తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు | Kollywood actor Harish Kalyan Revealed His Daughter Name on new year | Sakshi
Sakshi News home page

Harish Kalyan: తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు

Apr 14 2026 5:24 PM | Updated on Apr 14 2026 5:48 PM

Kollywood actor Harish Kalyan Revealed His Daughter Name on new year

కోలీవుడ్ హీరో, పార్కింగ్‌ ఫేమ్‌ హరీశ్‌ కల్యాణ్‌ గతనెల తండ్రిగా ప్రమోషన్‌ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు.  తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు  హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు.  తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్‌ కల్యాణ్‌- నర్మద ఉదయకుమార్‌ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

సినిమా కెరీర్.. 

2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్‌, ప్యార్‌ ప్రేమ కాదల్‌, లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌, పార్కింగ్‌, లబ్బర్‌ పండు, డీజిల్‌ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్‌, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్‌ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement