పునరావాస కష్టాలు? | - | Sakshi
Sakshi News home page

పునరావాస కష్టాలు?

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

పునరా

పునరావాస కష్టాలు?

ప్రభుత్వం ఆదుకోవాలి.. నష్టపరిహారం ఇవ్వాలి.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం..

ప్రభుత్వ ఆదేశాలు

రావాల్సి ఉంది..

భూత్పూర్‌, నేరెడుగాం ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్ల ఏర్పాటు పట్టని ప్రభుత్వం

భూత్పూర్‌ రిజర్వాయ ర్‌లో గ్రామస్తులు సర్వ స్వం కోల్పోయారు. వ్యవ సాయ భూములకు మా త్రమే నామమాత్రపు పరిహారం అందింది. పునరావాసం కల్పించడంలో జాప్యం చేస్తున్నారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వతో గ్రామంలో ఊటనీరు వస్తోంది. ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకోవాలి.

– కుర్వ హన్మంతు,

మాజీ సర్పంచ్‌, భూత్పూర్‌

భూత్పూర్‌లో తేమశాతం అధికంగా ఉండటంతో ఇళ్లు పాడవుతున్నాయి. ఇళ్లల్లో నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ముంపునకు గురైన గ్రామంలో అధికారులు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి.

– ఆనంద శేఖర్‌, భూత్పూర్‌

సంగంబండ రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన మా గ్రామ సమస్యను ఏళ్ల తరబడి పరిష్కరించడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలు ఎవ రికీ పట్టడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి.

– ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ, నేరెడుగాం

నారాయణపేట జిల్లాలో భూత్పూర్‌, సంగంబండ రిజర్వాయర్లలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. 15 ఏళ్లుగా పునరావాసానికి నోచుకోక ముంపు గ్రామాల్లోనే భయంభయంగా కాలం వెల్లదీస్తున్నారు. సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్ల కట్టకు ఆనుకొని ఉన్న భూ త్పూర్‌, నేరెడుగాం గ్రామాలను సీపేజ్‌ కింద ఎంపిక చేశారు. అయితే నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అడుగు ముందుకు పడటంలేదు. ఫలితంగా ముంపు గ్రామాల్లో ఊటనీటితో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. మట్టి ఇళ్లు కూలిపోతుండటంతో నిర్వాసితులు భయాందోళన చెందుతున్నారు. తమకు పునరావాసం కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తు న్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సాగునీటి రిజర్వాయర్లలో సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

భూత్పూర్‌, సంగంబండ రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన నేరెడుగాం, భూత్పూర్‌ గ్రామాల ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ముంపు గ్రామాలను పరిశీలించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ పనులు మొదలుపెడతాం.

– రాజేందర్‌గౌడ్‌,

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

ముంపు గ్రామాల్లోనే

నిర్వాసితుల నివాసం

15 ఏళ్లుగా అవస్థల నడుమ జీవనం

పునరావాసం కల్పించాలని వేడుకోలు

రిజర్వాయర్ల నిర్మాణం కోసం వందలాది ఎకరాల భూమిని త్యాగం చేశారు. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి. కానీ వారికి ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ముంపు ప్రాంతాల్లోనే గడుపుతున్నారు. భూత్పూర్‌, సంగంబండ రిజర్వాయర్లలో సర్వం కోల్పోయిన నిర్వాసితులు దాదాపు దశాబ్దన్నరగా అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలంలో ఊటనీరు వచ్చి.. ఇళ్లు కూలిపోతున్నా.. బిక్కుబిక్కుమంటూ అక్కడే గడుపుతున్నారు. – మక్తల్‌

పునరావాస కష్టాలు? 1
1/4

పునరావాస కష్టాలు?

పునరావాస కష్టాలు? 2
2/4

పునరావాస కష్టాలు?

పునరావాస కష్టాలు? 3
3/4

పునరావాస కష్టాలు?

పునరావాస కష్టాలు? 4
4/4

పునరావాస కష్టాలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement