స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా.. | Faridabad Swiggy riders side hustle as a writer became a Rs 1 crore | Sakshi
Sakshi News home page

స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..

Jul 24 2026 6:09 PM | Updated on Jul 24 2026 6:22 PM

Faridabad Swiggy riders side hustle as a writer became a Rs 1 crore

లాక్‌డౌన్‌ కొన్ని జీవితాలను చిన్నాభిన్నం చేసింది గానీ..వాళ్ల విజయాన్ని ఆపలేకపోయింది. బహుశా ఆ మహమ్మారి ఇంట్లోనే బంధీగా చేసిందేమో గానీ విజేత కానివ్వకుండా నిలువరించలేకపోయింది. అందుకు ఉదాహారణే రచయితగా మారిన ఈ వైద్య విద్యార్థి కథ. 

నిజానికి కరోనా టైంలో ఎందర్ని నిరుద్యోగులుగా చేసి రోడ్డుమీదకు తీసుకొచ్చేసంది. అప్పటిదాక సంతోషంతో ఉన్న కొందరి జీవితాలు తలకిందులైపోయాయి. అలాంటి వారిలో ఉ‍త్తరప్రదేశ్‌కు చెందిన అజిత్‌ కుమార్‌ కూడా ఒకడు. ఫరిదాబాద్‌లోని రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చదువుకుంటున్న అజిత్‌ కుమార్‌ లైఫ్‌ కరోనాతో ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుంది. తన చదువు కోసం చేసిన అప్పులు ఒకవైపు..చదువు కొనసాగన్వివకుండా మహమ్మారి ఇంకోవైపు. 

దాంతో చదువుని మధ్యలోనే ఆపేసి ఉపాధి వెతుక్కుంటూ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా మారాడు. రోజుకు 16 గంటలు పనిచేస్తూ..ఏకంగా వందల కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతుండేవాడు. ఆ క్రమంలో ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఒక పక్క తీర్చాల్సిన అప్పులు నిద్రపట్టనివ్వకుండా చేస్తుండటంతో మళ్లీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. అప్పుడే పాకెట్ ఎఫ్ఎమ్‌లో రచయిత ఉద్యోగ ప్రకటన అతడి కంటపడింది. దాంతో అతడి పరిస్థితులన్నీ మారిపోయాయి. 

అనూహ్యంగా మూడు నెలల్లో అతని కథలలో ఒకటి పాకెట్‌ ఎఫ్‌ఎమ్‌ఎమ్‌ రచనల పోటీలో అగ్రస్థానంలో నిలిచింది. వెంటనే అతనికి రూ. 20 వేలు పారితోషికం లభించింది. ఆ తర్వాత రూ. 52 వేలు పారితోషకం లభించింది. అలా నెమ్మదిగా అతడికి అందే చెక్కులపై అంకెలు పెరగడం ప్రారంభించాయి. ఒక నెలలో అతనికి ఏకంగా రూ. 6.29 లక్షల పారితోషకం లభించింది. ప్రస్తుతం ఆయన పాకెట్ ఎఫ్ఎమ్ 'బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' కార్యక్రమానికి ప్రధాన రచయితగా పనిచేస్తున్నారు. దీనికోసం ఏకంగా వెయ్యికిపైగా ఎపిసోడ్‌లు రాశారు. అలా అజిత్‌ ఇవాళ కోట్లు గడించే రచయితగా మారాడు

అతని లింక్డ్‌ఇన్ బయో ప్రకారం, 3 మిలియన్లకు పైగా వీక్షణలతో ప్రేక్షకుల ఆదరణను పొందారు. ఆ అకౌంట్‌లో అజిత్‌ కుమార్‌ తన గురించి ఇలా రాసుకొచ్చారు. "పురాణాల ఆధారిత కల్పనా కథలు రాసే చయితను. ప్రాచీన గాథలను భవిష్యత్ కాలపు మహాయోధుల ఇతివృత్తాలతో మేళవించి ఇతిహాస గాథలను రచించడం నా అభిరుచి. ప్రస్తుతం నేను బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' అనే ఒక భారీ సీరియల్‌కి పనిచేస్తున్నాని, అది సుమారు 5 వేలకు పైగా ఎపిసోడ్‌లు కొనసాగనుందని అజిత్‌ రాసుకొచ్చారు. 

ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఆడియో-ఫిక్షన్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. అంతేగాదు తన చేతిలో ఐదు పెద్ద నవలల కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నిజంగా అజిత్‌ కుమార్‌ని చూస్తే పడిలేచిన కెరటం అనొచ్చు కదా. అందరం కెరీర్‌ నిర్మించుకునే క్రమంలో కిందపడిపోతాం, కుదేలవుతాం..కానీ తట్టుకుని తిరిగి లేచి నిలదొక్కుకున్నవాడే విజేత అని నిరూపించాడు కదూ..!.

(చదవండి: మెరిసే చర్మం కోసం న్యూటెల్లా జార్‌..! ఆ నటి బ్యూటీ సీక్రెట్‌..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement