వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..! | Meerut Couple Braves Heavy Snowfall To Get Married At Uttarakhand Temple | Sakshi
Sakshi News home page

వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..!

Jan 25 2026 12:42 PM | Updated on Jan 25 2026 1:13 PM

Meerut Couple Braves Heavy Snowfall To Get Married At Uttarakhand Temple

వణికించే చలిలో పెళ్లి తంతు గురించి సినిమాల్లోనే చూసుంటాం. అందులో హీరో హీరోయిన్‌లు గడ్డకట్టిన మంచుని ఆస్వాదిస్తూ..గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నట్లు చూపిస్తుంటారు. కానీ రియల్‌గా మాత్రం అంత ఎంజాయ్‌ఫుల్‌గా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై లుక్కేయండి మరి..

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ హిమపాతం నడుమ ఓ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ జంట వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. అదే రోజున ఆ ప్రాంతంలో తొలి భారీ హిమపాతం కురిసింది. ఈ వివహ వేడుక ప్రసిద్ధిగాంచిన త్రియుగినారాయణ్ ఆలయంలో వైభవోపతంగా జరిగింది. ఈ త్రియుగినారాయణ్ ఆలయంలోనే సాక్షాత్తు ఆ పరమశివుడు, పార్వతిదేవి పెళ్లి చేసుకున్నారని భక్తులు విశ్వసిస్తుంటారు. 

అందువల్ల చాలామంది భక్తులు తమ దాంపత్యం బాగుండాలని, తాము కలకాలం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలయంలోనే పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. అయితే పెళ్లి తర్వాత ఆ నూతన దంపతులు దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అత్యద్భుతంగా ఉంది. వారి పెళ్లిని ఆశ్వీరదిస్తూ..ప్రకృతి ఈవిధంగా పూల వర్షంలా హిమపాతాన్ని ఆ దంపతులపై కురిపిస్తుందా అన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. 

ఇక ఈ వేడుకలో వధువు ప్రకాశవంతమైన ఎర్రటి లెహంగాలో మెరిసిపోతుండగా, వరుడు షేర్వేనీ విత్‌ జాకెట్‌ ధరించాడు. గజగజలాడిస్తున్న కఠిన వాతావరణాన్ని చూసి ఆ జంట ఆనందం వ్యక్తం చేస్తూ..ఇది ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం ఆనందంగా చెబుతుండటం విశేషం. ఇదిలా ఉండగా, శుక్రవారం, ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాదిలో తొలి హిమపాతం కురిసింది. 

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్, కుమావోన్ డివిజన్‌లలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఔలి, ముస్సోరీ, చక్రతా, ధనౌల్టి, మున్సియారి వంటి వివిధ ప్రదేశాలలో భారీ హిమపాతం సంభవించింది. నైనిటాల్‌లోని చైనా పీక్, కిల్బరీ, అల్మోరాలోని దునగిరి, పౌరీలోని తర్కేశ్వర్ వంటి ఎత్తైన ప్రాంతాలు పూర్తిగా దట్టమైన మంచుదుప్పటితో కప్పబడ్డాయి.

 

(చదవండి: గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్‌ చేసిన పనికి..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement