నాగర్ కర్నూల్: అమ్రాబాద్ నల్లమల బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు పెద్ద ఎత్తున అడవి దగ్ధమైంది.శ్రీశైలం- హైదరాబాద్ దారి వెంబడి దాదాపు మూడు కిలోమీటర్లు పొడవున అడవి దగ్ధమైనట్లు సమాచారంచ మంటలు ఆర్పడటానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, నల్లమల అడవుల్లో గతంలో అనేకసార్లు కార్చిచ్చులు సంభవించాయి. ఇవి ఎక్కువగా వేసవి కాలంలో, మానవ చర్యల కారణంగా కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకున్నాయి.
2024, ఫిబ్రవరి నెలలో నల్లమల ప్రాంతంలోని నంద్యాల–గిద్దలూరు జాతీయ రహదారి వద్ద కార్చిచ్చు జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బాంబూ అడవికి నిప్పు పెట్టారు. అంతకుముందు కూడా అడవుల్లో వేసవి కాలంలో తరచుగా చిన్నపాటి అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇవి వన్యప్రాణులు, పర్యావరణం, స్థానిక జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పుగా పరిగణించాయి.

నివారణ చర్యలు
నల్లమల అడవుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అటవీ శాఖ స్థానిక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్థానిక గిరిజనులను "ఫైర్ వాచ్‌ర్స్"గా నియమించి, అగ్నిప్రమాదాలను గుర్తించడం, నియంత్రించడం కోసం శిక్షణ ఇస్తున్నారు.
నల్లమల అడవులు జీవవైవిధ్యానికి ప్రసిద్ధి గాంచింది. కానీ కార్చిచ్చులు పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి.. అడవుల్లో వేట, చెట్లను నరికడం, నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.


