ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు | The NATS conference in Tampa on overcoming stress | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు

Jul 24 2026 4:45 PM | Updated on Jul 24 2026 5:11 PM

The NATS conference in Tampa on overcoming stress

అమెరికాలో తెలుగు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా ఒత్తిడిని జయించడం ఎలా అనే దానిపై సదస్సు నిర్వహించింది..నాట్స్ టాంపా బే విభాగం ఆద్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ వక్త కె. గోపాలన్ ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేశారు.. విక్రమ్ నంధ్యాల ఈ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు. 

ఒత్తిడిని ముందస్తుగా గుర్తించడం ఎలా? అది ఎన్ని రకాలుగా మనపై ప్రభావం చూపుతుంది? అనే అంశాలను సులభమైన ఉదాహరణలతో గోపాలన్ వివరించారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడకుండా, వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా గోపాలన్ అందించిన ఆచరణాత్మక చిట్కాలు ఈ సదస్సుకు విచ్చేసిన వారిని ఎంతగానో ఆలోచింపజేశాయి. చదువుల్లో, కెరీర్ ప్రారంభంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందని యువత సంతోషం వ్యక్తం చేశారు... 

ఆఫీసు ఒత్తిళ్లను తగ్గించుకుని ప్రశాంతంగా పనిచేయడానికి చక్కటి మార్గాలు దొరికాయని ఉద్యోగులు కొనియాడారు. అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నాట్స్ నాయకులు రాజేశ్ కండ్రు వివరించారు.  తెలుగువారి కోసం ఇలాంటి సదస్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించిన నాట్స్  ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, డాక్టర్ మల్లికార్జున నంద్యాలను, టాంపా బే టీం నాయకులకు గోపాలన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి టాంపా బే కోర్ టీమ్ సభ్యులు అను కోట, శ్రీనివాస్ మల్లాది, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, సురేష్ బొజ్జా, నవీన్ మేడికొండ, అనిల్ అరెమడ, రవి కాళిదిండి, సంజయ్ కొండ, శిరీష దొడ్డపనేని తదితరుల సమష్టి కృషి ఎంతో ఉంది. అలాగే, కార్యక్రమానికి అంకితభావంతో  తమ సహకారం అందించిన మురళీకృష్ణ మేడిచెర్ల, కిషోర్ నారె, శ్రవణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

(చదవండి: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement