breaking news
Nagarkurnool District News
-
ఎక్కడా యూరియా కొరత లేదు..
పట్టా మార్పిడికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ పెద్దకొత్తపల్లి: వానాకాలం పంటసాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని.. ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో భవనంలో యూరియా నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మన గ్రోమర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని.. ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో 75 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎరువులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డుతో పాటు సాగుచేసిన పంటల వివరాలను నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులు మోతాదుకు మించి యూరియా వినియోగించొద్దని సూచించారు. డీఏఓ వెంట ఏఓ శిరీష, సహకార సంఘం ఇన్చార్జి రాములు తదితరులు ఉన్నారు. -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్‌తోపాటు ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్‌లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జా తీయ స్థాయిలో అమలుపరుస్తున్న సిలబస్‌ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపా టు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. ఎంపీపీఎస్ జక్నాలపల్లి, సూరాపూర్, కొత్తకుంటపల్లి, కొండ్రావుపల్లి, రాళ్లచెరువుతండా, పెంట్లవెల్లి బస్టాండ్ పాఠశాల, కొట్ర, తిప్పరెడ్డిపల్లి, ముకురాల, కోడేరు, జగ్‌బోయిన్‌పల్లి, దేశిటిక్యాల, నర్సింహాపురం, సింగవరం, ఐతోలు, కొత్త యాపటాల, బదిగదిన్నె, ముగ్దంపూర్, నార్లాపూర్, నర్సంపల్లి, చింతలోనిపల్లిలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు ఇలా.. జిల్లా పాఠశాలలు మహబూబ్‌నగర్ 25 జోగుళాంబ గద్వాల 18 నారాయణపేట 10 నాగర్‌కర్నూల్ 20 వనపర్తి 17 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు అడ్మిషన్లు తీసుకుంటాం.. మహబూబ్‌నగర్ జిల్లాలో 26 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక గదిలో ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభిస్తాం. ఇందుకోసం ఒక్కో పాఠశాలలో వసతుల కల్పన కోసం రూ.1.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ,మహబూబ్‌నగర్ -
బీజేపీలో రగడ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 నుంచీ కోల్డ్‌వార్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది. అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెతోపాటు శాంతికుమార్ టికెట్ ఆశించారు. బీజేపీని గెలిపించాలని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఆమె ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇక 2024 ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గు చూపగా.. ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్‌కు టికెట్ వచ్చినట్లే వచ్చి చివరలో చేజారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో జరిగిన పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు శాంతికుమార్ కుట్ర చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి పనిచేయకుండా రాజీనామా చేసిన వారిని ఆయన సమావేశానికి తీసుకొచ్చారని.. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. తాము ఎవరి వర్గం కాదని.. పార్టీకి రాజీనామా చేసిన వారు సమావేశానికి రావడంతో ప్రశ్నించినట్లు కొందరు చెబుతున్నారు. ఇదే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్, గద్వాలలో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో విసిగి ఇద్దరు, ముగ్గురు ముఖ్య నేతలు పార్టీని వీడారని ఆరోపిస్తున్నారు. పాలమూరులో బీజేపీ బలోపేతానికి శాంతికుమార్ ఎంతో కష్టపడ్డారని.. ఆయనకు రెండు సార్లు ఎంపీ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని.. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన సమక్షంలో జరిగిన ఈ ఘటనను ఖండించకపోవడం.. తన ప్రసంగంలో శాంతికుమార్ పేరును ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన ఎంపీ డీకే అరుణ, శాంతికుమార్ అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎదుటే బాహాబాహీకి దిగారు. శాంతికుమార్‌ను వేదికపై రాకుండా డీకే వర్గం యత్నించడంతోపాటు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా శాంతికుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన అనుచరులు నినదించారు. ఈ క్రమంలో పలువురు నాయకులు కలుగుజేసుకుని గొడవ సద్దుమణిగించారు. ఆ తర్వాత డీకే అరుణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఓడించేందుకు పనిచేశారని.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పరోక్షంగా శాంతికుమార్‌ను ప్రస్తావిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు. ఈ పరిణామాలతో శాంతికుమార్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అరుణ శాంతికుమార్ బీసీ సంఘాల ఆగ్రహం..బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్‌ను డీకే అరుణ అవమానించారని.. ఇది తగదంటూ పలు సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ మేధావుల సంఘం, మున్నూరు కాపు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. శ్రేణుల్లో భిన్న స్వరాలు.. గో బ్యాక్ నినాదాలు.. మాటల తూటాలు సీనియర్ల మండిపాటు.. పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత రాంచందర్‌రావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బహిరంగ సమావేశంలో రచ్చకెక్కడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆదిలోనే కట్టడి చేయాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని.. పార్టీ అధిష్టానం దృష్టిసారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరుతున్నారు. నేతల మధ్య రచ్చకెక్కిన అంతర్గత పోరు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలోనే బహిర్గతం చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ‘స్థానిక’ ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నాగర్‌కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. నేటి ప్రజావాణికి 50 దరఖాస్తులు వచ్చాయని.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 14 ఫిర్యాదులు నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని ప్రజలు నేరుగా కలిసి వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 8 భూతగాదా, 5 తగు న్యాయం చేయాలని, ఒకటి భార్యాభర్తల గొడవపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల మైదానాన్ని అప్పగించాలని ధర్నా కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల మైదానాన్ని తిరిగి కళాశాలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో శ్రీపురం రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యురాలు సౌమ్య మాట్లాడుతూ.. కళాశాల మైదానాన్ని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూమిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి కళాశాలకే చెందే విధంగా చూడాలని కోరారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కాగా, గంటపాటు జరిగిన ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ గోవర్ధన్ అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘం నాయకులకు నచ్చజెప్పారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు, జిల్లా కన్వీనర్ శివశంకర్, సోషల్ మీడియా కన్వీనర్ ప్రసాద్‌కుమార్, కళాశాల అధ్యక్షుడు శివ, లావణ్య, పల్లవి, బిందు, కృష్ణవేణి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు. కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశానికి అవకాశం కందనూలు: జిల్లాలోని 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో సీట్ల ఖాళీలు ఉన్నాయని.. ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 30వ తేదీలోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కేజీబీవీల ప్రత్యేకాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
న్యాయం చేయాలి..
మాకు సర్వే నంబర్ 85/7లో మూడెకరాల లావుణి పట్టా భూమి ఉంది. భూమిని అక్రమంగా మరొకరు పట్టా చేసుకున్నారు. ఇప్పుడు భూమి మాదేనని అంటున్నారు. మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. – సురవేణి భాగ్యమ్మ, కోనేటిపూర్, వంగూరు మండలం ఫైళ్లు లేవు.. కోనేటిపురంలో అసైన్డ్ ల్యాండ్‌పై కొత్త పట్టాపాసుపుస్తకాలు పొందినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై ఎలాంటి సమాచారం, ఫైళ్లు అందుబాటులో లేవు. ఉన్నతాధికారులకు నివేదించాం. దీనిపై విచారణ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – మురళీకృష్ణ, తహసీల్దార్, వంగూరు మండలం ● -
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
కందనూలు: జిల్లాలో గ్రామ పాలనాధికారి, లైసెన్సుడు సర్వేయర్ల ఎంపిక రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగిందని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జీపీఓ పరీక్ష కోసం మొత్తం 66 మంది అభ్యర్థులకు గాను 55 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరయ్యారు. జీపీఓ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. అలాగే లైసెన్స్డు సర్వేయర్ పరీక్ష కోసం 235 మంది అభ్యర్థులకు గాను 190 మంది హాజరు కాగా 45 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు నిర్వహించారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు సాగునీరు అందిస్తాం వెల్దండ: కేఎల్ఐ కాల్వ ద్వారా త్వరలోనే రైతులకు సాగునీరు అందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండాల వద్ద కేఎల్ఐ కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్ఐ కాల్వలో పెరిగిన చెట్లను తొలగించాలన్నారు. ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కొల్లాపూర్ వద్ద సాగునీరు విడుదల చేశామని, త్వరలోనే వెల్దండ మండలానికి సాగునీరు వస్తుందన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వెల్దండ నుంచి సిర్సనగండ్ల వరకు నిర్మిస్తున్న రెండు వరుసల రోడ్డు విస్తరణపై గుండాల ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గుండాల వద్ద మూల మలుపులు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కాబట్టి గుండాల వద్ద కేఎల్ఐ కాల్వ సమీపం నుంచి బైరాపూర్ వెళ్లే దారిలో మూలమలుపులు లేకుండా బీటీరోడ్డు నిర్మించేలా చూడాలని, ఇలా చేయడం వల్ల ఆలయానికి కూడా మంచి జరుగుతుందని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఆర్అండ్బీ అధికారులతో సర్వే చేయించి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, పర్వత్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, రామకృష్ణ, కృష్ణారెడ్డి, అలీ, రషీద్, ఆలయ కమిటీ వైస్ చైర్మెన్ అరుణ్‌నాయక్, డైరెక్టర్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కందనూలు: షాద్‌నగర్‌లోని నూర్ కళాశాలలో ఉన్న నాగర్‌కర్నూల్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శైలజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్, బీకాం, బీఏ గ్రూపులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31లోగా అడ్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. పూర్తి వివరాలకు సెల్ నం.83746 31969ను సంప్రదించాలని సూచించారు. -
కార్మికులకు ‘సఫాయి సురక్ష’
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో పోగయ్యే చెత్తను ప్రతిరోజు సేకరించి.. మురుగు కాల్వలో పేరుకుపోయే మురుగు తొలగిస్తూ.. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు.. వారు మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి అటు ఆరోగ్యం.. ఇటు సంక్షేమం రెండింటిని వారికి అందించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి సురక్ష పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య వివరాలను అందజేయాలని ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వాటిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట)ల్లో 212 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పూర్తి వివరాలను శానిటేషన్ విభాగంలో పనిచేసే అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. పూర్తి వివరాలు సేకరించాక కార్మికులకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సఫాయి సురక్ష అమలుకు కార్మికుల ఆరోగ్య వివరాలను వారి వద్ద నిక్షిప్తం చేసి ఉంచనున్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా వర్తింపజేసేలా శానిటేషన్ విభాగం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారు. గతంలో కొన్ని మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన ఏజెన్సీలు ఇచ్చేవి. అయితే ఆయా ఏజెన్సీలు వారికి అందజేసే జీతంలోనే పీఎఫ్, ఈఎస్ఐ కట్ చేసి మిగతా సొమ్మును కార్మికులకు సంబంధించిన అకౌంట్లలో జమ చేసేవారు. వారంతా ఈ పక్రియను సక్రమంగా నిర్వర్తించారా.. లేదా.. అన్న విషయాలను సైతం మున్సిపల్ అధికారులు ఆరా తీసి వాటిని సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అవగాహన కల్పిస్తాం.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న కార్మికులకు సఫాయి సురక్ష పథకాన్ని అమలు చేసేందుకు వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. వారి ఆరోగ్య వివరాలతోపాటు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కార్మికులు అందరికీ ఆరోగ్య పరిరక్షణ కిట్లను అందజేస్తాం. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి ఆరోగ్య పరిరక్షణ కిట్లు.. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఏటా ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరిరక్షణ కిట్లను అందజేసేవారు. అదే మాదిరిగా సఫాయి సురక్ష పథకం ద్వారా కూడా కార్మికులందరికీ కచ్చితంగా ఆరోగ్య పరిరక్షణ కిట్లలో ఉండే చేతికి గ్లౌజులు, కాళ్లకు పొడవాటి బూట్లు, తలకు రక్షణ హెల్మెట్లను పంపిణీ చేయనున్నారు. కొంతకాలంగా వీటిని సక్రమంగా అందించకపోవడంతో కార్మికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. వైద్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించి చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అక్కడే మందులను ఇస్తారు. ఏదైనా వ్యాధి ఉన్నట్లు తేలితే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించనున్నారు. మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య సిబ్బంది కోసం ప్రత్యేక పథకం స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా అమలుకు చర్యలు కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిస్థితులపై వివరాల సేకరణ మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్న అధికారులు -
కందనూలులో కలకలం
ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత ● కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక ● గడువుతీరిన పాలు,పెరుగు వల్లే ఘటన ● ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం ● జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్ నిర్వహణ?సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, అందుకే రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 98 జీఓ భూ నిర్వాసితుల గురించి ఎప్పుడైనా ఆరోచించారా అని ప్రశ్నించారు. కొడంగల్‌లో కొబ్బరికాయ కొట్టడం తప్ప పనులే కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమైందో సీఎం చెప్పాలన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను గ్రామ గ్రామాన ఎగురవేయాలని, ఇందుకోసం కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని చెప్పారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మోదీ ఇవ్వడం లేదని ఎందుకు చెప్పాలన్నారు. మోదీ ఇచ్చేది ఉంటే నువ్వెందుకు హామీ ఇవ్వాలని అన్నారు. ముందు తెలంగాణ క్యాబినెట్లో 42 శాతం మంత్రులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాములు మాట్లాడుతూ కార్యకర్తలు ఎంత పనిచేస్తే పార్టీ అంత ఎదుగుతుందని, ప్రతి కార్యకర్త గ్రామాల్లో నాయకుడిగా ఎదగాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎల్లేని సుధాకర్‌రావు, దిలీపాచారి, భరత్‌ప్రసాద్, మంగ్యానాయక్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ పాయిజన్‌పై విచారణ జరిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతున్నాయో వవిచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. సీఎం సొంత జిల్లాలోనే విద్యార్థులకు అన్నం పెట్టలేకపోతున్నారని ఆరోపించారు. పాలమూరుకు రూ.లక్ష కోట్లు, కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన సీఎం హామీ ఏమైందో చెప్పాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత గ్రామానికి నాలుగు లైన రోడ్డు వేసుకున్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
భయంతో ఇంటిదారి..
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్‌తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొంతమంది తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. చాలామంది విద్యార్థులు భయాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. -
గతంలో జరిగిన సంఘటనలు గుర్తులేవా?
నాగర్‌కర్నూల్ క్రైం: ‘శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాల్లో ఎన్ని సంఘటనలు జరిగాయో ఆత్మవిమర్శ చేసుకోవడంతోపాటు విద్యార్థులను కేసీఆర్ ఎన్నిసార్లు పరామర్శించారో హరీశ్‌రావు సమాధానం చెప్పాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాల్లో వేలాది మంది అస్వస్థతతకు గురయ్యారని, 160 మంది మృతిచెందారని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలోనే గురుకులాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని మాట్లాడటం హరీశ్‌రావు స్థాయికి తగదన్నారు. అంతకు ముందు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
వసతులపై ప్రత్యేక శ్రద్ధ
కందనూలు: విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపా ధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం గురుకు ల పాఠశాలను సందర్శించిన ఆయన అస్వస్థతతకు గురైన విద్యార్థుల వివరాలను తెలుసుకొని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. విద్యార్థులకు ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. విద్యార్థులకు మెరు గైన వసతులు, నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ అమరేందర్, బీసీ గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జిల్లా ఇన్చార్జ్ ప్రశాంతి, తదితరులున్నారు. -
పెరుగు బాలేదు..
మాకు శనివారం సాయంత్రం క్యాబేజీ పకోడి, ఆలుగడ్డ కూర, అన్నం, సాంబారు, పెరుగు పెట్టారు. పెరుగు తినేటప్పుడు ఇబ్బంది పడ్డాం. మేము తిన్న తర్వాత రాత్రి 11.30 గంటలకు కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో 12 గంటలకు మా మేడం వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. – అక్షయ, ఇంటర్ మొదటి సంవత్సరం అన్నం ఉడకలే.. పాఠశాలలో మాకు అందించే భోజనం సరిగా ఉండదు. అన్నం, కూరలు సరిగ్గా ఉడకవు. అన్నం బియ్యం మాదిరిగా ఉంటుంది. శనివారం సాయంత్రం క్యాబేజీ పకోడి తిన్నాం. అది కూడా సరిగా ఉడకలేదు. పెరుగు పుల్లగా ఉండటంతో దాని తినడం వలన వాంతులు, కడుపులో నొప్పి వచ్చింది. – మానస, 6వ తరగతి ఎవరిది బాధ్యత.. పిల్లలకు వాంతులు, విరేచనాలు అయితే మా కు ఉదయం వరకు సమాచారం ఇవ్వలేదు. మే ము సామాజిక మా ధ్యమాల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. మా పిల్లలకు ఏమ న్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇక్క డి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – మధు, బుద్దారం, వనపర్తి జిల్లా చర్యలు తీసుకోవాలి.. గురుకుల పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఇంతకు మునుపు కూడా ఈ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇది ముమ్మాటికి ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, అచ్చంపేట ● -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో చోరీలు, ఇతర నేరాల నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాలను ప్రతిఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెంట్లవెల్లి మండలాలకు సంబంధించిన బంగారు, ఫైనాన్స్ వ్యాపారులు, బ్యాంకు మేనేజర్లకు సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకూ చోరీలు పెరిగిపోతున్నాయని, ప్రతిఒక్క షాపు, ఫైనాన్స్ ఆఫీసులు, బ్యాంకులకు 360 డిగ్రీలు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఎన్వీఆర్తోపాటు క్లౌడ్‌లోనూ రికార్డు అయ్యే విధంగా చూసుకోవాలని, సీసీ కెమెరాలకు అలారం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నేరాలనైనా ఆపగలిగే శక్తి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటప్పుడు ముందు భాగంలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా కవరయ్యే విధంగా రెండు కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎక్కడైనా చోరీలు జరిగినప్పుడు నేర పరిశోధనకు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో చోరీలను నియంత్రించేందుకు ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలతో ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ -
ఆగడాలకు అడ్డుకట్ట పడేనా?
జనరల్ ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ వాహనదారుల ఇష్టారాజ్యం ●● అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే రూ.వేలు చెల్లించాల్సిందే ● సిండికేట్‌గా మారి నిలువుదోపిడీకి యత్నం ● అప్‌గ్రేడ్ అయినా అందుబాటులోకి రాని ఉచిత అంబులెన్స్ సేవలు ఉచిత సేవలు కల్పిస్తాం.. జనరల్ ఆస్పత్రి నుంచి అత్యవసర సమయంలో రెఫర్ అయ్యే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తాం. అలాగే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకుని రోగులను తరలిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – ఉషారాణి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వాటిని సీజ్ చేస్తాం.. జిల్లాలోని ప్రైవేటు అంబులెన్సులకు సరైన పత్రాలు లేకపోవడంతోపాటు ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే సీజ్ చేస్తాం. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాలోని ప్రైవేటు అంబులెన్స్‌లను తనిఖీ చేస్తాం. మోటారు వాహన నిబంధనలను పాటించని అంబులెన్సులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – చిన్న బాలు, జిల్లా రవాణా శాఖాధికారి నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా జనరల్ ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు, రోడ్డు ప్రమాద బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బాధితుల నుంచి రూ.వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఆస్పత్రిగా, మెడికల్ కళాశాల రాకతో జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయినా ఉచిత అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఒకే ఉచిత అంబులెన్స్ ఉండటంతో అందరికీ సేవలు అందలేకపోతున్నాయి. సిండికేటుగా మారి.. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుంచి జనరల్ ఆస్పత్రికి ప్రతిరోజు 800 మంది వరకు వస్తుంటారు. అయితే రోడ్డు ప్రమాద బాధితులను మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తుండటంతో ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు సిండికేటుగా మారి బాధితుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌ల సిండికేట్‌లో భాగంగా ప్రతిరోజు కొన్నింటికి మాత్రమే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా తమను ఆశ్రయిస్తే వారు నిర్ణయించిన రేటుకే వెళ్లాలి.. లేదంటే మరో అంబులెన్స్ రాదు. ఈ క్రమంలోనే ప్రైవేటు అంబులెన్సులో మహబూబ్‌నగర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే రూ.4 వేలు, హైదరాబాద్‌కు అయితే రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. కాగా.. ఎవరైనా చికిత్సకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతిచెందితే అదనంగా మరో రూ.4 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఔట్సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది.. జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు అంబులెన్సులను ఏర్పాటు చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో రెఫర్ చేసే వారిని తమ అంబులెన్స్‌లలో తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. దీంతోపాటు చాలారోజులుగా అంబులెన్స్‌ల దందాపై అధికారులకు సమాచారం ఉన్నా వివిధ వర్గాల ఒత్తిళ్లతో అటువైపు చూడటం లేదు. నిబంధనలు పాటించట్లే.. ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులు, రోగుల కుటుంబ సభ్యులతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ప్రైవేటు అంబులెన్సుల యజమానులు మోటారు వాహన చట్టాల నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్షతగాత్రులను తరలించే క్రమంలో అంబులెన్సులను ఎవరు ఆపరనే ఆలోచనతో సరైన పత్రాలు లేకపోవడంతోపాటు ఫిట్నెస్ పరీక్షలు చేయించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లా రవాణా శాఖ అధికారులు వీటిపై దృష్టిసారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.దోపిడీని అరికట్టాలి.. జనరల్ ఆస్పత్రిలో ప్రైవేటు అంబులెన్స్‌లు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అత్యవసర పరిస్థితిలో ఉన్నవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మృతిచెందిన వారి మృతదేహాలను సమీప గ్రామాలకు తీసుకువెళ్లాలన్నా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉచిత అంబులెన్సు సేవలు ప్రారంభించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. – నజీర్, నాగర్‌కర్నూల్ -
పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం
నాగర్‌కర్నూల్: కంప్యూటర్ ఆధారిత విద్యకు రాన్రాను ప్రాధాన్యత పెరగుతుండటంతో విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రణాళికలను సైతం రూపొందించింది. దీంతో ఈ సంవత్సరం నుంచే విద్యా బోధన కొత్త పుంతలు తొక్కనుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు సదుపాయం ఉన్న పాఠశాలలకు ఇప్పటి వరకు ఈ వెసులుబాటు లేకపోవడం వల్ల కొన్నిచోట్ల ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ వేగం సరిపోకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వినియోగించవద్దన్న నిబంధనలను సైతం విధించడంతో కంప్యూటర్ విద్యకు మరింత ఆటంకంగా మారనున్నాయి. ఈ నేథప్యంలో బీఎస్ఎన్ఎల్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీతోపాటు ఇతర అంశాల్లో అధిక ప్రాధాన్యత ఉండనుండటంతో ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి విడతలో.. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీవీబీలు, మోడల్ స్కూళ్లు కలిపి 841 ఉండగా.. వీటిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు ద్వారా విద్యార్థులకు డిజిట్ పాఠాలు బోధించాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. అయితే మొదటి విడతలో 199 ఉన్నత పాఠశాలలకు మాత్రం ఈ ఏడాది నుంచి ఈ సేవలు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసి పంపగా.. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత విడతల వారిగా మిగతా పాఠశాలలకు సైతం ఈ సేవలను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సదుపాయాలతో విద్యార్థులకు సంబంధించిన డిజిటల్ బోధన మెరుగుపడనుంది. రానున్న పోటీ ప్రపంచంలో ప్రైవేటు విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలంటే ఈ సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది 199 స్కూళ్లలో ఏర్పాటుకు నిర్ణయం విడతల వారిగా అన్ని బడుల్లో అమలుకు చర్యలు జిల్లాలో డిజిటల్ బోధనకు లభించనున్న ఊతం చాలా ఉపయోగం.. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించడం వల్ల విద్యార్థులకు డిజిటల్ బోధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి విడతలో 199 పాఠశాలల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. విడతల వారిగా మిగతా పాఠశాలలకు కూడా ఈ సేవలు అందనున్నాయి. – రమేష్‌కుమార్, డీఈఓ -
నేడు డయల్ యువర్ డీఎం
నాగర్‌కర్నూల్ క్రైం: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రయాణికులు, ప్రజలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సెల్ నం.73824 46772కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి నాగర్‌కర్నూల్: మున్సిపాలిటీలోని దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్స్ కోసం రూ.1,93,125 చెల్లించిన ప్రగతి హాస్పిటల్ వారికి మున్సిపల్ సిబ్బంది ట్రైడ్ లైసెన్స్ ధ్రువపత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని దుకాణ యజమానులు ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శివశంకర్, వార్డు ఆఫీసర్ సాయిరాం, సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు. తపాలా బీమాపై అవగాహన కల్పించాలి వెల్దండ: తపాలా శాఖ ద్వారా అందిస్తున్న జీవిత, ప్రమాద బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి డివిజన తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శుక్రవారం ఆయన వెల్దండ పోస్టాఫీస్‌ను పరిశీలించి మాట్లాడారు. తపాలా బీమాతో ఖాతాదారుల కుటుంబాలకు ధీమా కల్పిస్తుందన్నారు. పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువగా లాభం వచ్చేవి కేవలం తపాలా శాఖలోనే ఉన్నాయన్నారు. పోస్టాఫీసుల్లో వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే పొదుపు, రికరింగ్ డిపాజిట్లు, ఆడపిల్లలకు సుకన్య యోజన పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. 8 ప్రైవేట్ కంపెనీలతో కలిసి తక్కువ ప్రీమియం చెల్లించి పెద్ద మొత్తంలో బీమా పొందే పథకాలను పోస్టాఫీసు ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీపీఎం వెంకటేశ్వర్లు, సిబ్బంది రతన్‌నాయక్, రాజేందర్‌రెడ్డి, పుష్పగిరి, శ్రీనునాయక్, సత్యం, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
● పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు ● రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ ● ప్రిన్సిపల్, అకౌంటెంట్ జనరల్, కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ ● పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సమస్యలపై వర్క్‌షాప్ విజయవంతం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్‌ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్‌లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్‌లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. ఉద్యోగ బాధ్యతలతోపాటు ఆర్థిక నిర్వహణ కూడా ఇది ముఖ్యమన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ పత్రాలు, జీపీఎఫ్ ఫైనల్ పత్రాలు సత్వరమే ఏజీకి పంపించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సమస్యలను అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా.. పెన్షన్ అదాలత్‌లో 116 ప్రభుత్వ శాఖల అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు, పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్‌లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు. 10 పెండింగ్ పెన్షన్ కేసులను పరిష్కరించారు. ఉదయం పెన్షన్ అదాలత్ తర్వాత మధ్యాహ్నం పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత సమస్యలపై నిర్వహించిన వర్క్‌షాప్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పెన్షన్ మంజూరు అధికారులు, పెన్షన్ జారీ, పంపిణీ అధికారులకు మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు. అకౌంట్ సంబంధిత సమస్యలు చేసే తప్పుల గురించి వివరించారు. సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్– వీఎల్సీ) నరేష్కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్ టైటిల్మెంట్స్) అభయ్ అనిల్ సోనార్కర్, వనపర్తి, గద్వాల అదనపు కలెక్టర్లు యాదయ్య, నర్సింగ్‌రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి విజయవంతం సదస్సుకు డీఎం యాదయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, విద్యార్థులు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో వివరించారు. పలు పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభచాటిన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారన్నారు. 200 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రూ.6,680 కోట్లు చెల్లించిందని వివరించారు. వంటింటికే పరిమితమైన మహిళలు ఈ పథకం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లి చిరు వ్యాపారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులు చేసేందుకు పెట్రోల్ బంకుల నిర్వహణతోపాటు బస్సులను కొనుగోలు చేసేందుకు రుణాలు సైతం మంజూరు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బలోపేతం కావడంతోపాటు మహిళలు కూడా ఆర్థికంగా ప్రయోజకులుగా మారుతున్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్ పట్టణం, మండలం, తెలకపల్లి మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. -
నేటినుంచి బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
పాలమూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రామచందర్‌రావు నియామకం అయిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో నియోజకవర్గాల్లో పర్యటించి జిల్లాస్థాయి నేతలతో పాటు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఉమ్మడి జిల్లాకు వస్తున్న క్రమంలో ఆయా జిల్లాలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట రామచందర్‌రావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్చర్లకు చేరుకుంటారు. అక్కడ పాలమూరు బీజేపీ శాఖ, బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతారు. తర్వాత మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో అన్నపూర్ణ గార్డెన్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మరికల్, నారాయణపేటకు వెళ్లి.. వివిధ వర్గాల నాయకులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి గద్వాల జిల్లాకేంద్రానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రెస్‌మీట్, ఆ తర్వాత మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం నిర్వహించి.. 10 గంటలకు పెబ్బేరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రాల్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పాటుకార్యక్రమాలు భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు -
విద్యార్థులకు నాణ్యమెన విద్య అందించాలి
చారకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిచాలని డీఈఓ రమేష్కూమార్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక జెడ్పీహెచ్ఎస్, సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, విద్యార్థుల రిజిష్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. విద్యా ప్రమాణాలపై తరగతి గదిలో పరీక్షించారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించి చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పారు. విద్యాభ్యాసంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. మెనూ ప్రకారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలే భవిష్యత్‌కు దిక్సూచిగా నిలబడాలని, అందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతోపాటు, మెరుగైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ నర్సింహ, ఎంఈఓ ఝాన్సీరాణి, కాంప్లెక్స్ హెచ్ఎం భగవాన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సివిల్ సప్లయ్ గోదాంలో అధికారుల తనిఖీలు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో పలువురు అధికారులు గోదాంలోని స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్‌లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు రేషన్‌డీలర్లు, వసతిగృహ ఇన్చార్జీలు, ఐసీడీఎస్ అధికారులకు ఫోన్లు చేసి స్టాక్ తీసుకున్నారా? లేదా..? అనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వర్షాకాలం సంభవించే ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా రేషన్ బియ్యం పంపిణీపై ప్రభుత్వం నిఘాను ఏర్పాటు చేసి, రాష్ట్ర, జిల్లా అధికారులను సమాయత్తం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు నెలలకు సంబంధించి అన్ని రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ పండరి, ఎస్ఐ సాంబశివరావు, గోదాం ఇన్చార్జీ మోతిలాల్ పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట పరిశీలన
బిజినేపల్లి: మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన రైతులు మామిళ్ల శ్రీను, భీమయ్య సాగు చేసిన మొక్కజొన్న పంట ఎండిపోవడంతో పాలెం శాస్త్రవేత్తలు గురువారం సాయంత్రం పరిశీలించారు. కొద్ది రోజుల కింద గడ్డి మందు పిచికారీ చేస్తే మొక్కజొన్న పంట ఎండిపోయిందని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు పంటను క్షేత్రస్థాయిలో సందర్శించి శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. గురువారం శాస్త్రవేత్తలు శశిభూషణ్, చరణ్‌తేజ్ ఎండిన పంటను పరిశీలించి, మొక్కల నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్‌లో పరీక్షించి నివేదిక అందజేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ కమల్‌కుమార్, ఏఈఓ భార్గవ్ ఉన్నారు. నేడు పెన్షన్ అదాలత్ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పెన్షనర్లు, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత పెండింగ్ సమస్యలపై శుక్రవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెన్షన్ అదాలత్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ జిల్లా స్థాయిలో పెన్షన్ కమిటీల ద్వారా పెండింగ్ పెన్షన్ కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా కలెక్టర్ల సమన్వయంతో పెన్షన్ అదాలత్, వర్కర్షాప్ నిర్వహించాలని ఆదేశించారన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సంబంధించి దీర్ఘకాలిక పెన్షన్ కేసుల పరిష్కారంపై ఈ వర్క్‌షాప్ కొనసాగుతుందన్నారు. అలాగే పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, పీపీఓ, పీజీఎఫ్ అధికారాలు కూడా పంపిణీ చేస్తారన్నారు. చైల్డ్ లేబర్ యాక్ట్ కేసులపై డీఎస్పీ విచారణ బిజినేపల్లి : మండల కేంద్రంలో ఆయా వ్యాపార దుకాణ యజమానులపై చైల్డ్ లేబర్ యాక్ట్ కింద నమోదైన కేసులను డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ గురువారం విచారించారు. కొద్ది రోజుల కింద ప్రత్యేక సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రెండు దుకాణాల్లో మైనర్లు పనిచేస్తుండగా పట్టుబడ్డారు. దీంతో ఆయా దుకాణదారులపై కేసులు నమోదు చేసి డీఏస్పీ విచారించారు. ఎస్ఐ శ్రీనివాస్‌యాదవ్, సిబ్బంది ఉన్నారు. ఓపెన్ ఇంటర్, పది పరీక్ష ఫీజు చెల్లించండి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలని డీఈఓ ప్రవీణ్‌కుమార్, టాస్క్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారు, అడ్మిషన్ పొంది పరీక్ష రాయలేని వారు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు చెల్లించాలని, అపరాధ రుసుంతో వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఆన్లైన్లో చెల్లించాలన్నారు. పరీక్ష సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు చేయొద్దు పాలమూరు: చిన్న వయస్సులో బాల్య వివాహం చేసుకోవడం వల్ల అమ్మాయిలకు అనారోగ్య సమస్యలతోపాటు చట్టపరమైన సమస్యలు ఎదువుతాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని జలజం జూనియర్ కళాశాలలో గురువారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై డ్రగ్స్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్, బాలల హక్కులు, విద్యాహక్కు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మనకు కావాల్సిన న్యాయంపై ఎవరికి వారు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. -
ఉన్నత విద్య మిథ్య..!
అచ్చంపేట: జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి సాంకేతిక విద్య చక్కని దిక్సూచి. కానీ నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, మన్ననూర్ ఐటీఐ కళాశాల మినహా మరెక్కడా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ, పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో విద్యారంగంలో వెనుకబడిన తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ), పాలిటెక్నిక్, నర్సింగ్ కోర్సుల ద్వారా విద్యార్థులు తక్కువ సమయంలోనే ఉద్యోగావకాశాలు పాందే అవకాశం ఉంది. కానీ కోర్సులను చదవాలంటే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలగానే.. నల్లమల ప్రాంతంలో పీజీ, సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు బుట్టదాఖలయ్యాయి. మాజీ మంత్రి మహేంద్రనాథ్ హయాంలో విద్యపరంగా నల్లమలకు కొంత మేలు జరిగింది. అచ్చంపేటలో మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకుల మాటలు నీటి మూటలు మిగిలిపోతున్నాయి. బల్మూర్ మండలం కొండనాగులలో ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అమ్రాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అచ్చంపేట పట్టణంలో ప్రగతి, చైతన్య, త్రివేణి ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద విద్యార్థులు అందులో చదవలేకపోతున్నారు. అచ్చంపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల, 23 కిలో మీటర్ల దూరంలో అమ్రాబాద్‌కు ఉప్పునుంతల, అచ్చంపేట, లింగాల మండలాల విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని కొండనాగుల, అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివినా.. విద్యార్థులు పీజీకి సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. మిహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు.. అచ్చంపేటలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, గురుకుల జూనియర్ కళాశాలతో పాటు మూడు ప్రైవేటు జూనియర్ కళాశాలు ఉన్నాయి. కొండనాగుల, అమ్రాబాద్, వంగూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, లింగాల, మన్ననూర్‌లో గురుకుల జూనియర్ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు ప్రతియేటా ఇంటర్ పూర్తి చేస్తున్నారు. అచ్చంపేటలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా అది నెరవేరడం లేదు. 2005లో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని నాటి, నేటి ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేసినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. విద్యారంగం అభివృద్ధి చెందాలి విద్యారంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలి. జిల్లాలో సాంకేతిక కళాశాలల ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు అందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కళాశాల సాధనకు విద్యార్థి సంఘాలు అన్ని ఏకమై దశల వారీగా ఉద్యమాలు చేపడుతాం. – ఎడ్ల మారుతి, డీవీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సాంకేతిక విద్య అందించాలి అచ్చంపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా ఉన్నారు. వెనకబడిన అచ్చంపేటలో ఐటీఐ, పాలిటెక్నిక్, పీజీ, నర్సింగ్‌కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. సాంకేతిక విద్య అందక విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందట్లేదు. ప్రభుత్వం గుర్తించి ఇక్కడ కళాశాలలు ఏర్పాటు చేయాలి. – సయ్యద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విద్యాభివృద్ధికి కృషి నల్లమల ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్య అందిస్తాం. మహిళా డిగ్రీ కళాశాల, పీజీ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు, ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఏజెన్సీ ప్రాంతామైన అచ్చంపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట జిల్లా విద్యార్థులకు ఆటంకం జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 10,196 మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ సాంకేతిక కోర్సుల్లో చేరడానికి అర్హత ఉంటుంది. వీరితో పాటు ఇంటర్ చదివిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఉమ్మడి జిల్లాలో వనపర్తి, మహబుబ్‌నగర్, గద్వాల వంటి ప్రాంతాల్లో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉన్నప్పటికీ దూరభారంతో పాటు సీట్లు కూడా సరిపోక నాగర్‌కర్నూల్ జిల్లా విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. జిల్లాలో కానరాని పాలిటెక్నిక్, పీజీ, మహిళా డిగ్రీ కళాశాలలు లక్ష్యానికి దూరమవుతున్న విద్యార్థులు నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని పలువురి డిమాండ్ -
పాలమూరులో పోకిరీలు
ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం. – జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్ అండగా సఖి కేంద్రం.. వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్‌ఫ్రీ నం.181కు ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు. – సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్, మహబూబ్‌నగర్ బాలికలకు అండగా.. ● చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, డయల్ 100 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ● షీటీంకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59365, భరోసాకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59280 ● భరోసా సెంటర్లో మైనర్లకు రక్షణతోపాటు న్యాయం అందుతుంది. ● మహిళా, శిశు సంక్షేమ శాఖలోని చిన్నారుల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) సహాయం పొందవచ్చు. ● లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం–2012 (పోక్సో) కఠిన శిక్షలు పడేలా చేస్తోంది. ● సఖి సెంటర్ ద్వారా అన్యాయానికి గురైన చిన్నారులు, అమ్మాయిలకు ప్రత్యేక వసతి, రక్షణతో,పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ● మహబూబ్‌నగర్ జిల్లా షీటీం విభాగానికి నెల రోజుల్లో 27 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వగా.. 25 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కొన్నిరోజుల నుంచి పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈ నెల 4న విద్యార్థులు షీటీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించి జరిగిన ఘటనపై విచారణ చేయగా ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు.’ మహమ్మదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బాలికలు, అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారకులపై కూడా పోక్సో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిలో మైనర్ అబ్బాయిలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా జులాయిగా తిరిగే కొందరు యువకులే ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే పనిగట్టుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం, వదిలే సమయానికి బైక్‌లపై ఉంటూ వచ్చిపోయే వారిని టీజ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటే.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకొని కొందరు యువకులు మరింత రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022 నుంచి 1,412 పోక్సో కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 451, నాగర్‌కర్నూల్‌లో 327, గద్వాలలో 234, నారాయణపేటలో 211, వనపర్తిలో 189 కేసులున్నాయి. నిత్యం తనిఖీలు చేస్తే.. మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలోని షీటీం బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ తనిఖీలు మరింతగా పెరగాలి. ముఖ్యంగా బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం తనిఖీలు చేయడం చాలా అవసరం. వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలకు వెళ్లి చిన్నారులు తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా అనుమానంగా అనిపించినా.. బాలికలకు సరైన రక్షణ అందని పరిస్థితులను గుర్తించినా తగు చర్యలు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే.. ● లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ● వేధింపులకు గురైతే ఎవరి సహాయం కోరాలి.. ఎలా స్పందించాలో వివరంగా చెప్పాలి. ● ఒంటరిగా ఎక్కడికీ వెళ్దొదని, వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించాలి. ● శరీరంలోని ఏ భాగాలను ఇతరులు తాకకూడదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ● ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముట్టొద్దు అని గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం, ఎదురించడం వంటివి తెలియజెప్పాలి. 2022 నుంచి ఉమ్మడి జిల్లాలో నమోదైన పోక్సో కేసులు నమోదైన కేసులు 2022 2023 2024 2025 (జూన్) మహబూబ్‌నగర్ 133 116 133 69 వనపర్తి 47 46 54 42 జోగుళాంబ గద్వాల 74 73 51 36 నాగర్‌కర్నూల్ 86 91 105 45 నారాయణపేట 50 42 80 39 జిల్లా ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు కీచకులుగా మారుతున్న పలువురు ఉపాధ్యాయులు పాఠశాలల్లోనూ విద్యార్థినులపై లైంగిక దాడులు నాలుగేళ్లలో 1,412 కేసులు నమోదు -
‘స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం’
కల్వకుర్తి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి కోరారు. గురువారం పట్టణంలో మండల పార్టీ అధ్యక్షుడు నరేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతిరోజు ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యు లు మొగిలి దుర్గాప్రసాద్, బండేల రామచంద్రారెడ్డి, నర్సిరెడ్డి, కిష్టారెడ్డి, శ్యామ్, సురేందర్ గౌడ్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘అంకితభావంతో పనిచేస్తేనే గౌరవం’
కల్వకుర్తి టౌన్: పోలీసులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజల్లో గౌరవం పెరుగుతుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం ప ట్టణంలోని పోలీస్‌స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందు గా రిసెప్షన్, ఫిర్యాదుదా రుల రిజిస్టర్, లాకప్ రూంను పరిశీలించారు. అందుకు సంబంధించిన రిజిస్టర్, వాచ్ డ్యూటీలో ఉన్న సిబ్బందితో వివరాలను ఆరా తీసి, వారికి పలు సూచనలు చేశారు. డ్యూటీలో ఉన్న సమయంలో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆదేశించారు. ఎస్పీ వచ్చిన సమయంలో పలువురు సిబ్బంది డ్రెస్ కోడ్‌తో పాటుగా, నేమ్ బ్యాడ్జీలను ధరించకపోవటంతో మరోమారు ఇలాంటి తప్పులను చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం ఎస్ఐ చాంబర్లో పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ఆయన, ఇటీవల పట్టణంలోని జరిగిన వరుస దొంగతనాలపై విచారణ జరిగే తీరును డీఎస్పీ వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచాలని, ప్రజల భద్రతను పరిరక్షించాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను గమనించి, వానాకాలం కావటంతో ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట కల్వకుర్తి సీఐ నాగార్జున, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అప్పుడే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. , మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు షీ టీం, సఖీ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ.. అన్ని రంగాల్లో సత్తా చాటాలని సూచించారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో లైగింక వేధింపులు, ఉమెన్ ట్రాఫికింగ్, ఈవ్ టీజింగ్‌లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఎవరైనా మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సమయాన్ని వృథా చేయొద్దు సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు ఆలస్యం చేయకుండా డయల్ 100, 87126 57676 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరారు. సఖీ సెంటర్ అడ్మిన్ సునీత మాట్లాడుతూ మహిళలు ఎవరైనా గృహహింస, శారీరకంగా, మానసికంగా ఏమైనా హింసకు లోనైతే జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌ను సంప్రదిస్తే వారికి కావాల్సిన కౌన్సిలింగ్, న్యాయపరమైన, పోలీసు సహాయం అందిస్తామన్నారు. నిస్సాహయ స్థితిలో ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 181, 99519 40181 ఫోన్ చేసి ఫిర్యాదు చేసి సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శంకర్, జిల్లా షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ విజయలక్ష్మి, షీ టీం సభ్యుడు వెంకటయ్య పాల్గొన్నారు. అదనపు ఎస్పీ రామేశ్వర్ -
అప్పుడే.. లోకల్ ఫైట్!
స్థానిక ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయం ● ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు ● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు ● గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు ● సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ ● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’ జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి. – లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరులోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తగిన కసరత్తు ప్రారంభించాయి. గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా ఆయా పార్టీల ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగట్టే కార్యాచరణతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ముందుకుసాగుతున్నారు. మరో రెండు రోజులు లేదంటే ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాతో పార్టీల్లో చేరికలు ఊపందుకోగా.. స్థానికంగా సందడి నెలకొంది. చేరికల పరంపర స్థానిక ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఇటీవల నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ నెల 18న బీఆర్ఎస్కు చెందిన జడ్చర్ల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. తాజాగా మహబూబ్‌నగర్ చెందిన రైతుబంధు జిల్లా సమితి మాజీ చైర్మన్ గోపాల్‌యాదవ్, మాజీ కౌన్సిలర్ పద్మజ బీఆర్ఎస్కు రా జీనామా చేశారు. వా రు కాంగ్రెస్‌లో చేరే అవ కాశం ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. బీజేపీ సైతం.. స్థానిక ఎన్నికల్లో ఈ సారి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మహబూనగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు గుర్రాల వడబోత చేపట్టినట్లు తెలుస్తోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్‌వాక్ పేరిట వార్డుల్లో పర్యటిస్తుండగా.. ఆయన ముఖ్య అనుచరులు మండలాల వారీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు, ప్రధాన అనుచరులు మండలాలు, పట్టణాల వారీగా నిత్యం పర్యటిస్తూ.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ.. ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేపట్టాలని శ్రేణులకు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం పోటాపోటీగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లేలా గ్రామ, మండలస్థాయి కీలక నాయకులను సమాయత్తం చేస్తున్నారు. కాగా, జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో అంతర్గత పోరు కొనసాగుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దేవరకద్ర, జడ్చర్లలో మాటల తూటాలు దేవరకద్ర నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధ్య విమర్శల పర్వం నామమాత్రంగా కొనసాగింది. నిన్న, మొన్నటి వరకు రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉండగా.. స్థానిక ఎన్నికలు వస్తాయనే క్రమంలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలతో ప్రస్తు తం రాజకీయ సెగ రాజుకుంది. జడ్చర్ల నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతుండగా.. రాజకీయం రసవత్తరంగా మారింది. -
జిల్లాలో యూరియా కొరత లేదు..
తాడూరు: జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం తాడూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. యూరియా నిల్వలను పరిశీలించారు. వానాకాలంలో సాగుకు సంబంధించి ఇప్పటి వరకు 657 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని.. గోదాములో 37 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని సింగిల్‌విండ్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. రైతుల అవసరానికి అనుగుణంగా 3,600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా 23 పీఏఎస్సీలు, 230 ప్రైవేటు క్రిమిసంహారక మందులు, ఎరువుల విక్రయ కేంద్రాలు ఉన్నాయని.. వాటిలో తప్పనిసరిగా స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని.. ముందుగానే ఎక్కువగా కొనుగోలుచేసి ఇళ్లల్లో నిల్వ చేసుకోవద్దని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్సీలో మందుల స్టాక్‌ను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భూ భారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 785 దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామని.. 55 దరఖాస్తులను ఆమోదించినట్లు తహసీల్దార్ జయంతి తెలిపారు. అనంతరం యాదిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట డీఏఓ యశ్వంత్‌రావు, ఏడీ పూర్ణచందర్‌రెడ్డి, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏఓ సందీప్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. క్రిటికల్ కేర్ సెంటర్ పనులు త్వరగా పూర్తిచేయాలి నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో రూ. 23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్ పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సలు అందించేందుకు గాను 50 పడకలతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, డా.రోహిత్ ఉన్నారు. అందుబాటులో 3,600 మెట్రిక్ టన్నులు ఎరువుల దుకాణాల్లో స్టాక్ బోర్డులు ఏర్పాటుచేయాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం, వనమహోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై మండల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా సాధించిన ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఎంపీడీఓలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రతి ఇంటి నిర్మాణ పనుల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామపంచాయతీల్లోని లబ్ధిదారుల వివరాలను రెండు రోజుల్లోగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకోవాలని.. వారి స్థానంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి 15 రోజుల్లోగా డబుల్బెడ్రూం ఇళ్లను కేటాయించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవంలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు విష జ్వరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, మిషన్ భగీరథ ఈఈలు విజయశ్రీ,, సుధాకర్‌సింగ్ తదితరులు ఉన్నారు. -
ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులోని ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను పరిశీలించడంతో పాటు ఖైదీలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఎంతో మంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. న్యాయవాదిని నియమించుకోలేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గుణశేఖర నాయుడు, న్యాయవాదులు మధుసూదన్‌రావు, పవనశేష సాయి పాల్గొన్నారు. ఏటీసీలో అడ్మిషన్లు మన్ననూర్: స్థానిక ఐటీఐ కళాశాలలో ఏర్పాటుచేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటో మిషన్, ఇండస్ట్రియల్ రోబొటిక్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిసన్ యూసింగ్ అడ్వాన్స్ టూల్స్ కోర్సులతో పాటు బేసిన్ డిజైనర్ అండ్ పర్చువల్ పెరీఫైర్, అడ్వాన్స్డ్ సీఎస్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రానిక్స్ వెహికిల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా https://iti.tela ngana.gov.in వెబ్సైట్లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోపా, డ్రాప్ట్మన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 85004 61013, 99517 07945, 85004 61022 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోండి కందనూలు: షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను అందించే స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాంలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు వచ్చే నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రణాళికా బద్ధంగా చదివితేనే లక్ష్యసాధన తెలకపల్లి: విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివితేనే నిర్దేశిత లక్ష్యాలు సాధ్యమవుతాయని డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. తెలకపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలలో బుధవారం డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
బిజినేపల్లి: ఆన్లైన్ మోసాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం బిజినేపల్లి గురుకుల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గతంలో హత్యలు, చోరీలు వంటి సాధారణ నేరాలు అత్యల్పంగా ఉండగా, ప్రస్తుతం డిజిటల్ నేరాల సంఖ్య పెరిగిందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ అధికంగా వినియోగించడమే కారణమని అన్నారు. సెల్‌ఫోన్ సత్ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని.. లేకపోతే అవే ఫోన్లు ఊరికొయ్యలుగా మారుతాయన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఎస్పీ వెంట ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
స్థానికం.. సన్నద్ధం
వివరాలు 8లో uఅచ్చంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. దీంతో ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగుతుందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఎన్నికలకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. అందుబాటులో బ్యాలెట్ బాక్సులు 2024 జనవరి 31న సర్పంచ్, అదే ఏడాది జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపరు విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ బాక్సులను జిల్లాలో అందుబాటులో ఉంచారు. సర్పంచ్, వార్డు సభ్యులకు అవసరమైన బ్యాలెట్ పేపర్స్ ముద్రించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన చేపట్టారు. స్టేషనరీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రి రాష్ట్రస్థాయిలో కొనుగోలు చేసి జిల్లాలకు ఇప్పటికే తరలించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తి చేసి వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. మరోవైపు వర్షాకాలం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓ, జిల్లా పరిషత్ సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ గుర్తులపైనే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి. జెడ్పీటీసీలు అందరూ కలిసి జెడ్పీచైర్మన్‌ను.. ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపించారు. గవర్నర్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 90 సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేయనున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. ముందుగా ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో.. జిల్లాలో 20 జెడ్పీటీసీ.. 214 ఎంపీటీసీ స్థానాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే ఎంపీటీసీల పునర్విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో 212 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి, మాచినేనిపల్లి, సింగాయిపల్లి ఎంపీటీసీ స్థానాలు కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా ఏదుల మండలంలో కలపడంతో మూడు ఎంపీటీసీలు తగ్గాయి. ఇదే సమయంలో అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన పలకపల్లి, పులిజాల, నడింపల్లి, లక్ష్మాపూర్, బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి ఎంపీటీసీ స్థానాలు 5 పెరగడంతో 214కు చేరింది. పల్లెల్లో పంచాయతీ, పరిషత్ ఎన్నికల సందడి సామగ్రి సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల ఖరారు ఇప్పటికే నిర్వహణపై మొదటి విడత శిక్షణ పూర్తి బీసీ రిజర్వేషన్‌కు ఆమోదం రాగానే షెడ్యూల్ ప్రకటన -
పీయూలో ఏం జరుగుతోంది?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్‌టీచింగ్ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్‌టీచింగ్ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. టీచింగ్ సిబ్బందిలోనూ అసంతృప్తి.. పీయూలో ప్రొఫెసర్ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్ అధ్యాపకుడిని చీఫ్ వార్డెన్‌గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్‌కు గతంలో ఉన్న చీఫ్ వార్డెన్ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. బాలికల హాస్టల్లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. బదిలీల పరంపర.. నాన్‌టీచింగ్‌లో రెగ్యులర్ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్‌టీచింగ్ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్ చాన్స్‌లర్‌ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్‌కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. నాన్ టీచింగ్ సిబ్బందిపై వేధింపుల పర్వం ఇటీవల పలువురిపై సస్పెన్షన్ వేటు చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు టీచింగ్ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం -
సిబ్బంది తరఫున పోరాడతాం..
సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మేము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు. – రాము, పీయూ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరినీ సమానంగా చూస్తాం.. పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్ చేశాం. ఏ సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపు కోసం కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో సెలవులు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. – రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు
నాగర్‌కర్నూల్: జిల్లాలోఎరువులు, యూరియా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, కోపరేటివ్, రవాణా అధికారులు, ఏడీఏలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి– వ్యవసాయ సంచాలకులు గోపి రైతులకు యూరియా సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ మేరకు జిల్లా నుంచి డీటీఓ చిన్నబాలు, డీసీఓ రఘునాథ్, ఏడీఏలతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా గురించి వివరిస్తూ ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు వారి పరిధిలోని అన్ని ఎరువుల దుకాణాలు, అనుమానాస్పద ప్రదేశాలు, పరిశ్రమలు సందర్శించి యూరియా వ్యవసాయేతర అవసరాలకు వాడితే కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రతి ఎరువుల డీలరు వారి వద్ద ఉన్న ఎరువుల స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శింపజేస్తామన్నారు. రైతులు ఎరువుల పంపిణీలో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 89777 41771 స్టాక్ బోర్డుపై తెలియపరుస్తామన్నారు. ప్రతి సహకార సంఘం ఉదయం 8 గంటలకే తెరిచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ చారకొండ: మండల కేంద్రంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రత్యేకాధికారి మంజుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో ఖాళీగా ఉన్న 12 సీట్ల భర్తీకి.. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోడు భూముల్లో సాగుకు అనుమతించాలి అమ్రాబాద్: ఆదివాసీ చెంచులు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంతోపాటు కండ్లకుంట భూమిలో సాగుకు అనుమతించాలని జిల్లా చెంచు సేవా సంఘం అధ్యక్షుడు నాగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో చెంచు కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కండ్లకుంట భూమిలో సాగుకు అనుమతించకపోతే చెంచులతో కలిసి ఆందోళనలు చేపడుతామన్నారు. సంఘం జిల్లా నాయకుడు నాగయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తాతలు, తండ్రులు కండ్లకుంట భూమిని సాగుచేస్తు అక్కడి అడవులు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా జీవనం సాగించారని, తాము అలాగే ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం తమకున్న అవకాశాల్లో చెంచులు ఎవరూ పోటీ చేయమని, ఓటుహక్కు సైతం వినియోగించుకోమని తేల్చిచెప్పారు. ‘స్థానికం’లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి పెద్దకొత్తపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు అభివృద్ధిని మరిచిపోయి.. ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను పెట్టిస్తున్నారని విమర్శించారు. పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్తే అధికారులు పనిచేయకుండా వేధిస్తున్నారన్నారు. అనంతరం స్థానిక గురుకుల పాఠశాల మాజీ ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాలలో 19 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైతే కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఎవరూ పాఠశాలను సందర్శించలేదని విమర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు పాఠశాల వద్దకు వస్తే విద్యార్థులకు పరీక్ష నిర్వహించడంతో ఆయన గేటు ముందే విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. -
‘మహాలక్ష్మి’ పథకంతో సాధికారత
నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా అమలవుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత ప్రయా ణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూర ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ వృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. ప్రతి మహిళ నెలకు రూ.4–5 వేల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని బుధవారం జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట డిపోల్లో సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని చెప్పారు. మహిళా ప్రయాణికులను శాలువా, బహుమతితో సత్కరించాలని, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి.. బహుమతులు అందజేయాలన్నారు. అలాగే పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 కండక్టర్లతోపాటు ట్రాఫిక్ గైడ్, భద్రతా సిబ్బందిని సత్కరించాలని సూచించారు. తరగతి గదులు మార్చండి.. బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామ ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదులను గ్రామంలోని మరో పాఠశాలకు తక్షణమే మార్చాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అక్షరాలు, పదాలు చదివించారు. విద్యార్థులకు భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, రోజువారి హాజరు శాతం పరిశీలించారు. ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించి గణిత బోధన చేశారు. కలెక్టరేట్ వెంట డీఈఓ రమేష్‌కుమార్, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరి, తహసీల్దార్ ఎండీ మునీరుద్దీన్, ఎంఈఓ రఘునందన్‌రావు తదితరులున్నారు. -
అభివృద్ధి పనులపై కేంద్ర బృందం ఆరా
లింగాల: మండలంలోని పద్మన్నపల్లి గ్రామాన్ని మంగళవారం కేంద్ర ప్రభుత్వ నేషనల్ లెవల్ మానిటరింగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల అమలును బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గ్రామంలో పారిశుద్ధ్య పనులతోపాటు ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పలు రకాల పనుల గురించి ఆరాతీసింది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను గ్రామీణ ప్రజలు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారనే విషయాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మండల మహిళా సమాఖ్య ద్వారా అమలు జరిగే పొదుపు సంఘాల పనితీరు గురించి వివరాలు సేకరించారు. గ్రామంలో అమలవుతున్న పనులకు సంబంధించిన నివేదికలను కేంద్రానికి పంపిస్తామని బృందం వెల్లడించింది. కార్యక్రమంలో డీఎల్పీఓ వెంకట్‌ప్రసాద్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ ఇమాంఅలీ, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్లు పెంచి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు రూ.6 వేలకు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రుణమాఫీపై ప్రశ్నించే ప్రతిపక్షాలు పింఛన్ పెంచకపోవడంపై ఎందుకు నిలదీయడం లేదని విమర్శించారు. పింఛన్ల పెంచాలని కోరుతూ వచ్చే నెల 13న హైదరాబాద్‌లో నిర్వహించ సభకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
అచ్చంపేట రూరల్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణ అమలు చేస్తోందని, వారి ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం అచ్చంపేటలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఇందిరమ్మ కలను సాకారం చేసే దిశగా మహిళా సంఘాలను అన్ని విధాలుగా బలోపేతం చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళల ఆలోచనా విధానాలు మారాలని, వృథా ఖర్చులను తగ్గించి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పభుత్వం మహిళల అభివృద్ధికి స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.వేల కోట్లతో వడ్డీ లేని రుణాలు ఇస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లను మంజూరు చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుందన్నారు. పిల్లల చదువుల పేరుతో రూ.లక్షలు వృథా చేయకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళా సంఘాలనే మరచిపోతే.. తమ ప్రభుత్వం ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. అనంతరం 721 స్వయం సహాయక సంఘాలకు రూ.51.32 కోట్ల చెక్కును మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, ఎమ్మెల్యే సతీమణి అనురాధ, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రజిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు గిరివర్ధన్‌గౌడ్, సునీతరెడ్డి, గౌరీశంకర్, శారద, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలోని చెరువులు, సాగునీటి కుంటలు ప్రమాదకర స్థాయిలో ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నీటిపారుదల, వ్యవసాయం, భారీ వర్షాలు, ఆరోగ్యం, రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ అమరేందర్, నీటి పారుదల సీఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచనలను జిల్లాస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని నియోజకవర్గ స్థాయిలోని మండలాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, పౌరసరఫరాల అధికారి నర్సింహారావు, వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు, డీపీఓ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 1, 2 తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు నాగర్‌కర్నూల్ రూరల్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా కల్వకుర్తిలో వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించి జిల్లా 3వ మహాసభలు విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని లక్ష్మణాచారి భవన్లో యేసయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. జిల్లా మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారన్నారు. సమావేశంలో నాయకులు ఆనంద్జీ, వెంకటయ్య, కేశవులు, నర్సింహ, ఇందిరమ్మ, చంద్రమౌలి, భరత్, కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండా సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతోపాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు స్పందించి కేఎల్ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతోపాటు పూడిక, జమ్ము పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. -
ఎనలేని సహకారం
●సంతోషంగా ఉంది.. ఆదర్శవంతమైన పీఏసీఎస్‌గా తీర్చిదిద్దడానికి నాతోపాటు మా పాలకవర్గ సభ్యులు, సీఈఓ, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తున్నాం. నాబార్డు, సీడీఎఫ్ సహకారంతో పీఏసీఎస్‌కు నూతన భవనం, కొత్తగా గోదాంలు నిర్మించాం. రైతులకు వారి అర్హతను బట్టి అన్ని రకాల రుణాలు ఇస్తున్నాం. రుణాల రికవరీలోనూ మంచి స్థితిలో ఉన్నాం. పీఏసీఎస్ రెండుసార్లు రాష్ట్రస్థాయిలో నాబార్డు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – భూపాల్‌రావు, పీఏసీఎస్ చైర్మన్, ఉప్పునుంతల పెద్ద లోన్లు ఇస్తున్నారు.. పీఏసీఎస్‌లో పంట రుణాలు ఇవ్వడమే కాకుండా గేదెలు, గొర్రెల పెంపకం, కోళ్ల ఫారాల ఏర్పాటుకు పెద్ద లోన్లు కూడా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతారు. పంట పండించిన తర్వాత ధాన్యం వారే కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు క్రమం తప్పకుండా రెన్యువల్ చేస్తుండటంతో పంటల ఇన్సూరెన్స్‌తోపాటు వడ్డీ రాయితీ వస్తుంది. రైతులందరూ పీఏసీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. – బొల్లు శ్రీనివాసులు, రైతు, కాంసానిపల్లి కోళ్లఫారం రుణం.. పీఏసీఎస్‌లో రెండు దఫాలుగా రూ.14 లక్షల వరకు రుణం తీసుకున్నాం. రెండు కోళ్ల ఫారాలు కట్టుకొని నడిపించుకుంటున్నాం. క్రమం తప్పకుండా కంతులు కడుతున్నాం. దాంతోపాటు పంట రుణం కూడా ఇచ్చారు. ఏదైనా అత్యవసరమైతే బంగారంపై కూడా రుణాలు ఇస్తున్నారు. మాకు అన్ని విధాలుగా రుణ సహాయం చేస్తున్నారు. ఇతర బ్యాంకుల వద్దకు రుణం కోసం వెళ్లడానికి మనసు ఒప్పదు. పీఏసీఎస్ మాకు ఇంటి బ్యాంకు మాదిరిగా అనిపిస్తుంది. – మధునాగుల లక్ష్మమ్మ, మహిళా రైతు, ఉప్పునుంతల ఉప్పునుంతల: సంఘం సభ్యులుగా ఉన్న రైతులకు విరివిగా రుణాలు ఇస్తూ.. వాటిని సకాలంలో రికవరీ చేయడం.. విత్తనాల విక్రయం, ధాన్యం కొనుగోళ్లు.. పంటల బీమా వర్తించేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అన్ని రకాల సేవలు అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ఉప్పునుంతల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రెండోసారి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పీఏసీఎస్‌గా అవార్డు అందుకొని తోటి సంఘాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నాబార్డు అవార్డుకు ఎంపికై న ఆరు పీఏసీఎస్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉప్పునుంతల ఎంపికవడం విశేషం. అన్నదాతలకు అన్నిరకాలుగా ‘సహకారం’ అందుతుండటంతో ఇక్కడి పీఏసీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. 70 శాతం రుణ రికవరీతోపాటు ఇన్ బ్యాలెన్సింగ్, బ్యాంక్ సేవలు, రికార్డుల నిర్వహణ, పారామీటర్, సంఘం ప్రగతితో ఉప్పునుంతల పీఏసీఎస్ రాష్ట్రస్థాయిలో రెండు పర్యాయాలు నాబార్డు నుంచి అవార్డు అందుకుంది. నష్టాల నుంచి లాభాల్లోకి.. 2005కు ముందు పూర్తిగా దివాలా తీసిన ఉప్పునుంతల పీఏసీఎస్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పీఏసీఎస్‌లను పటిష్టపర్చడానికి చేసిన కృషితో అంచెలంచెలుగా ఎదిగింది. ఇందులో భాగంగా 2008లో రూ.11 లక్షలతో ప్రధాన రహదారిపై శాశ్వత భవనం నిర్మించారు. అనంతరం 2014లో రూ.3 లక్షలు సీడీఎఫ్ నిధులతో కలిపి మొత్తం రూ.10 లక్షలతో పీఏసీఎస్ భవనం రెండో అంతస్తు నిర్మించారు. దీంతోపాటు గ్రామంలోని పాతకోట ప్రాంతంలో స్థలాన్ని సమకూర్చుకొని రూ.63.40 లక్షలతో 2,100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించారు. ఈ గోదాంకు అనుసరించి రూ.21 లక్షలతో ఎరువులు నిల్వ చేయడానికి మరో గోదాం, ఆ తర్వాత రూ.3 లక్షల సీడీఎఫ్ నిధులతో విత్తనాల కోసం మరో మినీ గోదాం ఏర్పాటు చేశారు. అలాగే ఉప్పునుంతల– అచ్చంపేట ప్రధాన రహదారికి పక్కన ఉన్న సొంత స్థలంలో మరో గోదాం, ఉప్పరిపల్లి, మొల్గరలో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించారు. మండలంలోని మొల్గర, కాంసానిపల్లి సమీపంలో రెండు పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న పీఏసీఎస్‌కు చెందిన స్థలంలో దాదాపు రూ.కోటికి పైగా నాబార్డు నిధులతో కొత్తగా పీఏసీఎస్ బ్యాంకింగ్ సేవల కోసం విశాలమైన నూతన భవనం రూపుదిద్దుకుంది. ఇంతకు ముందు పీఏసీఎస్‌ను కొనసాగించిన పాత భవనాన్ని ప్రస్తుతం గ్రోమోర్ కంపెనీకి అద్దెకు ఇచ్చి సంఘం ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దీంతోపాటు రైతులకు విత్తనాలతోపాటు వారు పండించిన వరి, వేరుశనగ వంటి పంటలను పీఏసీఎస్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల వసతులను సమకూర్చుకొని రూ.3.97 కోట్ల నెట్ లాభంతో పీఏసీఎస్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సీఈఓ రవీందర్రావు పాలకవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పీఏసీఎస్ అభివృద్ధికి కృషిచేస్తున్నారు. విరివిగా రుణాలు.. పీఏసీఎస్‌లో మొత్తం 11,360 మంది రైతులు సంఘం సభ్యులుగా ఉండగా వీరికి విరివిగా పంట, దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నారు. వాటితోపాటు బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తున్నారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు 2025 మార్చి వరకు స్వల్పకాలిక రుణాలు రూ.29.67 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు (పాడి, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు) రూ.21.29 కోట్లు, బంగారు ఆభరణాలపై రుణాలు రూ.9 కోట్లు ఇచ్చారు. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న ఉప్పునుంతల పీఏసీఎస్ నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనం విత్తనాల విక్రయం మొదలుకొని.. ధాన్యం కొనుగోళ్ల వరకు సేవలు 2008లోనే శాశ్వత భవనం, విరివిగా గోదాంల నిర్మాణాలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ సంఘంగా నాబార్డు అవార్డుల పరంపర -
మహబూబ్‌నగర్ రూరల్
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర) ఉన్నాయి. మరో నియోజకవర్గంగా మహబూబ్‌నగర్ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ పరిధిలోని మహబూబ్‌నగర్ రూరల్ మండలం, హన్వాడ, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్‌కొండ, జడ్చర్ల పరిధిలోని నవాబుపేట మండలాలతో కలిపి మహబూబ్‌నగర్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి (2011 లెక్కల ప్రకారం జనాభా 2,17,942)ని మహబూబ్‌నగర్ అర్బన్ నియోజకవర్గం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలం జనాభా మహబూబ్‌నగర్ రూరల్ 42,523 హన్వాడ (మహబూబ్‌నగర్) 55,044 మహమ్మదాబాద్ (పరిగి) 34,087 కోయిల్‌కొండ (నారాయణపేట) 66,721 నవాబుపేట (జడ్చర్ల) 52,061 మొత్తం 2,50,436 -
మరో నాలుగు..!
ఉమ్మడి పాలమూరులో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు కోస్గి లేదా అయిజ.. ప్రస్తుత నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, పరిగి నియోజకవర్గంలోని గండేడ్ కలుపుకొని కోస్గి అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలాన్ని కూడా కలిపే చాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజకు చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని గట్టు కలిపి అయిజ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెబ్బేరు వనపర్తి జిల్లా, ఆ నియోజకవర్గంలో ఉన్న పెబ్బేరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలను దీని పరిధిలో చేరుస్తారని అంచనా. 2011 లెక్కల ప్రకారం పరిశీలిస్తే ఆయా మండలాలు/పట్టణంలో జనాభా 2,12,253. సగటు జనాభా 2,30,064లో పదిశాతం తీసేసి పోలిస్తే.. జనాభా కొంత ఎక్కువగానే ఉంది. దీంతో పాటు పెబ్బేరు, కొత్తకోట జాతీయ రహదారి 44ను ఆనుకుని ఉండడడంతో ఈ నియోజకవర్గ ఏర్పాటు ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. మండలం జనాభా పెబ్బేరు (వనపర్తి) 48,749 కొత్తకోట (దేవరకద్ర) 59,331 శ్రీరంగాపూర్ (వనపర్తి) 19,941 వీపనగండ్ల (కొల్లాపూర్) 27,378 చిన్నంబావి (కొల్లాపూర్) 28,949 మదనాపురం (దేవరకద్ర) 27,905 మొత్తం 2,12,253 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు పూర్తి చేసి.. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ఇటీవలే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను నెమరువేసుకుంటూ.. ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యే ఆశావహులు ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. మారనున్న నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటు జనాభా 2,30,064 (పది శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు). దీని ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు చేరుకోనున్నాయి. ఈ లెక్కన 34 నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జనాభా 40,53,028 (2011 లెక్కల ప్రకారం) ఉండగా.. 14 అసెంబ్లీ స్థానాలు 18కి చేరుకోనున్నాయి. ● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు (షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్. దేవరకద్ర, వనపర్తి, నారాయణపేట, మక్తల్, కొడంగల్, గద్వాల, అలంపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట) ఉన్నాయి. పునర్విభజన చేపడితే మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ఇందులో పెబ్బేరు/కొత్తకోట, ఆమనగల్, మహబూబ్‌నగర్ రూరల్ ఖాయమని.. కోస్గి, అయిజలో ఏదైనా ఒకటి కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ ఐదు జిల్లాలుగా (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల) విడిపోగా.. పలు నియోజకవర్గాలు, మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు. ఆమనగల్ ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలు జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డికి వెళ్లాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం కలిసి ఆమనగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2011 సగటు జనాభాతో పాటు భౌగోళికంగా సరిపోనుండడంతో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం మిగలగా.. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట నుంచి వంగూరు, చారకొండ.. జడ్చర్ల నుంచి ఊర్కొండ, నాగర్‌కర్నూల్ నుంచి తాడూరు మండలాలను చేర్చే అవకాశం ఉంది. మండలం జనాభా ఆమనగల్ (కల్వకుర్తి) 62,034 మాడ్గుల (కల్వకుర్తి) 49,133 తలకొండపల్లి (కల్వకుర్తి) 52,835 కడ్తాల్ (కల్వకుర్తి) 36,406 వెల్దండ (కల్వకుర్తి) 46,006 మొత్తం 2,46,414 ముఖ్యనేతల నజర్ 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా జనగణన పూర్తి చేసి.. ఆ తర్వాత ఆరు నెలల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తతంగం ముగించేలా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2028 నవంబర్ లేదా డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలు 23కు చేరుకుంటాయి. దీని తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా 18 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవనుంది. పునర్విభజనతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఆశావహులు కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై దృష్టి సారించారు. తమ కుటుంబసభ్యులను రాజకీయారంగేట్రం చేసేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నూతనంగా పెబ్బేరు, ఆమనగల్, మహబూబ్‌నగర్ రూరల్ ఖాయం కోస్గి లేదా అయిజలో ఏదైనా ఒక్కటి.. రాష్ట్రంలో రంగారెడ్డి తర్వాత 18 సీట్లతో రెండోస్థానంలో జిల్లా.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మారనున్న భౌగోళిక సరిహద్దులు 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ షురూ -
స్వచ్ఛతలో వెనుకంజ!
వివరాలు 8లో uఅచ్చంపేట రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏడాదికేడాది జిల్లాలోని మున్సిపాలిటీలు వెనకబడుతున్నాయి. సంబంధిత అధికారుల అలసత్వానికి తోడు ప్రజల్లో అవగాహన కొరవడటంతో మెరుగైన ర్యాంకులు సాధించలేకపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పట్టణాభివృద్ధిశాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటిస్తోంది. ఇందుకు గాను ప్రత్యేకంగా సర్వే నిర్వహించి.. పారిశుద్ధ్యం, శుభ్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్వచ్ఛత యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరిలో పోటీతత్వం పెంచి స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. తిరోగమనం దిశగా.. కేంద్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి గానూ పట్టణాల్లోని జనాభా ఆధారంగా జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు వెల్లడించింది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలు గతేడాదితో పోలిస్తే చాలా వరకు వెనకబడ్డాయి. రాష్ట్రస్థాయిలో మాత్రం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ కొంత మెరుగైన ర్యాంకు సాధించగా.. మిగతా మున్సిపాలిటీలు తిరోగమనం దిశగా పయనిస్తున్నాయని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను బట్టి చెప్పవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకులు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగా పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల భాగస్వామ్యమేది? స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మున్సిపాలిటీ మెరుగైన ర్యాంకు సాధించడంలో అధికార యంత్రాంగంతో పాటు పట్టణ ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా స్వచ్ఛత యాప్ రూపొందించింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక మార్కు, ఫిర్యాదు నమోదైన వెంటనే పరిష్కరిస్తే రెండు మార్కులు, 6గంటల సమయం దాటిన తర్వాత సమస్యను పరిష్కరిస్తే ఒక మార్కు కేటాయిస్తారు. అయితే ఈ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కరువైంది. స్వచ్ఛత యాప్ వినియోగం, ప్రాధాన్యతపై పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలంటే.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతను మెరుగు పరిచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మన పట్టణాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో పెంపొందించాలి. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయకుండా చర్యలు చేపట్టాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడంపై గృహ యజమానులకు అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ నిషేధం వందశాతం అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పట్టణాల్లో ప్లాస్టిక్‌పై నియంత్రణ లేకపోవడంతో ప్రతినెలా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ డంపింగ్‌యార్డుకు చేరుతోంది. అచ్చంపేట మున్సిపాలిటీలో 34,500 మంది జనాభా ఉండగా, 18.79 చదరపు కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 55.19 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉండగా.. 36,912 మంది జనాభా ఉన్నారు. కల్వకుర్తిలో 40వేల మంది జనాభా, 36.6 చదరపు కి.మీ. విస్తీర్ణం, కొల్లాపూర్‌లో 25,049 మంది జనాభా ఉండగా.. 20 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దిగజారుతున్న ర్యాంకులు గతేడాదితో పోలిస్తే చాలా వరకు వెనుకబాటు స్వచ్ఛత యాప్ వినియోగంపై అవగాహన కరువు ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన ర్యాంకులు సాధ్యం -
ఆలోచించండి.. ఆవిష్కరించండి
నూతన ఆవిష్కరణలకు ‘ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్’ వేదిక ● విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి.. నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యం ● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ● ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులకు ఆహ్వానం ● ఉమ్మడి జిల్లాలో గతేడాది 3,658 దరఖాస్తులు నారాయణపేట రూరల్: విద్యార్థి ఆలోచనలకు సృజనాత్మకత జోడించి.. కొత్త ఆవిష్కరణలు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తోంది ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ వేదిక. ఈ ఏడాది నుంచి వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యతపై దృష్టిపెట్టింది. మూస విధానాలు, ఒకరిని చూసి మరొకరు కొద్దిపాటి మార్పులతో ప్రయోగాలు అనుకరించకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. కోవిడ్ సమయంలో విద్యార్థులకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఒక వేదికను తయారు చేసింది. ఇందులో అన్ని ప్రభుత్వ, అనుబంధ విద్యా సంస్థల్లో చదువుతున్న ఆరు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇద్దరు విద్యార్థులతో కూడిన జట్టుతో ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు మించకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ ప్రయోగాలకు నోచాన్స్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ స్కిల్ ఇండియా, మేకింగ్ ఇండియా, స్వచ్ఛ భారత్, మరి కొన్ని అనే నాలుగు విభాగాల్లో దరఖాస్తులు తీసుకుంటుంది. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్‌గా అనుకరణలు వస్తున్నాయని గుర్తించారు. విద్యార్థులు, సంబంధిత సైన్స్ టీచర్లు ఇవి కొత్తగా కనిపించినా సంస్థ మాత్రం చాలా సులువుగా గుర్తిస్తుంది. దీనికితోడు గతంలో ప్రదర్శించిన వాటికి అనుమతి ఉండదని చెబుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో.. నిరుపయోగంగా ఉన్న బ్యాటరీల ద్వారా విద్యుత్, శక్తి ఉత్పతి, వర్షపునీటి వినియోగం, నీటి నిల్వ స్థితి– హెచ్చరిక యంత్రాలు, వంటగ్యాస్, అగ్నిప్రమాదాలు– అప్రమత్తం చేసే యంత్రాలు, వర్మీ కంపోస్టు, లెటర్‌బాక్స్, అలారం, బిందుసేద్యం, సెన్సార్ ఆధారిత ప్రదర్శనలు, అప్రయత్నంగా వీధిదీపాల నిర్వహణ, ఆహార పదార్థాల కల్తీ గుర్తింపు, కార్బన్ సైకిల్, ఆహార గొలుసు, మానవ శరీర అవయవాల ప్రదర్శన, నక్షత్ర మండలం, జలశుద్ధి వంటి పాఠ్యపుస్తకాలు, యూట్యూబ్‌లలో చూసిన ప్రదర్శనలు అనుమతించరు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ప్రయోగాలు ఉండాలని నిబంధన ఉంది. మెరుగైన కొత్త వాటికి మాత్రమే అర్హత ఉంటుంది. గతేడాది జాతీయ స్థాయికి.. గతేడాది నారాయణపేట జిల్లా దామరగిద్ద గురుకుల విద్యార్థి ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా గతేడాది 3,658 దరఖాస్తులు రాగా వాటిలో ఐదు జిల్లాల్లో కలిపి 349 ఎంపిక చేశారు. ఇందులో అత్యుత్తమంగా ఉన్న 10 శాతం ప్రాజెక్టులను స్క్రూట్నీ చేసి రాష్ట్రస్థాయికి నామినేట్ చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు ఖర్చులకు అందిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పాల్గొన్న వాటిలో ఇప్పటి వరకు జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఒక్క ప్రాజెక్టు ఎంపికై ంది. సింగారం చౌరస్తాలో గల దామరగిద్ద గురుకుల స్కూల్ (ప్లాస్టిక్ నివారిస్తూ కొబ్బరి పీచుతో చేసిన కుండీలతో కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణ) ప్రాజెక్టు ఇటీవల జపాన్‌లో జరిగిన సకురా సైన్స్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం లభించింది. మొదట ఉపాధ్యాయుల నామినేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసి ఎస్ఐసీ ద్వారా వృత్తిపరమైన వివరాలు అంతర్జాలంలో నిక్షిప్తం చేశారు. రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్లో నమోదై తదుపరి అన్ని రకాల సమాచారం టీచర్ సెల్‌కు అందుతుంది. సంబంధిత ఉపాధ్యాయుడికి జూమ్ లేదా మరో ప్రసార మాధ్యమం ద్వారా సంబంధిత అంశంపై అవగాహన కల్పిస్తారు. పాల్గొనేందుకు అర్హతలు ● ప్రభుత్వ, ప్రైవేటు, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ● యూపీఎస్ నుంచి రెండు, హైస్కూల్ నుంచి ఐదు, కళాశాల నుంచి రెండు చొప్పున ప్రాజెక్టులు గరిష్ఠంగా ఆన్లైన్ చేయవచ్చు ● ప్రతి తరగతి ఒక సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి దరఖాస్తు పద్ధతి ఇలా.. www.inspireawards.gov.in వెబ్సైట్లో స్కూల్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. యూడైస్, పాస్వర్డ్ కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్ (జాతీయ బ్యాంకుల్లో), ఆధార్ నంబర్ నమోదు చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా రాతపూర్వకంగా పొందుపరిచి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లాస్థాయిలో ప్రకటిస్తారు. వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల నగదు ప్రయోగ నిమిత్తం బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్‌లను ఏర్పాటు చేయాలి. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
కల్వకుర్తి రూరల్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెట్లు, జావెలిన్ త్రో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్– 8, 10, 12, 14, 16, 18, 20 బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే నెల 7న నేషనల్ జావెలిన్ డే ను పురస్కరించుకొని జనగాంలో నిర్వహించే నాలుగో నేషనల్ జావెలిన్ డే వేడుకలు, కిడ్స్ అథ్లెటిక్స్ మీట్లో ఎంపికై న జిల్లా క్రీడాకారులు పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. కాగా, ఎంపిక పోటీలను పట్టణ రెండో ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీడీలు బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్, అంజయ్య, రాజు, రాజేందర్, సరస్వతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఆలోచనలతో రావాలి
గత సైన్స్‌ఫేర్‌లో ప్రదర్శించిన ప్రయోగాలు వద్దు. కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని సూచించాం. ఇప్పటికే గైడ్ టీచర్లకు అవసరమైన సలహాలు అందించాం. త్వరలో టీచర్లకు అవగాహన కల్పిస్తారు. తర్వాత విద్యార్థులకు గైడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు తయారు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. సందేహాలు ఉంటే డీఎస్ఓను సంప్రదించండి. – గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట సృజనాత్మకత వెలికితీయాలి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ఫేర్లు ఎంతో ఉపకరిస్తాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ ముఖ్యంగా నాణ్యత, సైన్స్ అభివృద్ధికి దోహదపడుతుంది. పూర్తిగా కొత్త వాటిని పరిచయం చేసేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి. గణితం, సామాన్యంపై దృష్టిపెట్టేలా సంబంధిత టీచర్లు చొరవ చూపాలి. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్ ఏర్పాటు చేసి పిల్లల ఇన్నోవేషన్లను స్వీకరించాలి. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట ● -
అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
కల్వకుర్తి టౌన్/కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళాశక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు తదితర యూనిట్లు ఏర్పాటు చేయిస్తుందన్నారు. జిల్లాలో 5వేల మందికి ఇందిరా మహిళాశక్తి ద్వారా రుణాలు అందించడంతో వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అదే విధంగా కల్వకుర్తికి మంజూరైన 2,500 రేషన్ కార్డుల్లో 5,800 మంది పేర్లను నమోదు చేశామన్నారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని 57 ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 5.47కోట్లు, 1,387 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ. 1.57కోట్ల రుణాలు, 14మంది సభ్యులకు రూ. 6.88లక్షల బీమా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్డీఓ రాజేశ్వరి, ఆర్డీఓ శ్రీను తదితరులు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి.. భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సూచించారు. ఏదైనా దరఖాస్తు తిరస్కరణకు గురైతే, అందుకుగల కారణాలను రాత పూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, కల్వకుర్తి డివిజన్లో మొత్తం 3,126 దరఖాస్తులు అందగా.. 2,040 దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశామని ఆర్డీఓ శ్రీను తెలిపారు. మరో 1,846 దరఖాస్తులను ఆమోదించామని.. 1,280 దరఖాస్తులను తిరస్కరించినట్లు వివరించారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
కందనూలు: మహిళల ఆత్మవిశ్వాసమే సమాజం పురోగతికి మూలమని.. అందుకు అనుగుణంగా మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుందని ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మహిళాశక్తి సంబురాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళలందరూ కోటీశ్వరులుగా మారాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహాన్ని, అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం డ్వాక్రా పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఆ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐకేపీగా నామకరణం చేసి మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ ప్రభు త్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు. కాగా, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని 254 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 14.22కోట్లు, 2,568 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 3.03కోట్ల రుణాల చెక్కులతో పాటు ఐదుగురు సభ్యులకు రూ. 50లక్షల ప్రమాద బీమా చెక్కు, 28 మంది సభ్యులకు రూ. 17.40లక్షల లోన్ బీమా చెక్కులను ఎమ్మెల్యేలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు బీమా
●నిరంతరం ప్రక్రియ.. ఉపాధి కూలీలకు బీమా అనేది నిరంతరం ప్రక్రియ దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు. జిల్లాలో ఎవరెవరికి బీమా లేదన్న విషయాన్ని బ్యాంకుల వద్ద సేకరించి వారికి బీమా కల్పించేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా ం. ప్రతి ఒక్కరికి బీమా కల్పించడమే లక్ష్యంగా కూలీలకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. – ఓబులేసు, డీఆర్డీఓ నాగర్‌కర్నూల్: గ్రామాల్లో వలసలు నివారించి ప్రతిఒక్కరికీ స్థానికంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కూలీ ఉపాధి పొందుతుండగా వారికి మరో ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి సురక్ష పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. కూలీలతో కొంత ప్రీమియం సొమ్ము చెల్లింపజేసి వారికి బీమాను కల్పించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి హామీలో ఉన్న కూలీలకు ఎవరెవరికి బీమా ఉంది.. లేనివారితో చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు జిల్లాలో కూలీలకు ఎవరెవరికి బీమా లేదనే వివరాలను సేకరించి వారిని బీమా చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,11,181 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా.. ఇందులో 1,69,870 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరందరికి ఈ బీమా వర్తించనుంది. సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 71 ఏళ్లలోపు వారు జాతీయ బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌లో ఖాతా నుంచి ఏటా రూ.20 బీమాకు జమ చేయాలని అంగీకార పత్రం ఇవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా.. పూర్తి అంగవైకల్యం కలిగినా వారికి రూ.2 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. పాక్షికంగా అంగవైకల్యం కలిగిన రూ.లక్ష పరిహారం అందుతుంది. అయితే కూలీలకు బీమా చెల్లింపు సమస్యగా మారింది. కచ్చితంగా బ్యాంకుకు వెళ్లి నమోదు చేసుకోవాలి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులు దూరంగా ఉండడంతో నిరక్షరాస్యులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలామంది కూలీలు తమ వేతనాలను సీఎస్సీ కేంద్రాల ద్వారా తీసుకుంటారు. కాగా బీమా పొందాలంటే వేతనదారుడి ఇంటి పేరుతోపాటు తండ్రి, భర్త, వయస్సు, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాలి. వేతనదారుల నుంచి ఉపాధి సిబ్బంది అనుమతి పత్రం సేకరించి బ్యాంకుల్లో అందజేయాలి. ప్రతిరోజు పథకం కింద నమోదైన వివరాలు జిల్లా ఉపాధి కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. కాగా వందశాతం కూలీలకు ఈ బీమా సౌకర్యం కల్పించేలా ఉపాధి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన అమలు బీమా లేని వారిని గుర్తించే పనిలో అధికారులు వందశాతం సౌకర్యం కల్పించేందుకు చర్యలు జిల్లాలో 1,69,870 మంది కూలీలు ఖాతా నుంచి రూ.20 జమ -
ఒత్తిళ్లకు తలొగ్గొదు..
జిల్లాలో వర్క్ అడ్జెస్ట్మెంట్ కోసం చేపడుతున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్ పారదర్శకంగా జరగాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఇవ్వొద్దు. చాలా మంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులను, పలుకుబడిన సంఘాలను సంప్రదించి తనకు నచ్చిన దగ్గర పోస్టింగ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా జరగాలి. – రాజిరెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు పారదర్శకంగా నిర్వహిస్తాం జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి వర్క్ అడ్జెస్ట్మెంట్ డిప్యూటేషన్‌పై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. మండలాల నుంచి పూర్తి సమాచారం విద్యాశాఖ కార్యాలయానికి చేరలేదు. సమాచారం వచ్చిన తర్వాత ఎంతమందిని వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాలనేది పూర్తిగా తెలుస్తుంది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తాం. – రమేష్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ ● -
బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
కందనూలు: జిల్లాకేంద్రంలోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహాన్ని శనివారం రాత్రి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం నాణ్యతను గురించి తెలుసుకున్నారు. హాస్టల్లో సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలు, ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారని ఆరాతీశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తెచ్చిన పలు సమస్యలపై ఆయన స్పందిస్తూ త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు బాగా చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. -
గెస్ట్ లెక్చరర్ల భర్తీకి చర్యలు
బిజినేపల్లి: పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో 2025– 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ఆయా సబ్జెక్టుల్లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, పొలిటికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టులకు గాను మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాని, సెల్ నం.98484 66603ను సంప్రదించాలని సూచించారు. ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండదిగువన ఉన్న భోగమహేశ్వరం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక దృష్టిసారించి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను పలుమార్లు కలిసి ఆలయ అభివృద్ధి కోసం సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించారన్నారు. నిధుల మంజూరుకు కృషిచేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు చైర్మన్, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి భక్తులు తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం తిలతైలాభిషేకాలతో పూజలు చేశారని ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ముందుగా శనేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడికి రుద్రాభిషేకాలు, పూజలు చేసిన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆశీస్సులు అందజేశారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కింద బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి గోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ఏదైనా రంగంలో డిగ్రీ, పీజీలో 50 శాతం మార్కులు ఉండి, 25 ఏళ్లలోపు, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడని వారు అ ర్హులన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను వచ్చేనెల 18లోగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
సర్కార్ చదువే మేలు..
బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్ బహిరంగ సభకు హాజరైన ప్రజలు, మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లురవి, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి● పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు ● బడిబాటలో 12,712 విద్యార్థుల చేరిక ● మూతబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి ● ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో సత్ఫలితాలు అచ్చంపేట: రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బడుల్లో అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యా బోధన, కృతిమ మేధ(ఏఐ), అనుభవజ్జలైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య, రాత పుస్తకాలు ఉచితంగా అందిస్తుండడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 940 పాఠశాలలో గడిచిన మూడేళ్లలో దాదాపు 11,036 ప్రవేశాలు తగ్గాయి. విద్యార్థుల నమోదు తగ్గుతుండటంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లావ్యాప్తగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 12,712 మంది విద్యార్థులు చేరారు. 2024–25 విద్యా సంవత్సరంలో 73,190 మంది విద్యార్థులుండగా.. 2025–26 లో ఆ సంఖ్య 75,347కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెరుచుకున్న 24 పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి మూతపడిన పాఠశాలలు అనేది ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో గతేడాది జీరో ఎన్రోల్మెట్గా ఉన్న 84 స్కూళ్లు మూతపడగా.. ఈ ఏడాది వాటిలో 24 పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల 1, డీఎన్టీ పాఠశాలలు 6, టీడబ్ల్యూపీఎస్ 1, మండల పరిషత్ పాఠశాలలు 49, ఎయిడెడ్ పాఠశాలు 3 చొప్పున విద్యార్థుల నమోదు లేక తెరుచుకోలేదు. పాయింట్ల పద్ధతికి ప్రయత్నం.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల వారీగా ఏ ఉపాధ్యాయుడు ఎక్కువ మంది పిల్లల్ని బడిలో చేర్పిస్తారో వారికి పాయింట్లు ఇచ్చి సర్వీస్ పుస్తకంలో నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమయంలో ఈ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పిల్లల నమోదుపై దృష్టి సారించి, ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సఫలమయ్యారు. జిల్లాలో ఇలా.. పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా, మండల 3,513 పరిషత్ పాఠశాలలు కేజీబీవీ 298 రెసిడెన్సియల్ 855 సంవత్సరం విద్యార్థులు 2022–23 84,226 2023–24 78,265 2024–25 73,190 2025–26 75,347 అచ్చంపేట రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ రోడ్డు గుండా శ్రీశైలం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాలకు అధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పాలకులు, అధికారులు పోస్టాఫీసు చుట్టు పక్కల ఉన్న డబ్బాలను తొలగించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. అక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి నచ్చజెప్పి పంపించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట, చుట్టు పక్కల ఉన్న డబ్బాలను తొలగించారు. ఆ ప్రాంతాలనే ఆక్రమించారు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, లింగాల రోడ్డు, పోస్టాఫీసు కార్యాలయం చుట్టు పక్కల ఉన్న స్థలాల్లో డబ్బాలను తొలగించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి. కానీ ఆ ప్రాంతాలనే ప్రస్తుతం కొందరు ఆక్రమించి, అదెకిస్తూ సంపాదిస్తున్నారు. పండ్లు, ఇతర వ్యాపారాలను సాగిస్తున్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయంతో పాటు, సివిల్ కోర్టు ఉండటంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. చౌరస్తాలో యూ టర్న్ తీసుకోవాలంటే నరకమే. అటు, ఇటుగా వాహనాలు రావడంతో పాటు టర్నింగ్లోనే పోస్టాఫీసు ఎదుట ఆక్రమించిన స్థలంలోనే వ్యాపారం కొనసాగిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అద్దె వసూలు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట దుకాణ సముదాయాలు ఉన్నాయి. వాటి ముందు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి నుంచి ప్రతి నెల అద్దె వసూలు చేస్తున్నారు. పండ్లు, పూలు, చాట్‌బండార్, మిర్చి, కూల్‌డ్రింక్స్, ఇతర వ్యాపారాలు చేసే వారు తోపుడు బండ్లను దుకాణాల ముందు ఉంచితే వారి నుంచి దర్జాగా అద్దె వసూలు చేస్తున్నారు. వారంతా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గతంలో డబ్బాలను తీసేయగా.. ప్రస్తుతం తోపుడు బండ్లు డ్రెయినేజీపై ఉంచి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాగే కూరగాయల మార్కెట్లో సమస్యను చెప్పనక్కర్లేదు. దుకాణాల ఎదుట చిన్న వ్యాపారాలు చేస్తుండటంతో నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంటుంది. రోడ్లపైనే మురుగు పాతబస్టాండు, నెహ్రూ చౌరస్తాలో డ్రెయినేజీలోని పూడిక తీయడం సాధ్యంకాక పేరుకుపోతుంది. వర్షాల సమయంలో వరదంతా రహదారిపైనే పారుతుంది. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి నీరు చేరుతుంది. చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందం ● గాలింపు చర్యలు ప్రారంభం మెట్టుగడ్డ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి రిజిస్ట్రార్ ఫణీందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్లకు సూచించారు. జూన్ 30న జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ పదవీ విరమణ పొందడంతో ఇప్పటి వరకు ఈ స్థానం ఖాళీగానే ఉంది. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌కు మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేటలో రోడ్డు స్థలాల ఆక్రమణలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టించుకోని పాలకులు, మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరిస్తాం... పట్టణంలోని ఆక్రమణలపై కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తాం. కౌన్సిల్ తీర్మాణం ప్రకారం టౌన్‌ప్లానింగ్ అధికారికి చెబుతాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. తాను ఇటీవలి కాలంలోనే బాధ్యతలు చేపట్టాను. రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. – మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట జిల్లావ్యాప్తంగా.. జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు 816, కేజీబీవీలు 20, ఎయిడెడ్ పాఠశాలలు 13, మోడల్ స్కూళ్లు 2, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల 1, జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు 60, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 39, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 15 మినీ గురుకులాలు 3, బీసీ గురుకులాలు (ఎంజీపీటీ) 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (టీజీఎస్‌డబ్ల్యూ) పాఠశాలలు 14, సీబీఎస్ఈ పాఠశాల ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 3 ఉన్నాయి. అన్ని పాఠశాలలో పెరిగారు.. జిల్లాలో అన్ని ప్రభుత్వపాఠశాలల్లో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. మూతపడిన పాఠశాలలను మొదట గుర్తించి ఆ గ్రామాల్లో బడిఈడు పిల్లల్ని చేర్పించారు. దీంతో మూతబడిన 24 పాఠశాలలు తెరుచుకున్నాయి. అక్కడ ఉపాధ్యాయులను నియమించాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యతగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల ప్రవేశాలు పెరగడానికి దోహదపడ్డారు. – రమేష్‌కుమార్, జిల్లా విద్యాధికారి సామర్థ్యాల పెంపు దృష్టి ఎన్సీఈఆర్టీ, విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన సర్వే (నాస్) జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పీజీఐ, అసర్ నివేదికలు వివిధ స్థాయిలో ముఖ్యమైన అభ్యసన సామర్థ్యాల్లో అంతరాలు చూపించాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల పెంచేలా సాధికారికత కల్పించడం, వినూత్న వ్యూహాలు, ప్రభావవంతమైన బోధన పద్ధతులపై దృష్టి పెట్టేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. -
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొల్లాపూర్ ప్రాంతం.. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు కౌన్ పూచ్తా కొల్లాపూర్ అనుకున్న ప్రాంతాన్ని, హమ్ జాదా లేనా కొల్లాపూర్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్ట, పార పని చేసినా పాలమూరు బిడ్డలే ఉంటారని చెప్పారు. ఇక్కడి మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాధ్యతను తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ 9 నాటికి అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారాన్ని చెల్లిస్తామని, భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల కాలంలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ‘పాలమూరు బిడ్డగా ఇక్కడి పరిస్థితులు, కష్టాలు నాకు తెలుసు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేసింది. రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్ల మొన్న జూరాలకు నిమిషాలలో రూ.120 కోట్లు మంజూరు చేశాం. ఇక్కడి నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు దొంగలకు సద్దులు మోశారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకో రెండు సీట్లు వచ్చుంటే.. ఈ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుండే.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్‌ను ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్.. ఈ గడ్డకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు తెచ్చింది ఏమీ లేదు. 98 జీఓ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నిర్వాసితులు ఏళ్ల తరబడి అడుగుతూ వస్తున్నా.. వారిని గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమై సహకారం అందిస్తామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి, దాని ప్రారంభానికి మళ్లీ ఇక్కడికి వస్తా సీఎం అన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు రూ.334 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు రూ.6.33 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాధ బీమా తదితర వాటిక సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాయకులు బెల్లయ్యనాయక్, సరిత, జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. సాధికారత దిశగా పయనం: మంత్రి దామోదర రాజనర్సింహ మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మల్లురవి బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ఘ నత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కు తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచామన్నారు.కొల్లాపూర్ అభివృద్ధికిసహకరించాలి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 వేల ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువపత్రాలు ఇప్పించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొలచింతలపల్లి శివారులో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, పెంట్లవెల్లి సింగిల్ విండో సొసైటీలోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని, సోమశిల– సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి త్వరగా అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని సీఎం దృష్టికి తెచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి వాకిటి సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానంలో విద్య, ఉపాధి, రైతు, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయమన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల బాధ్యత నాదే: సీఎం రేవంత్‌డ్డి డిసెంబర్ 9 నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం.. పరిహారం చెల్లిస్తాం బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుతెచ్చింది ఏమీలేదు శ్రీశైలం నిర్వాసితులనుఎందుకు ఆదుకోలేదు జటప్రోలులో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య భవిష్యత్‌కు కీలక దశ అని.. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఉన్నతస్థాయిలో స్థిరపడినప్పుడే సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. అప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు. -
వరాల జల్లు కురిసేనా..
నేడు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ● మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. ● మధ్యాహ్నం 1:45 గంటలకు జటప్రోల్‌కు చేరుకుంటారు. ● 1:55 గంటలకు జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ● 2:10 గంటలకు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ● 2:20 నుంచి సాయంత్రం 4గంటల వరకు జటప్రోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ● సభలోనే ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తారు. ● సాయంత్రం 4:30 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. -
కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
కోడేరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ విశ్వేశ్వర్ అన్నారు. గురువారం కోడేరు జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయాలన్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, పస్పుల శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారు. -
అందుబాటులో 6,119 మె.ట. యూరియా
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 6,119 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరా 5 బస్తాల యూరియా మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. అధికంగా యూరియా వినియోగించడం వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఫర్టిలైజర్ దుకాణ డీలర్లు ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని.. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలు, ఏఓలు అప్రమత్తంగా ఉండాలని, రోజు సహకార సంఘాలను సందర్శించి రైతులకు సరపడా ఎరువులు సకాలంలో అందించాలని ఆదేశించారు. -
జోరుగా పైరవీలు..!
హైదరాబాద్‌కు చేరిన ధాన్యం లారీ పంచాయితీ లెక్కలు తేల్చడంలో అధికారుల మీనమేషాలు అక్రమంగా ధాన్యం తరలిస్తూ పట్టుబడిన క్రమంలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి తీయడంలో సివిల్సప్లై శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. వాస్తవానికి సీజన్ల వారీగా మిల్లులకు కేటాయించిన ధాన్యం, అందుకు సంబంధించి మిల్లులు తిరిగి ఇచ్చిన బియ్యం లెక్కలు ప్రతిరోజు అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తుంటారు. అయితే అక్రమంగా దొరికిన ధాన్యం లోడులారీ లెక్కలు తీయడంలో మాత్రం అధికారుల మీనమేషాలు లెక్కిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆన్లైన్లో అన్ని లెక్కలు ఉన్నా.. విచారణ పేరిట కాలయాపన చేసి సదరు రైస్‌మిల్లు యజమానిని తప్పించే పనిలో సివిల్ సప్లయ్ శాఖ అధికారుల బిజీగా ఉన్నట్లు బాహటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా పైరవీల నేపథ్యంలో అవినీతి లెక్కలు బయటకు వస్తాయా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని నందిన్నెలోని సదరు రైస్ మిల్లుకు కేటాయిస్తే.. మిల్లు యజమాని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై నందిన్నె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రైస్ మిల్లు యజమానిపై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదిలాఉండగా, ఈ ఽవ్యవహారంపై విచారణ జరుపుతున్న సివిల్ సప్లయ్ డీఎస్ఓ స్వామిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. ● తాజాగా రాయచూర్ సమీపంలోని మిల్లులో 50 వేల బస్తాల ధాన్యం డంప్ ● ధాన్యం లారీ వ్యవహారంలో వెలుగుచూస్తున్న అక్రమాలు ● సదరు రైస్ మిల్లుకు మూడు సీజన్లలో రూ.45 కోట్ల ధాన్యం కేటాయింపు ● మర ఆడించి అందించింది రూ.5 కోట్ల బియ్యమే.. సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్/గద్వాల: కేటీదొడ్డిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ధాన్యం లోడు లారీ పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. ప్రభుత్వంలోని కీలకంగా వ్యవహరించే పెద్దను ఆశ్రయించి అక్రమాల నుంచి బయటపడేందుకు రైస్‌మిల్లు యజమాని జోరుగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ అవినీతి బాగోతంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో కాకలుతీరిన సదరు రైస్‌మిల్లు యజమాని తనకున్న పలుకుబడితో 2022 రబీ, 2024 ఖరీఫ్, 2024–25 రబీ సీజన్లలో సుమారు రూ.45 కోట్ల విలువ గల ధాన్యాన్ని తన మిల్లుకు కేటాయించేలా చేసినా.. ప్రభుత్వానికి తిరిగి 10 శాతం మాత్రమే సీఎమ్మార్ బియ్యం అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో సుమారు రూ.5 కోట్ల విలువ గల ధాన్యాన్ని కర్ణాటకలోని రాయచూరు సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో గుట్టుగా దాచిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ముడుపులతో కెపాసిటీ పెంపు నందిన్నెకు చెందిన సదరు రైస్‌మిల్లు యజమాని అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి జైకొట్టి తన అక్రమ దందా కొనసాగిస్తుంటాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. సాధారణంగా రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించే క్రమంలో అధికారులు మిల్లు కెపాసిటీని పరిగణలోకి తీసుకుంటారు. అయితే, ఈ మిల్లు సామర్థ్యం 6 టన్నులు ఉంటే దానిని 10 టన్నులకి పెంచుకుని పెద్దమొత్తంలో ధాన్యం కేటాయించుకున్నాడు. ఇందులో తనకు సహకరించిన సివిల్ సప్లయ్ శాఖలోని ఓ కీలక అధికారికి దాదాపు రూ.6 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్ద వరకు పంచాయితీ నందిన్నెలోని ఓ రైస్‌మిల్లు యజమాని ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో 400 క్వింటాళ్ల వడ్ల ధాన్యం లారీ అక్రమంగా కర్ణాటకలోని రాయచూరుకు తరలిస్తుండగా.. విషయం తెలుసుకొని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. సదరు రైస్ మిల్లు యజమాని ఈ కేసు నుంచి బయటపడేందుకు గద్వాల సివిల్సప్లై శాఖలోని ఓ అధికారిని మొదట ఆశ్రయం పొందాడు. అయితే, పరిస్థితి సీరియస్ కావడంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ద్వారా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ పెద్దను ఆశ్రయించినట్లు తెలిసింది. తనపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా హైదరాబాద్‌లో తిష్టవేసి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ● 2022 రబీలో 1,425.520 మెట్రిక్ టన్నుల ధాన్యం, 2024 ఖరీఫ్‌లో 5,948.560 మెట్రిక్ టన్ను లు, 2024–25రబీలో 10,294.680 మెట్రిక్ టన్ను లు మొత్తంగా మూడు సీజన్లలో సుమారు రూ.45 కోట్ల విలువ గల (40కేజీల సామర్థ్యం ఉన్న 4 లక్ష ల ధాన్యం బస్తాలు) ధాన్యం సివిల్ సప్లయ్ శాఖ అ దికారులు సదరు మిల్లుకు కేటాయించారు. ఇందు లో ఇప్పటి వరకు 2024 ఖరీఫ్‌కు సంబంఽధించి 17 ఏసీకేల వరకు, మార్చి 2024–25 రబీకి సంబంధించి 13 ఏసీకేల వరకు బియ్యంగా మార్చి అందించారు. 2022 రబీకి సంబంధించి బియ్యం నేటికీ అందించలేదు. ప్రభుత్వానికి ఇప్పటి వరకు కేవలం రూ.5 కోట్ల విలువ గల బియ్యం అందించాడు. -
మొక్కజొన్న రైతులకు అండగా ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: మొక్క జొన్న కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధిత రైతులు ఎస్పీగైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ను ఆశ్రయించడంతో ఆయన బాధితులకు న్యాయం చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఎస్పీ వెల్లడించిన వివరాలు.. బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్‌కు చెందిన ఆంజనేయులు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని నందివడ్డెమాన్, ఖానాపూర్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన దాదాపుగా 56మంది రైతులకు సంబంధించి రూ.కోటి విలువైన మొక్కజొన్నను కొనుగోలు చేశాడు. ఆంజనేయులు రైతులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధిత రైతులందరూ కలిసి రెండు నెలల క్రితం న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించారు. స్పందించిన ఎస్పీ రైతులకు న్యాయం చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించడంతో ఆంజనేయులు నుంచి రూ.60లక్షల వరకు వసూలు చేసి బుధవారం రైతులకు అందజేశారు. రైతులకు న్యాయం చేసిన ఎస్పీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తులకు రైతులు తమ పంటలను విక్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలని సూచించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన సజావుగా జరగడానికి శాఖల వారీగా అధికారులు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం నిర్వహించే సభకు జిల్లా నలుమూలల నుంచి 70 వేల మంది పాల్గొంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా టెంట్లు, స్టేజీ, రోడ్డు మార్గం, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, లైట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అధికారులతో సమీక్ష సీఎం పర్యటకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పని విభజన చేసుకోవడంతో పాటు ఒకరినొకరు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద, సభాస్థలి పరిసరాల్లో భద్రతా సిబ్బంది నిరంతరం గస్తీ చేయాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, నాయకులు రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, నల్లపోతుల గోపాల్, నాగిరెడ్డి, భీంరెడ్డి, కబీర్, బాలరాజు పాల్గొన్నారు. రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ -
చదువుతోనే పేదరికం దూరం
మన్ననూర్: పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని గిరిజన గురుకులాల ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్ సూచించారు. పేదరికాన్ని దూరం చేసుకోవడానికి చదువే ముఖ్య సాధనమన్నారు. మన్ననూర్లోని ఆదిమజాతి గురుకుల పాఠశాల, కళాశాలను (పీటీజీ) బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 7వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థి దశలో లక్ష్యం నిర్ధేశించుకొని, దానిని సాధించేందుకు నిరంతరం కష్టపడాలన్నారు. విద్యార్థులు లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అదనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులే మార్గనిర్ధేశకులు విద్యార్థులు సహజంగా ఉపాధ్యాయులను అ నుకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో ఉండటంతో పాటు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వస తి గృహంలో విద్యార్థుల కోసం తయారు చేసి న వంటను రుచి చూశారు. ప్రభుత్వం నూత నంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఏ చిన్న సమస్య తలెత్తినా సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్సీఓ సుధాకర్, ఏపీఓ యాదమ్మ, ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం మన్ననూర్: సుప్రీం కోర్టు సూచనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానంతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబావి, కుమ్మరోనిపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమ్రాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూరుగు వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి మాలలను 3వ గ్రూప్‌లో ఉంచి 5 శాతం రిజర్వేషన్ కేటాయించారన్నారు. అది కూడా మాలలకు పూర్తి స్థాయిలో దక్కకుండా కుట్ర పూరితమైన రోస్టర్ విధానం అమలులోకి తేవడం దురదుష్టకరమని మండిపడ్డారు. దీంతో మాల విద్యార్థి, నిరుద్యోగులకు తీరని నష్టం కలిగించేదిగా ఉన్న రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 3తో పాటు శాతవాహన యూనివర్సిటీ ఉద్యోగాల్లో గ్రూప్ 3లో 5 శాతంగా ఉన్న మాలలకు ఒక్క ఉద్యోగం కూడా కేటాయించ లేదంటే రోస్టర్ విధానం ఎంత లోపాభూయిష్టంగా ఉందనేది ఇట్టే అర్థమవుతుందన్నారు. రద్దు చేయాలి మాలలకు శాపంగా మారిన రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటూ మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్, నాసరయ్య, బాలస్వామి, బాలకిష్టయ్య, జక్క గోపాల్, పెర్ముల రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, కుమార్, నంద, రాముడు, రామాంజనేయులు, పాండు పాల్గొన్నారు. ఈవీఎంలకు పటిష్ట భద్రత గద్వాల: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈఓ, ఈవీఎంల నోడల్ అధికారి హరిసింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంలను రాష్ట్రస్థాయి బృందంతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ మల్లిఖార్జున్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ కరుణకర్, సురేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి బాల కల్యాణ ఆశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమంలోని వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదని, ముఖ్యంగా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, పరీక్షల్లో మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ ఇన్చార్జ్ నారాయణరెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు శ్రీశైలం, మల్లేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ ఢిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు పవనశేషసాయి పాల్గొన్నారు. -
ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల కంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. రిజర్వేషన్లపై వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పంచాయతీ సర్పంచుల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ప్రత్యేక పాలన కొనసాగుతుండటంతో తిరిగి ఎన్నికలు ఎప్పుడు చేపడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు సన్నాహాలు చేపడుతోంది. ఈ ప్రక్రియ వేగవంతమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితేనే బీసీలకు రిజర్వేషన్ పెంపు అమలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశం నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం నెలకొంది. కొత్తగా బీసీలకు రిజర్వేషన్‌ను పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా, లేక పాత రిజర్వేషన్లకే పరిమతమవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 780 ఎంపీటీసీ స్థానాలు పంచాయతీ కన్నా ముందే జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఊహగానాలు -
రూ.150 కోట్లు.. 22 ఎకరాల విస్తీర్ణం..
సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, డిజిటల్ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, విశాలమైన, విభిన్న రకాల ప్లేగ్రౌండ్స్‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లాలో కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తయితే జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్య అందనుంది. జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో తొలిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్ల ఖర్చుతో జటప్రోలులోని సర్వే నంబర్ 176, 177లో 22 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల భవనాలు, హాస్టళ్లు, మైదానాలు తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు. పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలులో నిర్మాణం ఈనెల 18న భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి -
1987లో ఇంటిజాగ కొన్నాం..
మేము 1987లో బుచ్చి రెడ్డి వద్ద ఇంటిజాగ కొనుకున్నాం. ఇందు కు సంబంధించి పత్రా లు రాయించుకుని ఇళ్లు కట్టుకున్నాం. అప్పటినుంచి ఇంటిపన్ను గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనడం ఎక్కడి న్యాయం. – బత్తుల బాలింగయ్య, పదర న్యాయం చేయాలి.. గ్రామ శివారులోని ఊరబావిచెల్కలో ఉన్న భూమిని 30ఏళ్ల క్రితం మేం అందరం కొనుగోలు చేసి ఇళ్లను కట్టుకున్నాం. ఏళ్లుగా పన్నులు చెల్లిస్తూ ఈ ఇళ్లలోనే ఉంటున్నాం. ఇప్పుడు నోటీసులు పంపి ఇళ్లను ఖాళీచేయాలని అంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – కడారి బాలయ్య, పదర రికార్డుల్లో ఇళ్ల స్థలాలుగానే ఉంది.. పదర మండల కేంద్రంలోని ఊరబావిచెల్క భూములపై కేసు నడుస్తోంది. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సదరు భూమిలో ఇళ్ల స్థలాలు ఉన్నట్టు నమోదై ఉంది. గ్రామపంచాయతీ రికార్డుల్లోనూ ఇళ్ల స్థలాలుగానే ఉంది. – సురేశ్‌బాబు, తహసీల్దార్, పదర ● -
సమస్యల పరిష్కారానికి చర్యలు
నాగర్‌కర్నూల్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం 17వ వార్డులో ఆయన పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మొదటగా కాలనీలోకి వచ్చే రోడ్డుకు అడ్డుగా నిర్మించిన గోడతో పాటు అసంపూర్తిగా నిలిచిన మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. వార్డులో కొత్తగా నివాసగృహాలు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. నేడు డయల్ యువర్ డీఎం అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం మురళీ దుర్గాప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 94408 18849 నంబర్‌ను సంప్రదించి సమస్యలను తెలియజేయడంతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. గుడిబండ వద్ద ‘డ్రై పోర్ట్’ అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ సమీపంలో డ్రై పోర్ట్(రోడ్డు మార్గం ద్వారా ఓడరేవుకు అనుసంధానించబడిన ఇన్‌ల్యాండ్ టెర్మినల్) నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుడిబండ శివారులోని సర్వే నంబర్ 118లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ, లాజిస్టిక్స్ డైరెక్టర్ అపర్ణ, ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఇటీవల దేవరకద్ర వద్ద ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా గుడిబండ వద్ద డ్రై పోర్ట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ ఉండటం కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి కలిసి వస్తుందని చెప్పారు. చేనేత ఉత్పత్తులసంఘానికి అవార్డు అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్‌కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్‌గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విద్యుత్ కార్పొరేట్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ భవన్‌లోని మీటింగ్ హాల్లో విద్యుత్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు చెందిన కనెక్షన్లను త్వరగా మంజూరు చేయాలని, వాటికి సంబంధించిన విద్యుత్ సా మగ్రిని వెంటనే అందజేయాలని సూచించారు. -
ఆహ్లాదం.. అల్లంత దూరం!
అచ్చంపేట: పట్టణ ప్రజలు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలోని పార్కులు పచ్చదనం పంచలేక బోసిపోతున్నాయి. అచ్చంపేట పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండగా.. అందుకు అనుగుణంగా పార్కుల ఏర్పాటుపై మున్సిపల్‌శాఖ దృష్టి సారించలేకపోతోంది. 50ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పటేల్ పార్కు నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. 2011 జూలై 21న మధురానగర్ కాలనీలో ఎన్టీఆర్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఆ స్థలంలో ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం నిర్మితమైంది. పార్కులకు అనువుగా ఉన్న స్థలాలను మున్సిపల్ అధికారులు ధారాదత్తం చేయడంతో ఆహ్లాదకర వాతావరణం కరువైంది. ప్రకృతివనాల నిర్వహణ గాలికి.. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వార్డుకో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిట్టడవులను పెంచడం ద్వారా వాయు కాలుష్యం తగ్గి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని భావించింది. ఇందుకోసం పట్టణప్రగతి నిధులను ప్రత్యేకంగా వెచ్చించి.. ప్రకృతి వనాల్లో వేప, ఉసిరి, జామ, చింత, దానిమ్మ, టేకు, కానుగ ఇతర రకాల మొక్కలను నాటించింది. అయితే మొదట్లో వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు..కొన్నేళ్లుగా గాలికి వదిలేయడంతో అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లు పెరగాల్సిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు దర్శనిమిస్తూ.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. పట్టణ ప్రకృతి వనాలు కేవలం బోర్డులు, ఫెన్సింగ్లకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. పటేల్ పార్కు ఉనికి కనుమరుగు.. పట్టణ నడ్డిబొడ్డున సర్ధార్ వల్లబాయ్ పటేల్ పేరుతో ఏర్పాటు చేసిన పార్కు ఉనికి కనుమరుగవుతోంది. ఈ పార్కును అనుసరించి కూరగాయల మార్కెట్ గ్రంథాలయం ఉన్నాయి. రోజు ఎంతో మంది ప్రజలు వస్తుంటారు. అయితే పార్కును పునరుద్ధరించడంపై మున్పిపల్ అధికారులు దృష్టి సారించడం లేదు. శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదు. పటేల్ పార్కును పునరుద్ధరించాలని 20ఏళ్లగా పట్టణ ప్రజలు కోరుతున్నారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న ఈ పార్కును పునరుద్ధరిస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది. ● విద్యానగర్‌లోని అర్టీసీ బస్టాండ్ సమీపంలో మున్సిపల్‌శాఖ రూ. 10లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్, పార్కును పునరుద్ధరించారు. పట్టణ ప్రకృతివనం సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఆలయ నిర్మాణం చేపడుతుండటంతో పార్కు, ఓపెన్ జిమ్ నిర్వహణను గాలికొదిలేశారు. జిమ్ పరికరాలు వృథాగా పడి ఉన్నా మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వాతావరణానికి దూరంగా పట్టణవాసులు నిర్లక్ష్యపు నీడలో ప్రకృతివనాలు పార్కుల అభివృద్ధి పట్టని అధికారులు నిర్వహణ లోపంతో పిచ్చిమొక్కలకు నిలయాలుగా మారిన వైనం స్మృతివనం పేరిట నిధుల దుర్వినియోగం.. అటవీశాఖ కార్యాలయాన్ని అనుసరించి ఉన్న 10 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన స్మృతివనం నిరుపయోగంగా మారింది. దసరా, బతుకమ్మ సంబురాల నిర్వహణ సమయంలో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. అటవీశాఖ స్థల మార్పిడి చేయని కారణంగా ప్రజాధనం వృథా తప్ప.. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గతేడాది శ్రీశైలం ప్రధాన రహదారిలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం, 132/33 కేవీ సబ్‌స్టేషన్ నడుమ ఏర్పాటుచేసిన పార్కును సైతం అభివృద్ధి చేయడం మరిచారు. ఇప్పటికై నా పార్కులు, పట్టణ ప్రకృతివనాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. -
జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ డా.మల్లు రవి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డా.రాజేశ్‌రెడ్డి, డా.వంశీకృష్ణ, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశంలో జాతీయ రహదారులు, ఎస్సీ కార్పొరేషన్, వివిధ సంక్షేమ శాఖలు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు తదితర శాఖల పురోగతిపై దిశ కమిటీ చైర్మన్ మల్లు రవి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తనకు లేదా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయం, చిరు వ్యాపారాలకు రుణాలు అందించి పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో పురోగతి సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మద్దిమడుగు – మాచారం బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2017 నుంచి 2025 వరకు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించిన రుణాల గ్రౌండింగ్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, జిల్లా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మెడికల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచడంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా చేపట్టాలని, నీటిపారుదల కాల్వల ఆధునికీకరణ, పూడికతీత పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, దిశ కమిటీ సభ్యులు వంకేశ్వరం మణెమ్మ, ఎం.భగవంతురెడ్డి, వి.చిన్నయ్య, మాదవత్ మోతీలాల్ తదితరులు ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి ప్రజాప్రతినిధులు, అధికారులుసమన్వయంతో ముందుకుసాగాలి దిశ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి -
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
తిమ్మాజిపేట: ప్రస్తుతం ఎంతో మంది మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. వారి స్ఫూర్తితో మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని హ్యూమన్ ట్రాఫికింగ్, షీ టీం జిల్లా ఇన్చార్జీలు సీఐ శంకర్, విజయలక్ష్మి అన్నారు. తిమ్మాజిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం షీ టీం ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఇంటా, బయట నేరాలు పెరిగిపోతున్నాయని.. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యే వారు ధైర్యంగా డయల్ 100 లేదా 87126 57676 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హరిప్రసాద్‌రెడ్డి, రమాదేవి, ఎంఈఓ సత్యనారాయణశెట్టి, శ్రీలత, శేఖర్‌గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు. -
ఊరబావిచెల్కకు ఆపదొచ్చింది!
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆ గ్రామంలో 30 ఏళ్లుగా నివా సం ఉంటున్నారు.. ఇద్దరు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూమిలో ఇళ్లను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడా గ్రామస్తులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. వారు ఉంటున్న భూమి తమ పేరిట పట్టాగా నమోదై ఉందని.. వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇది పదర మండల కేంద్రంలోని ఊరబావిచెల్క గ్రామస్తుల దీనావస్థ. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. నల్లమల అటవీ ప్రాంతంలో భాగమైన పదర మండలకేంద్రం శివారులో ఉన్న సర్వేనంబర్ 126, 127లో గ్రామానికి చెందిన ఎ.బుచ్చిరెడ్డి, రాంరెడ్డి పేరిట 10.20 ఎకరాల్లో పట్టా భూములు ఉండేవి. ఈ భూమిని యజమానులు 1984 నుంచి గ్రామస్తులకు భాగాలుగా విక్రయాలు జరిపినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి 40 ఏళ్లుగా ఒక్కొక్కరుగా సుమారు 80 మంది వరకు స్థలాలను కొనుగోలుచేసి ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంటి స్థలాలను కొన్నట్టుగా పత్రాలు రాసుకోవడంతో పాటు గ్రామపంచాయతీ రికార్డుల్లోనూ నమోదు చేయించుకున్నారు. ఏటా ఇంటిపన్ను చెల్లిస్తూ 30ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. కోర్టు నోటీసులతో ఆందోళన.. కొన్నేళ్లుగా సదరు భూములు తమ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయని.. ఆ భూములు తమకు చెందినవేనని పూర్వీకులు అంటున్నారు. వెంటనే ఖాళీ చేసి తమకు అప్పగించాలంటూ స్థానికులకు నోటీసులు సైతం జారీచేశారు. మంగళవారం పదర ఎస్ఐ సద్దాం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ మరోసారి గ్రామానికి వెళ్లి స్థానికులకు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో స్థానికులు, భూ యజమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ఇప్పుడు ఖాళీ చేయమంటే తామంతా ఏమై పోవాలని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు నిర్మించుకున్న ఇళ్లపై రగడ తమ పేరిట ఉన్న 8.20 ఎకరాల పట్టా భూమిని ఖాళీ చేయాలంటూ నోటీసులు 30ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నామని గ్రామస్తుల ఆందోళన -
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పెంట్లవెల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. మంగళవారం పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. జటప్రోల్లో రూ. 150కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హెలీపా్య్డ్, సభా స్థలాన్ని మంత్రి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. కాగా, జటప్రోల్ సమీపంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 16.06 ఎకరాల భూమి గోప్లాపూర్ శివారుకు చెందినదని.. కొత్తగా నిర్మించే పాఠశాలకు తమ గ్రామం పేరు పెట్టాలని కోరుతూ గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
సమస్యలు పరిష్కరిస్తాం..
అచ్చంపేట: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ మురళి అన్నారు. సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్‌లో అచ్చంపేట పట్టణ ప్రజలు పలు సమస్యలను ఏకరవు పెట్టారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, రోడ్లపై మురుగు పారకుండా డ్రెయినేజీలు నిర్మించాలని, పిచ్చిమొక్కల తొలగింపు, వీధిదీపాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, దోమల నివారణ, సీసీ రోడ్ల నిర్మాణం, బోరు మోటార్ల మరమ్మతు, తాగునీరు, పందుల బెడద తదితర సమస్యలను పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్ స్పందించి రెండు, మూడు రోజుల్లో ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ● ప్రశ్న: మా వీధిలో వీధిదీపాలు వెలగడం లేదు. చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం. – బాల్‌లింగం, 19వ వార్డు ● కమిషనర్: మా సిబ్బంది కాలనీ సందర్శించి పరిశీలిస్తారు. వీధిదీపాల ఏర్పాటు చేసి కాలనీలో చీకట్లు లేకుండా చూస్తాం. ● ప్రశ్న: ఉప్పునుంతల రోడ్డులో నిర్మాణంలో ఉన్న కల్వర్టును వెంటనే పూర్తి చేయించండి. – జంగయ్య, స్థానికుడు ● కమిషనర్: కల్వర్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసేలా ఆర్అండ్బీ అధికారలు దృష్టికి తీసికెళ్లి వారం రోజుల్లో రాకపోకలు పునరుద్ధరించే విధంగా చూస్తాం. ● ప్రశ్న: సాయినగర్ కాలనీలో ఇల్లు కట్టుకొని 25 ఏళ్లు అవుతుంది. శంకర్ మెకానిక్ నుంచి డ్రెయినేజీ, సీసీ రోడ్లు లేవు. చిన్నగా ఉన్న డ్రెయినేజీని పెద్దగా నిర్మించండి. – సుధాకర్, సాయినగర్‌కాలనీ ● కమిషనర్: మా సిబ్బంది వచ్చి పరిశీలిస్తారు. అవసరమైతే కొత్తగా డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. ● ప్రశ్న: రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్రూంల వద్ద డ్రెయినేజీ, చెత్తాచెదారం తొలగించండి. కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. శివసాయినగర్‌లో ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేసి.. మురుగు కాల్వ శుభ్రం చేయండి. – సైదులు, రాజీవ్‌కాలనీ, స్వామి, శివసాయినగర్ ● కమిషనర్: డ్రెయినేజీలో చెత్తాచెదారం తొలగిస్తాం. కరెంట్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు గురించి విద్యుత్ అధికారులకు సూచిస్తాం. మురుగు కాల్వ శుభ్రం చేయిస్తాం. ● ప్రశ్న: టంగాపూర్ కాలనీలో పెద్దమ్మగుడి వద్ద డ్రెయినేజీ సగం కట్టి వదిలేశారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు. – వందన, టంగాపూర్ కాలనీ ● కమిషనర్: కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మురుగు కాల్వను శుభ్రం చేయిస్తాం. ● ప్రశ్న: వినాయకనగర్‌లో సీసీ రోడ్డు వేయాలి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లు శుభ్రం చేయడం లేదు. పెరిగిన చెట్లతో పాములు వస్తున్నాయి. – దేవి, వినాయకనగర్, సుప్రియ, మార్కెట్ రోడ్డు, బుజ్జి ఆదర్శనగర్, హమ్మద్ ఆర్టీసీ బస్టాండు ఏరియా ● కమిషనర్: అక్కడ డ్రెయినేజీని వెంటనే శుభ్రం చేయిస్తాం. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తాం. సీసీ రోడ్డు నిర్మాణానికి కొంత సమయం పడతుంది. ప్రణాళికాబద్ధంగా అవసరమైన ప్రదేశాలను గుర్తించి చేపడుతాం. ప్రశ్న: మారుతినగర్లో కరెంటు స్తంభాలు వేశారు. వైరు లాగి వీధిదీపాలు ఏర్పాటు చేయండి. ముస్లిం శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. – మల్లికార్జున్ మారుతినగర్, ఉస్మాన్ పట్టణవాసి కమిషనర్: విద్యుత్‌శాఖ వైరు లాగితే వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. శ్మశాన వాటికలోనూ ఏర్పాటు చేసేలా చూస్తాం. ప్రశ్న: చేపల మార్కెట్ లేక రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నాం. మార్కెట్లోకి తరలించేలా చూడండి. మల్లంకుంట బఫర్ జోన్లో అసంపూర్తి, అక్రమ కట్టడాలను తొలగించండి. – రేణయ్య, పట్టణవాసి కమిషనర్: ఇంటిగేట్రేడ్ మార్కెట్ కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. మార్కెట్ నిర్మాణం జరిగితే అందరికీ అందులో అవకాశం కల్పిస్తాం. అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి తొలగిస్తారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు దీనిపై లేఖ రాశాం. ప్రశ్న: ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు పెరిగి పాములు, పురుగులు వస్తున్నాయి. మల్లకుంట రోడ్డుపై పడేసిన వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతుండటంతో హాస్టల్ విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వీధిదీపాలు లేక రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. ఆదర్శనగర్‌లో మాలమహానాడు భవనం వద్ద పిచ్చిమొక్కలు తొలగించి, సీసీ రోడ్డు నిర్మించండి. – జగదీష్ 14 వార్డు పాత బస్టాండు, మల్లేష్ ఆదర్శనగర్ కమిషనర్: పిచ్చి మొక్కలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు వేసే వారిని గుర్తించి అక్కడ వేయకుండా అవగాహన కల్పిస్తాం. వెంటనే పాడైన వీధిదీపాలను ఏర్పాటు చేస్తాం. ప్రశ్న: సాయినగర్ ప్రాథమిక పాఠశాలలో మురుగు నిలుస్తోంది. ఆర్టీసీ బస్టాండు ఇన్ గేట్ వద్ద మురుగు కాల్వ శుభ్రం చేయడం లేదు. దోమల బెడద ఎక్కువగా ఉంది. – గణేష్, సాయినగర్, నారాయణ ఆర్టీసీ బస్టాండు ఏరియా కమిషనర్: సిబ్బందిని పంపించి మురుగు నిల్వకుండా పారిశుద్ధ్య చర్యలు చేపడుతాం. అలాగే ఆర్టీసీ బస్టాండు నుంచి మురుగు రాకుండా చేస్తాం. ప్రశ్న: వలపట్ల కాలనీ రోడ్డుపై మట్టిలో కూరుకుపోయిన సింగిల్ ఫేజ్ బోరు మోటార్ ప్లాట్ ఫాం నిర్మించి, మినీ ట్యాంకు నీళ్లు ఇచ్చేలా పునరుద్ధరించాలి. – సుధాకర్, 13వ వార్డు కమిషనర్: వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండటంతో మట్టిపోశాం. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి వెంటనే పునరుద్ధరించే పనులు చేపడుతారు. ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో అచ్చంపేటమున్సిపల్ కమిషనర్ మురళి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ప్రాధాన్య క్రమంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం వీధి దీపాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు మా దృష్టికి వచ్చిన సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం -
ఎత్తిపోతలకు గ్రహణం
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల పరంపర ● తరుచుగా సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాకు ఆటంకం ● ప్రస్తుతం నెట్టెంపాడులో రెండు, కల్వకుర్తి రెండు, కోయిల్సాగర్లోఒక పంపుతోనే నీటి పంపింగ్ ● బకాయిలు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామంటూ ఏజెన్సీల కొర్రీ ● వరద సమయంలోనే హడావుడి చేస్తున్న వైనం గద్వాల: పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి వాటి కింద సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే.. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచుగా మరమ్మతుకు గురవుతుండటంతో నీటి పంపింగ్‌కు అడ్డంకిగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఎత్తిపోతలకు గ్రహణం పట్టినట్లయింది. నీటిని ఎత్తిపోసే పంపులకు సంబంధించి మోటార్లకు గత కొన్నేళ్లు సరైన మరమ్మతు చేయకపోవడం, మెయింటెనెన్స్ డబ్బులు సంబంధిత కంపెనీలకు చెల్లించకపోవడంతో సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎత్తిపోతల పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రెండో పంటకు సాగునీరు అందించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. రెండు మోటార్లతో నెట్టెంపాడు.. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు మోటార్లు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన ఐదు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్ఈఎల్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపేశారు. గతేడాది ఆగస్టులో సైతం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద మోటార్లు కాలిపోగా.. నిర్వాహకులు చేతులెత్తెయడంతో అప్పటి సీఈ రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు చేరుకుని మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను బీహెచ్ఈఎల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి మరమ్మతు చేసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ర్యాలంపాడు జలాశయం ద్వారా 1.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ● నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కేఎల్ఐ నేటికీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. రెండు పంపులు సాంకేతిక కారణాలతో మూలకు పడ్డాయి. మూడు మోటార్లు ఉన్నా.. రెండింటితోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్క మోటారుతో కోయిల్‌సాగర్.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో రెండు పంటలకు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో కోయిల్‌సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోయాల్సిన పంపుహౌస్‌లోని రెండు మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజులపాటు నడిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, రెండు మోటార్లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఏడాదిగా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. -
నాగర్‌కర్నూల్
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025వివరాలు 8లో u● ప్రశ్న: ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మురుగు కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన దహన వాటికను వినియోగంలోకి తేవాలి. ఏపుగా పెరిగిన కంప చెట్లు తొలగించండి. – మండికారి బాలాజీ, పట్టణవాసి ● కమిషనర్: డ్రెయినేజీ నిర్మాణానికి రూ.8 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. శ్మశాన వాటికలో కంప చెట్లు తొలగించి దహన వాటికను వినియోగింలోకి తెస్తాం. న్యూస్‌రీల్ ప్రశ్న: లింగాల రోడ్డులో పాత ఆంధ్రాబ్యాంకు రోడ్డు, 9వ వార్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. పిల్లల వెంట పడుతున్నాయి. వారం రోజులకోసారి కూడా చెత్తబండ్లు రావడం లేదు. వారం రోజులుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తున్నారు. – భాస్కర్‌రెడ్డి విద్యానగర్‌కాలనీ, జంగమ్మ 9వ వార్డు కమిషనర్: వీధికుక్కల నియంత్రణకు జిల్లాకేంద్రంలో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక బృందం ద్వారా త్వరలోనే కుక్కలను పట్టుకుంటాం. ఇకపై రెగ్యులర్‌గా చెత్త ఆటోలు వస్తాయి. ఖాళీ ప్లాట్లలో చెత్త వేయకుండా చెత్త ఆటోల ద్వారా మైకులో ప్రచారం చేస్తాం. ఎవరి ప్లాట్లు వారే శుభ్రం చేసుకోవాలి. -
వైకల్యం ఉన్నవారిని వేధిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: మానసిక వైఫల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం సహృద్భావంతో మెలిగి వారికి అన్ని రకాలుగా సహాయపడాలని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. సోమ వారం మండలంలోని గుడిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని హక్కులను అమలు చేయడం వారి బాధ్యత అన్నారు. వైకల్యం గల వ్యక్తులను హింసించినా, వారితో క్రూరంగా ప్రవర్తించినా, అసహ్యంగా మాట్లాడినా, అగౌరవపరిచి నా జైలుశిక్ష విధిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనుకోని ప్రమాదాల నుంచి వైకల్యం గలవారిని ఇతర వ్యక్తులతో సమానంగా రక్షణ భద్రత కల్పించాలన్నారు. అంగవైకల్యం ఉన్న వారికి సంతాన ఉత్పత్తి కుటుంబ నియంత్రణ విషయంలో తగిన సమాచారంపై అవగాహన కల్పించాలన్నారు. వికలాంగులు తమ సమస్యల గురించి టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి వినియోగించుకోవాలన్నారు. ఉచిత న్యాయ సలహాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్కానింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ సదుపాయాన్ని కల్పించామని సద్వినియోగం చేసుకోవాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి అన్నారు. సోమవారం గర్భిణులకు అవసరమైన ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి రేడియాలజిస్ట్ వైద్యులు రిపోర్టు చేయడంతో స్కానింగ్ సేవలు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని, సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణులకు స్కానింగ్ సేవలు చేస్తారన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, పలు వ్యాధుల నిర్ధారణ కోసం డిజిటల్ ఎక్స్ రే ప్రతిరోజు 80 నుంచి 90 రోగులు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక వ్యాధి నిర్ధారణ నిమిత్తం అవసరమైన రోగులకు సిటీ స్కాన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ ప్రశాంత్, రోహిత్, రేడియాలజిస్ట్ ఈశ్వరి, గ్రేడ్ వన్ మెడికో సోషల్ వర్కర్స్ జ్యోతి, విజయలక్ష్మి, బాలమ్మ, హెల్ప్ డెస్క్ ఇన్చార్జ్ యాదగిరి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్ గ్రామం సర్వే నంబర్లు 147, 508లో 22 ఎకరాలలో నిర్మించిన రెసిడెన్సియల్ స్కూల్‌ను ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించనుండటంతో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ముందుగా హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే మండల రెవెన్యూ, ఇతర అధికారులు సభా స్థలాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలోగా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విజయసింహ, ఎంపీడీఓ దేవేందర్ ఉన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -
నీటిని పంపింగ్ చేస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్‌లో గ్రిడ్‌ను రన్ చేసేందుకు ఎస్ఎఫ్సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తు తం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్ శాఖ రెండు పంటలకు నీరివ్వాలి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మోటార్లలో సాంకేతిక సమస్యపై ఇరిగేషన్‌శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నీటి పంపింగ్ కోసం అవసరమైన మోటార్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ వానాకాలంలో లక్ష్యం మేర పంపింగ్ చేసుకుని పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరివ్వాలని కోరాను. – కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ● -
కాలుష్యపు కోరల్లో కృష్ణమ్మ
కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు ●కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది. శుద్ధి చేసిన నీటినే.. మిషన్ భగీరథ స్కీంకు కృష్ణానది నుంచి ఎత్తిపోసే నీటినే వినియోగిస్తున్నాం. ఈ నీళ్లను రెగ్యులర్‌గా ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. మట్టి, చెత్త ఏమున్నా ఫిల్టరింగ్‌లో వెళ్లిపోతుంది. ఆరోగ్యానికి హాని కలిగించని ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి. నీటి ఫిల్టరింగ్ను రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తాం. నది నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించే బాధ్యత మా శాఖ పరిధిలో లేదు. – అంజాద్పాష, డీఈఈ, మిషన్ భగీరథ మా దృష్టికి రాలేదు.. కృష్ణానదిలో కాలుష్య కారకాలు కలుస్తున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. ఇది మా పరిధిలోని అంశం కాదు. కాలుష్య నివారణ బోర్డుకు సంబంధించిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ పచ్చగా మారుతున్నాయి.. కృష్ణానదిలో నీళ్లు మూడేళ్లుగా పచ్చగా మారుతున్నాయి. ఇవి పై నుంచి వస్తున్నాయి. వరద వచ్చినప్పుడు నీళ్లపై ఆకుపచ్చ రంగులో తెట్టెలు ఉంటున్నాయి. నీళ్లు తగ్గే సమయంలో అధికంగా కనిపిస్తాయి. ఈ ఏడాది కూడా కొన్నిచోట్ల ఈ నీటి తెట్టెలు కనిపించాయి. ఈ విషయం ఇక్కడికి వచ్చే అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – బాలరాజు, మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ. మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా.. ఉమ్మడి మహబూబ్‌నగర్– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి నది నీళ్లు మూడేళ్లుగా అధికమవుతున్న నీటి కాలుష్యం వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు దరిదాపుల్లో కానరాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి మైసమ్మ దేవతను దర్శించుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. భక్తుల సౌకర్యార్థం వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కాగా, మైసమ్మ జాతరకు భక్తుల రద్దీ పెరగడంతో పెద్దకొత్తపల్లిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మైసమ్మ దేవతను 15వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రంగారావు తెలిపారు. రెవెన్యూ మేళాకు అనూహ్య స్పందన కందనూలు: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రెవెన్యూ మేళాకు అనూహ్య స్పందన లభించిందని కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ సమస్యలపై పట్టణ ప్రజలు 288 దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. అందులో 148 ఇంటినంబర్ కోసం, 94 ఆస్తి మార్పిడి, 27 పేరు సవరణ, 19 ట్యాక్స్ రీవిజన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని మూడు రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కాగా, రెవెన్యూ మేళాను మరో నాలుగు రోజులు పొడిగించడం జరిగిందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పౌరహక్కులను కాపాడాలి నాగర్‌కర్నూల్ రూరల్: పౌరహక్కులను కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ మోహర్రం పండుగ సందర్భంగా పీర్ల వద్ద అలాయ్ ఆడే పరిస్థితి లేదని అన్నారు. గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనంపై అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని కోరారు. అదే విధంగా దళిత కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని కోరారు. సమావేశంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, అశోక్, సత్యనారాయణ, రాజు, శివ, అంబేడ్కర్ ఉన్నారు. -
అపరిష్కృత సమస్యలు పరిష్కరించండి
కందనూలు: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుపటి మల్లిఖార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌లో జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అదే విధంగా పీఆర్పీ అమలు, పెండింగ్ డీఏలు, పదోన్నతులు, ఏకీకృత సర్వీసు, పెండింగ్ మెడికల్ బిల్లులు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం విద్యార్థుల్లో దేశభక్తి నిర్మాణం, జాతీయ భావాజాలం, సభ్యత్వ అభియాన్ వంటి అంశాలపై జిల్లా కార్యవర్గానికి ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, వెంకట్‌రెడ్డి, సురేఖ, నాగరాజు ఉన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం : ఎస్పీ
కందనూలు: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం 1986–87 ఎస్ఎస్సీ బ్యాచ్ క్రికెట్ టోర్నీని ఎస్పీ ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాలలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 38ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒకచోట కలుసుకొని క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఆరోగ్యం, స్నేహభావం మరింత పెంపొందుతుందని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులతో కలిసి ఎస్పీ కొంతసేపు క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. కాగా, పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పూర్వవిద్యార్థులు రూ. 20వేలు అందజేశారు. గగ్గలపల్లి ఉన్నత పాఠశాలకు రెండు క్రికెట్ కిట్స్ వితరణ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సయ్యద్ ఫసియొద్దీన్, నాగరాజు, శివకుమార్, విక్రమ్, రవీందర్రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మున్సిపల్ కమిషనర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా సోమవారం పుర కమిషనర్ డి.మురళితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగనుంది. ఆయా వార్డుల్లో వీధిదీపాల ఏర్పాటు, సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, తాగునీటి సరఫరాలో అంతరాయం తదితర సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్లు : 93985 73135, 91770 68043 -
ఆర్టీసీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్టీసీ కాలనీ ఏర్పాటు చేసుకొని ఉద్యోగులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడం శుభ సూచకమని రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం సుభాషిణి, అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శంకర్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు గుమ్మకొండ రాములు, మాజీ సర్పంచ్ ఆనంద్, సీఎల్ శ్రీనివాస్ యాదవ్, అబ్రహం, మల్లేశం, విజయబాబు, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
వేతన వ్యథ!
అవస్థలు పడుతున్నాం.. గ్రామాల్లో అన్ని పనులు చేసేది మేమే. ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా పెండింగ్‌లో పెడుతుండటంతో అవస్థలు పడుతున్నాం. పెండింగ్ వేతనాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. కార్మికుల ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదు. – కలమండల దాసు, కార్మికుడు, కాంసానిపల్లి, ఉప్పునుంతల మండలం ఒకట్రెండు రోజుల్లో చెల్లిస్తాం.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒకట్రెండు రోజుల్లో మూడు నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లిస్తాం. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయ్యింది. ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి నివేదికలు తీసుకున్నాం. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. – శ్రీరాములు, ఇన్చార్జి డీపీఓ ● పంచాయతీ కార్మికులకు అందని వేతనాలు ● మూడు నెలలుగా అవస్థలు ● పట్టించుకోని అధికారులు ● సమ్మెకు సిద్ధమవుతున్న కార్మికులు అచ్చంపేట రూరల్: గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గ్రామాల పరిశుభ్రతకు పాటుపడే తమకు నెలనెలా వేతనాలు అందించడంపై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపడం లేదని కార్మికులు వాపోతున్నారు. పనులు చేసేందుకు నిరాసక్తత.. గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు కాల్వల శుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, నీటి పైపుల లీకేజీలు, వీధి దీపాలకు మరమ్మతు, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్‌తో పాటు అన్ని పనులకు కార్మికులే ఆధారం. అయితే పంచాయతీల ఆదాయం మేరకు కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉన్నచోట, నిధులు సమృద్ధిగా ఉన్న కొన్ని జీపీల్లోనే వేతనం చెల్లింపు సక్రమంగా కొనసాగుతుంది. మిగతా జీపీల్లో పనులు చేయించుకుంటున్నారే తప్ప ప్రతినెలా జీతాలు చెల్లించడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పనులు చేయడానికి కార్మికులు నిరాసక్తత చూపుతున్నారు. మరోవైపు చాలా ఏళ్లుగా జీపీల్లో పనులు చేస్తున్నా జీతాలు పెరగడం లేదని నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల్లోని కార్మికులను పంచాయతీ కార్యదర్శులు బుజ్జగిస్తూ పనులు చేయిస్తున్నారు. నిధుల కొరత.. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో 2024 ఫిబ్రవరి 1నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నాటి నుంచి పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికుల వేతనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులతో డీజిల్ పోయిస్తున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య, ఇతర పనుల నిర్వహణకు నిధులు లేకపోవడంతో కార్యదర్శులు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 2,500 మందికి పైగా కార్మికులు.. జిల్లాలో 461 జీపీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, బిల్కలెక్టర్లు, వాటర్మేన్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతి కార్మికుడికి రూ. 9,500 వేతనంగా నిర్ణయించినా.. కొన్ని జీపీల్లో అంతంతమాత్రంగానే వేతనాలు అందుతున్నాయి. నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తమకు నెలనెలా వేతనాలు చెల్లించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. డిమాండ్లు ఇవే.. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు క్రమంగా చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. రెండో పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీఓ నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. జీఓ నం.51ని సవరించి మల్టీపర్పస్ కార్మికుల విధానం రద్దు చేయాలి. పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి. కారోబార్లు, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్డ్మెంట్ బెనిఫిట్‌గా రూ. 5లక్షల చొప్పున చెల్లించాలి. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థలాలు కేటాయించాలి. -
లో లెవల్.. హై రిస్క్!
●వంతెనలు లేక ప్రజలకు చింతలు రఘుపతిపేట వద్ద పనులు ప్రారంభించాం తెలకపల్లి, కల్వకుర్తి ప్రధాన రహదారిలో రఘుపతిపేట వద్ద దుందుభీ వాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉప్పునుంతల, మొల్గర వాగుపై ఇప్పటికే సర్వే చేసి భూసార పరీక్షలు నిర్వహించాం. ఇందుకు అనుగుణంగా వంతెన డిజైన్ చేసి ఆర్అండ్బీ ఈఎన్సీకి పంపించాం. డిజైన అప్రూవల్ రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. – జలంధర్, ఆర్అండ్బీ డీఈ, అచ్చంపేట ● నిధులు మంజూరైనా మొదలు కాని పనులు ● హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడో? అచ్చంపేట: ప్రజా సంబఽంధాలు, అభివృద్ధిలో రహదారులు పాత్ర కీలకం. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన అనేక రోడ్లు వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ధ్వంసం కాగా.. దశాబ్దాల క్రితం పలుచోట్ల నిర్మించిన లో లెవల్ కాజ్‌వేలు, వంతెనలు శిథిలావస్థకు చేరాయి. జిల్లాలో దుందుభీ వాగు తిమ్మాజీపేట, తాడూరు, తెలకపల్లి, ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట మండలాల్లో వివిధ గ్రామాల శివారు మీదుగా ఉన్న ప్రవహిస్తోంది. పాలకుల నిర్లక్షమే.. గత ప్రభుత్వ హయాంలో కొత్త వంతెనలు, రహదారుల మరమ్మతులకు రూ.కోట్లు మంజూరు చేసినా.. నిర్మాణాలు నత్తనడకన సాగతున్నాయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా బిల్లులు రావడం లేదన్న సాకుతో నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ● నాగర్‌కర్నూల్–పాలెం రహదారిలో నల్లవాగుపై వంతెన పనులు దాదాపు పూర్తయి రెండేళ్లు అవుతుంది. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ పనులు పూర్తి వేయాల్సి ఉంది. ● తాడూరు మండలం సిర్సవాడ–మాధారం దుందుభీ వాగుపై 300 మీటర్ల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న రూ.20.20కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు మొదలు కాలేదు. ● ఉప్పునుంతల–మొల్గర మధ్య దుందుభీ వాగుపై ఉన్న కల్వర్టు తెగిపోయింది. హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023 జులై 24న రూ.35కోట్ల నిధులు మంజూరయ్యాయి. 80 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో కొత్త వంతెన నిర్మించాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ పూర్తయినా నిర్మాణ పనులు దక్కించుకున్న కంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదు. రెండేళ్ల క్రితం ఈ వాగు పొర్లడంతో చేపల వేటకు వెళ్లిన బాలుడు నీటిలో కొట్టుకపోయి మృతి చెందాడు. ● తెలకపల్లి–రఘపతిపేట దుందుభీ వాగుపై వంతెన నిర్మాణ కోసం రూ.45కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇటీవల కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. పిల్లర్ల దశలో పనులు ఉండటంతో ఈ వర్షాకాలంలో అవస్థలు తప్పవు. 2022 ఆగస్టు 30న రఘపతిపేట వద్ద దుందుభీ వాగు కాజ్‌వేపై బస్సు నీటిలో చిక్కుకుంది. ● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి డ్యామ్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం రూ.96లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ● ఖానాపూర్–పసుపుల వాగుపై వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ నుంచి రూ.4కోట్లు మంజూరైనా పనులు మొదలు కాలేదు. మూడేళ్ల క్రితం వాగు ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకపోయి మృతి చెందాడు. ● వెల్దండ మండలంలోని సిరసగండ్ల, చారకొండ వెళ్లే బైరాపూర్ వాగు ఉధృతికి 2022లో వంతెన కొట్టుకపోయింది. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ.3.50కోట్లు నిధులు మంజూరయినా.. పనులు ప్రారంభించలేదు. అలాగే చెర్కూర్, గాన్ గట్టుతండా మధ్య వాగుపై వంతెనకు రూ.4.15కోట్ల మంజూరైనా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ● బిజినేపల్లి–జడ్చర్ల ప్రధాన రహదారి గుమ్మకొండ సమీపంలో వట్టెం రిజర్వాయర్ నుంచి కర్వెన రిజర్వాయర్‌కు వెళ్లే కెనాల్‌పై బ్రిడ్జి పనులు ప్రారంభించినా పూర్తి కాలేదు. ● అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిలో బల్మూర్ మండలం గట్టుతుమ్మన్–తుమ్మన్‌పేట స్టేజీ, కనకాల మైసమ్మ–జిన్‌కుంట మధ్య బిజినేపల్లి మండలంలోని మహాదేవునిపేట వద్ద వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. ● లింగాల–చెన్నంపల్లి మధ్య పెద్ద వాగు ప్రవాహంతో చెన్నంపల్లి, ఎర్రపెంట, పద్మనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ● బల్మూర్ మండలంలోని చిన్నపల్లె చెరువు అలుగు పారితే చెన్నారం, వీరంరాజుపల్లి, రామాజీపల్లి ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కొండనాగుల, అచ్చంపేట మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ● గోకారం, తుర్కపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. – వంగూరు, జూపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది. ● అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, చందంపేట రహదారిపై దుందుభీవాగు దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎక్కువగా ఈవంతెన దాటి దేవరకొండ, చందంపేటకు వెళ్తుంటారు. దుందుభీ పొర్లితే ఈప్రాంత వాసులు అచ్చంపేట మీదుగా 70కి.మీల దూరం అదనంగా తిరగాల్సి వస్తోంది. ● కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ముక్కిడిగుండం మధ్య పెద్దవాగుపై వంతెన పనులు పూర్తి కాగా.. అప్రోచ్ రోడ్డు పనులు చేయాల్సి ఉంది. -
నిలబెట్టుకోవాలి
నాగర్కర్నూల్వైద్యులు నమ్మకాన్ని .. పట్టించుకోరు జడ్చర్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5.50 కోట్లతో ప్రతిపాదించారు. శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025వివరాలు 8లో uమహిళల ఆర్థిక సాధికారతే ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని జిల్లా ఇన్చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో రూ.110 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ సీఎం, మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రజల అవసరాల కోసం వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలిటీలోని కొట్ర నుంచి పట్టణం వరకు 4.5 కి.మీల రోడ్డు వెడల్పు కోసం రూ.65 కోట్లు, పట్టణంలోని 99వ సర్వే నంబర్లో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేపట్టారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. రెండు వరుసల బీటీ పనులకు.. వెల్దండ మండల కేంద్రం నుంచి చారకొండ మండలంలోని సిర్సనగండ్ల దేవస్థానం వరకు రూ.40 కోట్లతో మంజూరయిన రెండు వరుసల బీటీరోడ్డు నిర్మాణం కోసం వెల్దండలో మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొట్రగేట్ నుంచి తలకొండపల్లి వరకు రూ.65కోట్ల మంజూరు కావడంతో 22 కిలోమీటర్ల రెండు వరుసల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ రూరల్/కల్వకుర్తి/ కల్వకుర్తిటౌన్/వెల్దండ: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించి వైద్యులు ప్రజలకు నమ్మకం కలిగించాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, దామోదర రాజనర్సింహ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో 26 ఎకరాల్లో రూ.180 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాలను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. దీంతో పాటు రూ.235 కోట్లతో 550 పడకల సామర్థ్యంతో అధునాతన వసతులతో నూతన ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలకు రూ.50 లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేసి విద్యార్థుల రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్‌నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో పేదలకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మెడికల్ కళాశాల, ప్రజా ప్రభుత్వ వైద్యశాల జిల్లాకే మకుటంగా అభివర్ణించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. తూడికుర్తిలో పీహెచ్సీ.. మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భూమి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. 28 ఏళ్ల క్రితమే దామోదర్‌రెడ్డి తన తండ్రి రాంచంద్రారెడ్డి పేరు మీద 10 ఎకరాల స్థలంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నెలకొల్పారని కొనియాడారు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్ల వరకు రూ.150 కోట్లతో 4లైన్ల రోడ్డు వేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, ఆర్డీఓ శ్రీను, మున్సిపల్ కమిషనర్ మహామూద్షేక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: ‘బీఆర్ఎస్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది. ప్రభుత్వంపై ప్రతీ విషయంలో పోస్టులతో అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అందుకు ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదు. మనమూ అదేస్థాయిలో బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నాం.’ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యూస్‌రీల్‘కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్కడుంది..’? ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, దామోదర రాజనర్సింహ జిల్లావ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ -
ర్యాలంపాడులో కదలిక
సాగునీటి పారుదల శాఖ మంత్రి పర్యటనతో మరమ్మతు పనుల్లో చలనం ర్యాలంపాడు జలాశయం ఆనకట్ట గద్వాల: రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ర్యాలంపాడు సాగునీటి ప్రాజెక్టు కొందరు అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల వల్ల ప్రమాదంలో పడింది. అందుబాటులోకి వచ్చిన ఏడాది కాలంలోనే జలాశయం మొదలుకొని, కుడి, ఎడమ తూముల అడుగుభాగాల్లో ఏర్పడిన లీకేజీలతో రూ.కోట్ల ప్రజాధనం నీట కొట్టుకుపోతుంది. దీనిపై పలుమార్లు సర్వేలు, డీపీఆర్ నివేదికలు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు సమర్పించినా చలనం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో జలాశయాన్ని సందర్శించడంతో పాటు అధికారులతో వివరాలు సేకరించారు. ఈనేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో మరమ్మతు కోసం సమగ్ర సర్వేకు అవసరమైన నిధుల మంజూరు అవుతున్నట్లు తెలిసింది. నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సుమారు రూ.2వేల కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 14ప్యాకేజీలు, రెండు లిఫ్టులు, ఏడు జలాశయాలు నిర్మించారు. సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు స్టాండ్‌బై కింద కేవలం నీటిని నిల్వ చేసుకునేందుకు నిర్మించగా.. మరో 5 జలాశయాలు ఆయకట్టుకు నీరు అందించేలా డిజైన్ చేశారు. ఇందులో ర్యాలంపాడు జలాశయం కింద ధరూరు, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల్లో 1.05లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4టీఎంసీలు. మరోవైపు 1.30టీఎంసీల సామర్థ్యంతో 1.36లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతలకు కూడా అవసరమైన 2.80టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచే ఎత్తిపోసేలా నిర్మాణం చేపడుతున్నారు. నడిగడ్డలో 2లక్షల ఎకరాలకు.. 2022లో రిపోర్ట్ అందజేత సదరు సంస్థ 2022 మార్చిలో సర్వే పనులు చేపట్టి లీకేజీల మరమ్మతుకు సుమారు రూ.137 కోట్లు వ్యయం అవుతుందని 2023 జనవరిలో ఇరిగేషన్ శాఖకు రిపోర్ట్ అందించారు. అంచనాలు రూపొందించిన అధికారులు తుది నివేదికను 2024 డిసెంబర్లో ప్రభుత్వానికి సమర్పించారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ ఇంజినీర్ల నిపుణుల బృందం ర్యాలంపాడును సందర్శించి లీకేజీలను పరిశీలించారు. మరోసారి సర్వే చేసేందుకు రూ.1.86 కోట్లు అవసరం అవుతుందని నిపుణుల బృందం ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీకి వివరించారు. విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించడంతో రెండు, మూడు రోజుల్లో అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదేళ్ల క్రితం జలాశయానికి గండి 2024 డిసెంబర్లో రూ.137 కోట్ల అంచనాతో నివేదిక ఏప్రిల్‌లో పూణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ నిపుణుల బృందం సందర్శన -
జలాశయానికి గండి..
ఇంతటి ప్రాధాన్యత ఉన్న ర్యాలంపాడును గుత్తేదారు చేపట్టిన లోపభూయిష్టమైన నిర్మాణం, కొరవడిన అధికారుల పర్యవేక్షణతో ఏకంగా జలాశయానికి గండిపడింది. జలాశయం అడుగుభాగాన రాక్‌టోల్ నుంచి పలుచోట్ల లీకేజీలు ఏర్పడి జలాశయం నుంచి నీరు బయటకు ఉబికి వస్తుండడాన్ని ఇరిగేషన్ అధికారులు మూడేళ్ల కిందటనే గుర్తించారు. తర్వాత సీఈ స్థాయిలో నిపుణుల కమిటీ జలాశయాన్ని సందర్శించి లీకేజీలు, అందుకు గల కారణాలు తెలుసుకొని, మరమ్మతు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించింది. ఇందుకోసం రూ.57లక్షలు వెచ్చించారు. -
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు. -
వృద్ధిరేటు తగ్గుముఖం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఏటా జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత దశాబ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న కారణంగా భవిష్యత్‌లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. యువ జనాభా తగ్గుముఖం పడుతుండటం, వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, సామాజిక మార్పులు, ఉమ్మడి కు టుంబాలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్ కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్‌ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది. సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా.. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఎక్కు వశాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణు లు కాగా, 10.19 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రా మీణ ప్రాంతాల్లో, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్‌నగర్ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 1991 నుంచి భారీగా తగ్గుదల ఉమ్మడి జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వ రకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు, సామా జికంగా మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వర కు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది. అయితే 1991 లో 25.87 శాతం నుంచి 2001 నాటికి జనాభా వృద్ధి 14.20 శాతానికి, అక్కడి నుంచి 2011 నాటికి 15.34 శాతానికే పరిమితమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటేటా తగ్గుతున్న జననాలు పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య 1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల భవిష్యత్‌పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నాగర్‌కర్నూల్ రూరల్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని సూచించారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో గురువారం జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేపల సీడ్ ఉత్పత్తి, పెంపకం, చేపల మార్కెటింగ్ తదితర అంశాలపై మత్స్యకారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. చేపల రైతులు ఆక్వా కల్చర్ నిపుణుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యసహకార సంఘాల మండల అధ్యక్షుడు హరికృష్ణ, తెప్ప రుద్రయ్య పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
కందనూలు: జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా టి.ఉషారాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జీఎంసీ ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్న ఆమె బదిలీపై నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేసిన రఘు ఆమెకు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. క్రీడా అకాడమీలో ప్రవేశాలు కందనూలు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్రీడా అకాడమీలో 2025–26 విద్యా సంవత్సరం బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డీవైఎస్ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, పుట్‌బాల్ క్రీడాంశాల్లో ప్రవేశాల ఈ నెల 15, 16 తేదీల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యార్హత, జనన, క్రీడా ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, 10 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 7గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి బిజినేపల్లి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.శైల అన్నారు. గురువారం మండలంలోని అల్లీపూర్, పోలేపల్లి, నందివడ్డెమాన్, మహదేవునిపేట గ్రామాల్లో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసిన పత్తిపంట మొక్కల సంఖ్యను లెక్కించారు. ఈ పద్ధతిని అనుసరించిన రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు నాగర్‌కర్నూల్: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ఈ వెంకటనర్సింహారెడ్డి అన్నారు. విద్యుత్‌శాఖ ఎస్ఈగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా, గతంలో ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన పాల్‌రాజ్ హైదరాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయానికి బదిలీ కాగా.. ఆయన స్థానంలో మేడ్చల్ ఎమ్మార్టీ డీఈగా పనిచేస్తున్న వెంకట నర్సింహారెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. -
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
నాగర్‌కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు మాడ్గుల మండల కేంద్రంలో రూ. 12.70కోట్లతో 30 పడకల ఆస్పత్రి భవనం, 10:15 గంటలకు కోనాపూర్ నుంచి మాడ్గుల గుండా దేవరకొండ రోడ్డు వరకు రూ. 70కోట్లతో చేపట్టే బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 220 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి.. 11:45 గంటలకు వెల్దండకు చేరుకుంటారు. అక్కడ వెల్దండ – సిర్సనగండ్ల వరకు రూ. 40కోట్లతో నిర్మించే బీటీరోడ్డుకు, కల్వకుర్తి నుంచి కొట్ర గేట్ మీదుగా తలకొండపల్లి వరకు 22 కి.మీ. మేర రూ. 65కోట్ల వ్యయంతో నిర్మించే బీటీరోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2గంటలకు కల్వకుర్తికి చేరుకొని రూ. 45.50కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొని మెడికల్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే 550 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. విద్య, వైద్యంలో జిల్లాను అగ్రభాగాన నిలపడమే లక్ష్యం విద్య, వైద్యరంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 9కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో వట్టెంలో నూతన పాఠశాల భవనం నిర్మిస్తామన్నారు. రూ. 200కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సముదాయం టెండర్ దశలో ఉందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులను పూర్తిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో ఉన్న 100 పండకల ఆస్పత్రిని 330 పడకలకు పెంచడం జరిగిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో నూతన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రుల పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు నిజాం, సునేంద్ర, జక్కా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న అమాత్యులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం -
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలి
వెల్దండ: ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భజలాల పెంపునకు దోహదపడే పనులు చేపట్టాలని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి అథర్వ పవస్ అన్నారు. గురువారం మండలంలోని చెదురుపల్లి బుగ్గకాల్వ చెరువులో చేపట్టిన ఒండ్రుమట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం చెరువులో మట్టి తీయడం వల్ల వర్షాకాలంలో ఎంతమేర నీరు చేరిందనే దానిపై పరిశీలన చేశారు. ఉపాధి హామీ పథకం రైతులు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని సూచించారు. ముఖ్యంగా భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ చంద్రశేఖర్, క్రాంతికుమార్, పవన్, ఇన్చార్జి ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఓ ఈశ్వర్‌జీ, దేవేందర్, మంజుల పాల్గొన్నారు. -
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్‌తో పిల్లలను కనాలని భావిస్తున్నాం. – రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం భవిష్యత్‌కు ప్రణాళిక.. నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం. – రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం స్థిరపడిన తర్వాతే పిల్లలు.. మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవ కాశాలు ఉన్నాయి. ఒకరిద్దరి సంతానం ఉంటే వారి పర్యవేక్షణ సులభతరం అవుతుంది. వీరినే మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సేవ చేస్తే సరిపోతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట -
ఆధారాల సేకరణలో సీసీ కెమెరాలు కీలకం
బిజినేపల్లి: రోడ్డు ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, చోరీలు వంటి నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మండలంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం వైర్లెస్ సీసీ కెమెరాలు వచ్చాయని.. వ్యాపార దుకాణాల వద్ద, రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరస్తుల్లోనూ భయం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజల సురక్షిత జీవనానికి పోలీసుశాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక వనరులు సమకూర్చేందుకు తనవంతు సహకారం అందిస్తా నని తెలిపారు. కాగా, నందివడ్డెమాన్‌కు చెందిన తి ప్పిరెడ్డి రాంచంద్రారెడ్డి తదితర ఎన్ఆర్ఐల సామా జిక బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించారని ఎస్పీ తెలిపారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో డీఏస్పీ శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరని లక్ష్యం..
అచ్చంపేట: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ఎంజీకేఎల్‌ఐకి మాత్రం పూర్తిస్థాయిలో నీరు వాడుకోలేని పరిస్థితి ఉంది. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం కేవలం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో అదనపు రిజర్వాయర్ల నిర్మాణం అవసరమని గుర్తించిన అధికారులు.. గత ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా ఏటా ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. నిల్వ చేసేందుకు రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. కేఎల్ఐ పనులు డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో చేపట్టాలని.. నాలుగు, ఐదు టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఇరిగేషన్ అధికారులను గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఇప్పటి వరకు అడుగు పడలేదు. అసంపూర్తిగా పనులు.. వరదల సమయంలో 40 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించని కారణంగా ఆ స్థాయిలో నీరు అందడం లేదన్నది నగ్నసత్యం. ప్రాజెక్టులోని పలు ప్యాకేజీల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉండటంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. కేఎల్ఐ కింద 47 అదనపు రిజర్వాయర్లను ప్రతిపాదించగా.. వీటిలో కేవలం 10 మాత్రమే సాధ్యమని గుర్తించారు. ఇందుకు సంబంధించి సర్వే పూర్తిచేసి.. గత ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పూర్తి ఆయకట్టకు సాగునీరు అందించాలంటే కనీసం 30 టీఎంసీలు నిల్వచేసే సామర్థ్యం గల రిజర్వాయర్లు అవసరమని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు 2.14 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న జొన్నలబొగుడ జలాశయాన్ని 6 టీఎంసీల వరకు, సుమారు టీఎంసీ సామర్థ్యం ఉన్న గుడిపల్లిగట్టు జలాశయాన్ని 3నుంచి 4టీఎంసీల వరకు పెంచుకోవచ్చని అంచనా వేశారు. ప్రతిపాదించిన ప్రకారం నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి పరిధిలో ఇప్పటి వరకు ఒక రిజర్వాయర్ మంజూరు చేయని ప్రభుత్వం.. 2023 మార్చి 2న వనపర్తి ప్రాంతంలో ఖిల్లాఘనపురం గణప సముద్రం చెరువును రూ. 55కోట్లతో, బుద్ధారం చెరువును రూ. 42.2 కోట్లతో రిజర్వాయర్లుగా మార్చేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో కేఎల్ఐ కింద మొదట ప్రతిపాదించిన ప్రాంతాలకు రిజర్వాయర్లు మంజూరు చేయకుండా పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మిషన్ భగీరథ’కు తప్పని ఇబ్బందులు.. కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.35 టీఎంసీలు మాత్రమే. ఈ లిఫ్ట్‌తోనే మిషన్ భగీరథకు 7.2 టీఎంసీల నీటిని సరఫరా చేయాలి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఇక సింగోటం రిజర్వాయర్ నీటి సామర్థ్యం 0.55, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ సామర్థ్యం 0.96 టీఎంసీలు మాత్రమే. అంటే ఒక టీఎంసీ కూడా కాదు. జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను 2.14టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మరో 20 టీఎంసీల నీటి నిల్వ కోసం ఎనిమిదేళ్లుగా ప్రతిపాదిస్తున్నా ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. దీంతో చెరువులు, కుంటలను నింపి వదిలేస్తున్నారు. ఏటా డిసెంబర్ నుంచి నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. అయితే ఏడాది పాటు మిషన్ భగీరథకు తాగునీరు అందించాల్సి ఉండగా.. మార్చి నుంచే కేఎల్ఐ మోటార్లకు కృష్ణా జలాలు అందడం లేదు. కృష్ణా జలాల్లో కేఎల్‌ఐకి 40 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ.. 15 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ఇందులో మిషన్ భగీరథకు ప్రతినెలా 0.6 టీఎంసీల చొప్పున 7.2 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. మిగిలిన 7.8 టీఎంసీలు మాత్రమే సాగునీటికి వదులుతున్నారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరు అందడం లేదు. కృష్ణానదికి వరద వస్తున్నా.. వినియోగించుకోలేని దుస్థితి అదనపు రిజర్వాయర్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు జలాశయాల సామర్థ్యం పెంపుపై జాప్యం ఎంజీకేఎల్ఐ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు కాల్వలపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ప్రతిపాదనలతో పాటు మరికొన్ని రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశాం. వరదల సమయంలో కేఎల్ఐ నుంచి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా 10 రిజర్వాయర్లకు డిజైన్ చేశాం. వీటి మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వరదలు మొదలు కావడంతో కేఎల్ఐ కాల్వలకు నీటిని ఎత్తిపోస్తున్నాం. అవసరం మేరకు చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేస్తాం. – మాణిక్‌ప్రభు, ఇరిగేషన్‌శాఖ ఈఈ -
ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
కల్వకుర్తి టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించా రు. బుధవారం పట్టణంలోని ఓల్డేజ్ హో మ్, సబ్‌జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా ఓల్డేజ్ హోమ్ సందర్శించి సమస్య ల ను తెలుసుకున్నారు. అక్కడ కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. వృద్ధుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం సబ్‌జైలును ఆమె పరిశీలించారు. ఖైదీలతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఖైదీలకు భోజనం అందించాలని జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు సూచించారు. ఎవరికై నా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు వెంకటయ్య పాల్గొన్నారు. -
కాల్వల సామర్థ్యం సైతం అంతంతే..
కేఎల్ఐ మొదటి డిజైన్ ప్రకారం కాల్వలను వెడల్పు చేయకుండా కుదించారు. దీంతో పంపింగ్ చేసే నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేక కాల్వల కట్టలు అక్కడక్కడ తెగిపోతున్నాయి. ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు పంపుహౌజ్‌లలో ఉన్న ఐదు మోటార్లు 4వేల క్యూసెక్కులకు పైగా నీటిని తోడిపోస్తాయి. ఈ నీరు వెళ్లాలంటే 9మీటర్ల వ్యాసం గల కాల్వలు ఉండాలి. ప్రస్తుతం 6, 7 మీటర్లతో ఏర్పాటు చేశారు. కాల్వల నిర్మాణం కూడా మొదట్లో 20.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్రాథమికంగా అంచనా వేసి రూపొందించారు. దీన్ని 10 నుంచి 14 మీటర్ల వరకు డిజైన్ చేశారు. ఆ తర్వాత తగ్గించి తవ్విన కాల్వలో 3,200 క్యూసెక్కులు మాత్రమే పారుతోంది. దీంతో తరచుగా కాల్వలకు గండ్లు పడి పంట పొలాలు నీటమునుగుతున్నాయి.ఈ సమస్యను అధిగమించాలంటే కాల్వల ఎత్తు సైతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. -
వైద్యం.. దైన్యం!
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చవుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమకు సమీపంలోని పీహెచ్సీ లేదా సీహెచ్‌సీల్లో ప్రతినెలా పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. అయితే గర్భిణులు పురిటినొప్పులతో సమీపంలోని పీహెచ్సీ లేదా పీహెచ్‌సీకి వెళ్తే హైరిస్క్ పేరుతో జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఫలితంగా జిల్లా ఆస్పత్రి వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటైన తర్వాత జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చారు. అయితే అందుకు అనుగుణంగా సదుపాయాలు మాత్రం కల్పించలేదు. వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆస్పత్రిలో గర్భిణులను పరీక్షించడం.. కాన్పులు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఆరు నెలల్లో 2,289 కాన్పులు.. జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోజు 160 మందికి పైగా గర్భిణులు వైద్యసేవలు పొందడంతో పాటు 20 మంది వరకు సాధారణ, సిజేరియన్ కాన్పులు అవుతున్నాయి. ఆరునెలల కాలంలో సాధారణ, సిజేరియన్ డెలివరీలు 2,289 జరిగాయి. అయితే పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు చేయాల్సి ఉండగా.. ఎక్కువ శాతం హైరిస్క్ పేరుతో గర్భిణులను జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి వైద్యులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకే ఆపరేషన్ థియేటర్.. ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా మేజర్ ఆపరేషన్ థియేటర్, మైనర్ ఆపరేషన్ థియేటర్, సెప్టిక్ ఆపరేషన్ థియేటర్ ఉండాల్సి ఉండగా.. కేవలం లేబర్‌రూం, సెఫ్టిక్ ఆపరేషన్ ఽఽథియేటర్ మాత్రమే కొనసాగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే ఆపరేషన్ థియేటర్ ఉండటం.. నిత్యం అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయాల్సి వస్తుండటంతో గర్భిణులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం నెలకొందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వేధిస్తోన్న వైద్యుల కొరత.. అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు హైరిస్క్ కేసులు జనరల్ ఆస్పత్రి వస్తున్నాయి. వైద్యసేవల్లో ఏదేని అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆస్పత్రి వైద్యులపై విమర్శలు, ఆరోపణలు వస్తుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో సరిపడా వైద్యులను కేటాయించక పోవడంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 15మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం ఉండగా.. కేవలం ఇద్దరు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే గర్భిణులకు సేవలు అందిస్తున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. హైరిస్క్ పేరుతో జిల్లా జనరల్ ఆస్పత్రికి గర్భిణుల రెఫర్ గైనకాలజీ విభాగంలో సరిపడా వైద్యులు లేక అవస్థలు మౌలిక సదుపాయాలు సైతం కరువు ప్రతినెలా 400 పైగా కాన్పులు -
అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు
అచ్చంపేట: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్లో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా సాధికారిత కోసం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్పర్సన్ రజిత, సీబీఎం ట్రస్టు చైర్పర్సన్ చిక్కుడు అనురాధ, మల్లేష్, కౌన్సిలర్ సునీత పాల్గొన్నారు. -
ఆయకట్టుకు సాగునీరు
● కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు నీటి విడుదల ● 4.20 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యం ● అసంపూర్తి పనులతో 50శాతం ఆయకట్టు మాత్రమే సాగు ● కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల నిర్వహణపకడ్బందీగా చేపడితేనే ప్రయోజనం సాక్షి, నాగర్‌కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్‌హౌజ్ వద్ద రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేఎల్ఐ కాల్వలకు నీటి సరఫరాను ఆరంభించారు. ఈ సారి కృష్ణానదిలో ముందస్తు వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండి.. బ్యాక్‌వాటర్ నీటిమట్టం పెరిగింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. బోరుబావుల కింద సాగుచేస్తున్న రైతులు ఇప్పటికే వరినార్లు, విత్తనాలు వేసుకోగా.. కాల్వల కింద సాగుచేస్తున్న రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. లక్ష్యం 4.20 లక్షలు.. ఇచ్చేది 2.50 లక్షల ఎకరాలకే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మొత్తం 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు చేపట్టిన పనులు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం మేరకు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందించలేని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేపట్టాలంటే.. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే కేఎల్ఐ పనులు పూర్తిచేయడంలో ఏళ్లుగా జాప్యం కొనసాగుతుండటంతో ఈ సారి సైతం పరిమితంగానే ఆయకట్టు రైతులకు నీరు అందించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రధానంగా కేఎల్ఐ విస్తరణ పనుల్లో భాగమైన 28, 29, 30 ప్యాకేజీల్లో పెండింగ్ పనులు పూర్తికాలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలాల్లో చివరి వరకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నెరవేరని లక్ష్యం.. కేఎల్ఐ కింద మూడు లిఫ్టుల్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా ఎల్లూరు జలాశయంతో పాటు సింగోటం రిజర్వాయర్, రెండో లిఫ్టు ద్వారా జొన్నలబొగుడ రిజర్వాయర్, మూడో లిఫ్టుతో గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంటుంది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో.. ప్రస్తుతం చెరువులను మాత్రమే నింపేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. ఒక్కో రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం సైతం ఒక టీఎంసీలోపే కావడంతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, నెట్వర్క్ చానల్స్ లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మూడు ప్రధాన రిజర్వాయర్లలో నీరు ఖాళీ అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు లిఫ్టుల్లోనూ ఐదేసి మోటార్లతో నీటి ఎత్తిపోతలను చేపట్టాల్సి ఉండగా.. ప్రతిసారి రెండు మోటార్లకు మించి పని చేయడం లేదు. మిగతా మోటార్ల మరమ్మతు కోసం ఏళ్ల సమయం పడుతోంది. కృష్ణానదిలోని నీటిని తీసుకునే ఇన్‌టెక్ వద్ద సర్జ్‌పూల్ నుంచి పంప్‌హౌస్‌లోకి నీరు చేరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడి గేట్లకు మరమ్మతు, నిర్వహణ లేక తుప్పుపట్టి బలహీనంగా మారుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోతే గేట్లు పనిచేయని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మోటార్ల నిర్వహణతో పాటు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా.. కేఎల్ఐ కింద ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమైంది. రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటితో నింపేలా చర్యలు తీసుకుంటాం. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోటార్ల మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నాం. – విజయభాస్కర్‌రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
మన్ననూర్: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. మంగళవారం డీఈఓ రమేశ్‌తో కలిసి మన్ననూర్ గిరిజన ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థి దశలోనే మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అంతకు ముందు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ పథకం కింద ఏర్పాటుచేసిన శానిటరీ న్యాప్కిన్స్ తయారీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులకు న్యాప్కిన్స్ పంపిణీ చేసే సామర్థ్యానికి ఎదగాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలకిషన్, నర్సింహులు, హెచ్ఎం సిద్దార్థ మహదేవ్ తదితరులు ఉన్నారు. -
11న మెగా జాబ్ మేళా
కందనూలు: కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ ఆధికారి వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ పూర్తిచేసి.. 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 83176 38406, 79818 34205 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు కల్వకుర్తి టౌన్: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని డీసీహెచ్ఎస్ రామకృష్ణ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రికార్డులతో పాటు వార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో డీసీహెచ్ఎస్ సమావేశమై మాట్లాడారు. సీహెచ్‌సీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కార్మిక వ్యతిరేక జీఓను రద్దు చేయాలి కల్వకుర్తిరూరల్: రాష్ట్ర కార్మికశాఖ విడుదల చేసిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కార్మికుల పనివేళలను 10 గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీఓ ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికులపై అదనపు భారం మోపే విధంగా జారీ చేసిన జీఓను రద్దు చేయాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు బాలయ్య, బాల్‌రెడ్డి, శ్రీనివాసులు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్‌గా నిలవాలి మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్‌బాల్‌లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బాలికల జూనియర్ ఫుట్‌బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారిక, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
కల్వకుర్తిరూరల్: స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అన్నివిధాలా సన్నద్ధం కావాలని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. కల్వకుర్తి పట్టణంలో మంగళవారం బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచ తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్ముద్ షేక్, తహసీల్దార్ ఇబ్రహీం, ఎన్నికల డీటీ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతపై సర్వే
వెల్దండ: స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మంగళవారం వెల్దండ మండలం రాచూర్‌లో పరిసరాల శుభ్రతపై అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడీ చంద్రశేఖర్, స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా కోఆర్టినేటర్ ఊశన్న, స్వచ్ఛ గ్రామీణ ఆర్ఐ లింగమయ్య గ్రామంలో పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, పరిసరాల శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పూర్తి సర్వే అనంతరం గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ లక్ష్మణ్, మురారి, దేవేందర్, క్రాంతి, కార్యదర్శి పద్మ, నందకిషోర్, విష్ణు, మంజుల, హజిబాబా పాల్గొన్నారు. -
వైఎస్సార్ సేవలు మరువలేనివి
కొల్లాపూర్: జిల్లావ్యాప్తంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాఽభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషిని వారు కొనియాడారు. జలయజ్ఞం కార్యక్రమంతో ఎంజీకేఎల్‌ఐతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆయన బీజం వేశారని వివరించారు. వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సామాన్యులే టారె్గట్!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఫైనాన్స్ చిట్‌ఫండ్ డిపాజిట్లు, చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులే లక్ష్యంగా అధిక వడ్డీల ఆశ చూపుతూ నిలువునా ముంచుతున్నారు. ఏళ్ల తరబడి కష్టించి కూడబెట్టిన సొమ్మును ఫైనాన్స్ నిర్వాహకులపై నమ్మకంతో పెట్టుబడులుగా పెట్టే బాధితులు చివరకు ఉన్నదంతా కోల్పో యి నిండా మోసపోతున్నారు. జిల్లాకేంద్ర ంలో సంచలనం రేపిన సాయిరాం ఫైనాన్స్ ఉదంతం ఇంకా కొలిక్కి రావడం లేదు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 1,647 మంది నుంచి వివిధ రూపాల్లో డిపాజిట్లు సేకరించిన ఫైనాన్స్ నిర్వాహకులు.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా చేతులెత్తేయడంతో బాధితులు నిత్యం పోలీస్‌స్టేషన్, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫైనాన్స్ మాటున ‘రియల్’ మాఫియా.. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, భూములు కొని వెంచర్లు వేసేందుకు పెద్దఎత్తున డబ్బులు అవసరం కావడంతో.. కొందరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకుల అవతారం ఎత్తారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారాలకోసం మళ్లించారు. అందివచ్చిన లాభాలను సొంత అవసరాలకు వినియోగించడంతో పాటు విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. పెట్టుబడులంతా రియల్ వ్యాపారాల్లో ఉన్నాయని.. తామేమీ చేయలేమని బుకాయిస్తూ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. పర్యవేక్షణ ఏది.. ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, అనధికార వడ్డీ వ్యాపారులు విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడే కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటే దందాకు అడ్డుకట్ట పడటంతో పాటు డబ్బుల చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కానీ పదేపదే ఫిర్యాదులు అందితే కానీ కేసులు నమోదు చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా కేసులు నమోదు చేసినా.. విచారణకు ఏళ్ల పాటు సమయం పడుతోంది. ఇదే అదనుగా అధికారులను మచ్చిక చేసుకుంటూ నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిట్‌ఫండ్స్, చిట్టీల పేరుతో మోసాలు జిల్లాలో అడ్డగోలు దందా అధిక వడ్డీ ఆశతో మోసపోతున్న బాధితులు ఫైనాన్స్ కంపెనీ పేరుతో రూ. 150కోట్లు సేకరించి చేతులెత్తేసిన వైనం విచ్చలవిడిగా డిపాజిట్లు.. జిల్లాకేంద్రంలో ఫైనాన్స్ కంపెనీ నిర్వహణ పేరుతో వివిధ వర్గాల నుంచి రూ. 150కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వ్యాపార, ఉద్యోగ వర్గాలతో పాటు మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా డిపాజిట్లను సేకరించారు. ఇందుకు అధిక వడ్డీ రేట్ల ఆశ చూపారు. కొన్నాళ్లకు సేకరించిన డిపాజిట్లకు వడ్డీ ఇవ్వకపోవడం.. గడువు తీరినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కొందరు తమ పిల్లల చదువు, మరికొందరు తమ కూతుళ్ల పెళ్లి, భవిష్యత్‌లో అవసరాలకు పనికొస్తాయని ఇంకొందరు పెట్టుబడులు పెట్టారు. చివరకు సదరు ఫైనాన్స్ నిర్వాహకులు చేతులెత్తయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విచారణచేపడుతున్నాం.. జిల్లాలో చిట్‌ఫండ్, చిట్టీల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేసిన కేసులో బాధితుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1,500 మందికి పైగా బాధితులు ఉన్నట్టు గుర్తించాం. దీనిపై కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ చేపడుతున్నాం. – శ్రీనివాస్, డీఎస్పీ, నాగర్‌కర్నూల్ -
అడిషనల్ ఎస్పీ బదిలీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్‌ను బదిలీ చేస్తూ తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్త సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 డిసెంబర్లో అడిషనల్ ఎస్పీగా రామేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనకు ప్రస్తుతం రాచకొండ క్రైం అదనపు డీసీపీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల రామయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి గీత అన్నారు. లేబర్ కోడ్స్ ఆధారంగా కార్మికుల పనివేళలను 10గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పనివేళలను రద్దుచేసి.. 10గంటలకు పెంచడం కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని దుయ్యబట్టారు. కొత్త చట్టాలను రద్దుచేసే వరకు కార్మికులు సమష్టిగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అంతటి కాశన్న, మధు, బ్రహ్మం, కృష్ణయ్య, వెంకటస్వామి, బాలస్వామి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడుకు కొనసాగుతున్న ఇన్‌ప్లో మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,021 అడుగులకు గాను సోమవారం నాటికి 1,018 అడుగుల నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ, కుడి కాల్వ ద్వారా 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వార 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా 520 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువ ద్వార 45 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
కలెక్టరేట్ ప్రజావాణికి 32 అర్జీలు
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 32 అర్జీలు అందాయి. ప్రజల సమస్యలను కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పా ల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మూడు ఫిర్యాదులు భూ తగాదాలపై, ఒకటి తగున్యాయం కోసం, మరొకటి భార్యాభర్తల గొడవపై ఫిర్యాదు అందినట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జ్గా పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు.. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్‌చార్జ్‌లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్ నల్లగొండ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జీగా నియమితులయ్యారు. ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి అచ్చంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెండింగ్ పనులను పూర్తిచేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వపు ప్రాథమిక విద్య ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, లలితాబాయి, రాములు, బాబురావు, హన్మ, రామకృష్ణ, రామచంద్రు, బీచ్య, చంద్రకళ, రేణుక, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీయూ మాల్‌ప్రాక్టీస్ కమిటీ భేటీ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6, ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2, 4, 6 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులు మంగళవారం పీయూ మాల్‌ప్రాక్టిస్ కమిటీ ఎదుట హాజరుకావాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుక్ అయిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్స్ మెయిల్‌కు పంపించామని, వారు తప్పకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో, మాల్ ప్రాక్టిస్ చేసినందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని సూచించారు. -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని గిరిజన భవన్లో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఘనస్వాగతం పలికారు. మృగవాణి రెస్టారెంట్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్, ఇతర జిల్లా అధికారులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నాడు, నేడు ఆదివాసీ చెంచులను అక్కున్న చేరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశామని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అచ్చంపేట ప్రాంతంలోని చెంచులకు ప్రస్తుతం 836 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 జిల్లాల్లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణ బిల్లులు రూ. 5లక్షలతో పాటు అదనంగా మరో రూ.లక్ష అందిస్తామన్నారు. ● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 3,600 ఇళ్లు మంజూరయ్యాయని.. అర్హులైన ప్రతి చెంచు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. పూర్తిగా వెనకబడిన ఈ ప్రాంతానికి అదనంగా మరో 1,500 ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ● ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు పండుగ వాతావరణం తీసుకొచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 11,622 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, డీఈలు వెంకటేశ్వర సింగ్, హేమలత, నాయకులు హరినారాయణ, రహీం, రవి, శ్రీనివాసులు, మేరాజ్, వెంకటరమణ, రేణయ్య, మల్లేష్, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజారాం, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హామీలకే పరిమితం: మంత్రి జూపల్లి గత ప్రభుత్వం హామీలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మాయ మాటలతో కాలయాపన చేసి రూ. 8లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై పెట్టిందని ఆరోపించారు. గత పాలకులు చేసిన అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తూనే.. ఏడాదిన్నర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం ఆదివాసీ చెంచులకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాడు, నేడు అక్కున్న చేర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మాదే రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
చివరలో మొండిచేయి..!
‘ఇందిరమ్మ’ఆశావహులనువెంటాడుతున్న గతం ● 20 ఏళ్ల క్రితం లబ్ధిపొందారంటూఅనర్హులుగా తేల్చివేత ● అర్హులుగా చేర్చి.. ప్రొసీడింగ్‌లు సిద్ధమైన తర్వాత రద్దు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగాఆందోళనలో వేలాది మంది.. ● అప్పట్లో ఈ పథకంలో భారీ స్కాం.. పలువురు నేతల స్వాహా పర్వం ● తమకు తెలియకుండానే బిల్లులు మింగారని లబ్ధిదారుల గగ్గోలు ● ఆ జాబితా ప్రకారం ఏరివేయడంపై మండిపాటు కూలగొట్టిన ఇంటి వద్ద కళావతి -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నాగర్‌కర్నూల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి ఉదయం 8గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. 10:30 గంటలకు మన్ననూర్ మృగవాణి అతిథిగృహానికి చేరుకొని స్థానిక రెవెన్యూ అంశాలపై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం అమ్రాబాద్ బీటీరోడ్డు నిర్మాణానికి, గిరిజన భవనం ప్రహరీ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాప్యం లేకుండా విద్యుత్ కనెక్షన్లు నాగర్‌కర్నూల్ క్రైం: కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ సీహెచ్ పౌల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు చెల్లించిన రైతులకు మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందన్నారు. సీనియార్టీ ప్రకారం రైతులకు మెటీరియల్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ వరకు 200 మంది రైతులకు మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని.. 11కేవీ పనులు పూర్తయిన వెంటనే వాటిని బిగిస్తామని తెలిపారు. మైసమ్మ జాతరలోతగ్గిన భక్తుల రద్దీ పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం తొలి ఏకాదశి, మొహర్రం పండుగ ఉండటంతో భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో జాతర మైదానం వెలవెలబోయింది. సుమారు 3వేల మంది భక్తులు మైసమ్మ దేవతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోయిల్‌సాగర్‌లో 22.6 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 22.6 అడుగులకు చేరింది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రోజుకు కొంత మేర నీటిమట్టం పెరుగుతోంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులు ఉండగా.. 11.6 అడుగులు పెరిగి 22.6 అడుగులకు చేరింది. అయితే పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. మరో 4 అడుగుల నీరు రావాల్సి ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ వరకు 32.6 అడుగులు ఉండగా మరో 10 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. బకాయిలు విడుదల చేయాలి కందనూలు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు తారాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
మెప్మా ఆధ్వర్యంలో..
జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలతో 7,28,000 మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలు రూపొందించారు. గత నెలలోనే అన్ని పురపాలికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటేందుకు స్థల సేకరణ సైతం పూర్తిచేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వహించే మహిళా సంఘాల సభ్యులను అమృత్ మిత్రలుగా పిలవనున్నారు. అయితే మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే చేపట్టాల్సి ఉండగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో అడుగు పడలేదు. -
జంతువుల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి
నాగర్‌కర్నూల్: పెంపుడు జంతువులతో ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. వాటి పెంపకంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో చాలా మందికి పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుందన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలతో పెంచుకుంటారని.. పెంపుడు జంతువులకు చిన్నపాటి హాని జరిగినా విలవిల్లాడిపోతారన్నారు. అయితే జంతువుల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. జంతువులు, పక్షుల నుంచి జూనోసిస్ వ్యాధులైన రేబిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటివి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండటం, పరిశుభ్రత పాటించడం, టీకాలు వేయించడం ద్వారా జూనోసిస్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.జూనోసిస్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాంటీ రేబిస్ టీకాను కోర్సు ప్రకారం కుక్కలకు వేయించాలని కలెక్టర్ సూచించారు. కాగా, రేబిస్ వ్యాధి సోకకుండా ముందుజాగ్రత్తగా పెంపుడు జంతువుల యజమానులతో పాటు పశువైద్యులు, సిబ్బందికి టీకాలు వేశారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి బి.జ్ఞాన శేఖర్, వైద్యారోగ్యశాఖ ఇమ్యునైజేషన్ అధికారి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాలు వేయించాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఎండీసీఏ ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మనోహర్‌రెడ్డి అభినందించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. టుడే లీగ్‌లో మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీ–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా క్రికెట్ గ్రూప్–బీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు తొలి లీగ్ మ్యాచ్‌ను సోమవారం రాకేష్ లెవన్ జట్టుతో ఆడనుందన్నారు. టుడే లీగ్‌లో పది మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉమ్మడి జిల్లా జట్టుకు దక్కుతుందని, ఈ మ్యాచుల్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఎండీసీఏ మైదానంలో రెండు లేదా టుడే లీగ్ మ్యాచ్‌లు, బీసీసీఐ మ్యాచ్ జరిగేలా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఎండీసీఏ తరపున క్రీడాకారులను క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు. ఎండీసీఏ ఉమ్మడి జిల్లా జట్టు శ్రీకాంత్– కెప్టెన్ (షాద్‌నగర్), అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్‌నగర్), మహ్మద్ షాదాబ్ అహ్మద్– వైస్ కెప్టెన్ (మహబూబ్‌నగర్), ఎండీ ముఖితుద్దీన్ (మహబూబ్‌నగర్), జయసింహ (పెబ్బేర్), శ్రీకాంత్ (మహబూబ్‌నగర్), అక్షయ్ (నారాయణపేట), సంజయ్ (మహబూబ్‌నగర్), ఛత్రపతి (గద్వాల), రాంచరణ్, గగన్ (నాగర్‌కర్నూల్), శశాంక్ (మహబూబ్‌నగర్), హర్షిత్, జి.కేతన్‌కుమార్, అక్షయ్ సాయి (జడ్చర్ల), జశ్వంత్ (నాగర్‌కర్నూల్) ఉన్నారు. -
ఇంటర్ పాఠ్యపుస్తకాలు అందేదెన్నడో?
కందనూలు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అభ్యసిస్తున్న విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు నేటికీ అందలేదు. ఇంటర్ తరగతులు ప్రారంభమై నెలరోజులకు పైగా అయినప్పటికీ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధ్యాపకులు ఏ పాఠం చెబుతున్నారో.. తాము ఏం చదవాలో.. ఏం రాయాలో అర్థంకాక విద్యార్థినులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు. అయితే కొత్త కోర్సుల్లో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాలికా విద్య బలోపేతం, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా నిరోధించేందుకు ఏర్పాటైన కస్తూర్బా, ఆదర్శ విద్యాలయాలకు పాఠ్యపుస్తకాలు అందకపోవడం గమనార్హం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా.. గతేడాది 11, ఈ ఏడాది 9 కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం 1,926 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించారు. వీరిలో ప్రథమ సంవత్సరం 1,200 మంది, రెండో సంవత్సరం 796 మంది విద్యార్థినులు ఉన్నారు. అదే విధంగా కోడేరు, వెల్దండలోని ఆదర్శ విద్యాలయాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 346 మంది విద్యనభ్యసిస్తున్నారు. నాగర్‌కర్నూల్, లింగాల, కొల్లాపూర్, వెల్దండ, చారకొండ, పెంట్లవెల్లి, అమ్రాబాద్ కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా.. బిజినేపల్లి, తెలకపల్లి, కల్వకుర్తి, బల్మూర్, తాడూర్, తిమ్మాజిపేట, ఉప్పునుంతల, వంగూర్ కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. అచ్చంపేట, కోడేరు, పెద్దకొత్తపల్లి, ఊర్కొండ, పదరలో ఏఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్ కోర్సులు కొనసాగుతున్నాయి. ప్రతి కోర్సులో 40 మంది విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉంది. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క కొత్త పాఠ్యపుస్తకం కూడా అందలేదు. దీంతో కొన్ని విద్యాలయాల్లో పాత పుస్తకాలతో బోధన కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ, ఇతర కోర్సుల పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థినులకు బోధన ఎలా సాగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేజీబీవీ, ఆదర్శ విద్యాలయాల్లో అరకొర అభ్యాసనం ఇంటర్ విద్యార్థినులకు పుస్తకాల పంపిణీలో జాప్యం పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న వైనం కొత్త కోర్సుల్లో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరం -
కొనసాగిన కేంద్ర బృందం పర్యటన
వనపర్తి రూరల్: పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో ఆదివారం కేంద్ర బృందం 28వ కమిటీ నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి అర్వింద్‌కుమార్, సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త యాదయ్య పర్యటించారు. కంచిరావుపల్లి, తాటిపాముల, కంభాళాపురం శివారులోని భీమా 15వ ప్యాకేజీలోని ప్రధాన, మైనర్ కాల్వలు, కంభాళాపురం తండా 27 ప్యాకేజీలోని 18/19 కాల్వ 7ఆర్ మైనర్ కాల్వను, శ్రీరంగాపురం రంగసముద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సాగునీటి సరఫరా ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కాల్వల్లో జమ్ము, పూడిక పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వివరించారు. ఫీడర్ ఛానల్, డిస్ట్రిబూష్యన్ షట్టర్లు, కాల్వల వెడల్పు పెంచడం, లైనింగ్ సరిగా లేదని జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, వెంకట్రామారెడ్డి రైతులతో కలిసి కేంద్ర బృందానికి సమస్యల వినతిపత్రం అందజేశారు. వారి వెంట ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ కేశవరావు, డీఈ కిరణ్‌కుమార్, డీసీసీ అఽధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, ఏఈలు, ఇతర అధికారులు ఉన్నారు. -
పచ్చదనం పరిచేలా..
అచ్చంపేట రూరల్: పట్టణ ప్రాంతాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఉమెన్ ఫర్ ట్రీస్ (మహిళలతో మొక్కలు)’ కార్యక్రమంతో పచ్చదనం పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతగా ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి నాటిన మొక్కలను రెండేళ్ల వరకు సంరక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. గత మేలో ఈ కార్యక్రమంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించగా.. ఎక్కడ మొక్కలు నాటాలో గుర్తించే ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు. 10 మంది చొప్పున.. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలు ఉండగా.. మహిళా సంఘాల సభ్యులతో మొక్కలు నాటించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లోని ప్రతి మహిళా సంఘంలో 10 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరు 200 చొప్పున మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కొక్క సంఘం 2,000 చొప్పున మొక్కలు నాటి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. స్థలాలు లేని చోట కొంత వెసులుబాటు ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెండేళ్ల వరకు మొక్కల సంరక్షణ బాధ్యతలు ఎంపికై న వారే చూస్తారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ నిమిత్తం ఒక్కో పట్టణానికి నోడల్ అధికారిని సైతం నియమించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సదరు బాధ్యతల నిర్వహణ కోసం ఒకరికి రూ. 5వేల వరకు ప్రతి నెలా చెల్లిస్తారు. కార్యక్రమం విజయవంతమైతే వచ్చే ఏడాది మరిన్ని మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. నాటనున్న మొక్కలు.. పండ్లు, నీడనిచ్చే వాటితో పాటు ప్రజోపయోగ మొక్కలను అధికారులు ఎంపిక చేశారు. అందులో రావి, వేప, బయో డీజిల్, ఉత్తరేణి తదితర రకాలు ఉన్నాయి. పురపాలికల్లోని ప్రధాన చెరువుల వద్ద మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే రద్దీ ప్రదేశాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, తదితర చోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాలకుమొక్కల సంరక్షణ బాధ్యత సరికొత్త కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం ఒక్కో సంఘం 2,000 చొప్పున మొక్కలు నాటేలా ప్రణాళిక మున్సిపాలిటీల్లో ఆహ్లాదకర వాతావరణం దిశగా అడుగులు -
ఆర్బీఐ అనుమతితో..
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్‌తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, డీసీసీబీ34,731 మందికి మేలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది. ● -
ఎక్కడి రైళ్లు అక్కడే..!
● బోయపల్లి గేట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ● 4 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ● నిలిచిపోయిన హంద్రీ, బెంగ ళూరు, చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ రైళ్లు ● తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు ● రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్‌నగర్/ మదనాపురం/ జడ్చర్ల టౌన్ : జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్‌ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్‌పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు. వనపర్తి రైల్వేస్టేషన్లో నిలిచిన వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లు రైలులో జ్వరంతోనే.. ఎమ్మిగనూరు గంజిల గ్రామానికి చెందిన కె.లక్ష్మి అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయి స్వగ్రామానికి వెళ్లేందుకు భర్త పెద్దలింగన్నతో కలపి హంద్రీ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. జడ్చర్ల స్టేషన్లో రైలు నిలవటంతో ఇబ్బందులు పడ్డారు. జ్వరం రావడంతో మాత్రలు వేసుకుని రైలులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్దామంటే ఇలా ఇబ్బందులు వస్తాయని అనుకోలేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో నిలిపేస్తే ఎలా..? కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు -
ప్రతి చెంచుకు శాశ్వత గృహాలు
నాగర్‌కర్నూల్: ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, చెంచుపెంటల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చెంచుల ఇళ్ల నిర్మాణాలు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్య, సదుపాయాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోహిత్ గోపిడితో కలిసి ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న చెంచులకు శాశ్వత గృహాల మంజూరు నిర్మాణానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెంచు పెంటల్లో ఇది వరకే గుర్తించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలు అత్యంత పారదర్శకంగా అమలుచేయాలన్నారు. చెంచులు ఎవరు కూడా శాశ్వత గృహాలు లేకుండా ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో అధికారులు పనిచేయాలన్నారు. అలాగే జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను గుర్తించడానికి ఒక్కొక్క వసతి గృహానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామన్నారు. ఆశ్రమ, గిరిజన వసతి గృహాలను తప్పనిసరిగా ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. చెంచు గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రిన్సిపల్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, అప్పాపూర్ చెంచు పెంటలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ఆంజనేయులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నాలుగు జతల ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు, దుప్పట్లు, టవల్స్, ట్రంకు బాక్సులు, షూలు పంపిణీ చేశారా.. అని పాఠశాలల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే వసతులు, ఉపాధ్యాయుల హాజరు, భోజన సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. -
రైతు సేవలే లక్ష్యం
సహకార రంగాలఅభివృద్ధికి పటిష్ట చర్యలు ● త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ ● విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు ● రుణమాఫీతో 34,731 మంది రైతులకు ఊరట ● నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్‌ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్‌లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యకు చేయూత రైతు కుటుంబాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి కలిగిన పిల్లలకు డీసీసీబీ తరపున ప్రత్యేకంగా విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేకంగా రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు. -
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
మన్ననూర్: పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. శుక్రవారం ఆయన మన్ననూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, పీటీజీ పాఠశాల/కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు రూపాదేవి, పద్మావతి, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి అక్కడి పరిసరాలను కలియదిరిగారు. విద్యా బోధన, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందరికీ అందించారా.. అని ఆరాతీశారు. వసతి గృహం, పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు రాత్రి సమయంలో పడుకునేందుకు మంచాలు, కొన్ని అదనపు టాయిలెట్స్ నిర్మాణాలు అవసరమని ప్రిన్సిపాల్ రూపాదేవి అదనపు కలెక్టర్ దృష్టికి తేగా స్పందించిన ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమకూర్చేందుకు కృషిచేస్తానన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సరిత, డీఎల్పీఓ వెంకటప్రసాద్, మండల వ్యవసాయాధికారికారి మహేష్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి భీముడు పాల్గొన్నారు. -
అభివృద్ధి జోరు..
సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో పనులు వేగవంతం ●గ్రామానికి అన్ని హంగులు.. మా గ్రామానికి చెందిన ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కావడం మాకెంతో గర్వకారణం. ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెటర్నరీ ఆస్పత్రి, పాలశీతలీకరణ కేంద్రం, బస్టాండ్, పంచాయతీ భవనాలతోపాటు రోడ్లతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. – వేమారెడ్డి, కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.. కొండారెడ్డిపల్లిలో అన్ని అభివృద్ధి పనులను సమాంతరంగా పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని భవన నిర్మాణాలు, సీసీరోడ్లు, సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పనులను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. దసరా నాటికి పనులను పూర్తి చేసేలా వేగం పెంచాం. – దేవసహాయం, ఇన్చార్జ్ అధికారి, అదనపు కలెక్టర్ సాక్షి, నాగర్‌కర్నూల్/ వంగూరు: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో విస్తృతంగా చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని రోజులుగా వేగం పుంజుకున్నాయి. జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో తొలి విడతలో ఇప్పటికే సుమారు రూ.150 కోట్ల నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టగా.. మరోవిడత అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ చూసినా అధునాతన భవనాలు, రోడ్ల విస్తరణ, సుందరీకరణ ఇతరత్రా అభివృద్ధి పనుల హడావుడే కనిపిస్తోంది. ఆయా పనుల పర్యవేక్షణకు ఇన్చార్జ్గా జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయంను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే దసరా పండుగకు సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈలోపే ప్రధాన పనులను పూర్తిచేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ తర్వాత ఇక్కడే.. కొండారెడ్డిపల్లిలో ఇంటింటికీ సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని మొత్తం 515 ఇళ్లకు గానూ ఇప్పటి వరకు 405 ఇళ్లలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశారు. ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసి, తమ అవసరాలకు వినియోగించుకోవడమే కాక మిగులు విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్కు విక్రయించుకునేలా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కేబుల్ వైర్లను స్తంభాలకు కాకుండా అండర్ గ్రౌండ్ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఇక్కడే ప్రభుత్వం అండర్ గ్రౌండ్ కేబుళ్లను గ్రామంలో ఏర్పాటు చేస్తుంది. మారనున్న ముఖచిత్రం.. కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. పెద్దఎత్తున నిధులు వెచ్చించి విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలకు అంతర్గత సీసీరోడ్లు, ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్, విశాలమైన రహదారులు, అధునాతన ప్రభుత్వ భవనాలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, ఇంటింటా సోలార్ వెలుగులు, గ్రామం చుట్టూ సుందరీకరణ పనులతో మెరిసిపోయేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కొండారెడ్డిపల్లిలో ప్రధానంగా చేపట్టిన పనుల వివరాలు పనులు నిధులు (రూ.కోట్లలో) రహదారుల విస్తరణ 21 మిషన్ భగీరథ పైప్‌లైన్ 31.1 అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, ఎస్టీపీ 9.30 అంతర్గత సీసీ రోడ్లు 8.70 విద్యుత్ ఫీడర్ల ఏర్పాట్లు 2.85 పాలశీతలీకరణ కేంద్రం 2.50 గ్రామ పంచాయతీ భవనం 0.72 బీసీ కమ్యూనిటీ హాల్ 0.58 గ్రంథాలయం 0.55 వెటర్నరీ ఆస్పత్రి భవనం 0.45 ఎల్ఈడీ లైట్లు 0.40 చుట్టూరా సుందరీకరణతో మెరిసిపోయేలా కొండారెడ్డిపల్లి మొదటి విడతలో సుమారు రూ.150 కోట్లు కేటాయింపు అధునాతన భవనాలు, రోడ్ల విస్తరణతో మారుతున్న రూపురేఖలు ఈ దసరాలోగా పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు -
దండిగా నిధులు.. ఊరంతా పనులు
సీఎం స్వగ్రామంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ భవనం పూర్తికాగా.. ప్రధాన రహదారులు, అంతర్గత, సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. కొండారెడ్డిపల్లి నుంచి పోల్కంపల్లి వద్దనున్న హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి వరకు రోడ్డును సైతం నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా పాలశీతలీకరణ కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రి, గ్రామ పంచాయతీ, రైతు వేదిక ఆధునీకరణ, లైబ్రరీ, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, గ్రామం నుంచి మండల కేంద్రానికి, ఇతర గ్రామాలకు అనుసంధానంగా నాలుగు వరుసల రహదారులు, ఇంటింటా మిషన్ భగీరథ నీటి సౌకర్యం, సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు -
కాంగ్రెస్‌లో కష్టపడిన వారికే పదవులు
కందనూలు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని, కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ లీడర్లకే అవకాశం ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్‌లో ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం నేతలు కష్టపడితేనే వారికి పదవుల రూపంలో ప్రతిఫలం దక్కుతుందన్నారు. ఇందుకోసం పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ గల్లీలో పార్టీ కోసం కష్టపడితేనే ఢిల్లీలో అధికారం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ వల్లే తాను గెలిచినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియా వారియర్లుగా యువజన కాంగ్రెస్ లీడర్లు ఎదగాలని, అందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. సోషల్ మీడియానే వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రచారం చేయా లని, గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొందేలా ప్రతి కార్యకర్త పాటు పడాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్‌సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. బోట్ల సహాయంతో.. నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి.. నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది. ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత 7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు -
వెనకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేయాలి
నాగర్‌కర్నూల్: వెనకబడిన వర్గాల శ్రేయస్సుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ (బ్యాంకర్ల) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజన్‌కు అనుగుణంగా బ్యాంకులు జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి.. వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటునందించాలని, ఈ విషయంలో బ్యాంకర్ల పాత్ర ఎంతో కీలకం అన్నారు. అలాగే రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు, ఇందిరా మహిళ శక్తి రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ, విద్యార్థులకు సంబంధించి ఉన్నత చదువులకు విద్యా రుణాలను అధిక సంఖ్యలో మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులను తప్పనిసరి పరిస్థితుల్లో తిరస్కరించేటప్పుడు అందుకు గల కారణాలు తెలియజేయాలన్నారు. ఈ నెల 15న నిర్వహించే దిశ సమావేశానికి రుణాల వివరాల పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. ● స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్య సాధనకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని, ప్రతి గ్రామంలో వందశాతం ఓడీఎఫ్ ప్లస్ అమలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత అందించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, నాబార్డు డీడీఎం మనోహర్‌రెడ్డి, ఆర్బీఐ ఎల్డీఓ రాములు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ ఓబులేసు, డీఏఓ చంద్రశేఖర్, డీపీఓ శ్రీరాములు, డీఈఓ రమేష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు రాజేశ్వరి, ఖాజా నాజిమ్ అలీ అప్సర్, రజిని, పీఆర్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. కొండారెడ్డిపల్లిపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రతి పనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, మిగిలిన పనులకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పూర్తిచేయాలని చెప్పారు. అంతకు ముందు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఆరాతీశారు. ప్రతి పనిపై ప్రగతి వివరాలు, ఎదురయ్యే సవాళ్లు, పూర్తయ్యే గడువు గురించి తెలుసుకున్నారు. -
తప్పని పాట్లు
ఓపెన్ ప్లాట్లు..●దోమలు ఎక్కువయ్యాయి.. వానాకాలం ప్రారంభంలోనే దోమలు విజృంభించి రోగాలకు కారణం అవుతున్నాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో పాటు నీరు నిలిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదు. దీంతో ప్రజలు రోగాల బారినపడాల్సి వస్తోంది. – మైబన్న, శ్రీనగర్‌కాలనీ, నాగర్‌కర్నూల్ సాక్షి, నాగర్‌కర్నూల్: వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల విజృంభించే అవకాశం ఉంది. ముందస్తుగా అప్రమత్తమై, పకడ్బందీగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలన్నీ మురికి కూపాలను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు, నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో నీరంతా సమీపంలోని ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. వానాకాలం సీజన్లో నీటి ఉధృతి పెరిగి ఓపెన్ ప్లాట్లు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెడుతూ, తర్వాత సంతతి వేగంగా వృద్ధిచెందుతోంది. దీంతో తరచుగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మురికి నీరు, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఖాళీ స్థలాలపై పట్టింపు కరువు.. మున్సిపాలిటీల్లోని ఓపెన్ ప్లాట్లలో నీటి నిల్వ కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉన్నచోట దోమల లార్వా వృద్ధిచెందకుండా ఆయిల్‌బాల్స్ చల్లడం వంటి చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. వానాకాలం సీజన్లో ఎక్కువ కాలం నీరు నిల్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ఓపెన్‌ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగు, వర్షపునీరు చేరకుండా జాగ్రత్తపడాల్సిన ఆయా స్థలాల యజమానులకు సూచించాలి. తమ స్థలాన్ని చదును చేసుకునేలా వారికి మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేయాలి. కానీ సంబంధిత అధికారులు విస్మరిస్తుండటంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల్లోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలతో ఇబ్బందులు నీళ్లు నిలిచి మురికికూపాల్లా మారుతున్న వైనం దోమల ఉధృతికి ఆవాసాలుగా ఖాళీ ప్రదేశాలు శివారు ప్రాంతాలు, నూతన కాలనీల్లో మరింత అధ్వాన పరిస్థితి వాటర్ లాగింగ్ ఏరియాల్లో కనిపించని పారిశుధ్య చర్యలు అమలుకాని నిబంధనలు.. ఓపెన్ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే ఈ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఏర్పాటైన ఓపెన్ప్లాట్ల యజమానుల వివరాలు సైతం అధికారుల వద్ద లేవు. సీజనల్ వ్యాధుల నిర్మూలన చర్యల్లో భాగంగా ఖాళీ స్థలాలను అధికార యంత్రాంగమే శుభ్రం చేయాల్సి ఉండగా ఈ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఓపెన్ ప్లాట్లను చదును చేసినప్పుడు అయిన ఖర్చును ఆయా యజమానులు ఇంటి నిర్మాణం, ఇతర అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంది. కనీసం ఓపెన్ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వడంలోనూ అలసత్వం వీడటం లేదు. -
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
కందనూలు: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, పీఈటీ బోధన పోస్టులకు 2023లో రాత పరీక్ష ద్వారా మెరిట్ రోస్టర్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు 1:3 నిష్పత్తి ప్రకారం శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (పీజీ), బీఈడీ, ఎంఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, డిప్లొమా సర్టిఫికెట్లతోపాటు స్థానికం, కులం, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఎక్స్పీరియన్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తేవాలని సూచించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు డీఈఓ కార్యాలయంలో వెరిఫికేషన ఉంటుందని, రోస్టర్, మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల వివరాలను డీఈఓ జిల్లా వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పారు. ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2025 సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్ర సమన్వయకర్త అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్, ఐటీఐ లేదా ఇతర డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వచ్చే నెల 13లోగా ఓపెన్ డిగ్రీలో ప్రవేశం పొందాలని సూచించారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు 10వ తరగతి మెమో, ఇంటర్ మెమో లేదా ఇతర అర్హతల సర్టిఫికెట్లు, ఆధార్, కుల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను అప్లోడ్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.73829 29779 లేదా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. అలాగే 2, 3 సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించాలన్నారు. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి కందనూలు: జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ రామలక్ష్మి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించి, రైతువేదికల వారిగా అవగాహ న సదస్సులు నిర్వహించాలని, తద్వారా లక్ష్యా న్ని సాధించాలని ఆదేశించారు. ఆయిల్‌పాం సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదా యం వస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, ప్రీయూనిక్ ఆయిల్‌పాం, డ్రిప్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. -
క్షయ రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీహెచ్‌సీల పర్యవేక్షణ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి అనుమానితులు, పొగ, మద్యపానం చేసేవారు, తక్కువ బరువు ఉన్నవారు, ఇంతకు ముందు క్షయ వ్యాధి చికిత్స తీసుకున్న కుటుంబ సభ్యులను గ్రామాల్లో నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు తరలించి కళ్లె, ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి వెంటనే క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స ప్రారంభించాలని సూచించారు. గుర్తించిన క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా పోషకాహార కిట్ అందజేయాలని, సంపూర్ణ చికిత్స తీసుకునేలా క్షేత్రసాయి సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అబాకార్డ్ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)లను జనరేట్ చేయాలని, అబాకార్డు ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా వ్యాధుల నివారణ చర్యల గురించి ప్రతి శుక్రవారం ప్రజలందరూ వారి ఇంట్లో డ్రై డే పాటించేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన వారందరినీ 12 వారాల్లోపు నమోదు చేసుకోవాలని, గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు లక్ష్మణ్, కృష్ణమోహన్, డీపీఓ రేనయ్య, ఏపీఓలు శ్రీను, విజయ్‌కుమార్, నిరంజన్, మినహాజ్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు పంపాం
జనరల్ ఆస్పత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరో 300 పడకల ఆస్పత్రిని త్వరలోనే ఏర్పాటు చేసి వైద్య విద్యార్థులకు ప్రాక్రీస్తో పాటు రోగులకు అన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – డా.రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతులు మంజూరయ్యాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతులను బోధించేందుకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – డా.రమాదేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ● -
కనిపించని ఎరువుల తయారీ..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల వద్ద కంపోస్టు ఎరువుల తయారీ కోసం సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను వెచ్చించారు. కానీ ఎక్కడా ఎరువులు, కంపోస్టు తయారీ చేపట్టడం లేదు. తడిచెత్తను సేకరించి ఎరువుగా మార్చితే మున్సిపాలిటీలకు ఆదాయ వనరులుగా మారే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులను హరితహారం కింద నాటిన మొక్కలకు వినియోగించేందుకు అవకాశం ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. చెత్తయార్డుగా మార్చారు కొల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన చెత్తను రోజూ తీసుకొచ్చి మా గ్రామ శివారులో ప్రధాన రోడ్డు పక్కనే వేస్తున్నారు. స్థానికులతో పా టు పర్యాటక ప్రాంతమైన అమరగిరికి వస్తున్న పర్యాటకులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదు. – భరత్‌కుమార్, అమరగిరి, కొల్లాపూర్ మండలం -
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది. – మాసన్న, 108 పైలెట్, మహబూబ్‌నగర్ రెండు, మూడురోజుల్లో.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్‌ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ● -
ఆయిల్‌పాం సాగులో ఆదర్శంగా నిలవాలి
ఊర్కొండ: ఆయిల్‌పాం సాగుపై రైతుల దృష్టి సారించి, రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఊర్కొండ మండలంలోని మాదారంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు శ్రీకాంత్‌కు చెందిన 10 ఎకరాల్లో చేస్తున్న ఆయిల్‌పాం ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాదారం గ్రామం నుంచి శ్రీకాంత్ పొలం వరకు ట్రాక్టర్లో ప్రయాణించారు. మాదారంలోనే మరో రైతు కృష్ణారెడ్డి ఆయిల్‌పాం మొదటి క్రాప్ కట్టింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్‌పాం తోటల సాగుకు పొలాలు అనుకూలంగా ఉన్నాయని ఆయిల్‌పాం పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గతంలో ధ్రువీకరించారన్నారు. రైతులకు ప్రోత్సాహకం ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఒకసారి మొక్క నాటితే నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్లకు వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 60 వేల మంది రైతులు 10 ఎకరాల పొలం కలిగిన ఉన్నారని, వారందరూ ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, తహసీల్దార్ యూసఫ్‌అలీ తదితరులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి తాడూరు: విద్యార్ధులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని సిర్సవా డ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ, పరిసరాల శుభ్రత అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని, దానికి అందరి సహకారం కావాలని కోరారు. విద్యార్థులకు అందించే నోట్, పాఠ్య పుస్తకాలు, దస్తులు గురించి ఆరా తీశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు లెక్కలు బోధించడంతో వారితో చేయించారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
‘బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం’
నాగర్‌కర్నూల్: బాలల హక్కుల పరిరక్షణ, పిల్లలందరికీ సమాన అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు విద్య, వైద్య, పోలీస్, సీ్త్ర శిశు సంక్షేమ, కార్మిక శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి సూచించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా బిజినేపల్లి, తాడూరు మండలాల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, అంగన్వాడీ కేంద్రం, అనాథ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, అందుతున్న భోజనం, విద్యా తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలనతో చేసి సమీక్ష నిర్వహించారు. మిషన్ వాత్సల్య జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరు గురించి చర్చించా రు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచనకుమార్, సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అదనపు ఎస్పీ రామేశ్వర్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, జిల్లా బాలల సంరక్షణ చైర్మన్ లక్ష్మణరావు, డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలంగౌడ్, సీడీపీఓలు, సూపర్వైజర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీ, ఆస్పత్రిపై నజర్
నాగర్‌కర్నూల్ క్రైం: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27మెడికల్ కళాశాలల నిర్వహణపై నేష నల్ మానిటరింగ్ కమిటీ ఇటీవల అసంతృప్తి వ్య క్తం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండటంతో అధి కారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభించి ఇప్పటికే మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల అనుగుణంగా సదుపాయాలు కల్పించడంతో నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ బాదావత్ సంతోష్ వాటిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ఇటీవలే ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ సైతం జనరల్ ఆస్పత్రిని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన వివరాలతో పాటు వైద్య విద్యార్దుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫె సర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలను, వైద్య పరికరాల గురించి ఆరా తీశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 300 పడకలు ఉండగా మరో 305 పడకలు అదనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదన లు సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వైద్యకళాశాల విద్యార్థులకు మెడికల్ ప్రాక్టీస్ తో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే అవకాశం ఉండనుంది. తీరు మార్చుకోని వైద్యులు ఐదు రోజుల క్రితం జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలను ఆరోగ్యశ్రీ సీఈఓ, కలెక్టర్ తనిఖీ చేసేందుకు వచ్చి, వెళ్లిన రోజే ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యురాలు రోగులను పరీక్షించకుండా తన ఫోన్లో క్యాండిక్రష్ గేమ్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి మరో 305 పడకలు ఏర్పాటుకు కసరత్తు నిర్లక్ష్యం వీడని వైద్యులు -
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తేనే జీవితంలో స్థిరపడతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును అశ్రద్ధ చేయొద్దన్నారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివి కొత్త విషయాలు తెలుసుకోవాలని తెలిపారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సునీత మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఎస్బీఐ కొంత కార్పస్ ఫండ్ సమాజ సేవకు వినియోగిస్తుందని.. నాగర్‌కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో 230 మంది పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాకేశ్ శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, హెచ్ఎం శోభన్‌బాబు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా ప్రగతి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి, అడ్డంకులు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానం పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, వందశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. ప్రభుత్వ శాఖల పురోగతిపై నిర్వహించే సమీక్షకు సంబంధిత జిల్లా అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని.. అనుమతులకు సంబంధించిన ప్రతి ఫైల్ ఈ–ఆఫీస్ ద్వారానే పంపించాలని సూచించారు. జిల్లా అధికారులకు కేటాయించిన గురుకులాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. భోజనం నాణ్యతపై తరచూ సమీక్షలు జరిపి.. అవసరమైన మార్పులు చేయాలన్నారు. ప్రజావాణి, ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కారం సాధ్యపడని దరఖాస్తుల విషయంలో తగిన కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ.. సంబంధిత నివేదికలను సమర్పించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి సారించండి.. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్–11పై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌ను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే డ యల్ 1098కు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాలలను పనిలో పెట్టుకునే వారికి చట్టప్రకారం శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయిన పిల్లలందరినీ గుర్తించి.. తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా ఉపాధి అవకాశాల నిమిత్తం వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మానసిక స్థితి సరిగా లేని బాలలకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి.. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. కాగా, గతేడాది నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 30 మంది, ముస్కాన్ కార్యక్రమంలో 24 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఏఎస్పీ రామేశ్వర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులోనిర్లక్ష్యం వహించొద్దు కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కలెక్టర్ బదావత్ సంతోష్ -
ఔత్సాహికులకు నిరుత్సాహం
● ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు నోచుకోని స్పోర్ట్స్ స్కూల్ మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లు ఔత్సాహిక క్రీడాకారులకు వరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ (హకీంపేట), కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఉండగా.. 20 మంది బాలురు, 20 మంది బా లికల చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తు తం స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులను చేర్పించాలనే సంకల్పం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు స్పోర్ట్స్ స్కూళ్లే ఉండటంతో చాలా మంది వి ద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు. వనపర్తిలో స్థల సేకరణ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనైనా రెండు స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థల సేకరణ చేపట్టారు. వెంటనే వనపర్తిలో స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించాలని ఆ ప్రాంత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన క్రీడా వసతులు గతేడాది రాష్ట్రంలోని మూడు స్పోర్ట్ స్కూళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది విద్యార్థులు 4వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వనపర్తితోపాటు ఉమ్మడి జిల్లాలో మరోచోట స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటైతే మరింత ఎక్కువ మంది చిన్నారులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికవుతారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులకు ఎన్నో మెరుగైన క్రీడావసతులు అందుబాటులోకి వస్తాయి. తొలుత చిన్నారులకు ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో పరీక్షించి వారు ఏ క్రీడల్లో రాణించే అవకాశం ఉందో అందులో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అదేవిధంగా క్రీడా శిక్షణతోపాటు చదువుకూ ప్రాధాన్యం ఉంటుంది. నైపుణ్యాలు వెలికి.. స్పోర్ట్స్ స్కూళ్లతో చిన్నారుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం ఆయా క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలామంది స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన వారే. – శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ ● -
నీరు పారే దారేది?
మున్సిపాలిటీల్లో నాలాలపైపర్యవేక్షణ కరువు ● చాలా చోట్ల కాల్వలుఅన్యాక్రాంతం ● సాఫీగా పారని వరద,మురుగునీరు ● వానాకాలంలో కాలనీలను ముంచెత్తుతున్న వరద ● వాననీటి నిర్వహణకు కరువైన ప్రణాళిక సాక్షి, నాగర్‌కర్నూల్: చినుకు పడిందంటే చాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్లో వణుకు పుడుతోంది. వరద, బురదనీరు ఎప్పుడు తమ ఇళ్లలోకి వచ్చి చేరుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏళ్లుగా ఉన్న వరదనీటి కాల్వలు, నాలాలు క్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. వివిధ నిర్మాణాలతో కుంచించుకుపోతున్నాయి. ఫలితంగా వర్షం పడినప్పుడు నీరంతా బయటకు వెళ్లే దారి లేక సమీపంలోని కాలనీలను ముంచెత్తుతోంది. వానాకాలం నేపథ్యంలో ముందస్తుగానే మేల్కొని వాననీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అధికార యంత్రాంగం.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, నాలాల సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
పెంట్లవెల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పెంట్లవెల్లిలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి ఆయన మైనార్టీ మహిళలకు 109 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తామ న్నారు. పెంట్లవెల్లి మండలాన్ని అన్నివిధాలా అభి వృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం రూ. 20లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం పెంట్లవెల్లి కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయంలో రత్నగిరి ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. 17లక్షల విలువైన కిడ్ బెడ్స్ ను మంత్రి జూపల్లి అందజేశారు. కేజీబీవీలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నతంగా రాణించాలని విద్యార్థినులకు సూ చించారు. కార్యక్రమంలో నాయకులు రామన్‌గౌడ్, నర్సింహ యాదవ్, నల్లపోతుల గోపాల్, ఎర్ర శ్రీనివాసులు, ఎండీ కబీర్, మాజీ సర్పంచ్ సువర్ణమ్మ, గోపినాయక్, తిరుపాటి నాగరాజు, ధర్మతేజ, ఆంజనేయులు, భీంరెడ్డి, కుమార్ పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి నిరంతర కృషి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తాం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పోలీసు ప్రజావాణికి 15 అర్జీలు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ తగాదాలపై 10, తగున్యాయం కోసం 5 ఫిర్యాదులు అందాయని.. సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలిపెద్దకొత్తపల్లి: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వావిళ్లబావి, బాచారం ప్రాథమిక, కల్వకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులు కొనసాగించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. డీఈఓ వెంట జిల్లా బాలికా విద్య కోఆర్డినేటర్ శోభారాణి, జిల్లా టెస్టుబుక్స్ మేనేజర్ నర్సింహులు ఉన్నారు.ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలిస్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతిపాలమూరు: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం 175 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కళాశాలలో పర్యటించిన ఎన్ఎంసీ బృందం.. పలు లోపాలు ఉన్నట్లు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులు లోపాలపై ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ఎన్ఎంసీ.. సీట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలను రాబోయే నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది.