దేశాభివృద్ధికి పాటుపడాలి
కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు
క్రీడా పరికరాల పంపిణీ
అచ్చంపేట రూరల్: దాతలు అందించిన క్రీడా పరికరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర అన్నారు. సోమవారం అచ్చంపేటలోని మల్లికార్జున చెంచు ఆవాస కేంద్రంలో విద్యనభ్యశిస్తున్న చెంచు విద్యార్థుల కోసం అమెరికా బుల్ డాగ్స్ నుంచి పంపించగా క్రీడా పరికరాలను డీఎఫ్‌ఓ అందించారు. గతంలో న్యాయార్క్‌లో ఉంటున్న తాడూరువాసి జనుంపల్లి ప్రసన్న ఆవాసాన్ని సందర్శించి చెంచు విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా పరికరాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.90 వేల విలువైన క్రీడా పరికరాలను చెంచు విద్యార్థుల కోసం పంపించగా వాడుకలోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆవాస అధ్యక్షుడు జానకిరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సాగర్‌కుమార్, వీరబ్రహ్మ, దామోదర్‌శెట్టి, రామస్వామి పాల్గొన్నారు.
నేడు అండర్–16
క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్‌సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని ఆయన తెలిపారు.
దేశాభివృద్ధికి పాటుపడాలి


