బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి
అమ్రాబాద్: ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డీటీఎఫ్ రాష్ట్ర కారదర్శి జక్క రామస్వామి కోరారు. బుధవారం అమ్రాబాద్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన డీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యారంగానికి అరకొర నిధులను కేటాయిస్తూ.. ప్రభుత్వ విద్యను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఆరోపించారు. తండాలు, గూడాల్లో వివిధ కారణాలతో పా ఠశాలలు మూసివేయడం తగదన్నారు. ప్రభు త్వం అన్ని పాఠశాలలను కొనసాగించాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చే శారు. సమావేశంలో నాయకులు ఎల్లయ్య, పాండు, భీమయ్య, విజయ్, రాజేశ్వరి ఉన్నారు.


