తన లవ్‌తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు! | Daughter shares video of mother marrying her soulmate internet emotional | Sakshi
Sakshi News home page

తన లవ్‌తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!

Mar 7 2026 3:08 PM | Updated on Mar 7 2026 3:24 PM

Daughter shares video of mother marrying her soulmate internet emotional

కనిపెంచిన బిడ్డల  భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్‌.  అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ  మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.

పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే  ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్‌ మదర్‌గా ఒంటరిగా తన తల్లి  ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.  

కుమార్తె భావోద్వేగం
ఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది.  తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది."  అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

నెటిజన్లు  స్పందన
దీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్‌ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement