గజగజలాడే చలిలే కాసింత వెచ్చదనం ఇచ్చే హాయి అంత ఇంత కాదు. వసంత పంచమి తర్వాత హిమచల్‌ప్రదేశ్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో దట్టమైన హిమపాతంతో పరుచుకున్న సంగతి తెలిసింది. అక్కడున్న చాలా గ్రామాలు మంచుదుప్పటి కప్పుకున్నాయా..? అన్నంతగా మంచు కురుస్తుంది. పాపం పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు.వారి కార్లన్నీ రోడ్లపై దిగ్బంధించి ఉన్నాయి. విద్యుత్, నీటి సరఫరా అంతరాయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి పర్యాటకులు. ఈ విపత్కర సమయంలో స్థానికులు స్పందించిన విధానం నెటిజన్లు హృదయాలను దోచుకుంది.
ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది రీల్స్‌లా మారిపోయింది. కానీ ఇక్కడ స్థానికి మహిళలు చాలా నిశబ్దంగా మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులకు వెచ్చటి చాయ్‌ని అందించి స్వాంతన చేకూర్చారు. మనాలీ సమీపంలోని గోజ్రా గ్రామానికి చెందిన స్థానిక మహిళలు గడ్డకట్టిన వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి వేడినీటి ప్లాస్క్‌లతో బయటకు వచ్చి వారికి సర్వ్ చేయడం విశేషం.
ఎక్కడా.. హడావిడి గానీ హంగామా గానీ లేదు..సౌమ్యంగా సహాయం చేస్తున్న విధానం అందరి మనసులకు హత్తుకుంది. గణతంత్రపు దినోత్సవం ప్లస్ వారాంతపు సెలవు కలిసిరావడంతో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సరిగ్గా దానికి తగ్గట్టు కఠినమైన వాతావరణం ఇబ్బంది పెడితే.. స్థానికులు మాత్రం ఆతిథ్యంతో 'స్వచ్ఛమైన హిమచల్ స్ఫూర్తి'ని కనబర్చి మానవత్వం చాటుకోవడం అందర్నీ ఆకర్షించింది.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది పర్యాటకానికి సంబంధించిన రీల్స్ కాదు..నిశబ్దంగా చెబుతున్న మానవత్వపు చర్య ఇది అంటూ పోస్టులు పెట్టారు.
The most beautiful video on Tourism Day.
Local women serving hot tea to tourists stranded in Manali’s snowfall traffic jam. No noise, no show off, just warmth and kindness.
Across tourist states, one thing stays common. Be polite, be gentle, and people will always step up to… pic.twitter.com/gmxhGX3mt9— Nikhil saini (@iNikhilsaini) January 25, 2026
(చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!)


