సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని స్నేహనగర్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ఉన్మాది సుత్తితో కొట్టి హత్యయత్నం చేశాడు. గత కొంతకాలంగా తనను దూరం పెడుతుందని అక్కసుతో దాడికి ఒడిగట్టాడు. ఇంట్లో దూరి సుత్తెతో పదేపదే కొట్టడంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ యువతి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు.. స్తంభానికి కట్టేసిన దేహశుద్ధి చేశారు.
బాలికపై లైంగిక దాడి
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మేజర్, మరొకరు మైనర్‌గా గుర్తించారు. మైనర్ నిందితుడిని జువైనల్ కోర్టుకు తరలించిన పోలీసులు.. ఒక నిందితుడిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


