ఒక్క ఐడియా = 650 మంది కోటీశ్వరులు | 22-Year-Old Steven Schwarz Built Billion Dollar Whop Platform | Sakshi
Sakshi News home page

ఒక్క ఐడియా = 650 మంది కోటీశ్వరులు

Jul 24 2026 10:47 AM | Updated on Jul 24 2026 10:52 AM

22-Year-Old Steven Schwarz Built Billion Dollar Whop Platform

సక్సెస్‌ స్టోరీ

బాగా చదువుకుని ఉద్యోగం చేసో, లేక వ్యాపారం చేసో డబ్బు సంపాదించాలని అనుకోవడం సహజం. కాని తాను వ్యాపారం చేస్తూనే తనతో పాటు  క్లైంట్లను కూడా కోటీశ్వరులను చేసిన యువకుడి కథ ఇది. అమెరికాకి చెందిన 22 ఏళ్ల స్టీవెన్‌ ష్క్వార్జ్‌ మాత్రం చిన్న వయసులోనే వ్యాపారం గురించి ఆలోచించాడు. చిన్నప్పుడు నీటి సీసాలు అమ్ముతూ మొదలైన వ్యాపారం అతనిలో కొత్త ఆలోచనని పుట్టించింది. అదే వూప్‌(whop). ఇది ఒక ఆన్‌లైన్‌ డిజిటల్‌ మార్కెట్‌ ప్లేస్‌.

ఈ ప్లాట్‌ఫాం ద్వారా కంటెంట్‌ క్రియేటర్లు, డిజిటల్‌ వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవచ్చు. అచిర కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం వల్ల అనేక మంది తమ కోట్ల డాలర్ల లావాదేవీలను వూప్‌ ద్వారా నిర్వహించారు. ఈ పరిణామంతో వూప్‌ సంస్థ బిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు సాగించే 650 మంది మిలియన్ల కొద్దీ ఆర్జించినట్టు ప్రముఖ గ్లోబల్‌ బిజినెస్‌ మేగజైన్‌ ఫార్చూన్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement