65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో.. | Dubai Woman Shares 5 At-Home Exercises That Helped Her Lose 7 Kg | Sakshi
Sakshi News home page

Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..

Jun 6 2026 12:11 PM | Updated on Jun 6 2026 12:13 PM

Dubai Woman Shares 5 At-Home Exercises That Helped Her Lose 7 Kg

బరువు తగ్గాలంటే కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన వ్యాయమాల క్రమం అనుకుంటారు అంతా. కానీ తెలివిగా ఎంజాయ్‌ చేస్తూ సులభంగా తగ్గే ప్రక్రియ అని అంటోంది ఫిట్‌నెస్‌ కమ్‌ యోగా కోచ్‌ త్రిప్తి. చాలామంది. ఇక్కడ స్మార్ట్‌గా ఆలోచిస్తే స్లిమ్‌ అవ్వడం చాలా సులవు అని చెబుతోందామె. మరి అదెలాగో త్రిప్తి మాటల్లోనే తెలుసుకుందామా.!.

దుబాయ్‌కు చెందిన ఫిట్‌నెస్‌, స్ట్రెంత్‌, యోగా కోచ్‌ త్రిప్తి తను కేవలం ఏడు నెలల్లో 7.7 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి సహాయపడిన సులభమైన ప్రభావవంతమైన వ్యాయామాలను పంచుకున్నారామె. తాను కాంపౌండ్‌ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ 7.7 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఇది కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడంలోనూ, మొత్తం ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.

మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్
త్రిప్తి తన వర్కౌట్‌ను మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్‌తో ప్రారంభించారు. ఈ వ్యాయామం కోర్‌ తోపాటు శరీర దిగువ భాగాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా చేసేవారికి, కేవలం శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్ చేయమని ఆమె సిఫార్సు చేశారు.
కాలును పైకి లేపేటప్పుడు శ్వాసను బయటకు వదలండి, తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేటప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. 

కదలిక అంతటా మీ కోర్‌ను బిగుతుగా ఉంచి, నిటారుగా ఉండే భంగిమను కొనసాగించాలని చెప్పారామె. అలాగే క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారికి లేదా జిమ్‌కు వెళ్లేవారికి, బరువులను జోడించి, రెప్స్ సంఖ్యను 20కి పెంచమని త్రిప్తి సూచించారు. 

నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించడం
తరువాత, ఆమె నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించింది. ఇది కోర్, హామ్‌స్ట్రింగ్స్ మరియు హిప్ ఫ్లెక్సర్‌లను లక్ష్యంగా చేసుకునే ఒక సులభమైన వ్యాయామం. తొలిసారిగా ప్రారంభించేవారు తమ శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్‌తో మొదలుపెట్టవచ్చు. 

ఆ తర్వాత ఆమె 10 కేజీల డంబెల్‌ను పట్టుకొని అదే వ్యాయామాన్ని చేసింది. మరింత సవాలు కోరుకునే వారు వేగాన్ని పెంచుకోవచ్చు లేదా సరైన భంగిమను పాటిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.

మోకాలిని తిప్పే వ్యాయామం
ఆ తర్వాత త్రిప్తి మోకాలిని తిప్పే వ్యాయామం గురించి వివరించింది. ఈ వ్యాయామం ఒబ్లిక్స్‌ను బలపరచడానికి, మొండెం కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కదలికను చేయడానికి, ఒక మోకాలిని పైకి లేపి, కోర్‌ను బిగుతుగా ఉంచుతూ పై శరీరాన్ని దాని వైపుకు తిప్పండి. తొలిసారిగా ప్రారంభించినవారు ప్రతి వైపు 10 రెప్స్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. 

ఈ కదలికను మరింత సవాలుగా మార్చడానికి, ఆమె డంబెల్ లేదా వెయిట్ ప్లేట్‌ను జోడించమని సూచించింది. అధునాతన వ్యాయామం చేసేవారు వేగంపై కాకుండా నియంత్రిత మెలికలపై దృష్టి పెడుతూ, 5-10 కేజీల బరువును పట్టుకొని ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.

హై నీస్ (లేదా హై-నీ మార్చ్)
ఈ వర్కౌట్‌లో హై నీస్ కూడా ఉంది. ఇది ఒక కార్డియో వ్యాయామం, ఇది ఓర్పును పెంచుతూనే కోర్, గ్లూట్స్, కాలి కండరాలను ఉత్తేజపరుస్తుంది. తొలిసారి ప్రారంభించేవారు సౌకర్యవంతమైన వేగంతో మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ, 10-12 సార్లు హై-నీ మార్చ్ చేయవచ్చు. 

తీవ్రతను పెంచడానికి, ఇంతకు ముందు వర్కౌట్ అనుభవం ఉన్నవారు ప్రతి చేతిలో తేలికపాటి డంబెల్స్ పట్టుకుని 45-60 సెకన్ల పాటు హై నీస్ చేయవచ్చు. నిటారుగా కూర్చోవడం,చేతులను పంప్ చేయడం ఈ వర్కౌట్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

ఓవర్‌హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజ్
ఆమె ఓవర్‌హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజెస్ చేసింది. ఈ వ్యాయామం భుజాలు, కోర్, గ్లూట్స్, బయటి తొడలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్, స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తొలిసారిగా ప్రారంభించేవారు కేవలం తమ శరీర బరువును ఉపయోగించి, ప్రతి వైపు 10 రెప్స్‌తో ప్రారంభించవచ్చు. ఈ కదలిక అంతటా కోర్‌ను నిమగ్నంగా ఉంచడం నిటారుగా కూర్చోవడంపై దృష్టి పెట్టాలి.

వ్యాయామం చేసేటప్పుడు డంబెల్‌ను తలపైన పట్టుకోవాలని త్రిప్తి సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మధ్యస్థం నుండి ఎక్కువ బరువును ఉపయోగిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ వరకు పెంచుకోవచ్చు. చివరగా ఆమె ఈ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర రోజువారీ కదలికలు కలిపి చేస్తే..బరువులో మాత్రమే కాకుండా, బలం, శక్తి, ఆత్మవిశ్వాసంలో కూడా మార్పుని గమనించగలుగుతాం అని అంటోంది త్రిప్తి. ఇక్కడ కేవలం నిలకడ, క్రమశిక్షణే మంచి ఫలితాలను తెలస్తుందని అంటున్నారామె. అందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారామె. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం)
 

Advertisement
 
Advertisement
Advertisement