డీఎంకే.. కాంగ్రెస్‌ మధ్య కుదిరిన పంచాయితీ | DMK And Congress Alliance In Tamil Nadu Locks 28 Seats And One Rajya Sabha Spot For Congress, More Details Inside | Sakshi
Sakshi News home page

డీఎంకే.. కాంగ్రెస్‌ మధ్య కుదిరిన పంచాయితీ

Mar 4 2026 9:23 PM | Updated on Mar 16 2026 5:12 PM

seat sharing alliance has been reached between DMK and Congress

సాక్షి చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే అంగీకరించింది. దీంతో ఇంతకాలం ఇరుపార్టీల మధ్య నడిచిన సందిగ్ధతకు తెరపడింది. రెండు పార్టీలు కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

గత కొంతకాలంగా తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడిచింది. కాంగ్రెస్‌ పార్టీకి  ఈ సారి కాంగ్రెస్‌కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని పట్టుబట్టింది. అయితే తాజాగా ఇరుపార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది.  

కాంగ్రెస్  25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. ‍తాజాగా మరో మూడుసీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానం కాంగ్రెసుకు కేటాయించారు.  ఆ రాష్ట్రంలో మెుత్తం 234 సీట్లున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిలీం స్టార్ విజయ్ పార్టీ, దివంగత నేత మాజీ సీఎం జయలలిత మిత్రురాలు శశికళ నూతన పార్టీ పెట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సారి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement