టీఎస్‌పీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పలువురు అభ్యర్థులు అరెస్ట్‌

OU NSUI Students Seize TSPSC Office To Postpone Group 2 exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-2 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. గ్రూప్‌-2 పరీక్షపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  అనంతరం, అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు, ఏడుగురు అభ్యర్థులతో టీఎస్‌పీఎస్సీ చర్చలు జరుపుతోంది.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్‌-2 అభ్యర్ధుతలు, ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్‌ టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాదిగా తరలి వచ్చిన గ్రూప్‌-2 అభ్యర్థులు ఆఫీస్‌ ముందు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్‌-2 వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని విద్యార్థులు ఆందోళనను ఉద్రితం చేయగా, రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాని టీఎస్‌పీఎస్సీ చెబుతోంది.

టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్‌​, టీజేఎస్‌ మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్‌, కాంగ్రెస్‌ నేతలు నిరనసలో పాల్గొన్నారు. అభ్యర్థుల స్గోగన్స్‌తో టీఎఎస్‌పీఎస్సీ పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  గురుకుల, గ్రూప్ 2, జేఎల్‌, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top