'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..! | Why A Lone Nihilist Penguins 2007 Clip Going Viral In 2026 | Sakshi
Sakshi News home page

'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!

Jan 25 2026 3:57 PM | Updated on Jan 25 2026 4:28 PM

Why A Lone Nihilist Penguins 2007 Clip Going Viral In 2026

ఓ డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఒంటరి నిహిలిస్ట్ పెంగ్విన్ క్లిప్ ఇప్పటికీ వైరల్‌ అవ్వుతూ స్ఫూర్తిని రగిలిస్తూ..యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతేగాదు అసలేంటీ ఒంటరి పెంగ్విన్‌ కథ అని నెట్టింట చర్చలు లేవెనెత్తాయి. ఇది తిరుగుబాటుకు, ధైర్యానికి, పట్టుదలకు కేరాఫ్‌గా నిలిచింది. అందరు జీవిస్తారు కానీ ఈ ఎగరలేని పక్షి బతకాలని కోరుకుంటుందంటూ..ప్రేరణను అందించే కథలన్నీ గుట్టుగట్టలుగా ుపుట్టుకొచ్చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్‌ వెనుకున్న కథేంటంటే..!.

నిజానికి పెంగ్విన్‌లు గుంపులు గుంపులు సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ వీడియోలోనిపెంగ్విన్‌ మాత్రం నా దారి రహదారి అంటూ..విభిన్నంగా వెళ్తోంది. అది కూడా అది వెళ్లే రూటు ఆహారం దొరికే ప్రదేశం కానేకాదు. సముద్రం వైపుకి వెళ్తున్న గుంపుని వదిలేసి మరి ఒంటరిగా వెళ్తుండటం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సైతం గ్రీన్‌ల్యాండ్‌ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులకు ఆద్యం పోసేలా ఈ ఒంటరి పెంగ్విన్‌ను కలిగి ఉన్న AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. 

అంతేకాదు చాట్‌జీపీటీ సైతం పెంగ్విన్‌ ఒంటరిగా అలా ఎందుకు వెళ్తుందో సర్చ్‌ చేయగా..ఈ క్లిప్‌ వన్యప్రాణులను చూడలేదని పేర్కొనడం గమనార్హం. 2007లో చిత్రీకరించిన డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.

కానీ, ఒక్క 'అడిలీ పెంగ్విన్' (Adelie Penguin) మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కి.మీ దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తుండటాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్‌ని ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్‌ హెర్జోగ్‌ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్‌ వాక్‌ని డెత్‌మార్చ్‌ అని పిలిచాడు. ఎందుకంటే ఆ పెంగ్విన్‌ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి, పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. వెర్నర్ హెర్జోగ్, ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు. దానిని పట్టుకుని మళ్ళీ పెంగ్విన్‌ల గుంపులో కలిపారు. 

 

కానీ, ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్ళీ గుంపు నుండి బయటకు వచ్చి అదే పర్వతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ ెపెంగ్విన్‌ గుండెధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. పైగా దాన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటుండుంటం విశేషం.

గుంపులో గోవింద అన్నట్లుగా కాకుండా స్పెషల్‌గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు ఈ పెంగ్విన్‌ ఒక రోల్‌మోడల్‌ అని కొందరు చెబుతున్నారు. మరి ొకొందరు ఈ పెంగ్విన్‌ డిప్రెషన్‌లో ఉందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. ాకానీ ఎక్కువమంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ..కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అంటూ కితాబులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: కొండల నుంచి సభకు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement