించాలని కేంద్రం ఎన్టీఏకి సూచించింది. -
వాట్సప్‌లో టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్.. నిందితుల అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో లీకైన గణితం ప్రశ్నాపత్రం లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రమోయమున్న తొమ్మదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవల నిర్వహించిన గణితం పరీక్షలో పేపర్ లీకేజీ జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల బి కేంద్రంలో గణితం ప్రశ్నా పత్రం వాట్సప్‌లో షేర్ చేసినట్లు తెలిసింది.పేపర్ లీకేజీపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల విచారణలో సాయి అనే వాటర్ బాయ్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటో తీయించి లీక్ చేసినట్లు నిర్ధారించారు.ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాటర్ బాయ్ వాట్సప్ ద్వారా కమలాపురం వివేకానంద ఇంగ్లీష్ మీడియం యాజమాన్యానికి పంపినట్లు తేలింది. నిందితుల్లో వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డితో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోయం ఉన్నట్లు తేలింది. మాస్ కాపీయింగ్ కోసమే పేపర్ లీక్ చేశారంటూ పోలీసుల సైతం ప్రకటించారు. -
తరతరాలకు చెరగని ‘టాపర్ల’ చిరునామా..
పట్నా: బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే అవే పరీక్షల్లో టాపర్‌గా నిలిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. మరి.. తరతరాలుగా టాపర్లుగా నిలుస్తున్న ఆ కుటుంబంలోని వారు ఎంత ఆనందించాలి?తాజాగా బీహార్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు(Bihar Intermediate Board Exam Results) విడుదలయ్యాయి. ఈ నేపధ్యంలో పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారిని పట్నాలోని బోర్డు కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం పిలిచారు. సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికర టాపర్ల ఫ్యామిలీ ఉదంతం మీడియాకు దొరికింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు టాపర్లుగా నిలుస్తూ వస్తున్నారు. బెట్టియాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన తాత, తండ్రి, ఇప్పుడు తనయుడు తమ ప్రతిభతో పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఈ కుటుంబానికి చెందిన మూడవ తరం వాడైన యువరాజ్ బీహార్ బోర్డు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.యువరాజ్ కుమార్ పాండే మాట్లాడుతూ నాటి రోజుల్లో మా తాత కూడా టాపర్‌గా నిలిచారని, మెట్రిక్యులేషన్లో టాపర్‌గా నిలిచారని, తరువాత బీఎస్సీలోనూ టాపర్ అయ్యారన్నారు. మా నాన్న కూడా టాపర్ల లిస్ట్‌లో పేరు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు తాను కూడా ఈ జాబితాలో చేరానన్నారు. ఈ సందర్భంగా యువరాజ్ తండ్రి రజనీష్ కుమార్ పాండే మాట్లాడుతూ తన తండ్రి 1954లో గ్రాడ్యుయేషన్(Graduation)లో టాపర్‌గా నిలిచారన్నారు. తన సోదరుడు కూడా 1998లో టాపర్ అని, 1996 ఇంటర్మీడియట్ బ్యాచ్‌లో తాను టాపర్‌గా నిలిచానన్నారు. గతంలో రాష్ట్రంలో కాపీయింగ్ జరిగేదని రజనీష్ కుమార్ పాండే అన్నారు. 1996లో మొదటిసారిగా కేంద్రీకృత పరీక్ష నిర్వహించినప్పుడు తాను టాపర్‌గా నిలిచానన్నారు. తన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా వారి వారి పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారన్నారు.ఇది కూడా చదవండి: పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు -
పరీక్ష హాల్లో టాపర్స్ టెక్నిక్స్!
పరీక్ష హాల్ అనేది యుద్ధభూమి కాదు, ఇదొక గేమ్బోర్డ్! పరీక్షల్లో నిజమైన విజేతలు ఎవరంటే ఎక్కువగా చదివినవాళ్లు కాదు. పరీక్ష హాల్లో సరిగ్గా ఆలోచించి, సమయాన్ని ప్లాన్ చేసుకుని, ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అంటే మీ విజయం మీ మైండ్‌సెట్, ప్లానింగ్, ఆటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది! అందుకే పరీక్ష హాల్లో మెదడు ఎలా పనిచేస్తుంది? టాపర్ల సీక్రెట్ మైండ్ హ్యాక్స్ ఏమిటనే విషయం ఈరోజు తెలుసుకుందాం.చేయకూడనివి...గడియారం చూస్తూ ఆందోళన చెందవద్దు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఒక్క ప్రశ్నకే అతుక్కుపోయి ఎక్కువ సమయం వృథా చేయడం.పరీక్ష మధ్యలో ‘నేను తక్కువ మార్కులు తెచ్చుకుంటానేమో‘అనే అనవసరమైన ఆలోచనలతో భయం పెంచుకోవడం.ప్రశ్నలకు పూర్తి సమాధానం రాశానా? లేదా? అన్న ఆందోళనకి లోనవడం.ఎవరైనా పేపర్ రాయడం పూర్తిచేస్తే, ఒత్తిడిగా ఫీల్ అవ్వడం.పరీక్ష భయాన్ని తగ్గించే ‘పామింగ్ టెక్నిక్’కొంతమంది విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలకు లోనవుతారు. సింపతటిక్ నర్వస్ సిస్టమ్ అధికంగా యాక్టివ్ కావడమే దీనికి కారణం. దీన్ని నియంత్రించేందుకు ‘పామింగ్ టెక్నిక్’ ఉపయోగపడుతుంది. ఇది చేయడం కూడా చాలా సులువు. చేతులను రుద్ది వేడిగా చేయండి · కళ్లు మూసుకుని వేడి చేతులను కళ్ల మీద ఉంచండి లోతుగా ఊపిరి తీసుకుంటూ, ‘నేను ప్రశాంతంగా ఉన్నాను‘ అని మౌనంగా చెప్పుకోండి 30 సెకన్ల పాటు అలా ఉంచిన తర్వాత, చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్‌లోకి మార్చి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పరీక్ష ముందు, ప్రశ్నపత్రం చూసిన వెంటనే ఇది చేయడం మిమ్మల్ని స్పష్టమైన ఆలోచనకు తీసుకెళుతుంది.మైండ్ బ్లాక్ అయ్యిందా? నో ప్రాబ్లెమ్కొందరు విద్యార్థులకు పరీక్ష మధ్యలో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. చదివినవేవీ గుర్తుకురావు. దీన్ని హ్యాండిల్ చేసేందుకు టాపర్లు జీఎస్ఆర్ మోడల్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. మీరూ దాన్నే ఫాలో అవ్వండి!Ground Yourself – కాళ్లు నేలకి ఆనించి 5 సెకన్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి. Switch Focous– 10 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండండి.Restart Slowly – నెమ్మదిగా ప్రశ్న మళ్లీ చదవండి.పరీక్ష హాల్లో మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్పరీక్ష సమయంలో ఒక్కసారిగా ప్రశ్న అర్థం కాకపోతే, మెదడు ‘ఫ్రీజ్‘ అవుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించేందుకు మైండ్‌ఫుల్‌నెస్ సైకాలజీలో ఉపయోగించే ‘గౌనర్–స్విచ్ మోడల్‘ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే... గౌనర్ మోడ్ (గమనించు): ప్రశ్న అర్థం కాకపోతే, కొంతసేపు అక్షరాలను ప్రశాంతంగా గమనించు.స్విచ్ మోడ్ (మార్చు): ప్రశ్నను పూర్తిగా వదిలేయకుండా, కొంచెం వెనక్కి వెళ్లి మళ్ళీ నిశ్శబ్దంగా చదువు.స్కానింగ్ మోడ్: పక్కనే ఉన్న ఇతర ప్రశ్నలను చూసి, మైండ్‌ను మళ్ళీ సెట్ చేసుకోవడం. ఇది మెదడును బ్లాక్ అవుట్ నుంచి రికవరీ మోడ్‌లోకి తీసుకువచ్చి, మరింత చురుకైన ఆలోచనకు సహాయపడుతుంది.చివరి నిమిషాల్లో చేయవలసినవిపరీక్ష పత్రం అందుకున్న వెంటనే, 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి · ముఖ్యమైన సమాధానాల్ని గుర్తించి, ముందుగా అవి రాయడం మొదలుపెట్టండి · ప్రశ్నలకు సమాధానం రాస్తూ, మధ్యలో చిన్న మైండ్‌ఫుల్ బ్రేక్స్ తీసుకోండి సమాధానాలను సాఫ్ట్‌గా, క్లియర్‌గా రాయండి మార్కుల స్కోరింగ్‌కు డయాగ్రామ్స్, హైలైట్స్ ఉపయోగించండి గుర్తులేదనుకున్న ప్రశ్నలపై చివరి 15 నిమిషాల్లో ప్రయత్నం చేయండి. పరీక్ష అనేది మీరు చదివిన తీరుకే కాదు, మీ మానసిక స్థిరత్వానికి కూడా పరీక్ష. ఈ టూల్స్టెక్నిక్స్ ఉపయోగించుకుని ప్రశాంతంగా, ప్లానింగ్‌తో రాస్తే, మీరు విజయం సాధించటం ఖాయం! పరీక్ష అనేది ఒక స్ట్రాటజిక్ గేమ్! దీనిని గెలవడం మీ చేతుల్లోనే ఉంది! పరీక్షలో విజయం సాధించేది ఎక్కువగా చదివినవారు కాదు, ప్రశాంతంగా ఆలోచించగలిగినవారే!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!) -
NTA Exam : అవకాశాన్ని వదులుకోవద్దు!
దేశవ్యాప్తంగా 46 సెంట్రల్ యూనివర్సిటీలకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను నాలుగు సంవత్సరాల డిగ్రీ కోసం నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ (National Testing Agency) ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 1వ తేదీన రిజి స్ట్రేషన్ మొదలయ్యింది. ఈ ప్రక్రియ 23వ తేదీ వరకూ కొనసాగుతుంది. 37 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు డొమెయిన్ సబ్జెక్టు (ప్రధాన సబ్జెక్టు) నూ, నిర్దేశించిన 13 భాషలలో ఒక భాషనూ ఎంచుకోవాలి. జనరల్ స్టడీస్‌ను అభ్యర్థులందరూ రాయాలి. కనీస భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్, ప్లస్ 2, 12వ తరగతి పూర్తి చేసు కున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ప్రతి విద్యార్థి ఐదు సబ్జెక్టుల వరకు పరీక్ష రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. ఈ ఒక్క పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు తమ ర్యాంకు ద్వారా, రిజర్వేషన్ల ఆధారంగా సీటు పొందడానికి అవకాశం ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (2020)లో భాగంగా అన్ని కేంద్ర విద్యా సంస్థలలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును గత రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రారంభించారు. ఒక విద్యార్థి 8 సెమిస్టర్లను పూర్తి చేసుకుంటే ఆ విద్యార్థికి డిగ్రీతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా విద్యార్థి టీచర్ నియామకానికి సంబంధించి పరీక్షను నేరుగా రాయడానికి అర్హత సాధిస్తాడు. దీంతో పాటు పీజీ సర్టిఫికెట్ కూడా పొందుతాడు. ఈ కోర్సులో విద్యార్థి 75% శాతం మార్కులు సాధిస్తే నేరుగా పీహెచ్‌డీలో చేరడానికి అర్హత లభిస్తుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరడానికి అవసరమైన నెట్, సెట్ పరీక్షలు రాయడానికి విద్యార్థి అర్హత సాధిస్తాడు.సైన్సు చదివే విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టు చదవడం, ఆర్ట్స్ చదివే విద్యార్థి సైన్సు సబ్జెక్టు చదవడానికి వీలు ఉండేలా ఈ కోర్సులు డిజైన్ చేశారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి కంప్యూటర్ శిక్షణతో పాటు, మాతృభాష, ఇతర భాషలను నేర్పే విధంగా బోధన ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, మాను, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలు తెలంగాణలో; తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ట్రాన్సిట్ క్యాంపస్)లు ఏపీలో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వివరాలకు ఎన్టీఏ వెబ్సైట్ (https://cuet.nta.nic)ను చూడవచ్చు– డా.చింత ఎల్లస్వామి, ములుగు -
TSPSC Group 3 Result : గ్రూప్-3 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1, గ్రూప్-2 మార్కుల జాబితాను విడుదల చేసింది. ఇవాళ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేయనుంది.ఇక 1365 ఈ గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్ఈ గతేడాది నవంబర్‌లో పరీక్షలను నిర్వహించింది.నవంబర్ 17,18వ తేదీల్లో ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ (మార్చి14)న విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్ఈ తెలిపింది. -
తల్లి మృతి.. కన్నీటితో ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థి
అనకాపల్లి: తల్లిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షకు హాజరైన విషాదకర ఘటన తారువలో శుక్రవారం చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన ముత్యాల పరమేశ్వరి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె కుమారుడు ఆకాష్ సహా కుటుంబ సభ్యులంతా రాత్రంతా తల్లి పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. చోడవరంలో చదువుతున్న ఆకాష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సవరం పరీక్షలకు శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు ఆకాష్‌కు ధైర్యం చెప్పి పరీక్షకు సిద్ధం చేశారు. గుండెల్లో నుంచి ఉబికివస్తున్న బాధను పంటి బిగువున భరిస్తూ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు పయనమయ్యే ముందు ఆకాష్ తన తల్లి పార్థివదేహం వద్ద గుండెలవిలేలా రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. తల్లికి నమస్కరించి బాధను దిగమింగుతూ పరీక్ష రాసేందుకు చోడవరం పయనమయ్యాడు. ఆకాష్ పరీక్ష రాసి తిరిగి వచ్చాక ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలు.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 4 (బుధవారం) నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 15వందలకు పైగా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.అయితే ఈ సమయంలో విద్యార్థలు కొన్ని ప్రిపరేషన్ టెక్నిక్స్‌ను అనుసరించాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీస్,సలహాలతో కీలకమైన ఈ ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాదు మంచి మార్కులు సాధించవచ్చు.దీంతో పాటు సమయం నియంత్రణ,స్మార్ట్ స్టడీ మెథడ్స్,ముఖ్యమైన ప్రశ్నలపై ఫోకస్,సిలబస్ పూర్తిగా రివైజ్ చేయడం,మాక్ టెస్ట్ రాయడం, గైడ్లను ఫాలో అవ్వడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర, సరిపడ ఆహారం తీసుకోవడం, పాజిటీవ్ థింకింగ్ లక్షణాలు అలవరుచుకోవాల్సి ఉంటుంది.👉 మరింత విశ్లేషణాత్మకమైన ఉత్తమ ప్రిపరేషన్ టిప్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. -
రాసిన పరీక్ష గురించి అతిగా ఆలోచించొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం తొలిరోజు పరీక్ష ముగిసింది. సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు గురువారం తొలి పరీక్ష ముగుస్తుంది. మధ్యలో విరామం తర్వాత తదుపరి పరీక్షలు కొనసాగుతాయి. అయితే తొలిరోజు పరీక్ష అనుభవం మిగతా పరీక్షలకు మార్గదర్శకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పరీక్ష ఎలా రాశాం? సన్నద్ధత సరిపోయిందా? అనేది ఒక్కసారి పైపైన సరి చూసుకోవాలే గానీ..దాని గురించి పెద్దగా ఆలోచించ కూడదని స్పష్టం చేస్తున్నారు. ప్రతి ప్రశ్న లోతుల్లోకి వెళ్ళొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మెదడులోకి జ్ఞాపక శక్తిని ప్రేరేపించే సున్నితమైన కణజాలం ఒత్తిడికి గురవుతుందని లండన్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్తల పరిశోధన పేర్కొంటోంది. పరీక్షల సమయంలో ఒత్తిడి కల్గించే కణజాలంపై వారు ప్రత్యేక పరిశోధన చేశారు. ఈ పరిశోధనతో పాటు ప్రస్తుత కీలక సమయంలో విద్యార్థుల ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎలాంటి మానసిక ధోరణిని అలవాటు చేసుకోవాలి? అనే అంశాలపై మరికొన్ని ఇతర పరిశోధనలు, నిపుణుల సూచనలు, అధ్యాపకుల అనుభవాలను ‘సాక్షి’క్రోడీకరించింది. పాజిటివ్ థింకింగ్ కొనసాగించాలి రాసిన పరీక్ష ఎలా ఉన్నా చెయ్యగలిగిందేమీ లేదు. కాబట్టి విద్యార్థులు బాగా రాశాం అన్న పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలి. ఇది పరీక్షలు పూర్తయ్యే వరకూ కొనసాగించాలి. రాసిన పరీక్షలో బాగా మార్కులు వస్తాయనుకున్న ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని మానసిక వైద్య నిపుణులు సంధ్య తెలిపారు. ఇది మెదడులోని కణాలకు సానుకూల సంకేతాలను పంపుతుందని ఆమె చెప్పారు. మున్ముందు రాసే పరీక్ష స్వభావం తేలికగా ఉంటుందనే భావన విద్యార్థిని ఉత్తేజపరుస్తుందని లండన్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ జాన్ ఉల్లేకర్ వివిధ పరిశోధనల పరిశీలన అనంతరం తెలిపారు. ముఖ్యంగా రాసిన పరీక్ష గురించి స్నేహితులతో పదేపదే సంభాషించకూడదు. దీనికి బదులు రాయబోయే పరీక్ష గురించి చర్చించుకోవడం మంచిది. అలాగే జరిగిన పరీక్షకు సంబంధించి అధ్యాపకుడితో ఎక్కువసేపు చర్చించే కన్నా.. జరగాల్సిన పరీక్షకు సంబంధించి సంభాషించడం వల్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని ముంబైకి చెందిన మానసిక శాస్త్ర నిపుణులు నీలమ్ ద్వివేది ఇటీవల ఐఐటీ ముంబై విద్యార్థులను ఉద్దేశించి హితబోధ చేశారు. నిన్నటి అంశాలను మరిచిపోవాలి కొన్ని రంగులు కలిస్తే మరో కొత్త రంగు ఏర్పడుతుంది. అదే విధంగా గత పరీక్షకు సీరియస్‌గా అయిన ప్రిపరేషన్.. తర్వాత పరీక్షకు సన్నద్ధతలో జ్ఞప్తికి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రిపరేషన్‌కు కొన్ని నిమిషాలు విరామం ఇవ్వాలని, అప్పుడే మంచి సన్నద్ధత అలవడుతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త అనిల్ పాండే తెలిపారు. రాసిన పరీక్షలో చివరి ప్రశ్నలు.. వాటి సమాధానాల తీరు మెదడులో నిక్షిప్తమై జ్ఞప్తికి వస్తుంటుంది. కాబట్టి తదుపరి పరీక్షకు పూర్తి వ్యతిరేక కోణంలో స్టడీ చేయాలని ఆయన సూచించారు. అంటే నిన్నటి పరీక్షకు చిన్నచిన్న ప్రశ్నలతో సన్నద్ధత మొదలుపెడితే.. రేపటి పరీక్షకు పెద్ద ప్రశ్నలతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.రాయడం, వినడం, చదవడం, గ్రూప్ డిస్కషన్ లాంటివన్నీ ముందు రోజుకన్నా భిన్నంగా ఉండాలి. నిన్నటి అంశాలను పూర్తిగా మరిచిపోవడానికి కొంతసేపు రేపటి పరీక్ష సబ్జెక్టును, కాలేజీలో బోధకుడు చెప్పిన అంశాలతో పాటు సరదాగా సాగిన గతాన్ని చర్చించుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్‌కు పూర్తి స్థాయి ప్రణాళికను అనుసరించే వీలుంటుందని కెనడాలో పరీక్షలపై జరిగిన పరిశోధన సారాంశం తెలియజేస్తోంది. సందేహాలు నివృత్తి చేసుకోవాలి.. టెన్షన్ వద్దు ఇంటర్లో రెండోరోజు రాసే పరీక్ష ఇంగ్లిష్. ఆర్టికల్స్, పాసివ్ వాయిస్, ప్యాసేజ్ క్వశ్చన్స్, మిస్సింగ్ లెటర్స్.. ఇలాంటివి బట్టీ పడితే రావు. వివిధ మార్గాల్లో ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు టెన్సెస్ (కాలాలు..భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు) గురించి ప్రిపేర్ అవ్వాలంటే అనేక సందేహాలొస్తాయి. వాటికి కచ్చితమైన సమాధానాలు పుస్తకాల్లో ఉండవు. ఇలాంటి సందర్భాల్లో మెదడును అధికంగా ఒత్తిడికి గురిచేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఏ టెన్స్‌ను ఏ సందర్భంలో ఉపయోగించాలనే సందేహం ఉంటే అధ్యాపకుడిని ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ప్యాసేజ్, పొయిట్రీ విషయంలో చేసే ప్రిపరేషన్ సరైందనే భావనతో ఉండాలి. క్రాస్ చెక్ పేరుతో సమయం వృథా చేయకూడదు. అనవసర భయాన్ని మెదడులోకి తీసుకెళ్ళొద్దు. జస్ట్ ప్రాక్టీస్.. అంతే ఇంటర్ ద్వితీయ పరీక్ష ఇంగ్లిష్. విద్యార్థులు తర్వాత రాసేది ఇదే. సాధారణంగా గ్రామర్ విషయంలోనే కొంత తికమక ఉంటుంది. మిస్సింగ్ లెటర్స్, ఆర్టికల్స్, ప్యాసేజీ వంటివి జడ్జి చేయడం ఇబ్బందే. అందువల్ల ఆఖరి నిమిషంలో కొంతమేర వీటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. గ్రామర్ పాయింట్స్‌కు పాఠ్య పుస్తకాలు ఫాలో అవ్వాలి. దీనివల్ల ఆఖరి నిమిషంలో కీలకమైన అంశాలు గుర్తించే వీలుంది. ఇది పాజిటివ్ మైండ్ సెట్‌కు దోహద పడుతుంది. – దాసరి సైదులు (ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆంగ్ల అధ్యాపకుడు, అమ్రాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా) -
అమ్మకూ పరీక్షే!
పరీక్షల సమయంలో ఎక్కువమంది తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మలు.. ‘పిల్లల సిలబస్ పూర్తవుతుందో లేదో, ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, అనుకున్న గ్రేడ్ వస్తుందా.. అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు. మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. భావోద్వేగాలకు గురవుతుంటారు. త్వరగా చిరాకు పడటం, టైమ్‌కి తినకపోవడం, ఎవరినీ కలవకపోవడం, పిల్లల్ని కలవనివ్వకపోవడం వంటివి చేస్తుంటారు. కొందరు తల్లులు తమ పిల్లలకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఇది సరికాదని అమ్మలు కొంత సంయమనంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. సరైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు.ఎందుకు ఒత్తిడికి గురవుతారు..? ⇒ ముందు నుంచీ సిలబస్ ప్రకారం ప్రాక్టీస్ చేయించలేకపోవడం ఒక కారణం. మొదట స్కూల్లో టీచర్లే చూసుకుంటారులే అనే ధీమా ఉంటుంది. పరీక్షల సమయంలో అదికాస్తా సన్నగిల్లుతుంటుంది.⇒ పెద్ద పిల్లలైతే సిలబస్ పూర్తి చేయడంలో వెనకబడు తున్నారేమో అనే సందేహం వెంటాడుతుంటుంది. ⇒ ఫెయిల్ అవుతారేమో, ఇతరుల పిల్లలు ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారేమో అనే ఆందోళనకు గురవుతుంటారు.ఒత్తిడిని ఎలా అధిగమించాలి.. ⇒ తల్లిదండ్రులు పిల్లల విజయాన్ని కోరుకుంటారు. తమ పిల్లలు అందరికన్నా ముందుండాలనే ఆలోచన ఒత్తిడికి గురి చేస్తుంది. అలా ఒత్తిడికి గురవకుండా.. వాస్తవికంగా సాధించగల లక్ష్యాలపై పిల్లలతో కలిసి పనిచేయాలి.⇒ మీ ఆందోళన పిల్లల ముందు బయటపడకుండా సానుకూల వైఖరిని చూపాలి. రోజువారీ షెడ్యూల్‌ను రూపొందించుకోవడంలో పిల్లలకు సాయపడాలి. ⇒ ఒత్తిడి అనేది అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యే. దానిని అధిగమించేందుకు వ్యూహాత్మకంగా పనిచేయ డంలోనే అసలైన సవాల్ ఉంటుంది. అది మీ బిడ్డలకు మద్దతునిచ్చే అతి ముఖ్యమైన వనరుగా ఉండాలి. కలిసి భోజనం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ⇒ తల్లిదండ్రులు తమ స్కూల్ రోజుల్లో మార్కుల గురించి తమ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలను గుర్తుకు తెచ్చుకోవాలి. దీన్ని నివారించాలి. ⇒ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఒంటరిగా గదిలో వదిలేయ కుండా.. మరో పనిచేస్తూ పిల్లలకు సమీపంలో ఉండాలి.⇒ ‘ఎక్స్’లో మేరీ కోమ్, సచిన్, రిచర్డ్ బ్రాన్సన్, మార్క్ జుకర్‌బర్గ్.. లాంటి ప్రముఖులను ఫాలో అవ్వాలి. వారంతా కాలేజీ డ్రాపౌట్స్. కానీ నైపుణ్యాలే వారిని ప్రముఖుల జాబితాలో చేర్చాయనే విషయం గమనించాలి. ‘పిల్లల్లో ఉండే నైపు ణ్యాలను గుర్తించాలి’ అనే భావనను పెంపొందించుకోవాలి.తల్లిదండ్రులు కొన్ని గమనించాలి.. మరికొన్ని పాటించాలి..ప్రొ.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ ట్రైనర్ఈ రోజుల్లో తల్లిదండ్రులు తామే పరీక్షలు రాస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంటుంది వారి మానసిక స్థితి చూస్తుంటే. ముఖ్యంగా తల్లులు తమ ఆందోళనతో పిల్లల్ని ప్రభావి తం చేస్తుంటారు. అలాకాకుండా మానసిక స్థితిని అదుపులో పెట్టుకుంటూ, పిల్లల్ని గమనిస్తూ సమయానుకూలంగా జాగ్రత్తలు పాటిస్తే తల్లులు ఎగ్జామ్స్ అనే గండాన్ని దాటొచ్చు. ⇒ మీ టీనేజర్ పరీక్షల గురించి ఆందోళన చెందుతూ, ఎక్కువ విచారంగా ఉంటున్నారేమో చూడాలి.⇒ గోళ్లు కొరకడం లాంటివి చేస్తున్నారా? రాత్రంతా మేల్కొని ఉంటున్నారా?.. గమనించాలి.⇒ పిల్లల పక్కన కూర్చొని చదువులో సాయం చేయా లి. అందుకు అవసరమైతే స్కూల్ టీచర్ల సాయం తీసుకోవచ్చు. ⇒ ఫోన్, ట్యాబ్, టీవీ స్క్రీన్ల వాడకం.. చదువు నుంచి దృష్టి మరల్చేలా చేస్తుంది. అయితే దీన్ని పూర్తిగా దూరం చేయకుండా, సమయపు హద్దులు పెట్టడం మేలు.⇒ సరైన పోషక ఆహారం ఆందోళన స్థాయి లను తగ్గిస్తుంది. అందుకని పిల్ల లకు సమతుల ఆహారం ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. ⇒ వారి అలసటను నివారించేలా చిన్న విరామం తీసుకోనివ్వాలి. తల్లులు ఇలా ప్రమాణం చేసుకోవాలి.. ‘పిల్లల పరీక్ష సమయంలో తల్లులు తమకు తాముగా కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి.. వాటిని పాటించాలి..’ అని అంటున్నారు సోష ల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కిడ్స్‌స్టాప్‌ప్రెస్. కామ్ ఫౌండర్ మాన్సి జవేరీ. అవేంటంటే..⇒ ‘ఇది మీ భవిష్యత్తు.. పరీక్ష ఫలితం పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’ అనే పదాలను పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించను.⇒ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సమయంలో నేను, నా పిల్లల స్నేహితు లను కలిసినప్పుడు.. ‘సిలబస్ పూర్తయ్యిందా? ఇప్పటివరకు ఎన్ని అధ్యాయాలు చదవడం పూర్తి చేశారు?..లాంటి ప్రశ్నలను అడగనే అడగను. ళీ ఎక్కువ గంటలు పుస్తకాల ముందు కూర్చోపెట్టను. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడను. -
పుస్తకాలతో కుస్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియట్, పదో తర గతి పబ్లి క్ పరీక్షల సమయం దగ్గరపడటంతో విద్యార్థులు నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పిల్లల పరీక్షలపైనే తల్లిదండ్రులు దృష్టి పెట్టారు. హాస్టళ్లల్లో రాత్రింబవళ్లూ స్టడీ అవర్స్ నడుస్తున్నాయి. ప్రైవేటు కాలే జీలు, స్కూళ్ల హాస్టల్స్‌లో విద్యార్థులను చదివించడం కోసం ప్రత్యేక సిబ్బంది పని చేస్తున్నారు. విస్తృతంగా స్టడీ మెటీరియల్స్ ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి 9,96,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోని 417 ప్రభుత్వ కాలేజీల్లో 1.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లకు ఇంటర్ బోర్డ్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. నెల రోజుల క్రితమే అన్ని చోట్లా సిలబస్ పూర్తయింది. 15 రోజులుగా రివిజన్ చేయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు.వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నారు. టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి మొదలవుతాయి. 5.50 లక్షల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 1.40 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. వందశాతం పాస్ ఫలితాలపై స్కూళ్లు దృష్టి పెట్టాయి. విద్యాశాఖ అన్ని సబ్జెక్టులకూ స్టడీ మెటీరియల్స్‌ను స్కూళ్లకు పంపింది. నిద్రలేని రాత్రులు గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులకు నిద్ర కూడా కరవవుతోంది. ఉదయం 4 గంటలకే విద్యార్థులను నిద్ర లేపి గంటపాటు స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సబ్జెక్టు అధ్యాపకులు ముఖ్యమైన చాప్టర్స్‌పై ప్రశ్నలు వేస్తున్నారు. సరైన సమాధానం రాకపోతే ఆ చాప్టర్‌పై శిక్షణ పెంచుతున్నారు. ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు? వారిని ఏ విధంగా ప్రిపేర్ చెయ్యాలనే అంశాలపై స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు రోజూ నివేదికలు కోరుతున్నాయి. పరీక్షలు అయ్యే వరకు ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశాలు వెళ్లాయి.సబ్జెక్టు టీచర్లకు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పోటీ పెడుతున్నాయి. ఎక్కువ మంది మంచి జీపీఏ, ర్యాంకులతో పాసయ్యేలా చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆశ చూపుతున్నాయి. ఈసారి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు కూడా టార్గెట్లు పెట్టారు. సబ్జెక్టులవారీగా మంచి స్కోర్ చేసిన స్కూళ్లను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తల్లిదండ్రులు కూడా ఇదే స్థాయిలో పిల్లల చదువుపై దృష్టి పెట్టారు. పిల్లలకంటే ముందే నిద్రలేచి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలను కనిపెట్టుకుని ఉంటున్నారు. పరీక్షలపైనే దృష్టి ఇది కీలక సమయం. పిల్లలకు పరీక్షలయ్యే వరకు ఏ పనికీ వెళ్లదల్చకోలేదు. వారిని ఎలా చదివించాలనే అంశాలపైనే దృష్టి పెడుతున్నాం. వాళ్లకు ఏం కావా లో దగ్గరుండి చూసుకుంటున్నాం. కంటిమీద కును కు లేకున్నా వాళ్ల భవిష్యత్ కోసమే పనిచేస్తున్నాం. –ఎస్కే జబ్బర్ (విద్యార్థి తండ్రి, జడ్బర్ల)మార్కులు పెంచేలా ప్రిపరేషన్ ఒకటికి పదిసార్లు ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నాం. సబ్జెక్టువారీగా అధ్యాపకులను అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న చాప్టర్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. త్వరగా గుర్తుండిపోయేలా శిక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. –ఆర్ పార్వతిరెడ్డి (హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం)మెరుగైన ఫలితాల కోసంప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులూ మంచి ర్యాంకులు పొందేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ముఖ్యమైన ప్రశ్నలతో పాటు, గతంలో వచ్చిన ప్రశ్నలను గుర్తించి.. ఈసారి తేలికగా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు)క్షణం తీరిక ఉండటం లేదు పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు, టీచర్లకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ప్రభుత్వం సరఫరా చేసిన దీపికల ద్వారా విద్యార్థి తేలికగా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూస్తున్నాం. – ఆర్ రాజగంగారెడ్డి (ప్రభుత్వ గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
పరీక్షల్లో విజయం సాధించాలంటే..?
పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాళ్లు. చాలామంది విద్యార్థులు పరీక్షల సమయానికి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. మెదడు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? మన మనస్సు పరీక్షలకు అనుగుణంగా ఎలా సిద్ధం కావాలి? అనే విషయాలు తెలుసుకోవడం అవసరం.మానసిక స్థిరత్వం, సమర్థమైన అధ్యయన పద్ధతులు, దృఢమైన ఆత్మవిశ్వాసం పరీక్ష విజయాన్ని నిర్దేశించే మూడు ప్రధాన అంశాలు. పరీక్షల సమయంలో ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం, మెదడును ఒత్తిడికి అలవాటు చేయడం, చదువును ఒక ఉల్లాసభరితమైన ప్రక్రియగా మార్చుకోవడం ఎంతో అవసరం. పరీక్షలలో విజయం అనేది జ్ఞానం కన్నా మానసిక దారుఢ్యం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ వ్యాసంలో అందించే పద్ధతులను అనుసరిస్తే, పరీక్షలపై భయం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంచుకుని విజయాన్ని సాధించగలుగుతారు.ఒత్తిడిలో మెదడు ఎలా స్పందిస్తుంది?పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు, మెదడు అమిగ్డాలా అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది మన భయాలకు, ఆందోళనకు ఆధారమైన భాగం. అమిగ్డాలా మిగతా మెదడు భాగాల కంటే హై అలర్ట్‌లోకి వెళ్ళి, ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిలో మూడు రకాల ప్రతిచర్యలు కనిపిస్తాయి:Fight Mode: పరీక్షను సవాలుగా తీసుకుని మరింత కృషి చేయడంFlight Mode: పరీక్షలంటే భయపడి చదవడంపై ఆసక్తి చూపలేకపోవడం, అంటే తప్పించుకుని పారిపోవడంFreeze Mode: పరీక్ష సమయంలో మెదడు పనిచేయకపోవడం, గుర్తొచ్చిన విషయాలు మర్చిపోవడం.ఇందులో ఫ్లైట్, ఫ్రీజ్ మోడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా మీ లెర్నింగ్‌ను, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. ఫైట్ మోడ్‌లో ఉండటం పరీక్షల్లో విజయానికి కచ్చితంగా అవసరం. అందుకే మీరో ఫైటర్‌లా మారండి. పరీక్షలను చాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగండి. విజయానికి సానుకూల దృక్పథం పరీక్షలో విజయానికి ఆ మూడు గంటలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది అతి ముఖ్యమైన విషయం. నేనింతే సాధించగలననే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి నేను సాధించగలననే గ్రోత్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకోవాలి. అది మానసిక స్థితిని శక్తిమంతంగా మార్చి, ప్రతిభను మరింత పెంచుతుంది. అందుకోసం ఓ మూడు టెక్నిక్స్ తెలుసుకుందాం. ఆటో సజెషన్: ‘‘నేను ఈ పరీక్షను విజయవంతంగా రాయగలను’’అని ప్రతిరోజూ మనసులో అనుకోవడం. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉదాహరణలు చదవడం, ఆయా వీడియోలు చూడడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.విజువలైజేషన్: పరీక్ష హాలులో ప్రశాంతంగా సమాధానాలు రాస్తున్నట్లు మనసులో ఊహించడం. ఇలా చేయడం వల్ల ఊహించిన అనుభవాలను నిజంగా అనుభవించినట్లు మెదడు గుర్తుంచుకుంటుంది. దానికి ఊహకూ, నిజానికీ మధ్య తేడా తెలియదు. స్వీయ కరుణ: తప్పులు చేసినా, వాటిని నేర్చుకునే అవకాశంగా చూడటం అవసరం. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మీతో మీరే పోటీ పడాలి. మీ ప్రగతిని చూసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పూర్తిచేయడం ద్వారా మనసుకు ఓవర్‌లోడ్ కాకుండా ఉంటుంది.ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకోసం పలు సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం. అలాగని జస్ట్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం: మనసు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అదేమంత కష్టమైన పనికాదు. వెరీ సింపుల్. నాలుగు సెకన్లు లోపలికి శ్వాస తీసుకోవడం, ఏడు సెకన్లు శ్వాసను బంధించడం, ఆ తర్వాత ఎనిమిది సెకన్లు నెమ్మదిగా వదిలేయడం. దీనివల్ల మెదడులో ఆక్సిజన్ పెరిగి ప్రశాంతతను అందిస్తుంది.వ్యాయామం: రోజూ 20 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.దీంతో పాటు సరైన ఆహారం, నిద్ర అవసరం. గుడ్లు, కాయధాన్యాలు, ఉల్లిపాయలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పరీక్షల ముందు కనీసం 7 గంటలు నిద్రపోవడం అవసరం. రాత్రంతా మేల్కొని చదివితే మెదడు పనితీరు మందగిస్తుంది. ---సైకాలజిస్ట్ విశేష్, www.psyvisesh.com(చదవండి: 'గోచీ పండుగ': వినడానికి వింతగా ఉన్నా..పండుగలో మాత్రం..!) -
‘దూర’మవుతున్న విద్య
వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన వారికి దూరవిద్య ఓ మంచి అవకాశంగా మారింది. తమకు నచ్చిన కోర్సుల్లో డిగ్రీ చేసి, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఈ బాట పడుతున్నారు. కానీ.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో దూరవిద్యలో చేరిన అభ్యర్థులకు మాత్రం విద్య ‘దూర’మయ్యే పరిస్థితి ఏర్పడింది. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడంతో డిగ్రీలు ఎప్పటికి చేతికొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. – సాక్షి, అమరావతితిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో గందరగోళం నెలకొంది. గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల షెడ్యూల్ ఆలస్యంగా ఇచ్చారు. అంతేకాకుండా పదేపదే మార్పులు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో పరీక్షల తేదీలను మూడుసార్లు ప్రకటించి.. వివిధ కారణాలతో వాయిదా వేయడం వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్సిటీల పాలన దిగజారింది. అప్పటి వరకు ఉన్న వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించడం, అనంతరం వీసీల నియామకంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికీ వైస్చాన్సలర్లను నియమించడంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఎస్వీ వర్సిటీ దూర విద్య ద్వారా అందించే యూజీ, పీజీ, ఎంబీఏ వంటి కోర్సుల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులూ ప్రవేశాలు పొందారు. అలా 2023–24 విద్యా సంవత్సరానికి సుమారు 32 వేలమందికి పైగా అభ్యర్థులు వివిధ దశల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. గతేడాది ఎన్నికల కారణంగా పరీక్షల షెడ్యూల్‌నే ప్రకటించలేదు. ఈ కారణంగా సెపె్టంబర్లో దూరవిద్య పరీక్షలు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచిన వర్సిటీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో జనవరిలో పరీక్షలంటూ డిసెంబర్ చివరిలో షెడ్యూల్ విడుదల చేసింది.అయితే యూజీసీ కమిటీ పర్యటన కారణంగా పరీక్షలను సంక్రాంతి తర్వాత అంటూ వాయిదా వేసింది. అనంతరం ఫిబ్రవరి మొదటివారం మరో షెడ్యూల్ ఇచ్చింది. దాన్ని కూడా వాయిదా వేసింది. తాజాగా ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలంటూ షెడ్యుల్ ఇచ్చింది. అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్ష పత్రాలు ఎగ్జామ్ సెంటర్‌కు కూడా చేరిపోగా... ఒక్కరోజు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నామంటూ వర్సిటీ ప్రకటించింది. పరీక్షలు నిర్వహించే ఉద్దేశమే లేదు ఎస్వీ వర్సిటీ అధికారులకు దూరవిద్య పరీక్షలను నిర్వహించే ఉద్దేశమే లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పదేపదే పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయడంతో ఇబ్బందులు గురవుతున్నామని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులై బయటకు వస్తే ఉద్యోగాలు వచ్చేంత వరకు వారందరినీ నిరుద్యోగులుగా గుర్తించాలని... దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పరీక్షలను అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. వ్యయప్రయాసల కోర్చి, ఫీజులు చెల్లించి... సకాలంలో డిగ్రీ పూర్తి చేయాల్సిన తాము.. ఎనిమిదినెలలకు పైగా ఆలస్యంగా పరీక్షలు రాసి... డిగ్రీలు పొంది ప్రయోజనమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం ఆత్మహత్యాయత్నం వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ ఏఎన్ఎం ఎస్వీ వర్సిటీ దూరవిద్యలో చేరారు. ఈనెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్యాధికారిని సెలవులు అడిగారు. కానీ సెలవు మంజూరు చేయకపోవడంతో తాను పరీక్షలు రాయలేనన్న బాధతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. దూరవిద్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్థులు వాస్తవానికి దూర విద్య కోర్సులను అభ్యసించే వారిలో సాధారణ విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే వాళ్లు అధికంగా ఉంటారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ ఉన్నారు. వర్సిటీ దూరవిద్య పరీక్షల షెడ్యూల్ ఫిబ్రవరి 24న ప్రకటించడంతో చాలామంది ఉద్యోగులు సెలవులు పెట్టుకుని మరీ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. తీరా పరీక్షలు వాయిదా పడటంతో గందరగోళానికి గురయ్యారు.అయోమయంలో ఒడిశా అభ్యర్థులు మరోవైపు ఒడిశా రాష్ట్రానికి చెందిన దాదాపు 30మంది అభ్యర్థులు రెండేళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్యలో పీజీ కోర్సులో చేరారు. వారంతా ఈనెల 24నుంచి పరీక్షలుండటంతో చిత్తూరు చేరుకున్నారు. తీరా 22న పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో వారంతా ఏపీలో ఉండాలో... ఒడిశా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
Group 2: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన
-
ప్రొఫెసర్ సుమనా.. ఒక ట్రాన్స్జండర్ విజయ గాథ
ట్రాన్స్‌జండర్లు తమ జీవితంలో లెక్కలేనన్న అవమానాలను ఎదుర్కొంటుంటారు. అయితే వీటిని అధిగమించి, కష్టనష్టాలను దిగమింగుకుంటూ, అత్యున్నత స్థానానికి చేరుకున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటివారు ఈ తరహా వ్యక్తులకే కాకుండా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటారు. అలాంటివారిలో ఒకరే సుమనా ప్రామాణిక్. నేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన ఆమె ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.పశ్చిమబెంగాల్‌కు చెందిన ట్రాన్స్ జండర్ సుమనా ప్రామాణిక్ తన కలను సాకారం చేసుకున్నారు. ఇటీవలే రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించిన సుమనా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే అర్హతను దక్కించుకున్నారు. త్వరలోనే ఆమె ఏదో ఒక యూనివర్శిటీలో లేదా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం అందుకోనున్నారు. సుమనా తన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ టీచర్ కావాలని కలలుగనేవారు.సుమనా 2019లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)కు హాజరయ్యారు. అప్పుడు ఆమె ఆ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. అయితే ఈ ఏడాది నిర్వహంచిన సెట్ పరీక్షలో ఆమె విజయం దక్కించుకున్నారు. ట్రాన్స్‌జండర్లు కొన్ని పనులకు మాత్రమే అర్హులనే భావన తప్పని, వారు ఏ రంగంలోనైనా రాణించగలరని సుమనా నిరూపించారు. సుమనా గతంలో అధ్యాపక వృత్తి చేపట్టాలని ప్రయత్నించినప్పుడు పలు వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె వాటన్నింటికీ సమాధానం చెప్పారు.సుమానా అత్యంత బీదకుటుంబంలో జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆరేళ్ల వయసులోనే ఆమె అనాథాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తరువాత కృష్ణాకాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం కల్యాణీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వర్థమాన్ యూనివర్శిటీలో బీఈడీ కూడా పూర్తిచేశారు. ఈ సమయంలో సుమనా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ వచ్చారు. ఒక కౌన్సిలర్ అందించిన ధైర్యంతో సుమనా చదువులో ముందడుగు వేశారు. ఐదేళ్ల కృషి అనంతరం సుమనా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారి, తన కలను సాకారం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది -
భయం..అభయం..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్షల భయాన్ని, చదువుకు సంబంధించిన ఒత్తిడిని అధిగమించి, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా తోడ్పడేందుకు ఏర్పాటైన ‘టెలి మానస్’సత్ఫలితాలనిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో నడుస్తున్న టెలి మానస్‌ను 1382 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా విద్యార్థులు పెద్ద సంఖ్యలో సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. తమలోని ఆందోళన తెలియజేస్తున్నారు. వారి సమస్యలను, ఆందోళనను సావధానంగా వింటున్న టెలి మానస్ సైకాలజిస్టులు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేలా సలహాలు, అనుసరించాల్సిన చిట్కాలు తెలియజేస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు కూడా టెలీ మానస్‌ను ఆశ్రయిస్తుండటం గమనార్హం కాగా.. పిల్లల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో కౌన్సెలర్లు వారికి సూచనలిస్తున్నారు. తమ కౌన్సెలింగ్ విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపుతోందని సైకాలజిస్టులు, కౌన్సెలర్లు చెబుతున్నారు. డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఫోన్లు వచ్చినట్లు వివరించారు. అర్ధరాత్రి వేళల్లోనూ కౌన్సెలింగ్మంచి ర్యాంకులురావాలంటూ తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్లతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షల తేదీలు సమీపిస్తున్న కొద్దీ వారిని భయం వెంటాడుతోంది. కాలేజీలో చెప్పలేక, ఇంట్లో మాట్లాడలేక దిగులు పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే అనేకమంది టెలి మానస్‌ను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిద్రండుల నుంచి ఈ తరహా ఫోన్లు రోజుకు సగటున 20 వరకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్‌ను 24 గంటలూఅందుబాటులో ఉంచడంతో కొంతమంది అర్ధరాత్రి కూడా ఆందోళన పడుతూ ఫోన్లుచేస్తున్నారని వివరించారు.అన్నీ మర్చిపోయిన ఫీలింగ్ కలుగుతోంది.. టెలి మానస్‌కు వరంగల్ నుంచి ఓ విద్యార్థి ఫోన్ చేశాడు. ‘నేను హైదరాబాద్‌లో ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నా. కాలేజీ పరీక్షల్లో ప్రతిసారీ మంచి మార్కులే వచ్చేవి. కానీ రెండు రోజులుగా భయం వేస్తోంది. నాన్న ఫోన్ చేసి మంచి ర్యాంకు కొడతావ్గా అంటాడు. కాలేజీ వాళ్ళేమో అర్ధరాత్రి కూడా చదవాల్సిందేఅంటున్నారు. పుస్తకం పట్టుకుంటే వణుకు వస్తోంది. అన్నీ మర్చి పోయానేమో అనే ఫీలింగ్ వస్తోంది..’అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అతనికి సైకాలజిస్టు ఒకరు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒత్తిడిని అధిగమించేలా పలు సూచనలిచ్చారు. నిద్ర పట్టడం లేదు..హైదరాబాద్ నుంచి సుమారు 40 రోజుల వ్యవధిలోనే అత్యధిక సంఖ్యలో 68 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో 28 మంది పరీక్షల తేదీ ప్రకటించిన తర్వాత నిద్ర పట్టడం లేదని తెలిపారు. 18 మంది పరీక్షలంటే గుబులేస్తోందని చెప్పారు. వీళ్లలో 12 మంది తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మంచి మార్కులు ఎలా వస్తాయో అన్న భయం వెంటాడుతోందని చెప్పారు.ఆరుగురు మానసిక ఒత్తిడితో తలనొప్పి వస్తోందని చెప్పారు. మంచి ఆహారం తీసుకోవాలని, తగినంత సమయం నిద్ర పోవాలని సూచించడంతో పాటు, చదువు విషయంలో వారిని మానసికంగా ధైర్య పరిచేలాకౌన్సెలింగ్ ఇచ్చారు.భయం భయంగా ఉంటున్నారు..ఖమ్మంలోని ఓ గురుకుల ఉపాధ్యాయుడు ఫోన్ చేసి.. ‘బాగా చదివే నలుగురు విద్యార్థులు ఎందుకో మూడు రోజులుగా భయం భయంగా ఉంటున్నారు. గుచ్చి గుచ్చి అడిగితే పరీక్షలంటే కంగారుగా ఉందని చెప్పారు..’అని వివరించారు. దీంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పట్నుంచి వారు కాస్త ధైర్యంగా ఉన్నారని ఉపాధ్యాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి పది మంది విద్యార్థులు పరీక్ష రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హాల్ టికెట్ల గురించి అడిగారు. మరో ఆరుగురు ఫెయిల్ అవుతామనే భయం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ తర్వాత వారిలో ధైర్యం కన్పించిందని టెలి మానస్ సిబ్బంది చెప్పారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్ జిల్లాల నుంచి 12 ఫోన్ కాల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. పిల్లలు పరీక్షలంటే భయపడుతున్నారని, వాళ్ళను ఏ విధంగా సన్నద్ధం చేయాలో చెప్పమని అడిగారు. ఆహారం, నిద్ర, తాగునీరు విషయంలో జాగ్రత్తలపై ఆరా తీశారు. చదవడం కన్నా రాయడం మంచిదితల్లిదండ్రులు, కాలేజీలు విద్యార్థులపై మార్కులు,ర్యాంకుల కోసం ఒత్తిడి చేయొద్దు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. రాత్రి నిద్ర సరిగా పోకుండా చదివితే ఉపయోగం లేదు. ఉదయాన్నే లేచి రివిజన్ చేసుకుంటే బెటర్. బాగా చదివిన సబ్జెక్టులు, చాప్టర్స్‌పై దృష్టి పెట్టాలి. టెన్షన్ తెప్పించే వాటిని సమయాన్ని బట్టి చూసుకోవడం మంచిది. పరీక్ష భయం ఉన్న వారు చదవడం కన్నా..సమాధానాలు ఒకటికి రెండుసార్లు రాయడం మంచిది. దీనివల్ల పరీక్ష తేలికగా రాసే వీలుంది. సబ్జెక్టులో ఇబ్బంది ఉంటే ఆందోళన చెందకుండా సంబంధిత లెక్చరర్‌ను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇళ్లలో టీవీలు, సెల్ఫోన్లకు విద్యార్థులే కాదు..తల్లిదండ్రులూ దూరంగా ఉండాలి. దీనివల్ల మానసికంగా చదివే కమాండ్ వస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థి ఆందోళన గుర్తించాలి. బంధువులు, పరిచయస్తులతో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పించాలి. పరీక్షల సమయంలో ఆహారం, మంచినీరు చాలా ముఖ్యం. మంచి పౌష్టికాహారంతో పాటు, సమయ పాలన అనుసరించాలి. మెదడుకు 80 శాతం, ఇతర శరీర భాగాలకు 20 శాతం ఆక్సిజన్ అవసరం. ఇదినీళ్ళ ద్వారానే ఎక్కువగా సమకూరుతుంది.ఉదయం వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరంచేసుకోవచ్చు.- పి.జవహర్లాల్ నెహ్రూ సీనియర్ సైకాలజిస్టు, టెలి మానస్ -
బాబు పరీక్షలు మాకు పరీక్ష పెడుతున్నాయి
మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. స్వతహాగా మంచి తెలివైనవాడే. కానీ ఇటీవల పరీక్షలకు సరిగా ప్రిపేర్ కావడంలేదు. మొదటినుండి చదవకుండా పరీక్షలకు ముందు, తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నాడు. దాంతో మార్కులు బాగా తగ్గుతున్నాయి. బాబు పరీక్షలు మాకు ఒక గండంలాగా అనిపిస్తున్నాయి. బాబు విషయంలో నాకు, మా ఆయనకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. ఈ విషయంలో ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. – రాజ్యలక్ష్మి, హైదరాబాద్‌బాబు విషయంలో మీరెంత టెన్షన్‌కు గురవుతున్నారో అర్థమవుతోంది. చదువు, పరీక్షల విషయంలో మీ బాబు ఎదుర్కొంటున్న సమస్య చాలా సాధారణమైనదే. ఎంత బ్రిలియంట్ స్టూడెంట్స్ అయినా, పరీక్షల ముందర కొంత ఒత్తిడిని తప్పకుండా ఎదుర్కొంటారు. ఈ ఒత్తిడి వల్ల మంచి తెలివితేటలు గల విద్యార్థులు కూడా పరీక్షలు సరిగా రాయలేక ర్యాంకు తగ్గి΄ోతుంది. ఇలాంటి విషయంలో, మీరు ఓపికతో బాబును దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. దీనికి మీవారి సహకారం కూడా చాలా అవసరం. టైమ్ మేనేజ్మెంట్, నోట్స్ సరిగా రాసుకోవడం, మెమరీ టెక్నిక్స్ లాంటివి ఇలాంటి విద్యార్థులకు చాలా అవసరం. బాబు చదువుకోవడానికి రోజూవారి ఒక టైమ్ టేబిల్ తయారు చేసి, చదవవలసిన సబ్జెక్ట్స్‌ను చిన్న చిన్న పోర్షన్స్‌గా విభజించి, వాటిని క్రమంగా పెంచుతూపోవడం లాంటివి బాగా పనిచేస్తాయి. అతని ఏకాగ్రతకు భంగం కలగకుండా ఇంట్లో టి.వి. పెట్టడం, ఫంక్షన్స్ పెట్టుకోవడం, ఇతరుల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు వెళ్లడం లాంటివి లేకుండా చేయండి. వీలైతే బాబుకు తోడుగా మీరు కూడా పక్కన ఉండి ధైర్యం చెప్పండి. ధ్యానం, జాకబ్ సన్స్ రిలాక్సేషన్ అనే టెక్నిక్, ఈ పరీక్షల భయాన్ని బాగా తగ్గిస్తాయి. ఫలితంపై కాకుండా అతని ప్రయత్నం పైన దృష్టి పెట్టమని చెప్పండి. ఇంకా అవసరమైతే మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌కు చూపించి, కౌన్సిలింగ్ ఇప్పించండి. మీ బాబు భవిష్యత్తు కోసం, మీరు మీ వారు చక్కగా చర్చించుకొని, ఒక టీమ్ లాగా ముగ్గురూ కలిసి పని చేయండి. ఆశావాదంతో మీరు, మీ అబ్బాయి ముందుకెళితే, బాబు తన పరీక్షల భయాన్ని పూర్తిగా అధిగమించగలడు. ఆల్ ది బెస్ట్! ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
రెండు సెషన్లూ క్లిష్టంగానే..!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్(JEE Main) రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. తొలి సెషన్లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్‌లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ద్వితీయ సంవత్సరం సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత రెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్‌ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్‌లో సిరీస్ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్ కాలిక్యులస్ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్‌లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్ టేబుల్ (2 ప్రశ్నలు), అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), కెమికల్ బాండింగ్ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్‌లో హీట్ అండ్ థర్మో డైనమిక్స్ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్ ఆధారంగానే.. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా, కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్‌ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్ పేపర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. బెంగళూరు సెంటర్లో రీ షెడ్యూల్ ఈ నెల 22న బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది. ఆ సెంటర్లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్‌కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్‌ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్‌లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
అడ్మిట్ కార్డులు రెడీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకూ జరిగే జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలి సెషన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది. గత ఏడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది హాజరయ్యారు. ఈసారి కూడా దాదాపుగా అంతే సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది ఆన్లైన్ విధానంలో జేఈఈ మెయిన్స్ రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పట్టణాల్లో పరీక్ష ఉంటుంది. 22, 23, 24 తేదీల్లో పేపర్–1 (బీఈ, బీటెక్‌లో ప్రవేశానికి) ఉంటుంది. 28, 29, 30 తేదీల్లో పేపర్–2 (బీఆర్క్, ప్లానింగ్‌లో ప్రవేశానికి) ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో షిఫ్ట్ ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేసింది. పెరగనున్న సీట్లు దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈసారి బీటెక్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులు, ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేనుండటంతో కనీసం 5 వేల సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. దేశంలోని 31 ఎన్ఐటీల్లో ప్రస్తుతం 24 వేల సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 8,500 సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీల్లోని 50% సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో చేరాలంటే మెయిన్స్ కీలకం. ఇక మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ సంఖ్య 2.5 లక్షలుగా ఉంటుంది. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో రెండో దఫా పరీక్షకు ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈసారి చాయిస్ ఎత్తివేత బీఆర్క్‌కు ఏటా 50 వేలకు మించి దరఖాస్తులు రావడం లేదు. కరోనా సమయం నుంచి సెక్షన్ ‘బీ’లో చాయిస్ ఇస్తున్నారు. కానీ ఈసారి చాయిస్ ఉండదు. ఈ సెక్షన్లో ఐదు ప్రశ్నలే ఇస్తారు. సెక్షన్ ఏ, బీలో మైనస్ మార్కులు ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మందికి సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులు వచి్చన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారు.అడ్మిట్ కార్డులు కీలకం విద్యార్థులకు ఎన్టీఏ కొన్ని సూచనలు చేసింది. జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్స్, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, పేపర్, పుస్తకాలు, మొబైల్, మైక్రోఫోన్, ఇయర్‌ఫోన్స్, కెమెరా, ఎల్రక్టానిక్ వస్తువులు, వాచీలు, స్కేల్, ఆల్గారిథమ్ బుక్, మెటల్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఇన్వి జిలేటర్ నుంచి అనుమతి వచ్చే వరకూ గదిలోనే ఉండాలి. కీలకమైన అడ్మిట్ కార్డులో మూడు పేజీలుంటాయి. సెంటర్ వివరాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్, ముఖ్యమైన సూచనలు, ఇతర వివరాలు మూడో పేజీలో ఉంటాయి. -
‘జేఈఈ మెయిన్’కు వెళ్దాం ఇలా..
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1(బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో ఈ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊరిలో పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ వివరాలను సైట్లో ఉంచిన ఎన్టీఏ.. ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేసింది. – గుంటూరు ఎడ్యుకేషన్2 గంటల ముందుగా పరీక్ష కేంద్రానికి..⇒ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు పొందిన విద్యార్థులు అందులో ఎన్టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ⇒ ఉదయం పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు జరగనుంది. ఉదయం పరీక్షకు 7.00 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రకటించిన ఎన్టీఏ.. పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతించిన తర్వాత ప్రధాన గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది.⇒ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఏ.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది. ⇒ ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్‌కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉండగా.. పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక ఇని్వజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.⇒ విద్యార్థి తమ వెంట అడ్మిట్‌కార్డుతో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరో పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌తో పాటు బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ కార్డును విధిగా తీసుకెళ్లాలి. -
ఇంటర్ విద్యలో సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సైతం సీబీఎస్ఈ విధానంలోకి మారింది. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.జాతీయ విద్యా విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు బోర్డు పరీక్షలను రద్దు చేసి, సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు, సలహాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బోర్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇంటర్ విద్యలో తీసుకురానున్న విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు కోరుతున్నట్టు చెప్పారు. ప్రతిపాదిత సంస్కరణలను www.bieap.gov.in వెబ్సైట్లో ఉంచామని.. సూచనలు, అభ్యంతరాలను జనవరి 26వ తేదీలోగా biereforms@gmail.com మెయిల్ చేయాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియేట్ సిలబస్ కొన్ని సంవత్సరాలుగా మార్చలేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తేనున్నట్టు కృతికా శుక్లా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాల్లో ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాయన్నారు. విద్యా రంగంలో అనుభవం గల నిపుణులతో ప్రతి సబ్జెక్టుకు ఒక నిపుణుల కమిటీ చొప్పున 14 కమిటీలను వేశామన్నారు. వారి సూచనలతో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్–2023కు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఆ పై సంవత్సరం ఇంటర్ రెండో ఏడాది సిలబస్ అందుబాటులోకి వస్తుందన్నారు. పాఠశాల విద్యా శాఖ 2024–25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టిందని, ఈ విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, 2026–27 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోను ఎన్సీఈఆర్టీ సిలబస్ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ సిలబస్‌కు అనుగుణంగా సైన్స్ సిలబస్ ఉంటుందని ఆమె వెల్లడించారు.ఇంటర్ తొలి ఏడాది పరీక్షల రద్దు ప్రతిపాదనదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించడం లేదని శుక్లా తెలిపారు. అత్యధిక రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డులు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు. ఈ కమ్రంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు, మూల్యాంకనంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి బోర్డు పరీక్షలు రద్దుచేసి, కళాశాలల అంతర్గత పరీక్షలుగా మార్చనున్నట్టు చెప్పారు. బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుందన్నారు. ఈ ప్రతిపాదనలపై సలహాలను ఈనెల 26వ తేదీలోగా ఆన్లైన్లో ఇంటర్ బోర్డుకు తెలియచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా మార్పులు చేస్తామని, ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులతో పాటు ప్రాక్టికల్స్ తప్పనిసరి చేస్తామన్నారు. పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ఒక్క మార్కు ప్రశ్నలను ప్రతిపాదించారని, 8 మార్కుల వ్యాసరూప ప్రశ్నల స్థానంలో 5 లేదా 6 మార్కుల ప్రశ్నలు ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, మొదటి సంవత్సరం పరీక్షల రద్దు అనేది ప్రతిపాదనలు మాత్రమే అని, ఇంకా రద్దు చేయలేదన్నారు.అన్ని గ్రూపుల్లోను థియరీ, ప్రాక్టికల్ మార్కులు సీబీఎస్ఈ విధానం ప్రకారం ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులకు థియరీ, ప్రాక్టికల్ మార్కులు తప్పనిసరి చేశారు. ఆర్ట్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులకు 500 మార్కులు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు, ఇందులో 80 మార్కులు థియరీకి, 20 మార్కులు ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు వర్క్‌కు కేటాయిస్తారు. ఎంపీసీ గ్రూప్‌లో 380 మార్కులు థియరీకి, 120 మార్కులు ప్రాక్టికల్స్.. మొత్తం 500 మార్కులు ఇస్తారు. బైపీసీ గ్రూప్‌లో 370 మార్కులు థియరీకి, 130 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఇస్తారు. అన్ని గ్రూపులకు ఐచ్చికంగా ఎంచుకునే ఆరో సబ్జెక్టుకు మార్కులు ఎన్ని అనేది ఇంకా నిర్ణయించలేదు.ప్రతి గ్రూప్‌లో ఐదు సబ్జెక్టుల విధానంప్రస్తుతం ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, నాలుగు మెయిన్‌సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, మూడు మెయిన్ సబ్జెక్టుల (మొత్తం ఐదు) విధానం అమల్లో ఉంది. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. దీంతో సైన్స్ గ్రూపుల విధానంపై దేశంలోని కొన్ని యూనివర్సిటీలు అభ్యంతరం పెడుతుండడంతో జేఈఈ, నీట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐదు సబ్జెక్టులు ప్రధానంగా.. ఆరో సబ్జెక్టు ఐచ్చికంగా ఎంపిక చేసుకునే విధానం రానుంది. ఈ క్రమంలో అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, నాలుగు మెయిన్ సబ్జెక్టులు (మొత్తం ఐదు), 500 మార్కుల విధానం ప్రతిపాదించారు. ఇందులో ఒక సబ్జెక్టు ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్పనిసరి. రెండో సబ్జెక్టు ‘ఎలక్టివ్’. ఇందులో ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఎంపీసీలో మ్యాథ్స్–ఏ, బీ పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘జువాలజీ’గా పరిగణిస్తారు. ఆర్ట్స్‌లో కోర్సులైన సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచ్చిన కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు. ఆరో సబ్జెక్టుగా (ఆప్షనల్ మాత్రమే.. తప్పనిసరి కాదు) ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి. -
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగింపు
-
విద్యుత్ సరఫరా లేక పరీక్ష వాయిదా
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్మిడియట్ ఫస్టియర్ సెమిస్టర్ పరీక్ష వాయిదా పడింది. ఆర్కే వ్యాలీ డైరెక్టర్ తెలిపిన వివరాల మేరకు.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గురువారం రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఆన్లైన్ విధానం ఉండడంతో.. ఇడుపులపాయలోని విద్యుత్ సరఫరా సమస్య వల్ల అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ ఉదయం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షను మధ్యాహా్ననికి వాయిదా వేశారు. చివరకు విద్యుత్ సిబ్బంది గురువారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వర్షం వల్ల డిస్క్‌లు కాలిపోవడం, బ్రేకర్‌లో బల్లులు పడడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యుత్ అధికారులు చెప్పారు. దీంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా లైను ట్రిప్ అయ్యిందన్నారు. వెంటనే డిస్‌్కలు మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వెంకట నాగేంద్ర చెప్పారు. -
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. నిందితులు ఎవరంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్‌కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. #BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV— News18 (@CNNnews18) December 22, 2024 11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులుఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
Year Ender 2024: లీకుల నామ సంవత్సరం
2024లో దేశంలో భారీ రిక్రూట్మెంట్లు జరిగాయి. అలాగే వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో పలు పేపర్ల లీకుల కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో జరుగుతున్న పరీక్షలపై లెక్కకుమించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసు 2024 ఫిబ్రవరిలో వెలుగు చూసింది. ఆ తర్వాత నీట్ యూజీ, సీయూఈటీ, బీహార్ సీహెచ్ఓ, ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షా పత్రాలు లీకయ్యాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024 ఫిబ్రవరిలో జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 18న పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లను రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని తేలింది. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు.సీఎస్ఐఆర్ ఎస్ఓ ఎఎస్‌ఓ రిక్రూట్మెంట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో 444 ఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులకు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష పేపర్‌ను లీక్ చేసిన ఉదంతంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, సాల్వర్ ముఠాలు పోలీసులకు చిక్కారు. వీరు ఎనీడెస్క్ యాప్ ద్వారా కాపీయింగ్‌కు సహకరించారని తేలింది.యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పేపర్ లీక్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024, ఫిబ్రవరి 11న ఆర్ఓ, ఏఆర్ఓ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి రావడంతో యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హర్యానాలోని మనేసర్, మధ్యప్రదేశ్‌లోని రేవాలో రిసార్ట్లు బుక్ చేశారు. అక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ నీట్ యూజీ పేపర్ లీక్ వార్త చాలాకాలం వార్తల్లో నిలిచింది. ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. నీట్ యూజీ పేపర్ లీక్ దరిమిలా 1,563 మంది అభ్యర్థులు లబ్ధిపొందినట్లు తేలింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నీట్ యూజీ నిర్వహణ అధికారులు రివైజ్డ్ రిజల్ట్‌లో టాపర్ల సంఖ్య 61 నుండి 17కి తగ్గించారు.యూజీసీ నెట్ పేపర్ లీక్ 2024 జూన్ 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షను విద్యా మంత్రిత్వ శాఖ జూన్ 19న రద్దు చేసింది. డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందని, టెలిగ్రామ్ ద్వారా అభ్యర్థులకు అందించారని తేలిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.జెఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పేపర్ లీక్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సీ) సీజీఎల్ పరీక్ష 2024 సెప్టెంబర్ 21,22 తేదీలలో జరిగింది. అభ్యర్థులు ఎస్ఎస్సీ సీజీఎల్ సర్కారీ రిజల్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇంతలో ఎస్ఎస్సీ సీజీఎల్ పేపర్ లీక్ అయినట్లు వెల్లడయ్యింది.రాజస్థాన్ ఎస్ఐ పరీక్ష రాజస్థాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ కేసులో 37 మందిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) విచారణలో దీని వెనుక రెండు ముఠాలు ఉన్నట్లు తేలింది . 859 పోస్టుల కోసం జరిగిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 7.97 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 2021 సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షా పత్రాల లీకుతో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌సీఎస్‌సీ) పనితీరుపై పలు అనుమానాలు తలెత్తాయి.ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఫలితాలు బీహార్‌లోని పట్నాలో గల పూర్నియా డిజిటల్ పరీక్షా కేంద్రంలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తేలింది. నకిలీ అభ్యర్థుల ద్వారా ఎస్ఎస్సీ ఎంటిఎస్ పరీక్షను రాయిస్తున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన నేపధ్యంలో పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి, ఏడుగురు ఉద్యోగులు, 14 మంది నకిలీ అభ్యర్థులతో పాటు 14 మంది అసలు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ బీహార్ సీహెచ్ఓ పరీక్ష 2024, డిసెంబరు 1, 2, 3 తేదీలలో జరగాల్సి ఉంది. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 37 మంది నిందితులను అరెస్టు చేశారు.పేపర్ లీక్‌లను నిరోధించడానికి రూపొందిన చట్టాన్ని 2024 జూన్ నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో పేపర్ లీక్ లాంటి అక్రమ చర్యలకు పాల్పడేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృత పేపర్ లీకేజీకి కోటి రూపాయల వరకూ జరిమానా విధించనున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
APలో మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు
-
మార్చి 15 నుంచి పది పరీక్షలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. టైమ్ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మెనేజ్‌మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించాలని.. ఈనెల ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 7న జరిగే పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో దీనిపై చర్చించాలని.. ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసినందుకు ప్రత్యేక సీసీఎల్ మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని.. అభ్యసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సెలవు రోజులను మినహాయించాలి.. పదో తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్లో సెలవు రోజులను మినహాయించాలని విద్యా శాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్–1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలని.. సగటు విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రతి సబ్జెక్టుకూ ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని కోరారు. -
Bihar: మరో ప్రశ్నాపత్రం లీక్.. సీహెచ్ఓ పరీక్ష రద్దు
పట్నా: బీహార్ రాష్ట్ర ఆరోగ్య కమిటీ డిసెంబర్ ఒకటిన నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) పరీక్ష రద్దయ్యింది. ఈరోజు (డిసెంబర్ 2)న జరగాల్సిన పరీక్ష కూడా రద్దయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పరీక్షల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తారు.సీహెచ్ఓ పరీక్ష పేపర్ లీక్‌కు కొన్ని ముఠాలు పాల్పడినట్లు పట్నా పోలీసులకు ఇన్పుట్ అందింది. వీటి ఆధారంగా పట్నా పోలీసులు ఆదివారం అర్థరాత్రి పలు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పట్నా పోలీసు బృందం ఆదివారం ఏకకాలంలో 12 ఆన్లైన్ కేంద్రాలపై దాడులు చేసింది. రామకృష్ణనగర్తో పాటు పలు కేంద్రాలకు చెందిన 12 మందిని ఈ బృందం అదుపులోకి తీసుకుంది. రెండు కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు.పోలీసులు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి నలుగురిని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ పరీక్షకు సంబంధించిన ఆడియో, వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్య కమిటీ ఎస్ఎస్పీకి లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో ఆదివారం పరీక్షకు ముందు నుంచే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. బీహార్‌లో గతంలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి.ఇది కూడా చదవండి: Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ.. -
తీరిగ్గా ‘మీడియం’ మార్పు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కారు ఒక్కొక్కటీ రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్‌ను, ఇంగ్లిష్ ప్రావీణ్య శిక్షణ టోఫెల్‌ను రద్దు చేసిన ప్రభుత్వం... తాజాగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు చేసింది.2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలో కూడా రాయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఇప్పుడు మీడియం మార్పు చేయడం వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే దాదాపు 4.20లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.మీడియం ఎంచుకుని.. నామినల్ రోల్స్ పంపిన తర్వాత ఇలా...ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన దాదాపు 4 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. నామినల్ రోల్స్ పంపించినప్పుడు ఎంచుకున్న మీడియంలోనే పరీక్షలు రాయాలి. ఫీజు చెల్లించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంనే ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ‘మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్’లో ‘తెలుగు’ మార్చుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించాలని అన్ని పాఠశాలల హెచ్ఎంలను బుధవారం విద్యాశాఖ ఆదేశించింది.గత ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దాదాపు 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన వారు ఈ విద్యా సంవత్సరం (2024–25) ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. దేశంలో సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 2.23 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు తెలుగు మీడియం పరీక్ష విధానం తెరపైకి తేవడంపై తల్లిండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులు కోరుకున్న ఇంగ్లిష్ మీడియం విద్యను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా దిగజార్చుతూ నిర్వీర్యం చేసే దిశగా ఈ సర్కారు చర్యలు ఉన్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో చూడాలని పేర్కొంది. అక్షరాస్యత కమిటీ ఏర్పాటుసాక్షి, అమరావతి: వయోజన విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర అక్షరాస్యత కేంద్రానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గాను, ఏపీ లిటరసీ మిషన్ అథారిటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, స్కిల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, ఐటీ సెల్ డైరెక్టర్‌తో పాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉంటారు.ట్రిపుల్ ఐటీలో 14న జాతీయ సదస్సునూజివీడు: జాతీయ మెటలర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఏలూరు జిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం తెలిపారు. జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. లోహ పదార్థాలు, వాటి ప్రాసెసింగ్‌లపై పరిశోధన చేసి, దేశానికి వెన్నుదన్నుగా నిలిచే శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ మెటలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు. -
జనవరి 1 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఈ ఏడాది టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్ క్యాలెండర్లో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్ రాసే అవకాశం కలి్పంచారు. తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్ మంగళవారం https:// schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెట్ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. పేపర్–2లో తక్కువ ఉత్తీర్ణత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్–1, బీఈడీ అర్హులు పేపర్–2తో పాటు పేపర్–1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్–1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు. పేపర్–2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్–2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రేపట్నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ నవంబర్ 20న చివరి తేదీ విధించింది. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. -
‘ప్రత్యేక’ విద్యార్థులకు పాస్‌మార్కులు 10
సాక్షి, అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది. 4 నుంచి ఎస్జీటీలకు శిక్షణ ఆంధ్రాస్ లెరి్నంగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్‌లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. -
విద్యార్థులకు శుభవార్త: ఆ సబ్జెక్టుల్లో 20 వస్తే పాస్
ముంబై: మహారాష్ట్రలో గణితం, సైన్స్ సబ్జెక్టులంటే భయపడే విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అపార కరుణ చూపింది. ఇకపై రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షల్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో 20 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. గతంలో ఈ సబ్జెక్టులలో పాస్ కావాలంటే 100కు 35 మార్కులు తప్పనిసరిగా రావాలనే నిబంధన ఉంది.ఇంత మంచి వార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా పాసయ్యేవారి విషయంలో మరో మెలికకూడా పెట్టింది. వారు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక వారి మార్క్‌షీట్‌లో ఇకపై సదరు విద్యార్థి మ్యాథ్స్, సైన్స్ చదవలేరని రాస్తారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ రాహుల్ రేఖావర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్పు పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆమోదించిన కొత్త పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లో ఒక భాగమని తెలిపారు.రాష్ట్రంలో కొత్త పాఠ్యాంశాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ శరద్ గోసావి తెలిపారు. హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ చదవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. ఇది కూడా చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే.. -
సాక్షి స్పెల్ బి పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన
-
ఆ పిల్లల ఆచూకీ కోసం 500 కెమెరాల్ని జల్లెడ పట్టిన పోలీసులు
పరీక్షల్లో తక్కువ మార్కులు.. తల్లిదండ్రులు తిడతారనే భయం. ఫలితం ఇద్దరు విద్యార్థులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. చివరికిఢిల్లీ నోయిడా సెక్టార్-56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ద్యాన్‌లు ఉత్తరాఖండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. అయితే గత వారం స్కూల్లో జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మార్క్‌లు తక్కువ వచ్చాయి.‘ఇటీవల జరిగిన పరీక్షల్లో మీ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ తల్లిదండ్రులతో సైన్ చేయించి.. రేపు ఉదయం స్కూల్‌కు రండి. మీ పేరెంట్స్‌ని వెంట తీసుకుని రండి. వారితో మాట్లాడాలి ’ అంటూ క్లాస్ టీచర్ ఆదేశాలతో ఇద్దరు విద్యార్ధులు బయపడిపోయారు. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులు తమని తిడతారేమోనని అటు స్కూల్.. దూరంగా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే పారిపోయారు.ఇదీ చదవండి : రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్స్కూల్ వెళ్లిన పిల్లలు సమయం మించిపోతున్నా.. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు పిల్లల కోసం గాలించారు. 500 సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా.. వారి ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఆచూకీ లభించింది. పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ ఇవ్వాళ (గురువారం) విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్షలుఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణడిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారమైతే.. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే..డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. -
పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్
సాక్షి, చెన్నై: తిరువారూర్ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె అదే జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ మన్నార్ కుడి కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది. మన్నార్‌కుడి ప్రభుత్వ ఎయిడెడ్ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు. 2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్పీఎస్సీ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది. 2023 గ్రూప్ –2 లో మెరిట్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్ బ్రాంచ్ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కారి్మకుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్ జిల్లా పరిధిలోని మన్నార్‌కుడి మునిసిపాలిటికీ పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది. సోమవారం సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా, పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె కమిషనర్‌గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించడం గమనార్హం. -
నీట్-పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
వైద్యవిద్యా పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు నీట్-పీజీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది.నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ‘నీట్-పీజీ పరీక్ష ఆగస్టు 11న (ఆదివారం) జరగనుంది. అయితే దీనిని వాయిదా వేయాలని కోరుతూ విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా... ఈ సమయంలో వాయిదా వేయాలని ఆదేశించలేమని పేర్కొంది. ‘ఇలాంటి పరీక్షలను మనం ఎలా వాయిదా వేయగలం? ఈ మధ్యకాలంలో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఇది పరిపూర్ణ ప్రపంచమేమి కాదు. మేము విద్యా నిపుణులం కాదు.రెండు లక్షల మంద విద్యార్థులు హాజరవుతారు. కొంతమంది అభ్యర్థులు వాయిదా వేయాలని కోరినందుకు దీనిని రీ షెడ్యూల్ చేయాలని అనుకోవడం లేదు. పరీక్షను వాయిదా వేయడం ద్వారా రెండు లక్షల విద్యార్ధులు, 4 లక్షల మంది తల్లిదండ్రులు ప్రభావితమవుతారు. ఈ పిటిషన్ల కారణంగా మేము విద్యార్ధుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేయలేం’ అని కోర్టు అభిప్రాయపడింది.కాగా నీట్ పీజీ పరీక్షలో ఇప్పటివరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. కానీ నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. తొలుత జూన్ 23న నిర్వహించాల్స ఉండగా తాజాగా ఆగస్టు 11న జరగనుంది. -
‘నీట్’ పరీక్ష రద్దు లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 23) తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుకాపీని చదివి వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.‘నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయి. పేపర్‌లీక్ వల్ల 155 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధిపొందారు. పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు. నీట్‌కు మళ్లీ పరీక్ష అక్కర్లేదు. నీట్‌పై అభ్యంతరాలను ఆగస్టు 24న వింటాం’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 14న వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) భావించినప్పటికీ.. ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్ 4నే ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది. నీట్-యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది. -
2018 నుంచి 16 పరీక్షలను వాయిదా వేసిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018లో ఎన్టీఏ ఏర్పాటు కాగా.. వివిధ కారణాల వల్ల 16 పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కొంది. అయితే పరీక్షలను వాయిదా వేయడానికి కోవిడ్ 19 మహమ్మారి,సాంకేతిక, రవాణా, పరిపాలనా పరమైన సమస్యలను కారణాలుగా తెలిపింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు. విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.‘2018లో ఎన్టీఏ ఏర్పాటయ్యింది. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 5.4 కోట్ల మందికి పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఏ నిర్వహించే చాలా పరీక్షలు అనేక సబ్జెక్టులు, బహుళ-షిఫ్ట్‌లు, ఎక్కువ రోజుల వ్యవధిలో జరుగుతాయి. కాబట్టి కరోనా, లాజిస్టికల్, సాంకేతిక సమస్యలు, పరిపాలనాపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందు చెప్పిన తేదీలు, సమయాలకు పరీక్షలు నిర్వహించలేకపోయింది.’ అని పేర్కొన్నారు.కరోనా కారణంగా జేఈఈ-మెయిన్ (2020), నీట్-యూజీ (2020), JEE-మెయిన్ (2021) నీట్-యూజీ(2021) పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన మరిన్ని పరీక్షలు.. CSIR UGC-NET (2020), UGC-NET (డిసెంబర్ 2020),UGC-NET (మే 2021)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) AIEEA (2020).. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (DUET) 2020, GNOU PhDకామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)-2021ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET)-2021 జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్)- 2021, GNOU PhD ఎంట్రన్స్ పరీక్షగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (GAT-B), 2023నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET), 2024, CSIR-NET, 2024 -
గ్రూప్–2 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయడానికి అంగీకరించింది. దీంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచేందుకు, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌లు నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఆయా అంశాలపై చర్చించిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు గ్రూప్–2 పరీక్షల వాయిదాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితోనూ ప్రభుత్వం మాట్లాడింది. చర్చల సందర్భంగా నిరుద్యోగుల డిమాండ్లను సానుకూలంగా సానుకూలంగా ఆలకించిన తర్వాత డిప్యూటీ సీఎం స్పందించారు. 3 నెలల్లో 54 వేల ఉద్యోగాలకు మోక్షం: భట్టి గ్రూప్–2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని భట్టి చెప్పారు. డిసెంబర్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించిందని అన్నారు. మరిన్ని ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ కేలండర్‌ను ప్రకటించే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని వెల్లడించారు.ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు ఇప్పటికే స్థిరపడేవన్నారు. ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది కానీ, ప్రజా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించదని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు స్థిరపడాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. కొందరు వారి స్వలాభం కోసం నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్ విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని భట్టి చెప్పారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అధునాతన టెక్నాలజీతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ పద్ధతిలో శిక్షణ ఇస్తామని, దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారని చెప్పారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వం: ఎంపీలు గ్రూప్–2 పరీక్షల పోస్టులను పెంచుతూ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తెలిపారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంతో సమావేశం తర్వాత మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. పరీక్షలకు సమయం ఇవ్వాలి: గ్రూప్–2 అభ్యర్థులు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని గ్రూప్–2 అభ్యర్థులు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ విజ్ఞప్తిని మన్నించారంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ పోస్టులను వీలైనంత వరకూ పెంచాలని, అలాగే పరీక్షలకు వీలైనంత సమయాన్ని ఇవ్వాలని విద్యార్థులు సుఖేష్ (సిద్దిపేట జిల్లా), నవీన్ (హుస్నాబాద్), మహేష్ (ఖమ్మం) కోరారు. డీఎస్సీ పరీక్షలు రాసేవారు కూడా చాలామంది గ్రూప్ పరీక్షలు రాస్తున్నారని, అందువల్ల కనీసం మూడు నెలలైనా పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ పరీక్షల కోసం రూ.5 భోజనం చేస్తూ సిద్ధమవుతున్నామని, ప్రభుత్వం నిరుద్యోగులపై కరుణ చూపించాలని కోరారు. -
తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48 వేల మంది కూడా వీరిలో ఉన్నారు.స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్ హైదరాబా ద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది.జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు. -
నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌పై కీలక ప్రకటన
సాక్షి న్యూ ఢిల్లీ : నీట్-పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వాయిదా పడ్డ నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ఆగస్ట్ 11న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రెండు షిప్ట్‌లలో ఆ పరీక్ష జరగనుంది. కటాఫ్ తేదీ, ఇతర వివరాల్ని ఆగస్ట్ 15న వెల్లడిస్తామని పేర్కొంది. ‘ఎన్బీఈఎంఎస్ 22-06-2024న వాయిదా వేసిన నీట్ పీజీ ఆగస్ట్ 11న నిర్వహిస్తున్నాం. రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్ష జరగనుంది’ అని విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో..ఇటీవల నీట్ యూజీ-2024 పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా తర్వలో జరగనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రం ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జరగనుంది. పరీక్షను ఎన్బీఈఎంఎస్ జరుపుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నీట్ పీజీ పరీక్ష నిమిత్తం అవసరమయ్యే టెక్నికల్ సపోర్ట్‌ను ఎన్‌బీఈఎంఎస్‌తో కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ అందించనుంది. -
నీట్ పై విజయ్ కీలక వ్యాఖ్యలు
-
జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు.అయితే, గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రతిరోజూ సీబీఆర్టీ విధానంలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.తొలిరోజు జూలై 18న స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్‌లో, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు, సెకండ్ షిఫ్ట్‌లో లాంగ్వేజీ పండిట్ (హిందీ) పోస్టులకు పరీక్ష జరగనుంది. -
ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జూన్ 26 తేదీ (బుధవారం) రాత్రి 8:00 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారని అధికారులు తెలిపారు. ఇక విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
నీట్ రీఎగ్జామ్: సగం మంది అభ్యర్థులు డుమ్మా
ఢిల్లీ: నీట్-యూజీ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలు దేశంలో దూమారం రూపుతున్నాయి. మరోవైపు.. గ్రేస్ మార్కులు మార్కులు సంపాధించిన 1563 మంది అభ్యర్థులకు ఆదివారం పరీక్ష నిర్వహించగా.. కేవలం 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు. 750 మంది పరీక్షకు హాజరు కాలేదు. చంఢిఘర్‌లో ఇద్దరు అభ్యర్థుల పరీక్ష అర్హత సాధించగా.. ఇద్దరూ పరీక్షకు హాజరుకాకపోవటం గమనార్హం.🔴 #JustIn | NEET-UG 2024 retest: Only 52% (813 out of 1563) students turned up for the retest today. pic.twitter.com/JZzsxmDh8c— NDTV (@ndtv) June 23, 2024నీట్ పరీక్షలో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నీట్ యూజీ -2024 రీటెస్ట్ నిర్వహించింది. ఈ నీట్ రీఎగ్జామ్‌లో కేవలం 52 శాతం మాత్రమే హాజరయ్యారు. రాష్ట్రాల వారిగా పరీక్షకు హాజరైన వారి సంఖ్య...చంఢీఘర్: ఇద్దరికి అర్హత.. ఇద్దరు గైర్హాజరుఛత్తీస్గఢ్: 602 మందికి అర్హత.. 311 మంది గైర్హాజరు. 291 మంది పరీక్ష రాశారు.గుజరాత్: ఒక్కరికి అర్హత( పరీక్ష రాశారు)హర్యానా: 494 మందికి అర్హత.. 207 మంది గైర్హాజరు. 287 మంది పరీక్ష రాశారు. మేఘాలయ: 464 మందికి అర్హత.. 230 మంది గైర్హాజరు. 234 మంది పరీక్ష రాశారు. మరోవైపు.. నీట్-యూజీ అక్రమాలపై దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగింది. కేసులో మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆదివారం సీబీఐ వెల్లడించింది. గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. నీట్ అవకతవకలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టారు. యూజీసీ-నెట్ పరీక్ష అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందంపై బిహార్‌లోని నవడా జిల్లా కాసియాదీ గ్రామంలో శనివారం సాయంత్రం దాడి జరిగింది. సీబీఐ అధికారుల వాహనాలపై స్థానికులు దాడికి దిగటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. -
నేటి నీట్–పీజీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్–పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఆఖరి నిమిషంలో వాయిదా వేసింది. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని, వీలైనంత త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. -
నీట్ పేపర్ లీక్ : కేంద్రం దిద్దుబాటు చర్యలు
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, కేంద్రం ఆదేశాలతో.. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్ష విధానంలో సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు , డేటా సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. రాధాకృష్ణన్‌తో పాటు కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదారబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామమూర్తి, ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎమిరిటస్,కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్,ఐఐటీ ఢిల్లీ డీన్ (విద్యార్ధి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.Ministry of Education constitutes a High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. Committee to make recommendations on Reform in the mechanism of the examination process, improvement in Data Security protocols and structure and… pic.twitter.com/TJ9NqqUJMi— ANI (@ANI) June 22, 2024 -
నీట్ పేపర్ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన బీహార్‌కు చెందిన నలుగురు నీట్ అభ్యర్ధులు అనురాగ్ యాదవ్,శివానందన్, అభిషేక్, ఆయుష్‌రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీష్, అమిత్ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ సికిందర్ యాదవేందులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ నిజమేనని, ఒక్కో నీట్ అభ్యర్ధి నుంచి రూ.40 లక్షలు, రూ. 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.తాజాగా, నీట్ ఎగ్జామ్ నిర్వహణకు 48 గంటల ముందే నీట్ పేపర్‌ను డార్క్ వెబ్, ఎన్‌క్రిప్ట్‌డ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌లో రూ.6 లక్షలకు అమ్మినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే పేపర్ లీకేజీతో విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షను రద్దు చేసిందని సీబీఐ అధికారులు పలు జాతీయ మీడియా సంస్థలకు చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం, నీట్ పేపర్ లీకేజీ మూలాలు ఇంకా గుర్తించలేదు. వాటిని గుర్తించేందుకు సీబీఐ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లు రంగంలోకి దిగాయి. -
నీట్ పరీక్షా ఫలితాలు.. కోర్టులో విద్యార్ధినికి చుక్కెదురు
ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్‌పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్‌తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు. ఎన్టీఏ ఓఎంఆర్ చించేసిందిఅంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్‌ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్‌ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు. నకిలీ పత్రాలు సమర్పించిఅయితే, కోర్టు ఆదేశాలతో ఎన్టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్‌ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్ ఉపసంహరణఎన్టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024ప్రియాంక గాంధీ సైతంఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. -
AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో జనరల్ ఫలితాలుఒక్క క్లిక్‌తో ఒకేషనల్ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. -
రేపు ఏపీ లాసెట్–2024
ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్– 2024 పరీక్షలను ఈ నెల 9న మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ లాసెట్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.ఏపీ లాసెట్‌కు 23,425 దరఖాస్తులు వచ్చాయన్నారు. పురుషులు 15,374 మంది, మహిళలు 8,051 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులు https://cets. apsche.ap.gov.in ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తేవాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను జూన్ 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. -
నేడు తెలంగాణ ఎడ్‌సెట్
నల్లగొండ రూరల్: రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకోసం గురువారం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్–2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్‌సెట్ కన్వినర్ ఆచార్య తాళ్ల మృణాళిని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. మొదటి సెషన్లో 16,929 మంది, రెండో సెషన్లో 16,950 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 79 పరీక్ష కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, విజయవాడ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://edcet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి సెషన్ పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకల్లా, రెండో సెషన్ పరీక్షకు హాజరయ్యేవారు మధ్యాహ్నం 12:30 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.ఉదయం పరీక్ష కేంద్రాలకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరని తెలియజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రెండోసారి ఎడ్‌సెట్ నిర్వహిస్తున్నట్లు ఎడ్‌సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్‌రెడ్డి తెలిపారు. -
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
-
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
-
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
-
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్) బుధవారం ప్రశాంతంగానే ముగిసింది. అయితే, మంగళవారం కురిసిన అకాల వర్షం కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పరీక్ష కేంద్రాల్లో అనేక చోట్ల విద్యుత్ లేకపోవడం, ఇంటర్నెట్ సదుపాయం గంటల తరబడి అందుబాటులోకి రాకపోవడంతో సెట్‌కు సమస్యలు తలెత్తాయి.హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు. కానీ తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అదనంగా జనరేటర్లను సిద్ధం చేశారు. నెట్వర్క్ సమస్యలను కొన్ని నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం మొదలైన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగానికి చెందిన సెట్ రెండో రోజు కూడా జరిగింది. ఈ రెండు రోజులకు కలిపి 1,00,254 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 90 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇంజనీరింగ్ సెట్‌కు పక్కా ఏర్పాట్లురాష్ట్రంలోని దాదాపు 175 కాలేజీల్లో ఉన్న 1.06 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జేఎన్టీయూహెచ్ నిర్వహించే సెట్ గురువారం మొదలవుతుంది. ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ నుంచి 2,54,532 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సగం మందికిపైగా విద్యార్థులు హైదరాబాద్ కేంద్రం నుంచే పరీక్ష రాస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో 4 జోన్లు ఏర్పాటు చేశారు. వర్షం, గాలి దుమారం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ జనరేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెట్వర్క్ సమస్య రాకుండా కూడా అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
ఈఏపీ సెట్ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ (టీఎస్ఈఏపీ సెట్) మంగళవారం మొదలైంది. తొలి రోజు జరిగిన పరీక్షకు 90.41 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకూ ఇంజనీరింగ్ సెట్ ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి మొత్తం 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగిన ఈ పరీక్షను ఉదయం, సాయంత్రం నిర్వహించారు. ఈ రెండు పూటలకు కలిపి 33,500 మంది హాజరవ్వాల్సి ఉంది. అయితే, 30,280 (90.41%) మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలిరోజు పరీక్ష జరిగిందని ఈఏపీ సెట్ కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన విధించినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగలేదని వెల్లడించారు. వేసవి తీవ్రను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్ బుధవారం కూడా జరుగుతుంది.ఫిజిక్స్ కాస్త టఫ్ఈఏపీ సెట్లో ఫిజిక్స్ విభాగం నుంచి కఠిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. సిలబస్ నుంచే ఇచ్చినప్పటికీ సమాధానాలు డొంక తిరుగుడుగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి నీలేష్ తెలిపారు. కఠినమైన ఫిజిక్స్ చాప్టర్స్ నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయడానికి ఎక్కువ సమయం పట్టిందని, కొన్ని లెక్కలు వేయడం వల్ల ఇతర సబ్జెక్టులకు సమయం సరిపోలేదని వరంగల్‌కు చెందిన ప్రజ్ఞ చెప్పారు. కెమిస్ట్రీ పేపర్ మధ్యస్థంగా ఉన్నట్టు ఎక్కువ మంది విద్యార్థులు తెలిపారు. ఆర్గానిక్, ఇనార్గన్ చాప్టర్ల నుంచి కొంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినా, ఇతర చాప్టర్లు తేలికగానే ఉన్నాయన్నారు. కాగా, మూలకాల విశ్లేషణపై పట్టున్న విద్యార్థులకు కెమిస్ట్రీ తేలికగానే ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు వినోద్ త్రిపాఠీ తెలిపారు. అయితే, ఆప్షన్స్‌లో సమాధానాలు ఒకదానితో ఒకటి పోలినట్టే ఉండటం వల్ల విద్యార్థులు సరైన ఆన్సర్ ఇవ్వడానికి కష్టపడాల్సి వచ్చిందని మరో రసాయన శాస్త్ర అధ్యాపకుడు బీరేందర్ వర్మ అభిప్రాయపడ్డారు. బాటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రిపేర్ అయిన ప్రశ్నలే వచ్చినట్టు మెజారిటీ విద్యార్థులు తెలిపారు. మొత్తం మీద జువాలజీ, బాటనీ సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని అధ్యాపకులు చెబుతున్నారు. గత ఐదేళ్ల ఎంసెట్ పేపర్లు ప్రిపరేషన్‌కు తీసుకుని ఉంటే ఎక్కువ మార్కులు సాధించే వీలుందని బాటనీ లెక్చరర్ శ్రుతి తెలిపారు. -
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్‌గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshi education.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వేగంగా ఫలితాలు చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం 👇 క్లిక్ చేయండిఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం ఉత్తీర్ణత2, 87, 261మంది పాసయ్యారుఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా టాప్, మేడ్చల్ జిల్లా సెకండ్సెకండ్ ఇయర్లో 64.61 శాతంసెకండ్ ఇయర్లో 3,22,432 మంది పాస్సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా టాప్ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలురేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్.. దరఖాస్తు చేస్కోవాలిమే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు -
గ్రూప్ 1 మైన్స్ సింగల్ బెంచ్ తీర్పు పై హై కోర్ట్ స్టే
-
పరీక్ష వేళ భవిష్యత్తు అంధకారం కావొద్దని..
కాటారం (ములుగు): ఓ విద్యార్థిని భవిష్యత్ అంధ కారం కావొద్దని ఆలోచించా రు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి తనకు దూరమైందనే విషయం తెలి యకూడదని.. చివరి పరీక్ష సజావుగా రాయాలని ఆకాంక్షించారు. సదరు విద్యార్థిని పరీక్ష రాసేలా కృషి చేశారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం జరి గిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రొంటాల రమాదేవికి, కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త కరోనా సమ యంలో మృతి చెందాడు. కూతురు సౌమ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. రమాదేవి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బుధవారం కొడుకును తీసుకుని ద్విచక్ర వాహ నంపై ములుగు ఆస్పత్రికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాదేవి మృతి చెందగా...కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయాన్ని సౌమ్య కుటుంబ సభ్యులు కళాశాలకు తెలియజేశారు. అయితే సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవి ష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో...ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా దాచారు. గురువారం పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందనే సంతోషంతో బయటకు రాగా..అమ్మ కాకుండా బంధువులు వచ్చారు. దీంతో అమ్మకేదో ఆపద వచ్చిందని భావించి ఇంటికి వెళ్లిన సౌమ్య తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. -
గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడగించినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు బుధవారం టీఎస్పీఎసస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 భర్తీకి అభ్యర్థుల దరఖాస్తు గడువు.. అధికారికంగా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు గడువు పెంచింది. మొత్తం 563 పోస్టులకు ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేయగా.. మార్చి 13వ తేదీ వరకు సుమారు 2.70 లక్షల మంది గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
‘నేను పేదవాడిని.. పాస్ చేయండి’.. సమాధాన పత్రంలో వింత అభ్యర్థనలు!
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షల జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు దిద్దుతున్నారు. ఈ సమాధాన పత్రాలలో పలువురు విద్యార్థులు తమకు తగినన్ని మార్కులు వేయాలని విన్నవించుకుంటున్నారు. ‘నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తారు’ అని రాసింది. ఒక విద్యార్థి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రశ్నలకు సమాధానాలు రాసే బదులు ప్రేమ లేఖ రాశాడు. జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని అధ్యాపకులు మీడియాకు తెలిపారు. ఫన్నీ కవితలు, పద్యాలు మొదలైనవి కూడా రాస్తున్నారు. ముఖ్యంగా గమనిక అంటూ పలు సందేశాలను రాస్తున్నారు. విద్యార్థులు తమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరీక్షా పత్రాలు దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకుడు మీడియాకు తెలిపారు. -
ఒత్తిడిని చిత్తు చేస్తే విజయం మీదే!
సరిపడా నిద్రా అవసరమే... విద్యార్థులు/పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కాగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్‌ను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంత మంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. రోజుకు కనీసం 6–7 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంక్‌ల కోసం పదే పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్ట్ మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి. – డాక్టర్ కె.వి.రావిురెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోను పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా అనంతరం అకడమిక్ కార్యకలాపాల్లోను మొబైల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్‌ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేదతీరడం కోసం పిల్లలకు సెల్ఫోన్లు ఇస్తుంటారు. అలా చేయద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక.. స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుని, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీని వల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది. – డాక్టర్ వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ టెలీమెడిసన్ కాల్ సెంటర్ మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసన్ కాల్ సెంటర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416/180089114416 నెంబర్లకు ఫోన్ చేసి కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ సుశిక్షితులైన కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్న వారు ఉచితంగా కాల్‌సెంటర్ సేవలు పొందవచ్చు. -
పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..!
'విద్యార్థులు వారి జీవితంలో ఎన్నో చిక్కులను ఎదుర్కుంటూ ఉంటారు. తమాషాగా చెప్పాలనుకుంటే.. వారి జీవితంలో పరీక్షలు కూడా ఒక పెద్ద చిక్కులాగా భావిస్తూంటారు. ఈ పరీక్షలు వారి జీవితాలను మలుపు తిప్పుతాయనీ.., వారి జీవిత పాఠాలను(చదువు) ఎంత నేర్చుకున్నారో వారికే గుర్తుచేస్తాయనే విషయం వారు గ్రహించకపోవడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. మరి ఇలాంటి పరీక్షలను రాయాలని మొదటగా కనుగొన్న వ్యక్తి ఎవరో తెలిస్తే.. 'అబ్బో' అంటూ నోరెళ్లబెట్టక తప్పదు. ఇక ఎవరో చూద్దాం..' స్కూల్లో చేరింది మొదలు పిల్లలకు రకరకాల పరీక్షలు తప్పవు. మొట్టమొదటి సారిగా ఈ పరీక్షల పద్ధతిని అమెరికాలో స్థిరపడ్డ జర్మన్ ప్రొఫెసర్ హెన్రీ ఫిషెల్ ప్రవేశపెట్టాడు. ఇండియానా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఈ ఘనకార్యానికి ఒడిగట్టాడు. ఇవి చదవండి: కార్టూన్ సిరీస్‌లతో జర జాగ్రత్త..! ఎందుకంటే? -
పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడుచోట్ల మాల్ ప్రాక్టీసింగ్ జరిగినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్‌ను ఎంపిక చేశారు. ప్రైవేటుపై ప్రత్యేక నిఘా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్ స్వా్కడ్స్ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. టెన్షన్... టెన్షన్... తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. -
ప్రశాంతంగా గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68–70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థుల్లో ఏపీపీఎస్సీ పట్ల నమ్మకం పెరిగింది. దీంతో ప్రస్తుత గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను కూడా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారన్న నమ్మకంతో అభ్యర్థులు సీరియస్‌గా పరీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పరీక్ష రాసినవారి సంఖ్య పెరిగింది. కాగా, గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.


