సీఎంగా నితీష్‌ కుమార్ రాజీనామా? | Nitish Kumar May Quit As Bihar Chief Minister | Sakshi
Sakshi News home page

సీఎంగా నితీష్‌ కుమార్ రాజీనామా?

Mar 4 2026 7:29 PM | Updated on Mar 4 2026 8:00 PM

  Nitish Kumar May Quit As Bihar Chief Minister

పాట్నా: బిహార్‌ రాజకీయాల్లో పెను సంచలనం జరగనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. బీజేపీకి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టి  నితీశ్ కుమారునికి  ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా బీజేపీతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

బిహార్‌ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయి. నిన్నటి వరకూ నితీష్ కుమార్ కుమారుడు.. నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారని ఆయన కోసం రాజ్యసభ సీటు సైతం కేటాయించారని జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ తెలిపారు. దీంతో నితీష్ కుమార్ వారసుడి ఎంట్రీ ఖరారైందని అంతా భావించారు. అంతలోనే ఊహించని ట్విస్ట్ జరిగింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. 

దీనికోసం ఢిల్లీలో ఒప్పంద కూడా జరిగిందని జేడీయూ కీలక నేత చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది చాలా బాధపడాల్సిన సమయం అని అంతా ఢిల్లీలోనే జరిగిందని ఆయన ఆ నేత తెలిపినట్లు ప్రచురించాయి. అయితే నితీష్‌ కుమార్‌ని వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో నామినేట్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది.  ఆయన స్థానంలో నితీష్ కుమారుడు నిశాంత్‌ కుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. 

కాగా  గతేడాది బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి స్థానం బీజేపీకి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ చివరికి నితీష్‌ కుమారే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ముఖ్యమంత్రి మార్పు జరగనుందనే ప్రచారం జోరందుకుంది.

ఇది చదవండి: రాజ్యసభ బరిలో నితీష్‌ తనయుడు నిశాంత్?

 

 

Advertisement
 
Advertisement
Advertisement