breaking news
daughter
-
కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై బొత్స కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: తన కుమార్తె రాజకీయ ప్రవేశంపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను పోటీ చేస్తుందని బొత్స వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. వారసురాలుగా కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న బొత్స.. ఎన్నికలు ఏ పద్దతిలో జరిగిన పోటీ చేయిస్తానని వెల్లడించారు.కాగా, అంతకుముందు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించిందని.. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్న బొత్స.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‘‘రాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయింది. సభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి. 5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటూ పార్టీకి లేదు. ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుంది’’ అంటూ బొత్స మండిపడ్డారు. -
బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు జనని వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున సందడి చేశారు. ఈ పెళ్లి ఫంక్షన్లో హీరోలు వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హాస్యనటులు బ్రహ్మనందం, సునీల్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ సతీసమేతంగా పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్లి వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీస్సులు అందించారు. బండ్లన్న కుమార్తె వివాహ వేడుకలో సునీల్ ..#sunil #Bandlaganesh #janani#Jananisuryapayanam pic.twitter.com/mZwETRvS5z— SZN (@Suzenbabu) August 16, 2026 -
సెల్ఫీ పేరుతో.. కుమార్తెను యమునా నదిలో విసిరేసిన తండ్రి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పసికందును ఎత్తుకుని వంతెనపైకి వచ్చిన ఒక తండ్రి, సెల్ఫీ తీసుకునే నెపంతో కన్న కూతురిని యమునా నదిలోకి విసిసేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర ప్రాంతంలో ఒక వ్యక్తి తన చిన్నారి కుమార్తెతో కలిసి వంతెనపైకి వచ్చాడు. అక్కడ సెల్ఫీ దిగేందుకు కొద్దిసేపు ఆగాడు. అయితే, చుట్టూ ఎవరూ గమనించని సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ, ఆ పసికందును ప్రవహిస్తున్న యమునా నదిలోకి విసిసేశాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గాలింపు జరిపి నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగానే అతను ఈ అరాచకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి జాడ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. కనికరం లేకుండా పసిబిడ్డను బలిగొన్న తండ్రి దుర్మార్గపు బుద్ధిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. -
రెండు రోజుల్లో బర్త్‌డే : 11 నెలల చిన్నారిని యమునలో విసిరేసిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో సికంద్రా సమీపంలోరింకూ అనే వ్యక్తి తన 11నెలల కుమార్తెను యమునా నదిలో విసిరేసి హత్య చేశాడు. సరిగ్గా ఆమె పుట్టిన రోజుకు మూడు రోజులు ముందు ఇంత అమానుషానికి పాల్పడ్డాడు.ఆగస్టు 17న కుమార్తె బర్త్ డే ఉండటంతో, బట్టలు కొనేందుకు బైక్‌పై భార్య, పాపతో కలిసి ఆగ్రాకు బయల్దేరాడు. ముందుగానే పథకం వేసుకున్నాడో, ఏమో తెలియదుగానీ దారిలో, అక్బరీ బ్రిడ్జ్ దగ్గర బండి ఆపాడు. సెల్ఫీ తీసుకుందామని చెప్పి భార్య లక్ష్మిని నమ్మించాడు. అకస్మాత్తుగా పాపను తల్లి ఒడిలోంచి లాక్కొని మరీ సెల్ఫీ తీస్తున్నట్టుగా నటించి, యమునా నదిలోకి విసిరేశాడు. దీంతో హతాశురాలైన ఆమె, ఎందుకిలా చేశావని ప్రశ్నింస్తుండగానే ఆమెను కూడా నదిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె గట్టిగా అరిచి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. రింకూని చితకబాది పోలీసులకు అప్పగించారు.In Agra, Uttar Pradesh, a man identified as Rinku threw his 11-month-old daughter into the Yamuna River. He was about to throw his wife in as well when onlookers confronted him and rescued her. Efforts are being made to rescue the body of the infant. https://t.co/b5RxupqjU1— Piyush Rai (@Benarasiyaa) August 14, 2026ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలుసంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడైన రింకును అదుపులోకి తీసుకున్నారు. పాప ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను పిలిపించారు, కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. నిందితుడు రింకుపై హత్య కేసు నమోదు చేసినట్లు డీసీపీ సిటీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. పాపను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగిందని భార్య లక్ష్మి పోలీసులకు తెలిపింది. భర్తకు తనపై అనుమానంతో తరచూ గొడవపడేవాడని, దీంతో తాను ఆరు నెలల పాటు తన పుట్టింట్లో ఉండిపోయానని చెప్పింది. కూతురి విషయంలో తరచూ తనతో గొడవపడేవాడని లక్ష్మి వాపోయింది. అయితే ఈ మధ్య కాలంలో చిన్నారిపై ప్రేమానురాగాలుచూపుతున్నట్లు నటిస్తూనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని ఆమె కన్నీరు పెట్టుకుంది.ఇదీ చదవండి: రూ. 11.5 కోట్ల ఆస్తి, 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్సా? నెట్టింట ఒకటే చర్చ -
మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా..
పిల్లలు తల్లిదండ్రులకెప్పుడూ చిన్నపిల్లలుగానే కనిపిస్తారు. వాళ్లకు ఏం తెలియదనే అనుకుంటారు. అలానే భావించాడు ఈ తండ్రి. కానీ అతడి కూతురు వ్యాపారం సవ్యంగా సాగక ఇబ్బంది పడుతున్న తండ్రి కష్టాన్ని గమనించింది. తనకు తోచిన విధంగా ఏదైనా సాయం అందించి తండ్రి వ్యాపారాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. చివరికి ఆమె కారణంగానే మూతపడాల్సిన వ్యాపారం కాస్త ఊహించన విధంగా లాభాల బాటపట్టింది. పేరెంటింగ్‌కి కొత్త నిర్వచనం నేర్పేలా తండ్రి ఉపాధిని రక్షించింది. అసలేం జరిగిందంటే..లండన్‌కి చెందిన రషీద్ లజ్రాక్ షోర్డిచ్లో షూ దుకాణాన్ని నడిపేవారు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుని కొద్ది కాలంలోనే చిన్న దుకాణాన్ని కాస్త పెద్ద వ్యాపారంగా మార్చారు. అయితే చూస్తుండగానే అతడి 34 ఏళ్ల నాటి షాపు ఉన్న ప్రాంతం ఆధునికరించబడటంతో..అక్కడ ఉండే స్థానిక కస్టమర్ల ఆలోచనలు కూడా మారాయి. చుట్టూ చైన్ స్టోర్లు, కాఫీ షాపులు వంటి కొత్త దుకాణాల రాకతో..కుటుంబ వ్యాపారం కాస్త కష్టాల్లో పడింది. ఇక తన షూ షోరూమ్ 'రిచ్ కలెక్షన్ ఇటాలియా'ని మూసేయ్యడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే అతడి కూతురు జినెబ్ లజ్రాక్, రంగంలోకి దిగి, ఏళ్ల తరబడి అమ్ముతున్న బూట్లు కచ్చితంగా సరికొత్త తరానికి నచ్చుతాయని గుర్తించింది. దశాబ్దాలుగా అతను అమ్ముతున్న బూట్లను యువ వినియోగదారులకు చూపించడానికి టిక్‌టాక్‌ను ఉపయోగించి..ప్రమోషన్ ఇచ్చే పని చేసింది. జినెబ్ టిక్‌టాక్ ద్వారా చేస్తున్న ప్రచారంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆఖరికి కస్టమర్లు క్యూలో నిలబడి మరి కొనేలా క్రేజ్ సంపాదించుకుంది ఆ షాపు. ఇంతకుమునుపు ఆధునీకరణ కారణంగా రెగ్యులర్ కస్టమర్లు తగ్గిపోయారు. దాంతో ఆ టైంలో తన తండ్రికి ప్రాథమిక కస్టమర్లు ఆఫ్రికన్లేనని చెప్పిందామె. వాళ్లు కూడా రాను రాను మానేశారు. దాంతో వ్యాపారం ఇక కొనసాగించ లేని పరిస్థితి ఎదురైందని వెల్లడించింది. దాదాపు మూతపడుతుంది అనుకున్న తరుణంలో కూతురు జినెబ్ టిక్‌టాక్ వీడియోలతో నిలదొక్కుకునేలా చేసింది. ఆ వీడియోలలో తన తండ్రి షాపులో షూ కలక్షన్ల గురించి పూసగుచ్చినట్లుగా తెలిపింది. దాంతో ఒక ఫ్రెంచ్ టిక్‌టాకర్ ఆ దుకాణాన్ని సందర్శించి..ఆ షాపుని "దాగి ఉన్న ఆణిముత్యం"గా వర్ణించడంతో..ఊహించని విధంగా కస్టమర్ల రద్దీ పెరిగింది. అలాగే తన తండ్రి ప్రధానంగా "వయసు పైబడిన మహిళల కోసం ఆంటీ షూస్" అమ్ముతారంటూ..వాటి వివరాలను కూడా వివరించింది. అలాగే ఆ షాపులో కొన్ని రకాల కలెక్షన్లు..Y2K ఫ్యాషన్ ట్రెండ్‌కు సరిపోతాయని ఆమెకు తెలియదు. ఏదో సరగా తన తండ్రి దుకాణం గురించి వివరిస్తూ..Y2K-శైలి చెప్పుల శైలి గురించి మాట్లాడింది. అంతే ఒక్కసారిగా కస్టమర్ల తాకిడి ఎక్కువై..ఊహించని విధంగా అమ్మకాలు జోరందుకున్నాయి. ఫలితంగా ఒంటి చేత్తో షాపుని నిర్వహించడం కష్టమైపోయింది. చివరికి హెల్పర్లు అవసరమయ్యారు. దాంతో జినెబ్ స్వయంగా రిటైల్ అనుభవం లేనప్పటికీ, షాపులో పనిచేయడం ప్రారంభించింది. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త సరుకుని తీసుకువచ్చి..కస్టమర్లను ఆకర్షిస్తూ..లాభల బాటలో దూసుకుపోతోంది. అంతేగాదు జినాబ్ త్వరలో ఆన్లైన్ బ్రాండ్‌ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వివిధ దేశాల ప్రజలు నుంచి డిమాండ్ అధికమవ్వడంతో 'టిక్‌టాక్ షాప్' (TikTok Shop)ను కూడా ప్రారంభించింది. కాగా కూతురు కారణంగా మూసేద్దాం అనుకున్న షాపు దినదినాభివృద్ధి చెందడంతో అతడికి సోషల్‌మీడియా పట్ల ఉన్న దృక్ఫథం మారిపోయింది. ఒక చిన్న వ్యాపారానికి సోషల్ మీడియా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. పైగా పరిస్థితులు కష్టంగా మారినప్పుడు కూడా ఎలా వ్యాపారాన్ని కొనసాగించాలో తెలుసుకున్నారు రషీద్. అంతేగాదు ఈ తండ్రీ కూతుళ్ల కథ ఒక ఆచరణాత్మక పాఠాన్ని కూడా అందిస్తోంది. అదేమిటంటే, పిల్లల కొత్త పోకడలు, సాంకేతికత, మారుతున్న వినియోగదారుల అభిరుచిని పేరెంట్స్ అంచనా వేయలేకపోయినా..పిల్లలు అర్థం చేసుకోగలరని తెలియజేసింది. అలాగే తనకు ఉన్న వ్యాపార అనుభవానికి సోషల్ మీడియా వంటి సాంకేతిక శక్తి కూడా తోడైతే..విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహించొచ్చని రషీద్ కథ తెలుపుతోంది కదూ..!.(చదవండి: ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..) -
అగ్నివీర్‌గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్‌గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్‌గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది.రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్‌కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేశారు. కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
కుమార్తె ప్రేమ కోసం.. బండ రాయితో మోది భర్త హత్య
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అతని భార్య, కూతురు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ సోని అనే వ్యక్తిని అతని భార్య నైనా, చిన్న కూతురు భక్తి, ఆమె ప్రియుడు విమల్ చౌదరి కలిసి హత్య చేశారు. కూతురి ప్రేమ వ్యవహారాన్ని మనోజ్ వ్యతిరేకించడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో నిందితులు పథకం ప్రకారం ఏప్రిల్ 18న మనోజ్‌కు మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి, బండరాయితో తల పగులగొట్టి హత్య చేశారు. అనంతరం యమునా నది సమీపంలోని అడవికి శవాన్ని తరలించి, దహనం చేసి పూడ్చిపెట్టారు.బాధితుడి అన్న రాంబాబు ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితురాలు నైనా తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే, మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు అధికారికంగా హత్యను ఇంకా నిర్ధారించలేదు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు -
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన పూర్ణ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా ఆయనని మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేమని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)'ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచినా, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది'నా రెండో బిడ్డ కళ్లలో ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉప్పా(నాన్న) అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(అమ్మ) మాత్రం అది నిన్న జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము' అని పూర్ణ ఎమోషనల్ అయింది.పూర్ణ ఫ్యామిలీ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఈమె దుబాయిలో ఉండే షనీద్ అసిఫ్ అలీ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా ఈమె గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
తండ్రికి ఆన్లైన్లో అంత్యక్రియలు.. కూతుళ్లూ భలే 'అప్డేట్' అవుతున్నారుగా!
హర్యానా: ఓ తండ్రి తన జీవితాన్ని అంకితం చేసి ముగ్గురు కుమార్తెలను పెంచి, ఉన్నత విద్య అందించి, వివాహాలు చేశారు. అయితే ఆయన మరణించినప్పుడు కడసారి చూసేందుకు కుమార్తెలు రాకపోవడం, అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా వీక్షించడం హర్యానాలోని సోనిపట్‌లో చర్చనీయాంశమైంది.వృద్ధాశ్రమ నిర్వాహకుల కథనం ప్రకారం, కుమార్తెలు రూ.5,100 పంపించి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘోరం చూసిన నెటిజన్లు.. ‘కంటే కూతుళ్లను కనమని అంటారా’ అంటూ సదరు కుమార్తెలపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దహన సంస్కారాలు జరుగుతుండగా, వీడియో కాల్లో ముగ్గురు కుమార్తెలు వీక్షిస్తున్న దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి.వీడియో కాల్‌లోనే చివరి వీడ్కోలుదహన సంస్కారాలు జరుగుతుండగా ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్ ద్వారా వీక్షిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తాకు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాహాల అనంతరం వారు నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైల్లో స్థిరపడ్డారు. వారిలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.రెండేళ్ల క్రితం రతన్ గుప్తా దంపతులు హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేరారు. కొంతకాలం క్రితం ఆయన భార్య మీనా మృతి చెందారు. అనంతరం దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ గుప్తా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణించిన విషయం వృద్ధాశ్రమ నిర్వాహకులు ముగ్గురు కుమార్తెలకు తెలియజేశారు.అంత్యక్రియలకు రాలేమన్న కుమార్తెలుసోనిపట్కు రావడం సాధ్యం కాదని కుమార్తెలు ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు. దీంతో వృద్ధాశ్రమ సిబ్బంది, స్థానికులు కలిసి రతన్ గుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కుమార్తెలు వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ఆశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ ప్రకారం, రతన్ గుప్తా అక్కడ చేరినప్పటి నుంచి ప్రతిరోజూ తన కుమార్తెలతో ఫోన్లో మాట్లాడేవారు. అయితే ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారి నుంచి ఫోన్ కాల్స్ తగ్గిపోయాయని చెప్పారు. మరణానికి సుమారు 20 రోజుల ముందే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుమార్తెలకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చి చూడలేదని ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.రూ.5,100 పంపిన పెద్ద కుమార్తెరతన్ గుప్తా మృతి తర్వాత మరోసారి సమాచారం అందించి, ఆశ్రమానికి వస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సిబ్బంది సూచించారు. అయితే తాము రావడం కుదరదని కుమార్తెలు చెప్పినట్లు ఆనంద్ కుమార్ వివరించారు. నేపాల్‌లో నివసిస్తున్న పెద్ద కుమార్తె అనిత యూపీఐ ద్వారా రూ.5,100 పంపించి, తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమం పూర్తయ్యాక వీడియోలను పంపించాలని కూడా అభ్యర్థించారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఒక కుమార్తె “ఇంకెంత సమయం పడుతుంది? మేము స్నానం చేసి భోజనం చేయాలి” అని మాట్లాడినట్లు వినిపిస్తుండటంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కుమార్తెల భవిష్యత్తు కోసం శ్రమించిన తండ్రిరతన్ గుప్తా తన ముగ్గురు కుమార్తెల చదువు, భవిష్యత్తు కోసం జీవితమంతా శ్రమించారని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. వారికి ఉన్నత విద్య అందించి, మంచి స్థాయికి చేరుకోవడం పట్ల ఎంతో గర్వపడేవారని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ముగ్గురూ వివాహం చేసుకుని తమ తమ కుటుంబాలతో జీవిస్తున్నారు. మరణానంతరం తొలుత అస్థికలను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే అనంతరం సోనిపట్‌కు వచ్చే అవకాశం లేదని చెబుతూ, వాటిని గంగానదిలో నిమజ్జనం చేయాలని ఆశ్రమ నిర్వాహకులను కోరినట్లు సమాచారం.మరణానంతరం కూడా ఇద్దరికి చూపురతన్ గుప్తా మరణానికి ముందు తన కళ్లను దానం చేయాలని ఆకాంక్షించినట్లు ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. ఆయన కోరిక మేరకు కంటి దానం చేయడంతో మరణానంతరం కూడా ఇద్దరికి చూపు అందే అవకాశం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై రతన్ గుప్తా కుమార్తెల స్పందన ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు ఆశ్రమ నిర్వాహకుల కథనం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగానే ఉన్నాయి. -
తల్లి మెనోపాజ్ దశ కూతురికి ఎందుకు అవసరం?
ప్రస్తుత రోజుల్లో ప్రతి కుటుంబంలోని మహిళల మెనోపాజ్ గురించి బహిరంగంగా చర్చించడం, దానిని సాధారణ విషయంగా చూడటం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో రుతుస్రావం (పీరియడ్స్) శాశ్వతంగా ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. భవిష్యత్ తరాల మహిళల కోసం తల్లుల మెనోపాజ్ అనుభవాలను కూతుళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.తన చిన్నతనంలో తన తల్లి మెనోపాజ్ దశను ఎదుర్కొన్నప్పుడు దాని గురించి ఎలాంటి అవగాహన లేదని, ఆమె ఎదుర్కొన్న భావోద్వేగాలను కేవలం ‘ఒత్తిడి’గా భావించామని ఓ మహిళ గుర్తుచేసుకున్నారు. ఈ అంశంపై సరైన చర్చ లేకపోవడం వల్ల తల్లులు పడే ఇబ్బందులు కూతుళ్లకు అర్థంకావని ఆమె పేర్కొన్నారు.భారతీయ కుటుంబాలలో మెనోపాజ్ ఇప్పటికీ ఒక రహస్య విషయంగానే ఉంది. దీనివల్ల తల్లుల శారీరక, మానసిక ఇబ్బందులు కూతుళ్లకు తెలియవు. కొన్ని లక్షణాలను బట్టి తల్లులు కేవలం కోప్పడుతున్నారని భావిస్తారు. కానీ వాస్తవానికి వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. ఈ దశపై అవగాహన పెంచుకోవడం ద్వారా కూతుళ్లు తమ తల్లుల కష్టాలను అర్థం చేసుకుని తగిన సహకారం అందించగలుగుతారు.భవిష్యత్తులో కూతుళ్లు కూడా ఇదే దశను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తల్లి అనుభవాల ద్వారా ముందస్తు సంకేతాలను గుర్తించి, వైద్య సహాయం ఎప్పుడు అవసరమో తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మౌన సంస్కృతిని బద్దలు కొట్టాలి. తల్లితో ఈ అంశంపై మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో తన కూతుత్తోనూ చర్చించే అవకాశం లభిస్తుంది. ఈ విజ్ఞానాన్ని తరతరాలకు అవసరమైనదిగా భావించి, కుటుంబాలలో మెనోపాజ్‌పై చైతన్యం తేవాలని, తద్వారా మహిళల సమస్యలను అర్థం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘కే బ్యూటీ’ గ్లాస్ స్కిన్ రహస్యం.. వంట గదిలో.. -
రూ. 40 లక్షల ఎదురు కట్నం కావాలంటూ, కూతురిపైనే తండ్రి దాడి
కర్ణాటకలోని బెంగళూరులో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది లక్ష్మీ దుర్గ. ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు.అంతేకాదు లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టాడు. జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇదీ చదవండి: చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్ తెచ్చిపెట్టింది!కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్ఓడి (HOD) ఛాంబర్లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడలో తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? -
కూతురు ఇచ్చిన గిఫ్ట్.. ప్రాణం కాపాడిన వాచ్!
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో జీవితాలు కూడా సాఫీగా ముందుకు సాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా సాంకేతికత ప్రాణాలను కాపాడుతోంది. దీనికి అమెరికాలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటి నగరానికి చెందిన మహ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయారు. కొంతసేపటి తర్వాత స్పృహ వచ్చినా.. లేచి నిలబడే పరిస్థితిలో లేకపోయారు. శరీరాన్ని కదిలించలేక నేలపైనే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన కట్టుకున్న యాపిల్ వాచ్ ప్రమాదాన్ని వెంటనే గుర్తించింది.వాచ్‌లో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఆయన పడిపోయిన విషయాన్ని గుర్తించి, ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేసింది. అంతేకాకుండా.. ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్‌లకు కూడా సమాచారం పంపింది. కొద్దిసేపటికే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని మహ్మద్ ఇస్లాంను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు.సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం వల్లే ఆయనకు వెంటనే చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం లభించిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు ముందు నుంచే.. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సంబంధిత సమస్యలు, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినప్పటికీ అసలు కారణం ఏమిటో తెలియలేదని చెప్పారు. కుప్పకూలిన తర్వాతే పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించారు.మహ్మద్ ఇస్లాంకు ఈ యాపిల్ వాచ్‌ను ఆయన కుమార్తె గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ తమ తండ్రి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని తెలుసుకుని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత సాంకేతిక పరికరాలు కేవలం సౌకర్యాలకే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షక సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని మరోసారి స్పష్టమైంది.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
పారిస్ ట్రిప్‌లో ‘సర్జా సిస్టర్స్’.. అర్జున్ చిన్న కూతురు ఫోటోలు వైరల్
-
వైరల్ అవుతున్న తండ్రి–కూతురు బంధం..
అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్ లూయిస్ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు. ఈ పద్ధతిని అక్కడ ఫస్ట్ లుక్ అని పిలుస్తారు.పక్క రూమ్‌లో లూయిస్ వాళ్ల నాన్న గ్యారీ మెక్అఫే కూడా ఎప్పుడెప్పుడు కూతురు తన ముందుకొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అలంకరణ పూర్తయిన తర్వాత లూయిస్ తన తల్లితో పాటు గ్యారీ వద్దకు వచ్చింది. తండ్రి చేతులను తీసుకుని తన వెడ్డింగ్ గౌనును స్పృశింపజేసి డిజైన్ ఎలా ఉందని అడిగింది. గ్యారీకి మాటల్లేవు. తర్వాత లూయిస్ శిరోజాలను, తన ఆభరణాలను తాకుతూ బాగుందని గ్యారీ చెబుతుండగా, లూయిస్ ‘మీ పెళ్లికి అమ్మ వేసుకున్న గౌన్ డిజైన్‌లానే నా గౌన్ని కూడా డిజైన్ చేయించా నాన్న’ అంటూ చెప్పింది.మరి చెప్పాలి కదా.. కన్నరోజు నుంచి కంటిరెప్పలా కాపాడుకుంటున్న ఆ తండ్రికిప్పుడు చూపు లేదు మరి..! లూయిస్ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో గ్యారీ ప్రమాదవశాత్తు చూపు కోల్పోయాడు. పోయింది చూపే కానీ ప్రేమ కాదు కదా! అందుకే. తన చేతుల్లో పెరిగిన బిడ్డను కళ్లారా చూడలేకపోయినా మనసారా స్పృశిస్తూ కళ్లనిండా ఆనంద బాష్పాలు నింపుకున్నాడు ఆ తండ్రి. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది. -
14 ఏళ్ల క్రితం ఒకరు.. ఇప్పుడు మరొకరు..
ఖమ్మంరూరల్: ఓ విద్యార్థిని మరణం ఆమె కుటుంబాన్నే కాదు... ఆ వీధి, పాఠశాల, స్థానికులను శోకసంద్రంలో ముంచెత్తింది. 14ఏళ్ల క్రితం ఒక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ఇంకొకరికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ విధి చిన్నచూపు చూడడంతో ఇంకో కుమార్తె కూడా మృత్యువాత పడింది. ఇందుకు సంబంధించి వివరాలు.. ఏదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్ – స్రవంతి దంపతులకు 14 ఏళ్ల క్రితం కవల కుమార్తెలు జన్మించారు. ఇందులో ఓ కుమార్తె పసిప్రాయంలోనే పేగు సంబంధిత సమస్యతో మృతి చెందింది. అదే సమస్యతో బాధపడుతున్న ఇంకో కుమార్తె వైదికకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తూ ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడారు. కానీ విధి మరోసారి అదే కుటుంబాన్ని పరీక్షించింది. హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తుండగా వైదిక పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులందరినీ కంట తడి పెట్టించింది.చివరిచూపు కోసం...ఏదులాపురం జెడ్పీహెచ్ఎస్లో వైదిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె స్నేహితులతోనే కాక స్థానికులతో కలివిడిగా ఉండేది. ఆమె మృతి చెందిన సమాచారం తెలియగానే స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాక వైదిక అంతిమయాత్ర పాఠశాల సమీపం నుంచి వెళ్తుండగా వీడ్కోలు పలికారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. -
CJPకి మద్దతుగా ఎన్ డిఏ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూతురు సెటైర్లు
-
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్‌తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుండగా.. తాజాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాచల్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దిబిసా మహంతా నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా.. బీజేపీ నేతృత్వంలోని అసోం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్ష ప్రభుత్వంలో భాగమైన సీనియర్ నేత కుమార్తె.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్లతో జరుగుతున్న నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కూతురి నిరసనపై తండ్రి స్పందించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న నీట్ నిరసనలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి డిమాండ్లు, వాదనలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అసోం వరదలతో తీవ్రంగా ప్రభావితమైందని, ప్రకృతి విపత్తుపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు.ఇదిలా ఉండగా, నీట్ నిరసనలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు.. ఆందోళనలకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నీట్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.#WATCH: Assam Cabinet Minister Keshab Mahanta's daughter, Dibisa Mahanta, was among those who joined the CJP protest in Guwahati, where demonstrators demanded education reforms and the resignation of Union Education Minister Dharmendra Pradhan.#Assam #CJPProtest… pic.twitter.com/CJP2hjZFIc— Northeast Now (@NENowNews) July 24, 2026 -
నీట్‌ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్‌ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. -
మహిళలకు భద్రత ఇవ్వలేని చెత్త ప్రభుత్వం.. కూటమి పై బొత్స కూతురు ఫైర్
-
‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి
ఝాన్సీ: కూతురు పుట్టిన వేళ.. ఒక తండ్రి చూపిన ప్రేమాభిమానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఒక ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తోంది. తన ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి కూతురు వస్తే, ఆ వేడుకను కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా, ఆస్పత్రిలోని వారందరితో కలిసి పంచుకోవాలని ఆ తండ్రి ముందే మొక్కుకున్నాడు. అనుకున్నట్లే కూతురు జన్మించగానే, ఆనందంతో ఆస్పత్రి వార్డులో ఉన్న రోగులకు, మహిళలకు, సిబ్బందికి స్వయంగా మిఠాయిలు పంచిపెట్టాడు. అంతేకాకుండా, వారికి బట్టలు, ఇతర కానుకలను కూడా అందజేశాడు.ఆ తండ్రి చేస్తున్న ఈ వేడుకను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. కూతురు పుడితే వివక్ష చూపే వారికి, ఈ తండ్రి ప్రవర్తన ఒక పాఠంలా నిలుస్తోంది. ప్రభుత్వం ‘బేటీ బచావో-బేటీ పఢావో’ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నా, సమాజంలో పూర్తిస్థాయిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టమని, అది ఒక గొప్ప పండుగ అని చాటిచెప్పిన ఈ తండ్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది మనసులను గెలుచుకుంటోంది. ఇలాంటి ఆలోచన ప్రతి ఇంట్లో ఉండాలని, అప్పుడే సమాజంలో లింగ వివక్ష తగ్గుతుందని నెటిజన్లు అంటున్నారు. View this post on Instagram A post shared by Life Of Student 📚 (@_life.of.student_) -
నారా లోకేష్ నోటి దూల.. ముద్రగడ కుమార్తెకు నో ఎంట్రీ.. అసలేం జరిగింది!
-
నెల రోజులు ముద్రగడ ఆసుపత్రిలో ఉంటే కూతురికి పరామర్శించే సమయం లేదా ?
-
ముద్రగడ మరణంపై అంబటి కూతురు ఎమోషనల్ రియాక్షన్
-
ముద్రగడ ఇంటివద్ద ఉద్రిక్తత.. కూతురు క్రాంతిని అడ్డుకున్న అనుచరులు
-
కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్తత
సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బార్లపూడి క్రాంతిని కొంతమంది అభిమానులు, అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘‘గో బ్యాక్ క్రాంతి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో ఆమెను బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు.ముద్రగడ భౌతికకాయం స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో చివరి చూపు చూసేందుకు క్రాంతి అక్కడికి చేరుకున్నారు. అయితే తొలుత ప్రతిపాడు వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు వద్దన్నారని పోలీసులు ఆమెకు వివరించారు.అయితే తన తండ్రిని చివరిసారిగా చూసేందుకు అనుమతించాలని క్రాంతి పోలీసులను కోరడంతో.. పరిస్థితిని పరిశీలించిన పోలీసులు ఆమెను కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు సైతం పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. నివాళులర్పించిన వెంటనే తిరిగి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కూడా ఉద్రిక్తత కొనసాగింది. ముద్రగడ అనుచరులు కొందరు గో బ్యాక్ క్రాంతి నినాదాలతో అడ్డుకున్నారు. భౌతికకాయం ఉన్న పెట్టెను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదని సమాచారం. ఆమెను బయటకు పంపించాలని ముద్రగడ భార్య, కొందరు బంధువులు కోరారు. ఆ సమయంలో తండ్రిని చూడలేక క్రాంతి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె బిగ్గరగా రోదించడంతో సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ కుటుంబంలో విభేదాలు బయటకు వచ్చాయి. తన అభిష్టానికి వ్యతిరేకంగా బార్లపూడి క్రాంతి జనసేనలో చేరారు. అంతేకాదు ఆయనపై పలు విమర్శలు కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో.. తాను చనిపోతే క్రాంతిని దగ్గరకు రానివ్వొద్దని ముద్రగడ స్వయంగా చెప్పారు కూడా. తాజాగా ఆయన మరణం అనంతరం కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. -
అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
-
56 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ..! పట్టరాని సంతోషంలో కుమార్తె..
భర్తను కోల్పోయి ఒంటిరి తల్లిగా పిల్లలను పెంచుతున్న ఓ మహిళ సాధించిన అసాధారణ విజయ గాథ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె కుమార్తె షేర్ చేసిన ఈ పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక.. మహిళలు ఏదైనా చేయగలరు అని నిరూపించింది. ఒకపక్క పిల్లలు బాధ్యత, కుటుంబ నిర్వహణ, ఉద్యోగం అన్ని చూసుకుంటూనే తన కలను నెరవేర్చుకోవడం అంటే మాటలు కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. మరి ఆమె ఎలా సాధ్యం చేసిందంటే..56 ఏళ్ల తల్లికి దుబాయ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ నుమయా కారు సోషల్‌మీడియా వేదికగా హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఇలా రాసుకొచ్చింది. దశాబ్దాలుగా కుటుంబ అభ్యున్నతికి పాటుపడిన తన తల్లి ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుందంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భర్తను కోల్పోయి ఒంటరిగా పిల్లలను పెంచుతూ..ఓ పక్క తల్లిదండ్రులను కూడా పోగొట్టుకుని పుట్టెడు బాధను దిగమింగుతూ.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించిన స్ట్రాంగెస్ట్ విమెన్. అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని కూడా సమతుల్యం చేసుకుంటూ..కుటుంబాన్ని చక్కదిద్దిన మహిళ ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తన జీవితం మొత్తం తన పిల్లల కోసమే బతికింది. నాన్న చనిపోయాక..తొమ్మిదేళ్లుగా అమ్మగా నాన్నగా వ్యవహరించి..ఒంటరిగా ఆ బాధను మొత్తం మోసిన ధీర వనిత. పూర్తి సమయం పనిచేస్తూ పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి మూసి ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలకు తొలి ప్రిన్స్‌పాల్‌గా నియమాకం అందుకుంది. ఇన్నేళ్లకు తన కోసం ఆలోచించడం మొదలు పెట్టి..మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి, తన కలను సాకారం చేసుకుంది. "అమ్మా.. ఈ డిగ్రీ నీదే. ఒక కూతురుగా నాకెంతో గర్వంగా ఉంది. ఆమె గ్రాడ్యుయేషన్ డేలో తాను లేకపోవడం ఎంతో బాధగా ఉందని, అయినప్పటికీ ఒక కుమార్తెగా గర్వించే క్షణం ఇది అని" పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం తాను వేరే దేశంలో ఉన్నానంటే అందుకు ఆమెనే కారణం, అది ఆమె కోరుకున్న జీవితమే అని పేర్కొంది. "అమ్మా..నిజమైన బలం, నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటాయో చూపిచావు. నేను మీలో కనీసం సగం అయిన ఉండగలిగితే బాగుండు. ఈ డిగ్రీ ఈదే. దీనికి మీకంటే ఎక్కువ అర్హులు ఎవరూ లేరు అంటూ తనపోస్టుని ముగించింది." నెటిజన్లు కూడా మీ కలలను సాకారం చేసుకోవడానికి ఎప్పుడు ఆలస్యం కాదు అంటూ..సదరు తల్లికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Numaya Karu✨Dubai Content Creator ✨ (@double_n_karu) (చదవండి: 'సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!) -
తల్లినే కాదు.. తండ్రిని కూడా కడతేర్చిందా?
ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తి కోసం కన్న తల్లినే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైపూర్ యువతి ఆయుషి శర్మ (23) కేసులో మరో సంచలన మలుపు తిరిగింది. ఇప్పటికే తల్లి నీరజ్ శర్మ హత్య కేసులో అరెస్టైన ఆయుషిపై.. ఇప్పుడు తన తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ పాత్ర ఉండొచ్చనే అనుమానాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో ఈ కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.విజయ్ శర్మ రాజస్థాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్‌గా పనిచేసేవారు. అనారోగ్యానికి గురైన ఆయన 2025లో మరణించారు. ఆయన మృతి అనంతరం కారుణ్య నియామకం కింద భార్య నీరజ్ శర్మకు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగం లభించింది. అయితే ఆ ఉద్యోగం తనకే రావాలని కుమార్తె ఆయుషి భావించినట్లు, అదే సమయంలో కుటుంబ ఆస్తి విషయంలోనూ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి..ఈ నేపథ్యంలో జూలై 3న కోచింగ్ సెంటర్లో తన కుమారుడిని దింపి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న నీరజ్‌ను అతివేగంగా వచ్చిన ఎస్యూవీ ఢీకొట్టింది. తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. దర్యాప్తులో ఇది ముందే పథకం వేసి చేసిన హత్య అని తేలింది. తల్లి హత్య కోసం ఆయుషి బంధువులతో కలిసి రూ.7 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు(ఆయుషి కజిన్) పరారీలో ఉన్నాడు.ఇదే కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నీరజ్ సోదరుడు రాకేశ్ శర్మ మరో సంచలన ఫిర్యాదు చేశారు. తన బావ విజయ్ శర్మ మరణం కూడా సహజ మరణం కాదని, దాని వెనుక కూడా ఆయుషి, ఆమె బంధువు బలరామ్ పాత్ర ఉండొచ్చని ఆరోపించారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న విజయ్ను ఇంటి నుంచి తీసుకెళ్లి నెలల తరబడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, చివరకు ఆస్పత్రిలో చేర్చినప్పటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.తండ్రి మరణం అనంతరం ప్రభుత్వ ఉద్యోగం తనకే ఇవ్వాలని, కుటుంబ ఆస్తి మొత్తం తన పేరుపై బదిలీ చేయాలని ఆయుషి ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు.. ఒకసారి తల్లితో జరిగిన వాగ్వాదంలో "నాన్న ఫీడింగ్ ట్యూబ్ తీసేసి చంపగలిగాం.. నిన్ను చంపడం ఇంకా సులువు" అని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందు నీరజ్ శర్మ వాట్సాప్‌లో "నాకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి" అనే భావం వచ్చే స్టేటస్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పోలీసులు విజయ్ శర్మ మరణంపైనా దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు.. ఈ కేసులో మరో సంచలన కోణం కూడా బయటపడింది. ఆయుషి తన తల్లి నీరజ్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకుందని తెలిసింది. తన గురించి కాకుండా ఎప్పుడూ తన దివ్యాంగ సోదరుడి గురించే తల్లి ఎక్కువగా ఆలోచించేదని.. అతన్నే ప్రేమగా చూసేదని బంధవువుల వద్ద ఆయుషి వాపోయేదట. ఈ క్రమంలోనే.. కుటుంబ ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం, వ్యక్తిగత కక్షలే ఈ హత్య వెనుక ప్రధాన కారణాలై ఉంటాయని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం విజయ్ శర్మ మరణానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. వైద్య చికిత్స వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా విజయ్ శర్మ మరణంపై ప్రత్యేక కేసు నమోదు చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న కేసులో అదనపు అభియోగాలు చేర్చాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ కేసు రాజస్థాన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు)
-
పవన్ కుమార్తెపై చంద్రబాబు కామెంట్స్
-
గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి పెళ్లి.. మెగాస్టార్, వెంకీమామ సందడి
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురు కృష్ణమోహన - అనిరుధ్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. చిరంజీవికి దగ్గర బంధువైన మెహర్ రమేశ్.. పూరీ జగన్నాథ్ దగ్గర తొలుత దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ టైంలోనే అంటే 2002లో రిలీజైన 'బాబీ' సినిమాలో నటించారు. ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ని కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో 'వీర కన్నడిగ' అని తీసి దర్శకుడిగా పరిచమయ్యారు. మహేశ్ 'ఒక్కడు'ని 'అజయ్' పేరుతో కన్నడలో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఎన్టీఆర్ 'కంత్రి'తో తెలుగులోకి మెహర్ రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ కూడా ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్‌తో తీసిన 'బిల్లా' మాత్రం ఆయనకు పేరు తీసుకొచ్చింది. Megastar @KChiruTweets graced the grand wedding reception of director @MeherRamesh's daughter, #KrishnaMohana, and Anirudh. #chiranjeevi #Meherramesh pic.twitter.com/lLxXfxYTUQ— Aithagoni Raju off (@AithagoniRaju) July 1, 2026 -
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
-
గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
గ్రాండ్‌గా ఖుష్బు కుమార్తె పెళ్లి వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)
-
నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!
నల్లగొండ పట్టణాన్ని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే.. హసీనా కుటుంబాన్ని దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నియమించారని.. ఆ గ్యాంగ్ అత్యంత కిరాకతంగా ఆ నలుగురిని హతమార్చిందని తేల్చారు.నల్లగొండ జిల్లాలో సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నాలుగు హత్యల ఘటన మిస్టరీ వీడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో హసీనా అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు ఘోరంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది గుర్తుతెలియని దుండగుల దాడిగా అనుమానించగా.. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ కేసు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హసీనా పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం), అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.దర్యాప్తులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కొన్ని రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లే మార్గాలు, కుటుంబ సభ్యుల కదలికలు అన్నీ ముందుగానే గమనించి పక్కా ప్లాన్‌తో హత్యలకు పాల్పడ్డారని సమాచారం.ఘటన జరిగిన రాత్రి.. నిందితులు ఇంటి తలుపు తట్టి హసీనాను బయటకు రప్పించినట్లు సమాచారం. తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమ్మీల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపైనా తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి హతమార్చారు.ఆ అలజడికి మెలుకువ వచ్చి వచ్చిన సుల్తాన్‌పై(హసీనా మూడో భర్త) కూడా దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దాడి సమయంలో భయంతో బెడ్ కింద దాక్కున్న సుల్తాన్ కుమార్తె అక్సరాను బయటకు లాక్కొచ్చిన దుండగులు.. గోడకేసి బలంగా బాదారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు.దర్యాప్తు ప్రకారం, ఈ మొత్తం కుట్రలో సుపారీ గ్యాంగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కూతురు, అల్లుడి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఇదే కేసులో మరో కీలక అంశంగా, హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దాడి ఎంత క్రూరంగా జరిగిందో వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.హసీనా(40)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఇక సుల్తాన్‌కు కూడా హసీనా మూడో భార్య. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం ముజమ్మీల్, అక్సరాలతో ఆ భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. ఆ ఆస్తిని సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. -
ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)
-
పెద్ద కూతురు రాసిన మరణ శాసనం.. ట్రిపుల్ మర్డర్ కలకలం!
సాక్షి,బెంగళూరు: సహజీవనం తప్పమ్మా?. అన్ని లక్షలు అప్పు ఎందుకైంది? అని ప్రశ్నించినందుకు పెద్ద కుమార్తె ఇంటికి శాపంగా మారింది. కనీపెంచిన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన సొంత చెల్లెల్ని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. పెద్ద కుమార్తె ఘాతుకానికి పాల్పడుతుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అటు తల్లిదండ్రులు, ఇటు చెల్లెల్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే వెంటపడి మరి ప్రాణాలు తీసింది. ఒళ్లు గగుర్పొడిచే ఘటన సిలీకాన్ వ్యాలీ సిటీగా పేరొందిన బెంగళూరులో చోటు చేసుకుంది.సోమవారం జరిగిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ, కుటుంబ విభేదాలు, అప్పుల భారం, ఆవేశం.. ఇవన్నీ కలిసి చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు.కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి ప్రాంతంలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియ (20) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలోని పెద్ద కుమార్తె శ్వేత,ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు.ప్రేమకు కుటుంబం అడ్డుగా మారిందా?శ్వేత కొంతకాలంగా కెన్నెత్‌తో సహజీవనం చేస్తోంది. తీరు మార్చుకోవాలని పెద్ద కుమార్తెను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఇదే కుటుంబంలో తరచూ గొడవలకు కారణమైంది. ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు.. శ్వేత దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు చేసింది. ఈ అప్పుల గురించి తల్లిదండ్రులు తరచూ ప్రశ్నించడంతో కుటుంబంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్న సమయంలో శ్వేత, కెన్నెత్ అక్కడికి వెళ్లారు. ముగ్గురి మధ్య మాట మాట పెరిగింది. ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. హత్య అనంతరం కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేశారు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన చెల్లెలు సుప్రియపై కూడా దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్వేత ఆమెను అడ్డుకోగా, కెన్నెత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడని అనుమానిస్తున్నారు.అనంతరం ఇంటికి చేరుకున్న సోమసుందర్‌పై కూడా అదే ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ ఇంటి బయటకు పరుగెత్తి సహాయం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన కూడా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజులో భార్య, ఇద్దరు కుమార్తెలు, తండ్రి మధ్య చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఒకప్పుడు ప్రేమగా పెంచిన కూతురిపైనే ఇప్పుడు హత్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమకు వ్యతిరేకత, అప్పుల ఒత్తిడి, కుటుంబ కలహాలు... ఏది అసలు కారణమో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్‌ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించినప్పటికీ, మరిన్ని వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ట్రిపుల్ మర్డర్ వెనుక అసలు నిజం ఏమిటి? ప్రేమా... అప్పులా... లేక ఇంకేదైనా కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం దర్యాప్తు పూర్తయ్యాకే తెలిసే అవకాశం ఉంది. -
వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)
-
Hi నాన్న.. కష్టాల కొలిమిలో... నవ్వుల కలిమి
నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు. తెనాలి మసోడి షెడ్ మా నాన్న కొంజేటి వెంకటేశ్వర్లు ఆఫీస్. ఆయన నడిపే లారీతో పాటు ఆయన స్నేహితులు ఉండే చోటు కూడా అదే.ఎనిమిదేళ్లుంటాయ్ నాకప్పుడు. వర్షం పడ్డ కాసేపటికి నాన్న చేయి పట్టుకుని షెడ్డుకి వెళ్లా. మా నాన్న స్నేహితుడితో ‘‘ఒరేయ్ ఇవ్వాళ నీ డ్యూటీకి నేను వెళతాను. నా కూతురు పుట్టినరోజు వస్తోంది. దానికి ఏమైనా ఇవ్వడం మాట సరే కనీసం భోజనం..’’ దుఃఖం ఎక్కువైతే గొంతు మూగబోతుంది. నా తండ్రి గొంతు బరువుగా మాట్లాడిన ఆ క్షణం నాకింకా గుర్తుంది. అప్పటికే నాలుగు రోజులు డ్యూటీ చేసిన మనిషి. అయినా మళ్లీ స్నేహితుడి దగ్గర లారీ తాళం తీసుకుని, తెనాలి అంబమ్మ హోటల్ భోజనం కట్టించుకుని ఇంటికొచ్చాడు. అమ్మ వడ్డిస్తుంటే నేను గబగబా తింటున్నా. వాకిట్లో ఉన్న నాన్నని చూసి ‘నాన్నా! నువ్వు రావేం’ అన్నాను. భుజం మీదున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకుంటున్నాడు. అర్థం కాలేదు నాకు.. ఆ వయసులో ఆకలి మీదున్న దృష్టి మా నాన్న కళ్ల మీదకి పోలేదు..ఎర్ర పరికిణీ వేసుకుని స్కూలుకి వెళ్లడం, ఆపై కాలేజీ దాని తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇలా నా చుట్టూ అల్లిన జీవితపు మల్లెతోటలో ఆనందాన్ని మాత్రమే నింపిన ఆయన, తన జీవితంలోని కష్టాల ముళ్ల కంచెల్ని మాత్రం నాకు తెలియకుండా దాచేశాడు. తన స్నేహితులు ఆయన్ని సావిత్రి అంటూ పిలిచేవారు. సతీనాటకంలో సావిత్రి వేషంలో చాలా బాగా చేశాడని అలా అంటారంతా.. కాని మేం పెద్దవాళ్లవుతున్న కొద్దీ ఆయన నాటకాలకు దూరమయ్యాడు. మాకోసమే నాటకాలొద్దనుకున్నాడని, మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు తనొక్కపూటే తింటున్నాడని, ఆయన మాతో ఉన్నన్నినాళ్లూ తెలియలేదు. కష్టాల కొలిమిలో కాలుతున్నా నిలువెత్తు చిరునవ్వుకి చిరునామాగా నిలిచి నా ఎదుగుదలని చూడకుండానే వెళ్లిపోయావు నాన్నా!.. నీకంటూ మేమేమీ ఇవ్వలేకపోయినా.. నువ్విచ్చిన మొండిధైర్యం, పట్టుదల, శక్తి మాకు వరం.– సి. సుజాత, రచయిత్రి, జర్నలిస్ట్నిర్వహణ: శ్రావణ్ జయమీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ కింది నంబర్‌కు మెయిల్ లేదా వాట్సాప్ చేయండి. 9281020501, sakshifamily3@gmail.com -
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
-
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్‌ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్‌ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..
ఇటీవల కాలంలో లేఆఫ్స్ ఎంత కామన్‌గా అయిపోయాయో తెలిసిందే. ఉద్యోగ భద్రత కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పరిస్థితులు ఇవి. అలాంటి స్థితిని ఎలా హ్యాండిల్ చేసి..సులభంగా మన కెరీర్‌ని పునర్నిర్మించుకోగలమో చెప్పే కథ ఇది. అందుకు కుటుంబ మద్దతు తోడైతే తిరుగే ఉండదంటున్నాడు ఈ వ్యక్తి. అంతేగాదు తన బంగారు తల్లే ఈ సమస్య నుంచి బటయపడేలా కొండంత స్టైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు ఈ నాన్న. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. హిమాన్షు ఝా అనే పారిశ్రామిక వేత్త తన జాబ్ పోయి ఏడాది అయిన సందర్భంగా.. నాటి తన పరిస్థితి గురించి వివరించాడు. తన కెరీర్‌లోని అత్యంత గడ్డుపరిస్థితిని ఆ ఏడాదిలో చవిచూశానంటూ..నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు. ఆకస్మికంగా చక్కటి కార్పొరేట్ ఉద్యోగం కోల్పోవడంతో.. ఒక్కసారిగా తన పరిస్థితి తలకిందులైనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఏం చేయాలో దిక్కుతోచని ఆ స్థితిలో తన భార్య, కూతురు ఎలా తన మద్దతుగా నిలిచారో చెబుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ కష్ట సమయంలో మన స్నేహితులు, బంధువులు ఎలా దూరమవుతారో, అలాగే మనకెంతో ప్రియమైన వారు ఎలా అండగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అంతేగాదు ఉద్యోగం కోల్పోవడంతో ఐదు పాఠాలను నేర్చుకున్నానంటున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెతో గడుపుతూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడూ.. ఆమె ఇక ఇప్పుడు మీకు నచ్చింది చేయండి నాన్న అంది. అప్పుడే అర్థమైంది జాబ్ పోవడం అంతం కాదు, కెరీర్లో ఎదురయ్యే ఎదురుదెబ్బ అంతిమం కాదని తెలుసుకోగలిగనంటున్నాడు. ఏ వయసులోనేనా మళ్లీ తిరిగి ప్రారంభించి నిలదొక్కుకోవచ్చు..అందుకు గుండె నిండా ధైర్యం కావాలి. అది ఉంటే చాలు..చతికిల పడినా..రాకెట్లా తిరిగి దూసుకుపోగలమని అవగతమైందని చెప్పుకొచ్చాడు హిమాన్షు. ఇది అప్పటి వరకు ఉన్న సౌకర్యవంతమైన స్థితి నుంచి బయటకు నెట్టి..స్ట్రాంగ్‌గా మరింత బలంగా నిలబడేందుకు అంకురార్పణ అవుతోందంటున్నాడు. తన కూతురు చెప్పినట్లుగా 44 ఏళ్ల వయసులో నా కలను అనుసరించి స్టార్టప్ ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా మారానని చెప్పాడు. నచ్చిన పనిచేయి నాన్న అంటూ మాట్లాడిన మాటలు..చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నా..ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించిందామె. ఈ పరిస్థితి.. ఎవరు మనకు ఆప్తులు..ఎవరు శత్రువులో కూడా తెలియజేస్తుంది. అలాగే దీంతోపాటు..అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం అని దానిపై సదా దృష్టిపెట్టమని కోరాడు. ఏళ్ల తరబడి కార్పొరేట్ లైప్ బిజీలో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని తెలుసుకున్నా..అంతర్గత శాంతికి ప్రయత్నించి మరీ.. నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు. అలాగే ఎక్కువగా భయపడే ఉద్యోగ తొలగింపు భయం..ఒక్కోసారి మిమ్మల్ని స్ట్రాంగ్‌గా మార్చే అధ్యయంగా కూడా మారుతుందని నమ్మకంగా చెబుతూ..తన పోస్ట్‌ని ముగించాడు హిమాన్షు. నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ..ముందుకు సాగకుండా..రాబోయేదాన్ని స్వీకరించకుండా, గతాన్ని పట్టుకుని వేళాడటమే తప్పు..మీకు అంతా మంచే జరుగుతుంది సార్ అని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వారు ఈ వ్యక్తి స్ఫూర్తినే తీసుకుంటూ...ముందుకు సాగండని హితవు పలుకుతున్నాడు హిమాన్షు.(చదవండి: ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్‌కి..! జస్ట్ దేశీ బ్రాండ్‌తోనే.) -
పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
తిరువనంతపురం: మనీలాండరింగ్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం కొచ్చిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం తొమ్మిది మందికి ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.కాగా, గత నెల పినరయి విజయన్ నివాసంలో ఈడీ ఆకస్మిక తనీఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు చేసింది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈడీ దర్యాప్తు కేరళంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.కొచిన్ మినలర్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత.. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నిరసనల సమయంలో ఈడీ సిబ్బంది, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు జరిగాయని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల చర్యను కేరళ ప్రభుత్వం సమర్థించగా, దర్యాప్తును అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
మోహన్ నా కూతురు అందంగా లేదు.. వేరే సంతానం కావాలి..!
బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్‌తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్‌ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్‌ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్‌ను కాడుగోడి పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు. -
హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి
మల్కాజిగిరి: ఏడేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో కొడుకు, కూతురుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హతుడి భార్య గంగాబాయి(65)కి వయసురీత్యా జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కొడుకు కిషన్ (47) కూతురు ప్రపుల్ల (36)కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జి వి.బాలభాస్కర్ రావు తీర్పు వెలువరించారు. సోమవారం మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టకు చెందిన కిషన్ మారుతీ సుతార దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్ ట్రైన్ డ్రైవర్‌గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని మల్కాజిగిరిలో ఎన్ఏ కృష్ణానగర్‌లో ఇల్లు కొనుగోలు చేశాడు. అక్కడ భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లతో నివాసముంటున్నాడు. మరో కూతురు అనుపమ వివాహం కావడంతో వేరుగా ఉంటున్నది. కిషన్ ఖాళీగా ఇంటి వద్దనే ఉంటూ తన జల్సాలకు డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. అతనికి సోదరి ప్రపుల్ల, తల్లి గంగాబాయి వత్తాసు పలికేవారు. ప్రపుల్ల కూడా పీజీ చేసినా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో తండ్రి మందలించేవాడు. ఇది వారికి నచ్చలేదు. పింఛను మొత్తాన్ని కూడా ప్రపుల్ల పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడంతో మారుతీ ఒప్పుకోక పోవడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని చంపడానికి ప్రపుల్ల యూట్యూబ్‌లో చూసి ఒక పథకం రచించి విషయాన్ని తల్లి, సోదరుడుతో పంచుకొంది. ఉమ్మెత్త చెట్టు గింజలను నూరి ఆ పొడిని ఆహారంలో కలిపి విషప్రభావంతో చనిపోయేలా చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి బయట నాలాలో పడేద్దామని చెప్పింది. ఆవిధంగా పలుమార్లు ఆహారంలో ఉమ్మెత్త చెట్టు గింజల పొడిని ఆహారంలో కలిపి మారుతీకి ఇవ్వగా 2019 ఆగష్టు 16న మృతి చెందాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో ఉంచి పూజగదిలో దాచివుంచారు. జన సంచారం ఉండటంతో రెండు రోజులు అలాగే ఉంచారు. దుర్వాసన రాకుండా అగరబత్తీలు వెలిగించి, సెంట్ చల్లి జాగ్రత్తపడ్డారు. జనసంచారం తగ్గడంతో 18వ తేదీన బయటకు తీసుకొని రావడంతో ఒక్కసారిగా దుర్వాసన వచి్చంది. దీంతో స్థానికులు గుమిగూడటంతో విషయం బయటపడ్డది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోమవారం తీర్పు వచి్చంది. -
తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)
-
హీరో రవితేజ కూతురు ఎలా ఉందో చూసారా..?
-
పెళ్లయిన కుమార్తె కూడా కుటుంబంలో భాగమే
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లియిందనే కారణంతో కుమార్తెకు కారుణ్య నియామకం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం నిర్వచనంలో పెళ్లి అయిన కుమార్తె కూడా భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి అనేది ఒక మహిళ అర్హతకు అడ్డంకి కాదని, అర్హత కలిగిన కుమార్తెకు కేవలం వైవాహిక హోదా కారణంగా సంక్షేమ పథకాన్ని నిరాకరించలేమని తెలిపింది. ఈ విషయంలో బాంబే, కర్ణాటక హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది. కేసు వివరాలివీ..ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్సుమ్ నిషా తల్లి చౌక ధరల దుకాణం డీలర్‌గా ఉండేవారు. కుల్సుమ్ నిషా పెళ్లయినప్పటికీ, భర్తతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండేవారు. దివ్యాంగురాలైన తన సోదరి బాగోగులు చూసుకుంటూ, తల్లికి దుకాణం నిర్వహణలో సాయం చేసేవారు. తల్లి మరణించిన తర్వాత, కారుణ్య ప్రాతిపదికన ఆ దుకాణం లైసెన్స్ తనకు ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి పెళ్లయిన కూతుళ్లను తొలగించింది. ఈ జీవోను సాకుగా చూపి ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. భిన్న తీర్పుల నేపథ్యంలో సుప్రీంకు బదిలీ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి, గత తీర్పులను పరిశీలించారు. వాటిలో ప్రధానంగా..⇒ విమల్ శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. (2015) కేసులో.. ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలకు సంబంధించిన ‘ఉత్తరప్ర దేశ్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిపెండెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ డైయింగ్–ఇన్– హార్నెస్ రూల్స్, 1974’ లోని ‘‘కుటుంబం’’నిర్వచనాన్ని విశ్లేషించింది. వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టి కల్ 14, 15లకు విరుద్ధమని, అది వివక్ష తో కూడుకున్నదని తేల్చింది. కుటుంబం నిర్వచనంలో ఉన్న ‘అవివాహిత’అనే పదాన్ని కొట్టివేసింది. ⇒ కుసుమ్లత వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు (2021)లో అయితే.. 2019 జీవోను సవాల్ చేస్తూ దాఖలైన మరో కేసులో సింగిల్ జడ్జి, విమల్ తీర్పులో వచ్చినది ఇక్కడ వర్తించదని పేర్కొన్నారు. 2019 జీవోలో ‘అవివాహిత కుమార్తె’అని ఉండటం వివక్ష కాదని తేల్చారు. ‘హార్నెస్ రూల్స్’ను అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా 2019 జీవోను వ్యాఖ్యానించలేమని చెప్పారు.⇒ సైదా బేగం వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు (2023)లో.. డివిజన్ బెంచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఒకే హైకోర్టులో భిన్న తీర్పులు రావడంతో పాటు, ఇతర హైకోర్టుల అభిప్రాయాలు కూడా వేరుగా ఉన్నాయి. బాంబే హైకోర్టు ‘రంజనా మురళీధర్ అనే రావ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2014)’కేసులో, లైసెన్సింగ్ ఆర్డర్, 1979 కింద మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తీర్మానంలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19(1)(జీ)లకు విరుద్ధమని తీర్పు ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ భిన్నమైన తీర్పుల నేపథ్యంలో, స్పష్టత కోసం అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు.4 వారాల్లో లైసెన్స్ ఇవ్వాలని ఆదేశంతీర్పు సందర్భంగా.. బాంబే హైకోర్టు రంజనా కేసులో ఇచ్చిన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అలహాబాద్ హైకోర్టు సైదా బేగం కేసులో ఇచ్చిన తీర్పు సరైంది కాదని తేల్చి చెప్పింది. ‘ఈ కేసులో రికార్డుల ప్రకారం, అప్పీలుదారు పెళ్లి తర్వాత కూడా అదే గ్రామంలో నివాసం ఉంటూ, తన తల్లికి చౌక ధరల దుకాణం నడపడంలో సాయం చేసేవారు. తల్లి మరణం తర్వాత, ఆమె తన సోదరి, శారీరక వైకల్యం ఉన్న మరో సోదరి బాధ్యతలను తీసుకుంది. ఆమె వివాహిత అనే కారణంతో దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగపరంగా చెల్లదు’అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌కు లైసెన్స్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ధర్మాసనం, నాలుగు వారాల్లోగా కుల్సుమ్ నిషాకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఆదేశించింది. -
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి,న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులేనని తెలిపింది. వివాహిత కుమార్తెను ‘కుటుంబం’ నిర్వచనం నుంచి మినహాయించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలకు పెళ్లయిన కూతుర్లను మినహాయించకూడదని వెల్లడించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం, బాంబే హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. వివాహం కారణంగా అర్హత ఉన్న కూతురికి సామాజిక సంక్షేమ ప్రయోజనాలు లేకుండా చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ కేసు మొదలైంది. తన తల్లి మరణం తర్వాత రేషన్ షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఆమెకు ‘వివాహిత కూతురు’ అనే కారణంతో లైసెన్స్ నిరాకరించారు.ఆమె తన వికలాంగ సోదరిని చూసుకుంటూ, కుటుంబంతోనే నివసిస్తూ తల్లికి సహాయం చేస్తూ షాప్ నడిపేది. అయినప్పటికీ 2019 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఆమె దరఖాస్తు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషనరైన వివాహిత కూతురుకు నాలుగు వారాల్లో రేషన్ షాప్ లైసెన్స్ ఇవ్వాలని సుప్రీం కోర్టు యూపీ అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో సుప్రీం కోర్టు మహిళల హక్కులను మరింత బలోపేతం చేసింది. వివాహం తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకు ఇది పెద్ద ఊరట కలిగినట్లైంది. -
వంతెనపై భయానక ఘటన.. కెమెరాకు చిక్కిన దృశ్యం
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పలాసుని వంతెనపై జరిగిన ఓ భయంకర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు.. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన నుంచి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రీ కుమార్తె కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన దాటుతున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును ఆపకుండా డ్రైవర్.. కారును రోడ్డుపై అలాగే నెట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇది కారులో తండ్రీకుమార్తెలతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.ట్రక్కు.. కారును నెట్టుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే భారీ వాహనాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నొక్కి చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.సదరు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? ఏదైనా మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 📍Bhubaneswar–Cuttack, Odisha: Chaos erupted on the highway after a dispute over giving side reportedly turned dangerous between a car and a Hyva truck. The truck allegedly dragged the car for nearly 200 meters while trying to flee the spot, creating panic on the road. Police… pic.twitter.com/eN5ubZJ3ps— Deadly Kalesh (@Deadlykalesh) May 30, 2026 -
మాస్క్ ధరించండి..మాన్విని రానివ్వొద్దు : సూసైడ్ నోట్ కలకలం
కనిపెంచిన తల్లిదండ్రులు,తోబుట్టువులు, భార్యాబిడ్డలు.. ఇలా అందర్నీ మరిచి, జీవితంమీద ఆశ కోల్పోయి తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య. కానీ అంత నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలు తీసుకునే చివరి క్షణాల్లో కూడా జరగబోయే ప్రమాదాన్ని గమనించి, తన కుటుంబం, ముఖ్యంగా చిన్న కూతురు మాన్వి, ఇతరులు క్షేమంగా కూడా ఉండాలని ఆయన ఆలోచించిన తీరు అందరినీ కదిలిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే చనిపోయే తలుపుపై రాసిన చివరి లేఖ మాత్రం అందర్ని కదిలించింది.ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు, ఆ వ్యక్తి తన ఫ్లాట్ తలుపుపై ఇంగ్లీష్‌లో ఒక హెచ్చరిక లేఖను అంటించాడు. అందులో "సెల్ఫాస్ (Celphos), విషవాయువు, మాస్క్ ధరించండి, నీళ్లు తాగొద్దు" అని రాసి ఉంది. ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ విషవాయువు వల్ల ముఖ్యంగా తన చిన్న కూతురు మాన్వి, కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోఆయన ఈ హెచ్చరిక చేశాడు.'సెల్ఫాస్' అనేది అత్యంత విషపూరితమైన క్రిమిసంహారక మందు.మృతుడు పంకజ్ భన్సాలీ (42) గాంధీనగర్‌లోని కుడసన్ ప్రాంతంలో గల పూనమ్ రెసిడెన్సీ ఫ్లాట్‌లో నివసించేవాడు. ఇన్‌ఫోసిటీలోని ఒక స్టాక్ మార్కెట్ సంస్థలో పనిచేసే ఆయన, దాదాపు ఐదు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం పోవడంతో పాటు అప్పులు, నష్టాల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. పంకజ్ భన్సాలీ భార్య, కూతురు మే 13న పుట్టింటికి వెళ్లారు. భార్యాభర్తలు చివరి సారిగా మే 22న ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులు మే 27న ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. మే 22న లేదా ఆ తరువాత గానీ భన్సాలీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల పాటు మృతదేహం మూసి ఉన్న ఇంట్లోనే ఉండటం వల్ల పూర్తిగా కుళ్ళిపోయింది.ఇన్ఫోసిటీ పోలీసులు ఘటనా స్థలం నుండి విషపూరిత క్రిమిసంహారక మందును స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్‌తో కొట్టి చంపిన తాత!
తమిళనాడు: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన వెంకటాచలం. ఇతని భార్య అముధ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటాచలం మద్యపానానికి బానిసయ్యాడు. ఇతను ఇంట్లోని పాత్రలను అమ్ముతాడు. ఆ డబ్బుతో మద్యం తాగుతూ తిరుగుతాడు. ఈ క్రమంలో, అతని పెద్ద కుమార్తె మోనిషా, భవానికి చెందిన మయిలానందన్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగింది. ఈ పరిస్థితుల్లో, మోనిషా 10 రోజుల క్రితం తన 10 నెలల బాబు జోష్విక్తో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. దీనికి వెంకటాచలం అభ్యంతరం తెలిపి, ‘ఎందుకు ఇంటికి వచ్చావు? అని అడిగి కూతురిని కొట్టి, హింసించాడు. కుక్కర్ మూత తీసుకుని మోనిషాపై విసిరాడు. అది ఆ పిల్లాడి తలపై పడడంతో, ఆ పిల్లాడు గాయపడి మరణించాడు. మోనిషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలాన్ని అరెస్టు చేశారు. -
కుమార్తెలకు గ్రాండ్‌గా పెళ్లి చేయడం 'గిప్ట్' కాదు..!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోట్విషా శర్మ ఉదంతం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసు రోజుకో మలుపుతిగరుతూ చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసు వాదోపవాదనలు విచారిస్తూ..అసలు వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకుని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతి తల్లిదండ్రుల తీరుకు చెంపెట్టులా ఉండటం విశేషం. అలాగే మానసిక నిపుణులు సైతం కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాలని హితవు పలుకుతున్నారు. కష్టపడి చదివించి పాతికేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి అనే రెండక్షరాలకు బలి అవ్వకాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి వంటి వాటి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ప్రతి పేరెంట్ తమ కుమార్తెలకు అంగరంగ వైభవంగా పెళ్లిచేయడం గొప్ప బహుమతి కాదని అంటున్నారు. వివాహం తనను ఊపిరాడనివ్వని పరిస్థితుల్లోకి నెట్టేస్తే..ధైర్యంగా బయటకొచ్చి నిలబడేలా ఉండాలి, అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని అంటున్నారు. వరకట్నం మరణాలను నివారించాలంటే పేరెంట్స్‌ని తమ కుమార్తెలను జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులకు ఆమెను సిద్ధం చేసేలా ట్రైన్ చేయాలి. సాంప్రదాయకంగా పెళ్లి చేయడం కంటే..ఆమెకు ఈ వైవాహిక బంధం రక్షణ, స్వేచ్ఛను ఇవ్వగలదా చూడాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలకు ముందుకు మానసిక ధైర్యం, ఆర్ధిక స్వేచ్ఛ వంటివి నేర్పించాలి. ఇక వివాహానికి పునాది త్యాగం కాదు, భద్రతే ముఖ్యం అని గ్రహించాలి. అలాగే ఆడపిల్లలకు అత్తంటిలో సమస్యలు, హింసను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే ప్రతి తల్లిదండ్రులు సద్దుకోమని చెప్పడం కాదు. ధైర్యంగా బయటకు వచ్చేలా స్వేచ్ఛను ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి తల్లిదండ్రల్లో పెళ్లితో తమ అమ్మాయి పరాయిది అనే భావాన్ని తొలగించాలి.ఆ వైవాహిక జీవితం నరకప్రాయంగా మారినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకోవాలి, భద్రత అందించాలి. చిన్నప్పటి నుంచి అత్తారింటికి వెళ్లే అమ్మాయి ఇలా ఉండాలి అని స్టోపాయిజన్లా కుమార్తెలకు ఎక్కించడం మానాలి. అంతేగాదు ఆడపిల్లలు కూడా అత్తంట్లో సమస్య వస్తే..పుట్టింటికి వెళ్లడాన్ని అపరాధ భావంలా కాకుండా తన హక్కుగా ధైర్యంగా వచ్చేలా చేయాలి. అలాగే శ్రద్ధ అన్న పేరుతో కుమార్తెలను ప్రతి నిమిషం పర్యవేక్షించడం, కట్టుబాట్లు విధించడం వంటివి చేయకూడదని అంటున్నారు. వాళ్లను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల్లా తీర్చిదిద్దాలన్నారు. ఆడిపిల్లకు ఇచ్చే బంగారం, డబ్బు అత్యవసర నిధుల్లోకి మళ్లించాలి. అది ఆమెకు పెళ్లి తర్వాత భరోసానిచ్చే నిధిలా ఉంటుంది. సమస్య ఎదురైతే ధైర్యంగా బయటకకు వచ్చి బతకగలను అన్న ధైర్యం అందిస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేస్తే..కేవలం నాలుగు రోజులే గుర్తుంటుంది. అదే డబ్బు మిగిల్చి ఆమె స్త్రీ ధనంగా ఇస్తే..ఆమెకు భరోసానిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకవేళ కూతురు పుట్టింట్లో ఉంటే చుట్టూ జనాలు ఏం అనుకుంటారో అన్న భయంతో ముందే తలుపులు వేసుకుని కూర్చొవద్దని పిలుపునిస్తున్నారు. మన అమ్మాయికి అత్తంట్లో కష్టం వస్తే భయపడొద్దు..ఎప్పటికీ పుట్టింటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయన్న నమ్మకం ఇవ్వండని సూచిస్తున్నారు. అలాగే బాధను సాధరణీకరించొద్దు, తొలగించి, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికేలా ధైర్యం ఇవ్వండని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!) -
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
నల్లగొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లీకుమార్తె హత్య
-
నటి పూర్ణ ఇంట్లో శుభకార్యం.. ఈమె పిల్లలు వీళ్లే (ఫొటోలు)
-
డైరెక్టర్ మెహర్ రమేశ్ కుమార్తె నిశ్చితార్థం,సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!
పుణె జిల్లాలోని దౌండ్‌లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం స్కూల్ మార్కుల విషయంలో వచ్చిన గొడవ కారణంగా తొమ్మిదేళ్ల బాలికను ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ప్రకంపనలు రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు శాంతారామ్ దుర్యోధన్ చవాన్ కుమార్తె అనామిక (9 ఏళ్లు). ఇటీవల స్కూల్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనామిక తమ్ముడు (సవతి తల్లి కుమారుడు) సంస్కార్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, అనామికకు రెండో ర్యాంక్ వచ్చింది. దీనిపై ఇంట్లో వాళ్లంతా ఆమెను ఎగతాళి చేశారు. ఆ అవమానంతో అనామిక తన తమ్ముడి మార్కుల జాబితాను మార్చేసింది. తద్వారా తనదే ఫస్ట్ ర్యాంక్ అని నిరూపించుకోవాలని చేసింది. అంతే .. ఇది తెలిసి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులను అర్థం చేసుకొని, అవగాహన కల్పించాల్సింది పోయి, విచక్షణ మరిచి తండ్రి శాంతారామ్, చెక్క కోసే యంత్రం (wood-cutting machine)తో చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు, మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి నిప్పంటించాడు.దీనిపై పోలీసులకు సమాచారం అందడంతోవారు ఘటనా స్థలానికి చేరుకుని, పాక్షికంగా కాలిపోయిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని డీఎన్ఏ పరీక్షలు, తదుపరి విచారణ నిమిత్తం పుణేలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు.ప్రధాన నిందితుడు తండ్రి శాంతారామ్ చవాన్‌తో పాటు, అతనితో కలిసి ఉంటున్న సవతి తల్లి చింకీ భోంస్లేను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరం గురించి తెలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వనందుకు ఆమెపై కూడా కేసు నమోదైంది. చిన్నారి మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొన సాగుతోంది.మరోవైపు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనల నేపత్యంలో పూణేలో పిల్లల భద్రతపై ఆందోళన తలెత్తింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి విషాదాలను నివారించేందుకు కఠినమైన చట్టాల అమలు, జవాబుదారీతనం, తక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.ఇదీ చదవండి: కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన? -
ఒక్కటైన పాత మిత్రులు..
-
నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)
-
బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)
-
ఆస్తి కోసం కన్నకూతురి ఘాతుకం
చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లికార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సుకన్య, మల్లికార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు తల్లిదండ్రుల వద్దే ఉంది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం..ఏడాది నుంచి ఆమె పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి మరో ప్రాంతంలో ఉంటుంది. తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. మంగళవారం రాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచకు ఉన్న గ్రిల్స్ నుంచి లోనికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు వంటివి తగలబడి పోయాయి. స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. -
దీప్‌వీర్ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్
బాలీవుడ్ నటుడు, రణవీర్, దీపికా పడుకోన్ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో తన పెర్ఫామెన్స్‌తో దీప్‌వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్ సినిమా భారీ హిట్ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్‌కు దువా తన టాలెంట్‌తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. 'ధురందర్' స్టార్ రణ్వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్ చేశారు. షో అనంతరం, రణవీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్‌కు హాజరైందని రణ్వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.Ranveer talks about watching Cocomelon Live at the NMACC with Dua and Deepika 🥰🥰♥️♥️ #deepveer #RanveerSingh #DeepikaPadukone Ranveer: It is extra special for us because this is our Dua baby's first show 💖 pic.twitter.com/9REtUmny44— DeepVeer Fanclub (@DeepVeer_FC) April 26, 2026 కాగా దీపికా, రణవీర్‌లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు. -
చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో నాలుగేళ్ల కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. ఈ సంఘటన ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది. సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం అంతకన్నా లేదు. చిరుతపై ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది. అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై పావి జెట్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి స్పందిస్తూ రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలుతండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
మృగాడి వాంఛాగ్ని.. విస్తుపోయిన పోలీసులు
ప్రశాంత ఉదయం ఓ మృగాడి వాంఛాగ్నితో భయానకంగా మారింది. ఆదరించి అన్నం పెట్టిన కుటుంబానికి తీరని ద్రోహం చేశాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి వాళ్ల బిడ్డను బలిగొన్నాడు. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటనతో దేశ రాజధాని ఉలిక్కి పడింది. అయితే నిందితుడు రాహుల్ మీనా చెప్పింది విని పోలీసులు సైతం విస్తుపోయారు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె(22) కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది. యువతి దారుణ హత్యాచారం కంటే ముందు తన సొంతూరులో మరో మహిళపైనా రాహుల్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంటే.. 24 గంటలు గడవక ముందే రెండు రాష్ట్రాల్లో రెండు ఘాతుకాలకు పాల్పడ్డాడన్నమాట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ఆల్వార్ జిల్లా రాజ్‌గఢ్‌కు చెందిన రాహుల్ మీనా(23) తెలిసినవాళ్ల ద్వారా రికమండేషన్‌తో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనివాడిగా చేరాడు. సర్వెంట్ క్వార్టర్స్‌లో అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఆ సమయంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అధికారి కూతురిపై కన్నేశాడు రాహుల్. అలా ఎనిమిది నెలల పాటు అదను కోసం ఎదురు చూశాడు. అయితే ఇంటి సరుకుల కోసం ఇచ్చిన డబ్బు గోల్మాల్ చేశాడని.. బయట అధికారి పేరు చెప్పి అప్పులు చేశాడని.. తేలడంతో రాహుల్‌ను పనిలోంచి తీసేశారు. దీంతో అతను సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే అతని తప్పుడు ఆలోచనలు ఆగలేదు. దీంతో మళ్లీ ఢిల్లీకి పయనం అయ్యాడు. ఏప్రిల్ 21న.. పొరుగింట్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించి ఆపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బయల్దేరాడు. భార్య ఒంటిపై గాయాలు గమనించిన ఆ భర్త.. ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. ఏప్రిల్ 22న ఉదయం.. ఢిల్లీ చేరుకున్న రాహుల్.. నేరుగా ఆగ్నేయ ఢిల్లీలోని కైలాశ్ హిల్స్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఇంతకు ముందు పని చేసిన వాడే కావడంతో సెక్యూరిటీ ఇబ్బందులేవీ అతనికి ఎదురు కాలేదు. ఆ టైంలో ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య జిమ్‌కు వెళ్లారు. పని మనిషి కోసం తాళం చెవి బయట ఉంచుతారనే విషయమూ రాహుల్‌కు తెలుసు. తాళం తీసి లోపలికి వెళ్లిన రాహుల్ నేరుగా పైన గదిలో చదువుకుంటున్న ఐఆర్ఎస్ అధికారి కూతురి(22) దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెను బతిమాలాడాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి బెడ్ ల్యాంప్, చేతికి దొరికిన వస్తువులతో తల మీద కొట్టాడు. రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెను మెట్ల మీద నుంచి కిందకు ఈడ్చుకొచ్చాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆపై.. ఆమె వేలి ముద్రలతో లాకర్ తెరవడానికి ప్రయత్నించాడు. అయితే.. వేళ్లకు రక్తం ఉండడంతో అది ఓపెన్ కాలేదు. దీంతో స్క్రూ డైవర్ సాయంతో లాకర్ తెరిచి.. అందులో ఉన్నదంతా తనతో తెచ్చుకున్న బ్యాగులో నింపేసుకున్నాడు. మొబైల్ చార్జర్ కేబుల్‌తో యువతికి ఉరి వేసి ఊపిరి తీశాడు. యువతితో జరిగిన పెనుగులాటలో ప్యాంట్‌కు, షూస్‌కు రక్తపు మరకలు అంటడంతో.. వాటిని అక్కడే పడేసి ఐఆర్ఎస్ అధికారి కొడుకు దుస్తులు, చెప్పులు ధరించి పారిపోయాడు. రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ అధికారి దంపతులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉదయం 6.28 గంటలకు నిందితుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి.. సుమారు గంట తర్వాత వేరే దుస్తులు, బ్యాగుతో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ద్వారకలో గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం సాయంత్రం ఓ లాడ్జిలో దాక్కున్న రాహుల్‌ను అరెస్ట్ చేశారు. రాహుల్ మీనా ఫోన్లో పోర్న్ కంటెంట్ అడ్డగోలుగా ఉంది. రోడ్లపై వెళ్లే యువతులను అసభ్యంగా ఫొటోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఎక్కువగా ఉందని.. అందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. రాహుల్‌కు బెట్టింగ్ యాప్‌లతో పాటు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని నిర్ధారించారు. అతని నేర చరిత్ర చిట్టాను మరింత లోతుగా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. -
రోజా కూతురు అన్షుమాలిక అరుదైన ఘనత
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అరుదైన ఘనత సాధించారు. తన ప్రతిభతో అమెరికాలో కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. అమెరికాలోని ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించారు. బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఇందు లో ఐదేళ్లకొకసారి ప్రెసిడెంట్ హెర్మన్ బివెల్స్ గౌరవా ర్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్ బివెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థిని అన్షుమాలిక కావడం విశేషం. యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఆమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది. అవార్డులు.. పురస్కారాలు అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్‌స్టాండింగ్ లీడర్ష్ప్ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ నవల ను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డు, ‘మౌరిన్ బిగ్గర్స్ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) -
తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు
కోలీవుడ్ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గతనెల తండ్రిగా ప్రమోషన్ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు. తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.సినిమా కెరీర్.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) -
కోర్ట్ రీమేక్.. స్టార్ నటి వారసురాలి ఎంట్రీ..!
తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక్కడ సూపర్ హిట్ అయిన మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్ డైరెక్షన్లో రంజన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ లాంఛ్‌కు హాజరైన దేవయాన్ని ఈ విషయాన్ని ప్రకటించింది. తన కూతురికి అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ధన్యవాదాలు తెలిపింది. తన కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.కాగా.. నటి దేవయాని గురించి పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. కాగా.. గతేడాది విడుదలైన 3 బీహెచ్‌కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని కనిపించిన విషయం తెలిసిందే. #Devayani தியாகராஜன் சார் வந்து இந்தப் படத்துல என்னோட மகள் பிரியங்கா ராஜ்குமார், அதுக்கப்புறம் ஹரி கதிரேசன், இரண்டு பேரையும் லான்ச் பண்றாங்க.கண்டிப்பா இவங்க உங்க பேரை காப்பாத்துவாங்க, நல்லா நடிப்பாங்க, சினிமால ரொம்ப நாளா இருப்பாங்க. pic.twitter.com/8U6AeTw7aT— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) April 6, 2026 -
ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!
విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్ చేశాడు.ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. ఆమెకు 2018లో పంజాబ్‌లోని జలంధర్‌లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.సెలబ్రేషన్స్ ఎందుకంటే..ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్ చేశాం. అని చెప్పారు.मेरठ: तलाक के बाद बेटी को ढोल-नगाड़ों के साथ घर लाए रिटायर्ड जज#Meerut pic.twitter.com/LpPhkU8aSg— NDTV India (@ndtvindia) April 5, 2026 (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)
-
కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)
-
నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)
-
'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. Apple...Watching you blossom into such a beautiful young girl fills my heart with a joy I can’t even put into words. You are the very embodiment of kindness, gentleness, warmth, laughter, loyalty, and that effortless spark of sass that makes you you.Every moment of watching… pic.twitter.com/smHR7J6HZ8— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 24, 2026 -
ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. డీఎంకేలో స్టాలిన్ సమక్షంలో ఇంటర్వ్యూ: చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్.ఎస్.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్ కార్తీక్ సెల్వరాజ్ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే సీన్ డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. కమల్ ఖాతాలో పడేనా.. గత ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
సీసీ కెమెరాతో తల్లిదండ్రులను పలకరింపు
-
8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికను స్వయంగా తల్లే రైలు కిందకి తోసేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. సీసీటీవీలో రికార్డైన ఈ భయంకరమైన దృశ్యాలు వైరల్‌గా మారాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం నర్మదాపురంలోని మలఖేడి ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగి బాధిత మహిళ. భర్త మరణం తర్వాత ఆమెకు కాంపెన్సేటరీ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి అప్పటి నుంచి వారిద్దరూ ఒంటరిగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, రైల్వే స్టేషన్‌కు వెళ్లి, ఉన్నట్టుండి రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెను ఎదురుగా వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి తోసివేసింది. దీంతో బాలిక తల, నడుము, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఆమెను కాపాడిన రైల్వే సిబ్బంది ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచిన చికిత్స అందించినా ఆమె పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఆందోళన కలిగించిన విషయం ఏమిటంటే..ఈ ఘటన జరగడానికి దాదాపు మూడు గంటల ముందు నుంచి తల్లీకూతుళ్లు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉన్నారని నర్మదాపురం ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజీవ్ చౌక్సే వెల్లడించారు. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ నెం. 1 వైపు వస్తుండగా, ఆ మహిళ అకస్మాత్తుగా చిన్నారిని పట్టాలపైకి తోసేసింది. లోకోమోటివ్ ఢీకొనడంతో ఆ బాలిక ప్లాట్‌ఫారమ్ అంచుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలుతో నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో చుట్టుప క్కల వారు, రైల్వే సిబ్బంది ఆ చిన్నారి సహాయానికి పరుగెత్తుకొచ్చారు. ఆమెను బయటకు లాగిఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి పరుగులు తీస్తున్నసందర్భంలో రైలుకిందకి బిడ్డను తోసేసిన ఆ మహిళ, బిడ్డను రక్షించవద్దని పదే పదే వేడుకుందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో నిందిత మహిళ మానసిక ఆరోగ్య కోణం కూడా ఉండవచ్చని సూచిస్తోంది. ఆ మహిళ చికిత్స చరిత్రను ధృవీకరించే ప్రక్రియలో ఉన్నామని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
నటి మంచు లక్ష్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
-
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలని చాలా మంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.వర్ష అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్‌గా ఇచ్చింది.తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు. అందరూ కలిసి కారు పైన కవర్ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n)భావోద్వేగ సందేశం"మా తల్లిదండ్రులు ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."నెటిజన్ల ప్రశంసలుఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
యాదాద్రిలో దారుణం.. కూతురు, కొడుకుపై తల్లి దాడి
-
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికరెడ్డి మృతి చెందింది.బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్‌రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. నిన్న(శనివారం) సాయంత్రం నీలిమ.. తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. -
కూతురితో బిగ్‌బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
-
'ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది' మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా చిరు విష్ చేశారు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి.. నేడు ఒక బలమైన, బాధ్యయుతమైన మహిళగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నా సినిమాలు చూడటం.. ఇప్పుడు సినిమా నిర్మించడం.. నాకు చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించడం అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా నన్ను గర్వపడేలా చేశావని సుస్మితను కొనియాడారు.మెగాస్టార్ తన ట్వీట్ రాస్తూ..' నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, అందమైన బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఇది ఒకటి. మీరు నా సినిమాలు చూడటం.. ఇప్పుడు ఏకంగా సినిమా నిర్మించడం, నాకు చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించడం.. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, అంతులేని విజయం కలగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి' అని పోస్ట్ చేశారు. కాగా..ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మనశంకర వరప్రసాద్‌గారు చిత్రానికి సుస్మిత నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 'Happy Birthday my precious @sushkonidela ❤️From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026 -
తన లవ్‌తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!
కనిపెంచిన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్. అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్ మదర్‌గా ఒంటరిగా తన తల్లి ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. కుమార్తె భావోద్వేగంఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది. తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది." అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. View this post on Instagram A post shared by Pooja (Piyu) (@pooja_bhatnagar_) -
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
-
బిడ్డ కోసం అమాంతం బావిలోకి దూకేసిన తల్లి..!
‘అమ్మ’ గొప్పదనం గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ బిడ్డల్ని కాపాడు కుంటుంది. తరతరాల చరిత్ర ఈ సత్యాన్ని పదే పదే నిరూపిస్తూనే ఉంది. పిల్లల్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఉదంతం బిడ్డలపై తల్లి ప్రేమ, చూపించే ధైర్య సాహసాలపై మరోసారి చర్చకు తావిచ్చింది. మాతృత్వం గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసిన ఈ సంఘటన మంగళవారం జరిగింది.ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం తమిళనాడులోని నంబియూర్ సమీపంలో అయియంకట్టు తొట్టంలో తన కూతురిని కాపాడటానికి 55 ఏళ్ల మహిళ లోతైన బావిలోకి దూకేసింది. ఊంజపాళయంకు చెందిన సుందరం కుమార్తె దివ్య (27) స్పెషల్ నీడ్ చైల్డ్. ఇందుకోసం చికిత్స కూడా పొందుతోంది. ఆత్మహత్య చేసుకోవాలని ఆమె బావిలోకి దూకేయడంతో అక్కడే ఉన్న తల్లి ముత్తుమణి క్షణం కూడా ఆలోచించికుండా కూతుర్ని కాపాడేందుకు సాహసానికి పూనుకుంది. వెంటనే తాను కూడా బావిలోకి దూకేసి, కుమార్తెను గట్టిగా పట్టుకుంది. సహాయం కోసం ఆమె వేసిన కేకలు ఆ ప్రాంతం అంతటా ప్రతిధ్వనించాయి. దీంతో పొరుగువారు అప్రమత్తమై కడ్తూర్ పోలీసులకు, నంబియూర్ అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేదాకా ఆమె బిడ్డను కాపాడుకుంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముత్తుమణి ధైర్యాన్ని స్థానికులు ప్రశంసలు కురిపించారు. తల్లీ బిడ్డల్ని కాపాడిన అగ్నిమాపక శాఖ కృషిని కూడా కొనియాడారు ఈ సంఘటనపై పోలీసులు సాధారణ విచారణ ప్రారంభించారు.In a split-second act of courage, a 55-year-old woman jumped into a deep well to save her daughter, triggering a dramatic rescue operation in Aiyankattu Thottam near Nambiyur on Tuesday.Divya, 27, daughter of Sundaram from Oonjapalayam, reportedly leaped into a well in the… pic.twitter.com/TeRzAkL4kF— IndiaToday (@IndiaToday) March 4, 2026 -
నేను ఎమ్మెల్యే అవుతా...! కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
-
మెగా డాటర్ నిహారిక ఫిబ్రవరి గడిచిందిలా (ఫొటోలు)
-
ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని ఖరారు చేశారా? గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ చర్చకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన కుమార్తె కిమ్ జు ఆయేను దేశ తదుపరి అత్యున్నత నేతగా తీర్చిదిద్దే క్రమంలో కిమ్ కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో జు ఆయే స్వయంగా స్నిపర్ రైఫిల్‌ను ధరించి, లక్ష్యాన్ని ఛేదిస్తున్న చిత్రాలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ (KCNA) విడుదల చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సైనిక అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త తరం స్నిపర్ రైఫిళ్లను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్ తన కుమార్తెకు కూడా ఒక రైఫిల్‌ను బహుకరించడం విశేషం. ఈ ఆయుధాలను అద్భుతమైన ఆయుధాలుగా వర్ణించిన కిమ్, ఇవి తన నమ్మకానికి ప్రతీకలని పేర్కొన్నారు.ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యూపీకే) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ తయారు చేసిన అత్యాధునిక రైఫిళ్లను కిమ్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కిమ్ కుమార్తె జు ఆయే(13) తన తండ్రి తరహాలోనే లెదర్ జాకెట్ ధరించి షూటింగ్ రేంజ్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు కిమ్ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. గతంలో ఆమెను కేవలం కుమార్తెగా పిలిచిన ప్రభుత్వ మీడియా ఇప్పుడు ‘గౌరవనీయ కుమార్తె’గా సంబోధిస్తుండటం గమనార్హం.జు ఆయే ఇప్పటికే తన వారసత్వ శిక్షణను పూర్తి చేసుకుని, అధికారిక హోదాను ఖరారు చేసే దశకు చేరుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) చెబుతోంది. ఆమె ఇప్పటికే విధానపరమైన అంశాల్లో తనదైన ముద్ర వేస్తోందని, దేశంలో అప్రకటిత రెండో అత్యున్నత నేతగా చలామణి అవుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైఫిల్‌ను స్వీకరించారు. అయితే, మొదటిసారిగా కేసీఎన్ఏ ఆమెను పార్టీ కేంద్ర కమిటీలోని ‘జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్’గా గుర్తించి, ఆమె అధికార పరిధిని స్పష్టం చేసింది.ఒకప్పుడు కిమ్ వారసురాలిగా యో జోంగ్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు జు ఆయే తెరపైకి రావడం కొరియా రాజకీయాల్లో కొత్త మలుపుగా పరిగణిస్తున్నారు. కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జు ఆయే బాధ్యతలు చేపడితే, కిమ్ కుటుంబం నుంచి నాలుగో తరం నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించనుంది. కిమ్ జోంగ్ ఉన్ అడుగుజాడల్లో నడుస్తూ, సైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాల్లో చురుగ్గా కనిపిస్తున్న జు ఆయే, రాబోయే రోజుల్లో ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’ -
ప్రేమిస్తే చంపేస్తారా..? కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి
-
ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు.. అరసమరపేటకు చెందిన యోగనాథన్(63) సత్‌వచ్చారిలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి పదవీ విరమణ చేశాడు. బుధవారం ఉదయం యోగనాథన్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. బంధువులకు విషయం తెలిసి వేలూరు సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై విచారణ చేపట్టారు. యోగనాథన్ కుమార్తె వినోదిని ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకుంది. విషయం తండ్రికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇంట్లో తండ్రికి తన భర్త కనిపించకుండా చూసుకునేది. ఈ విషయం యోగనాథన్కు తప్పా మిగతా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఇటీవల ప్రేమ వివాహం గురించి యోగనాథన్కి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో యోగనాథన్ ఇంట్లో మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించారు. విచారణలో యోగనాథన్ది హత్య అని తేలడంతో పోలీసులు మృతుడి భార్య విమలాదేవి, కుమారుడు గోవిందరాజ్, స్నేహితులు అశ్వథామన్, శివదాస్, కుమార్తె వినోదినిని గురువారం అరెస్ట్ చేశారు. -
కన్నబిడ్డను హతమార్చిన వైద్యురాలు, 911 కాల్ రికార్డు సంచలనం
భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ నేహా గుప్తా కన్నకూతుర్నే హతమార్చి ఏమీ తెలియ నట్టుగా 911 కాల్ చేసింది. ఒక్లహోమాకు చెందిన పిల్లల వైద్యురాలు కాల్ రికార్డును దర్యాప్తు అధికారులు తాజాగా విడుదల చేశారు. అలాగే 2025 జూన్‌లో జరిగిన సంఘటనను వివరించేందుకు గాను నిందితురాల్ని తాజాగా విడుదల చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని స్వల్పకాలిక అద్దె ఇంటిలోని తన నాలుగేళ్ల కుమార్తెను కొలనులో ముంచి చంపినట్లు పై అభియోగం మోపబడిన నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..ఒక్లహోమాకు చెందిన 36 ఏళ్ల నేహా గుప్తా పిల్లల డాక్టర్. వైద్యుడైన భర్త సౌరభ్ నుంచి ఆమె విడిపోయింది. నాలుగేళ్ల కుమార్తె అరియా ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నది. ఆ బాలిక కస్టడీ వివాదం కోర్టులో ఉంగానే నాలుగేళ్ల అరియా కన్నుమూయడం విషాదాన్నినింపింది. కుమార్తె అరియాతో కలిసి నేహా గుప్తా ఫ్లోరిడాకు వెళ్లింది. అక్కడ తాత్కాలిక అద్దె ఇంట్లో బస చేసింది. అయితే అక్కడి నీటి కొలనులో పడి అరియా మునిగినట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో ఆమెను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.పోస్ట్‌మార్టం నివేదికశవపరీక్షలో బాలిక ఊపిరితిత్తులలో లేదా కడుపులో నీరు కనిపించలేదు. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి, ఆ తరువాతే ఆమెను కొలనులో వేసినట్టు నిర్ధారించారు. సంఘటన జరిగిన సమయంలో, ఆరియా తలతి తండ్రి పూర్తి కస్టడీని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. గుప్తా మానసిక స్థితి గురించి. తన కుమార్తెను ఫ్లోరిడాకు తీసుకెళ్లారని తనకు తెలియదని వాపోయాడు.🇺🇸 📹 PEDIATRA ACUSADA POR MUERTE DE SU HIJA EN PISCINA Las cámaras de seguridad captaron a la madre y la niña en la vivienda de alquiler antes del hallazgo en la piscina. ¿Noticias y tendencias? ¡Sigue @ULTIMAHORAENX para MAS!🔔 Neha Gupta pediatra de Oklahoma… pic.twitter.com/ol8cVhh9BR— ⓍULTIMAHORAENX (@ULTIMAHORAENX) February 26, 2026911 రికార్డింగ్ వివరాలు"మేము నిద్రపోతున్నాము, నాకు ఏదో శబ్దం వినిపించింది ఆమె కొలనులో ఉంది, ఆమెను కాపాడటానికిప్రయత్నించాను, కానీ నాకు ఈత రాదు" అని అధికారులు విడుదల చేసినమె చెప్పినట్లు వినబడుతుంది. "నేను ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను." అని ఆమె డిస్పాచర్తో చెప్పింది.ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, గుప్తా, "లేదు, ఇక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాము... నేనే... ఆమెను బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసాను" అని తెలిపింది. ఆ అమ్మాయి మేల్కొని ఉందా అని డిస్పాచర్ ఆమెను అడిగారు., గుప్తా, "లేదు, ఆమె కొలను అడుగున ఉంది... కదలడం లేదు" అని చెప్పింది.ఆ తర్వాత గుప్తా తన కూతురిని కొలను నుండి బయటకు లాగడానికి ప్రయత్నించమని అడిగాడు. అప్పుడు మీరు ఎప్పటికీ చేరుకుంటారని ఆమె డిస్పాచర్ను అడిగింది. "వారు దారిలో ఉన్నారు, కానీ మీరు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి, ఆమెను బయటకు తీసుకురావడానికి మీరు ఏదైనా మార్గాన్ని కనుగొనాలి" అని డిస్పాచర్ ఆమెకు చెప్పారు.ఆ తర్వాత డిస్పాచర్ ఆమెను కొలను ఎంత లోతు ఉంటుంది లాంటి వివరాలు అడిగాడు. ""తొమ్మిది అడుగులు ఉందని నేను అనుకుంటున్నాను, ఎంత లోతు ఉందో నాకు తెలియదు," అని గుప్తా చెప్పింది. "సరే, మీరు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి, మేడమ్," అని డిస్పాచర్ మళ్ళీ చెప్పినపుడు నేను ప్రయత్నిస్తున్నాను," అని సమాధాన మిచ్చింది. కొన్ని క్షణాల తర్వాత, పోలీసు అధికారులు వచ్చినప్పుడు, గుప్తా వారి కోసం తలుపు తెరిచింది. అప్పుడు అధికారులు తన కుమార్తెను నీటిలో నుండి బయటకు తీశారు.మరోవైపు ఆరియా మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని గుప్తా, ఆమె న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆమె మే నెలలో తిరిగి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు..
నన్నెందుకు చంపావమ్మా? నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు.. ఒంటరిగానే నన్ను పెంచావు.. నీ సుఖం చూసుకుని ఊహాలోకంలో విహరించావు.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించావు.. మాయాలోకంలో పడి నన్ను వదిలించుకోవాలనుకున్నావు.. నీ కడుపుచించుకుపుట్టిన నన్ను కర్కశంగా గొంతు నులిమి చంపేశావు.. నీకు తోడుగా నిలిచిన వాడితో కలిసి స్వర్ణమ్మలో కలిపేశావు.. నేనేం తప్పు చేశానమ్మా.. నాకెందుకీ శిక్ష వేశావమ్మా..?.. అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం.ఓ కసాయి తల్లి ప్రియుడి మోజులో పడి రెండున్నరేళ్ల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. తిరుపతి: ‘11 నెలల చిన్నారి ‘పునర్విక’ ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన రూ.16 కోట్లు సమకూర్చేందుకు ఏ సంబంధం లేని లక్షల మంది ఒక్కటయ్యారు. తమవంతు సాయమందించి సమాజంలో మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు. ఈ కసాయి తల్లి కామాంధకారంతో కళ్లు మూసుకుపోయి కడుపుచించుకుని పుట్టిన అపురూప పాపాయిని అత్యంత పాశవికంగా చిదిమేసింది. ఆపై స్వర్ణమ్మ ఒడిలో పాతిపెట్టేసి చేతులు దులుపుకుంది. పోలీసులు తమదైన విచారణలో అసలు విషయం బయటపడింది. ఏ‘పాప’ం చేసిందని? తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్‌తో విడిపోయి తిరుపతి పోస్టల్ కాలనీలో రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఉంటోంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్‌ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గను అంతమొందించాలని భావించింది. ఈ నెల 19వ తేదీన దుర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడు రెడ్డికుమార్ సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకుని ప్రియుడి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో అవ్వ ప్రశ్నించింది. తల్లి సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన ప్రతి హృదయం ద్రవించింది. ఏ పాపం చేసిందని పాప ప్రాణం తీశావంటూ ప్రతి గొంతు ఘోషించింది.గుండెలవిసేలా రోదించిన అవ్వ ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశాలత, రెడ్డికుమార్‌తోపాటు వారికి సహకరించిన మరికొందరిని పోలీ సులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కళ్లు బైర్లు కమ్మేలాంటి చిన్నారి హత్యోదంతాన్ని వారు బయటపెట్టారు. బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పోలీసులు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాపానాయుడుపేట సమీపంలో పాపను పూడ్చిపెట్టిన స్వర్ణముఖి నదిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి వారి వెంట వచ్చిన చిన్నారి దుర్గ అమ్మమ్మ నాగరత్నమ్మ బోరున విలపించింది. నువ్వేం పాపం చేశావమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కదిలించింది. -
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)
-
ప్రియుడి కోసం.. కన్న కూతురినే చంపేసిన తల్లి
-
కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!
ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గ్రాడ్యుయేషన్ డే అంటే ఎంతో సంతోషంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అది వారికి ఓ గొప్ప పండుగ. అలాంటి గొప్ప వేడుకలో ఓ తల్లి ఎంత పట్టరాని సంతోషంలో ఉందంటే..ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్లందరి ముఖాల్లో నవ్వలు విరిసేలా చేసింది. కూతురు గ్రాడ్యుయేషన్ డేలో ఆ తల్లి సంతోషమే హైలెట్‌గా నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందంటే..కెనడాలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తన కూతురి కోసం తల్లి పట్టరాని సంతోషంతో డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ స్నాతకోత్సవంలో కూతురు నల్లగౌనులో వేదికపైకి వచ్చి ప్రొఫెసర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుండగా..ఆ తల్లి సంతోషంతో నేను నిన్న ప్రేమిస్తున్నా తల్లి..అని గట్టిగా అరుస్తుంది. ఆ స్వరానికి అందరు ఆశ్చర్యపోతూ..అక్కడ ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. ఆ తల్లి ఎంతో గర్వంగా ఉద్విగ్నంగా కూతురిని, ఆ ప్రొఫెసర్ని ప్లీజ్ రెండు స్టెప్లు వేయమని కోరడం..అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పిల్లలు సాధించిన ఘనతలను సంబరం చేసుకుని ఆనందపడేది ఒక్క మన తల్లిదండ్రులే కదా..!. నిజంగా పేరెంట్స్ మనల్ని చూసి గర్వంగా ఉప్పొంగిన క్షణం మాటలకందని సన్నివేశం, మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Gursehaj Kaur (@impromptu_gursehaj) (చదవండి: రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ఎంత ఖర్చు అవుతుందంటే..) -
ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్‌లోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్‌లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు. -
ప్రజా బలం దైవబలం కలిసి.. అంబటి విడుదలపై కూతురు రియాక్షన్
-
గళ్ళ మాధవి, అనిత గుర్తుపెట్టుకోండి..!
-
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
-
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
హన్మకొండ: ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్‌హాల్‌నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. -
బిగ్‌బాస్ ఆదిరెడ్డి చిన్న కూతురి అన్నప్రాసన వేడుక (ఫొటోలు)
-
తల్లి నగ్నచిత్రాలు ప్రియుడికి..!
సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా, ప్రేమ మోజులో పడి కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. సొంత తల్లి, పెద్దమ్మ నగ్న ఫొటోలను రహస్యంగా తీసి వాటిని ప్రియుడికి పంపించిందో యువతి. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల మహిళ ఇచి్చన ఫిర్యాదు మేరకు కుమార్తె, ఆమె ప్రియుడు వరుణ్‌పై బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బీబీఎం చదువుతోంది. గతేడాది ఆమెకు మొబైల్ కొనిచ్చారు. నెల రోజులుగా అపరిచిత యువకుడితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానం వచ్చింది. విషయాన్ని బయట పెట్టకుండా యువతి మొబైల్ పాస్‌వర్డ్‌ను తెలుసుకున్నారు. తర్వాత ఆ మొబైల్‌ను పరిశీలించగా అందులో యువతి తల్లి ప్రైవేటు ఫొటోలతో పాటు ఆమె సోదరి అక్క ఫోటోలను యువకుడికి పంపినట్లు గుర్తించింది. అనంతరం కుమార్తె నిర్వాకంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్తె ప్రియుడు వరుణ్ ఆ ఫొటోలను పంపించాలని ఒత్తిడి చేసినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి అంటూ చేసుకుంటే తాను ప్రేమించిన యువకుడినే చేసుకుంటా అంటూ ఇంట్లో గొడవ పడి వెళ్లినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవేటు ఫొటోలను ఆ యువకుడు ఇతరులకు పంపించే అవకాశం ఉందని, ఈ క్రమంలో తన కుమార్తె, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. -
పొగరు తగ్గించుకో... మౌనిక వార్నింగ్
-
ఐఏఎస్ ఆఫీసర్... అంగన్ వాడి స్కూల్
‘ఐఏఎస్ ఆఫీసర్లు తమ పిల్లలను ఎలాంటి స్కూల్స్‌లో చదివిస్తారు?’ అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. అయితే ఐఏఎస్ ఆఫీసర్, చిత్రకూట్ కలెక్టర్ పుల్కిత్ గార్గ్ ‘అందరు ఆఫీసర్లు ఒకేలా ఆలోచించరు’ అని నిరూపించారుమధ్యప్రదేశ్లోని చిత్రకూట్‌లో తన మూడేళ్ల కుమార్తె సియాను ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు చాలా మెరుగు పడింది. ఒక ఐఏఎస్ అధికారి తన బిడ్డను ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివించగలిగినప్పుడు సామాన్యులెవరూ సంకోచించకూడదు. అంగన్వాడీ కేంద్రాలపై ఉన్న అభిప్రాయాలు మారాయని విశ్వసిస్తున్నాను’ అన్నారు గార్గ్. ఈ సందర్భంగా బాల్యదశ అభివృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆరోగ్యం, పోషకాహారం... మొదలైనవి బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఎలా తీర్చిదిద్దుతాయో వివరించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న అపనమ్మకాన్ని వీడండి’ అని తల్లిదండ్రులను కోరారు. పుల్కిత్ గార్గ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా అత్యధికులు ఆయనను సమర్థించి ప్రశంసించారు. -
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
-
మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్
-
శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
సాక్ష్యాలు మాయం చేయడానికి పోలీసులు పొద్దున్నే ఇంటికి వచ్చి..
-
ఒక మహిళ అంత ఘోరంగా మాట్లాడుతుంటే.. అనితకు ఆ మాటలు వినపడలేదా
-
ఇంటికి వచ్చి అలా అనడం తప్పు.. అంబటి కూతురు ఎమోషనల్
-
టీడీపీ గూండాల విధ్వంసం తర్వాత ఇంట్లో అంబటి కుమార్తె..!!
-
తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..
ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్‌గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.అందుకు సంబంధించిన వీడియోని జితేందర్ సారస్వత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్‌ని ఓ చిన్న కీప్యాడ్ఫోన్లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫోన్‌ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్‌ని చూసి చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Jitendar Sarswat (@sarswatjitendar) (చదవండి: హార్డ్‌వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్‌గా పోస్ట్) -
20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా
జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే. కన్న కూతురి కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.పెచియమ్మాళ్ అలియస్ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రారంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఇక్కడే పెచియమ్మాళ్ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం, ప్యాంట్ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్‌గా, కూలీగా, టీ మేకర్‌గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ, బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.ఆమె మహిళ అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా ముత్తు లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్గా మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్‌గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది. -
‘నా చితికి నా మూడేళ్ల కూతురే నిప్పు పెట్టాలి’
పాట్నా: ‘అమ్మా,నాన్న. నన్ను క్షమించండి. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చితికి నిప్పు నా భర్తతో కాదు.. నా మూడేళ్ల కూతురితో పెట్టించండి’అంటూ ఓ మహిళా ఉపాధ్యాయురాలు బలవన్మరణం చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిహార్ రాష్ట్రం వైశాలీ జిల్లాకు చెందిన ప్రియా భారతి ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భారతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఇలా ఉంది.‘అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నేను చనిపోతున్నాను. అనారోగ్య సమస్యల వల్ల ప్రాణం తీసుకుంటున్నాను. నా మరణానికి ఎవరూ కారణంగా కాదు.నాకు నచ్చినట్లు నా అంత్యక్రియలు నిర్వహించండి. నేను మరణించిన నా భౌతిక కాయాన్ని నా స్వగ్రామానికి తీసుకుని వెళ్లొద్దు. నా చితికి నా కుమార్తెతో నిప్పుపెట్టించండి.నా భర్తతో వద్దు. 5.5లీటర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నా పర్సులో నుంచి తీసుకోండి. నా ఫోన్‌ని నాభర్తకు ఇవ్వండి. అందులో కొన్ని ఆడియో,వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఫోన్ పాస్వర్డ్ ఏంటో నా భర్తకు తెలుసు.నా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. పోస్టుమార్టం నిర్వహించవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా భర్త, కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు చేయద్దు. ఈ చర్య నా వ్యక్తిగత నిర్ణయం. అమ్మా, నాన్న, మీ కూతురు ఓడిపోయింది. క్షమించండి అమ్మా’అని నోట్లో రాశారు.అయితే, భారతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. భారతి తన భర్త దీపక్ రాజ్, అత్తింటివారి వేధింపులకు గురయ్యిందని, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి కూడా చెప్పిందని తెలిపారు. కాగా, బాధితురాలి తల్లి తండ్రుల ఆరోపణలకు.. ఆత్మహత్యా లేఖలోని మాటలకు విరుద్ధంగా ఉండటం వల్ల కేసు మరింత క్లిష్టంగా మారింది. -
'బిగ్‌బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)
-
తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)
-
ఒకటి నుంచి 50 వరకూ రాయలేదని..
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూసింది. కేవలం హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో ఓ కసాయి తండ్రి తన నాలుగేళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చాడు. బల్లబ్గఢ్కు చెందిన కృష్ణ జైస్వాల్ (31) తన కుమార్తె వంశిక (4) హోంవర్క్‌లో ఒకటి నుండి 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో విచక్షణ కోల్పోయాడు. చపాతీలు చేసే కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుప్పకూలిపోయింది.అనంతరం, నిందితుడు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను బల్లబ్‌గఢ్‌లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి, మెట్లపై నుంచి జారిపడిందని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె శరీరంపై పలు గాయాలు, ఫ్రాక్చర్లు, తలకు తీవ్రమైన దెబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు.ఈ ఘాతుకం జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న నిందితుని ఆరేళ్ల కుమారుడు నిజాన్ని బయటపెట్టాడు. తన సోదరి అంకెలు రాయలేకపోయినందుకు తండ్రి ఎలా కొట్టాడో ఆ బాలుడు తన తల్లికి, ఆపై పోలీసులకు వివరించాడు. భార్య ఫిర్యాదు, బాలుని వాంగ్మూలం ఆధారంగా నిందితుడు కృష్ణ జైస్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు అతనిని ఫరీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అతడిని ఒక రోజు పోలీస్ రిమాండ్‌కు పంపింది. -
తల్లిదండ్రుల దశదిన కర్మ రోజే కూతురు జన్మదినం
పెద్దపల్లి జిల్లా: లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతుల మధ్య వచ్చిన స్వల్ప ఘర్షణతో క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా 15ఏళ్ల ఏకైక కూతురు శివాణి ఉంది. ఈక్రమంలో బుధవారం తల్లిదండ్రుల దశదినకర్మ రోజే కూతురు శివాణి జన్మదినం కావడంతో బంధువులు, గ్రామస్తుల ప్రోత్సాహంతో బాధ నుంచి మరల్చేందుకు తల్లిదండ్రుల చిత్రపటం ఎదుట కేక్ కట్ చేయించారు. కాగా ఉద్విగ్న క్షణాలతో కన్నీటిని ఆపుకుంటూ బాధను అదిమి పట్టి అతికష్టంగా ముఖంపై చిరునవ్వును చిందినట్లుగా శివాణి కేక్ కట్ చేసిన తర్వాత పక్కకు వచ్చి ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమైంది. బాలిక రోధనను చూసిన బంధువులు, గ్రామస్తులు మరోసారి కంటతడిపెట్టారు. గ్రామస్తులంతా చిన్నారికి అండగా నిలుస్తూ భరోసా కల్పించారు. -
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కూతురి బర్త్‌డేకి... తల్లి సర్ప్రైజ్
బర్త్‌డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్‌డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే ఉంటాయి. కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్‌డేని ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్‌పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్‌డే గార్ల్ వంతైంది.అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్‌పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్‌డేకి బెస్ట్ గిఫ్ట్ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. View this post on Instagram A post shared by Sylvia D'costa (@maa.madeit) ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్లు, పాస్తాలు, ఇతర డిషెస్ ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్‌తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియోదీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్లా ఉంది అని మరొకరు చమత్కరించారు. ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్ -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్‌ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్‌ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్‌ఫ్రెండ్‌ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్‌జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్‌ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్‌ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు
గుంటూరు: ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్ జగన్ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్‌లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది. -
కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)
-
అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)
-
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్‌ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
ఘోరం.. ఆడపిల్లని కోపంతో ఆరేళ్ల చిన్నారిని
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆడపిల్ల అనే కోపంతో ఆరు సంవత్సరాల పసికందును సుప్రియ అనే ఓ కిరాతక తల్లి పొట్టన బెట్టకుంది. అనంతరం గుండెపోటుతో పాప మృతి చెందిందని కట్టుకథ అల్లింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్ర నావీ ముంబై కళంబోళిలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఎప్పటిలాగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అయితే రావడంతోనే పాప అపస్మారక స్థితిలో పడి ఉండడం చూశారు. దీంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.అయితే దీనిని గుండెపోటుగా చిత్రీకరించడానికి సుప్రియ ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు శవపరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో తనకు బాబు కావాలని ఉండేదని దానికి తోడు చిన్నారి మరాఠీ మట్లాడకపోవడంతో ఇంకా పగ పెంచుకుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ సుప్రియ తన కూతురుకు పలుమార్లు హానీ కలిగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా
ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్‌ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్‌తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025 (చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!) -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
అమ్మకు బదులు అమ్మాయి
ఓస్లో: వెనెజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సాహసి, ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో.. ఆ నిప్పుకణిక లేకుండానే.. నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం ఓస్లోలో జరిగింది. భయంకరమైన పరిస్థితుల నడుమ రాలేకపోయినప్పటికీ, ఆమె కూతురు అనా కొరినా సోసా.. వేదికపై తల్లి తరపున ఆ చారిత్రక గౌరవాన్ని స్వీకరించారు. మచాడో ఈ ఏడాది జనవరి 9 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అదేరోజు, ఆమె వెనెజులా రాజధాని కారకాస్‌లో తన మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. త్వరలో మనతో మారియా.. నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్, జోర్జెన్ వాట్నే ఫ్రైడ్నెస్ సభలో చేసిన వ్యాఖ్యలు ఆహూతులను కదిలించాయి. ‘మారియా కొరినా మచాడో ఈ రోజు వేడుకకు హాజరయ్యేందుకు తన శక్తి మేరకు ప్రయతి్నంచారు. ఆమె రాలేకపోయినా, సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఎంతో సంతోíÙస్తున్నాం. ఆమె త్వరలోనే ఓస్లోలో మనతో ఉంటారు’.. అని ప్రకటించగానే సభ చప్పట్లతో దద్దరిల్లింది. ముందుగా నోబెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, మచాడో ప్రతినిధి ఆమె రాలేకపోతున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మచాడో కుమార్తె అనా కొరినా సోసా.. తన తల్లి స్థానాన్ని అలంకరించారు. ఈ బహుమతి వెనెజులా ప్రజలందరిది నోబెల్ వెబ్సైట్లో విడుదలైన మచాడో ప్రసంగం ఆద్యంతం ఉద్వేగాన్ని నింపింది. ‘నేను ఓస్లో చేరుకోవడానికి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ గుర్తింపు వెనెజులా ప్రజలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది’.. అన్న ఆమె గొంతులో పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ‘ఈ బహుమతి మొత్తం వెనెజులా ప్రజలందరిది. నేను రాగానే, రెండేళ్లుగా చూడని నా కుటుంబ సభ్యులను, నా పిల్లలను కౌగిలించుకుంటాను’.. అని ఉద్వేగంతో ఆమె చెప్పారు. ఐదుగురూ నిర్బంధంలోనే.. గతంలో కూడా ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు (నర్గెస్ మొహమ్మది–2023, అలెస్ బియాలియాట్సి్క–2022, లియు జియాబో–2010, ఆంగ్ సాన్ సూ కీ–1991, కార్ల్ వాన్ ఒసియెట్జీ్క–1935) నోబెల్ అవార్డు ప్రకటించే సమయానికి జైలులో లేదా నిర్బంధంలో ఉండటం గమనార్హం. -
Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)
-
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం
న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్ మాజీ విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి. లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం ప్రకటించింది. కౌశల్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.VIDEO | Delhi: Swaraj Kaushal, senior BJP leader and husband of the late former External Affairs Minister Sushma Swaraj, passed away on Thursday. Visuals from the cremation ground show his daughter and BJP MP Bansuri Swaraj performing rituals.(Full video available on PTI Videos… pic.twitter.com/bMzs5Nxaz8— Press Trust of India (@PTI_News) December 4, 2025తిరిగి అమ్మ దగ్గరికేబన్సూరి స్వరాజ్ తన తండ్రి మరణంపై ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.पापा स्वराज कौशल जी, आपका स्नेह, आपका अनुशासन, आपकी सरलता, आपका राष्ट्रप्रेम और आपका अपार धैर्य मेरे जीवन की वह रोशनी हैं जो कभी मंद नहीं होगी।आपका जाना हृदय की सबसे गहरी पीड़ा बनकर उतरा है, पर मन यही विश्वास थामे हुए है कि आप अब माँ के साथ पुनः मिल चुके हैं, ईश्वर के सान्निध्य… pic.twitter.com/imqpUb2DMS— Bansuri Swaraj (@BansuriSwaraj) December 4, 2025ఎవరీ స్వరాజ్ కౌశల్ జూలై 12, 1952న సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. -
రంగా కూతురు ఎంట్రీ.. పవన్ కు కాపుల షాక్
-
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కామారెడ్డి క్రైం: మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అంటూ ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివిపెట్టింది. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అలకుంట్ల సుదర్శన్‌కు భార్య, ముగురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.స్వగ్రామంలో తనకు ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సుదర్శన్ మృతి చెందగా సోమవారం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది. కొడుకులు లేక కూతురే అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న అందర్నీ కంటతడి పెట్టించింది. -
ఉరేసుకుని ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
తాడేపల్లి రూరల్/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసుకొచ్చామని చెప్పారు. తమ కుమార్తెమృతికి కారణమైన రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్‌కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. -
గ్రాండ్‌గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి
ఎన్నో తెలుగు సినిమాలు తీసిన నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి. ఈయన మూడో కూతురు స్రవంతి, విక్రమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఈ శుభకార్యం జరిగింది. నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. హడావుడి లేకపోవడంతో వివాహానికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)అక్టోబరు 1వ తేదీన స్రవంతి-విక్రమ్ నిశ్చితార్థం జరగ్గా.. తర్వాత రోజు ఈమె సోదరి స్వప్న తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు అలానే పెళ్లి ఫొటోలని పోస్ట్ చేస్తారేమో చూడాలి? వైజయంతి మూవీస్ తరఫున చాన్నాళ్లుగా అశ్వనీదత్ మూవీస్ తీస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం పూర్తిగా తగ్గించేశారు. ఈయన కూమార్తెలు స్వప్న, ప్రియాంక.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. గతేడాది ప్రభాస్‌తో 'కల్కి' తీసి పాన్ ఇండియా హిట్ కొట్టారు.అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్నప్న, ప్రియాంకతో పాటు అల్లుడు నాగ్ అశ్విన్.. ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఈయన మూడో కూతురు స్రవంతికి మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేదు. అందుకే పెళ్లి హడావుడి ఎక్కడా కనిపించలేదు.(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్) -
భర్త మరణంతో ఆ రంగునే దరిచేరనివ్వలేదు..! కానీ కూతురు.
భర్తను కోల్పోయిన స్త్రీలు..ఒక్కసారిగా తమ జీవితంలోకి తొగ్గి చూసిన శూన్యం మాదిరిగా నిస్తారంగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. అది వారి వేషధారణలో సైతం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొందరూ ఆత్మవిశ్వాసంతో లేచి పుంజుకుంటారు. కొందరు సమాజం, కట్టుబాట్లకు తలొగ్గి తమ ఆశలను, కలల్ని చంపుకుని నిర్లిప్తంగా గడుపుతుంటారు. అలానే అన్నింటిని వదిలేసి..బతుకుతున్న ఆమె జీవితంలోకి మళ్లీ కాంతులు వచ్చేలా రంగులతో నింపింది కూతురు. సంతోషంగా ఇదివరకటి స్త్రీలా త్రుళ్లిపడుతూ ఉన్న ఆ దృశ్యం.. దూరమైన ఆమె భర్త సైతం ముచ్చటపడేలా అందంగా ఉంది.ప్రగతి అనే సోషల్ మీడియా వినియోగదారు నెట్టింట ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను వ్యక్తిగత విషయాలను పోస్ట్‌చేసే వ్యక్తిని కానని, ఈ రీల్ తన తల్లి కోసం అని పేర్కొంది. తన తల్లి నాన్న మరణంతో ఎరుపు రంగుకి పూర్తిగా దూరమైందని, ఎరుపు రంగు చీర గానీ డ్రెస్లుగానీ ధరించటమే మానేసిందని చెప్పుకొచ్చింది. అయితే తాను ఈసారి తన తల్లి కోసం ఎరుపు రంగు చీరను కొని, కట్టుకోమని ఫోర్స్ చేసినట్లు వెల్లడించి. అయితే ప్రగతి ఎంతో బతిమాలాడగా ఆమె ఒప్పుకుంది. అందువల్లే ఈ రీల్‌ని పోస్ట్చేశానని వివరణ ఇచ్చింది. ఎందుకంటే చాల ఏళ్ల తర్వాత ఎరుపు రంగు చీరలో తాను ఎలా ఉన్నానే అనేది గుర్తుండిపోవాలి, ఆ బాధకరమైన రోజులు కళ్లముందు కానరాకూడదని ఇలా చేశానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. ఆమె తాను కొన్న ఎరుపు రంగులో అద్భుతంగా కనిపించడమే కాదు..ఆమె చేసిన ర్యాంపు వాక్ కూడా అదుర్స్ అని సంబరపడింది. విచిత్రం ఏంటంటే ఆ వీడియోలో పక్కనే ఓ ఫోటోఫ్రేమలో ఉన్న ప్రగతి తండ్రి కూడా ఈ దృశ్యాన్ని సంతోషిస్తున్నాడేమా అన్నట్లుగా ఉంద . అంతేగాదు ఆ వీడియోలో చివరగా..అయినా స్వేచ్ఛను అనుమతి కింద పరిగణించకండి, ముఖ్యంగా మహిళలో విషయం అంటూ ప్రగతి విజ్ఞిప్తి చేయడం అందరీ హృదయాలను తాకింది. ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు..మళ్లీ ఆమె తనకిష్టమైన ఎరుపు రంగుని స్వీకరించాక ఎంత అందంగానో కనిపిస్తోంది అని మెచ్చుకుంటూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by PRAGATI (@pragatipatil440) (చదవండి: బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..) -
అలనాటి హీరోయిన్ రాధ కూతురు.. పెళ్లయి రెండేళ్లయిపోయిందా? (ఫొటోలు)
-
శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)
-
కూతుర్ని రూ. 20 లక్షలకు తెగనమ్మి.. తండ్రి జల్సాలు
ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు. తనకున్న పొలాన్ని కూడా అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తున్నాడు. తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ.. ఇద్దరూ కలిసి తాగుతూ, తిరుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో నాగరాజు తన 15ఏళ్ల కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమలారెడ్డి వద్ద నుంచి రూ.20లక్షలు వరకు దండుకుని కారు తదితరాలు కొనుక్కున్నాడు. ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. అయితే ఆ మైనర్ బాలిక కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి మైనర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
లాలూ ఫ్యామిలీలో లుకలుకలు.. ఇంటిని వీడిన కుమార్తెలు
-
కరీంనగర్లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే?
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా.. కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి మల్లేశం పరారయ్యాడు.పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ ఆసుపత్రిలో చేర్పించింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా.. గత ఏడేళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం కుటుంబం కిరాయికి ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఘోరం.. కన్న కుమార్తెను చంపి కుమారుడిపై దాడి చేసి
కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. వివరాలు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
జమ్ముకశ్మీర్ పేలుడు: నాన్నా వెళ్లొద్దు.. కొద్ది నిమిషాల్లోనే
జమ్ము కశ్మీర్‌లోని నౌగం పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో దర్జీ మరణంతో ఆయన కుటుంబం ఏకాకిగా మారింది. ఆ కుటుంబానికి ఆయన ఒక్కరే ఆధారం. పోలీస్‌స్టేషన్‌లో చిన్న ప్యాకింగ్ పని ఉందని రమ్మంటే వెళ్లిన స్థానిక టైలర్ మొహమ్మద్ షఫీ పారీ మళ్లీ తిరిగిరాలేదు. పేలుడు ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం అనాథగా మారింది. 47 ఏళ్ల షఫీకి స్థానికంగా ఎంతో మంచి పేరుంది. మసీదులో కార్యక్రమాల కోసం విరాళాలు సేకరిస్తారు. చుట్టుపక్కల వాళ్లను ప్రేమగా పలకరిస్తాడు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తండ్రి భోజనం కోసం ఇంటికి వచ్చినప్పుడు.. చలి కారణంగా ఇంట్లోనే ఉండాలని కుమార్తె వేడుకుంది. నాన్నా.. వెళ్లొద్దంటూ ఆమె ఎంతగానో వారించింది. కానీ ఆయన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పని పూర్తి చేయాల్సి ఉందని వెళ్లిపోయారు. రాత్రి 11.20గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. పని పూర్తి చేసి తిరిగి వస్తానని ఆయన చెప్పిన చివరి మాటలు తలచుకుంటూ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా, టైలర్ మొహమ్మద్ షఫీ పారీని పోలీసులు.. పేలుడు పదార్థాల ప్యాకెట్ల కోసం సంచులు కుట్టించడానికి స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇటీవల హర్యానా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాల నుండి నమూనాలు సేకరిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. నిబంధనావళి ప్రకారం పేలుడు పదార్థాల నుంచి కొంతమేర శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు ప్రయత్నిస్తుండగా అవి ఒక్కసారిగా పేలిపోయి 9 మంది ప్రాణాలను బలిగొంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ టీమ్‌లోని ముగ్గురు, ఇద్దరు క్రైమ్ ఫొటోగ్రాఫర్లు, మేజి స్ట్రేట్ బృందంలోని ఇద్దరు రెవెన్యూ శాఖ అధికారులు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారి, ఒక టైలర్ చనిపోయారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు సహా 27 మంది గాయపడ్డారు. -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్‌నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్‌లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్‌గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్‌లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్‌స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
గ్రాండ్‌గా దిల్ రాజు సోదరుడి కూతురి పెళ్లి.. హాజరైన టాలీవుడ్ సినీతారలు (ఫొటోలు)


