గిరిపుత్రులుగా పిలిచే గిరిజనులు..కొన్నితెగలు ఇప్పటకీ చాలా వెనకబడే ఉన్నారు. ఇప్పటికీ నాటి ఆచార సంప్రదాయాలు, కట్లుబాట్లు వారిలో భాగం అన్నట్లుగా ఉంటుంది వారి సంస్కృతి. కొందరు ఇప్పటికీ సిటీ ముఖమే చూడని వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి గిరిజనుల్లో ఒక తెగ అసలు బయటకే అడుగుపెట్టరు. వాళ్లకస్సలు..పట్టణాలు, నగరాలు గురించి బొత్తిగా తెలియనే తెలియదు. ముఖ్యంగా అక్కడ మహిళలు తమ ఇల్లు, గ్రామం తప్ప బయట ముఖమే తెలియని వాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వాళ్లంతా ఏదో పార్టీలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారనుకుంటే పొరపాటే
తమిళనాడు నీలగిరిలోని దేవర్చోలై పంచాయతీలోని కౌండన్‌కొల్లై కుగ్రామానికి చెందిన ఓ గిరిజన తెగ చాలా అరుదుగా బయటకు వస్తారు. అలాంటి నేపథ్యం ఉన్న గిరిజన మహిళలు అసెంబ్లీనికి చూసేందుకు రావడం విశేషం. ఎవరి వల్ల వాళ్లు ఇంత ధైర్యంగా అసెంబ్లీ సందర్శనకు రాగలిగారంటే..గూడలూరు ఎమ్మెల్యే పొన్ జయశీలన్ మద్దతుతో అసెంబ్లీకి వచ్చారు. ఆ తెగకు చెందిన ఎక్కువమందిని అసెంబ్లీకి తీసుకురావాలనుకుంటే..కేవలం ఐదుగురు మాత్రమే ఇక్కడకు రావడానికి అంగీకరించారట.
అంతేగాదు వాళ్లంతా తమకు ఈ అవకాశం ఇచ్చిన సదరు ఎమ్మెల్యే, స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాము అసెంబ్లీ ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతుహలంతో వచ్చామని అన్నారు. కాగా, ఎమ్మెల్యే పొన్ జయశీలన్ ఆ తెగకు చెందిన చాలామంది ఇక్కడకు రావాలని ఆశించా, కానీ ఐదురుగు మాత్రమే వచ్చారని ఆయన అన్నారు.
అంతేగాదు ఆయన మారుమూల గిరిజన ప్రాంతాలలో గృహాలను నిర్మించడంలో ఎదుర్కొంటున్న లాజిస్టికల్ సవాళ్లను పేర్కొంటూ, గిరిజన గృహాలకు ఆర్థిక సహాయాన్ని 5.25 లక్షల నుంచి 7.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కూడా.


