పనితీరు బాగా లేని ఉద్యోగులను పన్లోంచి తీసివేయడం ఏ కంపెనీ అయినా, లేదా బాస్ అయినా సాధారణంగా చేసే పని. కానీ ముంబైకి చెందిన ఒక స్టార్టప్ పౌండర్ తీసుకున్న నిర్ణయం నెట్టింట ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆ కంపెనీకి ఉద్యోగ దరఖాస్తుల వరద తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆబాస్ ఏం చేశాడు?
'బ్లూ లాబ్‌స్టర్ మీడియా' (Blue Lobster Media) అనే కంటెంట్ ఆధారిత B2B స్టార్టప్ వ్యవస్థాపకుడు ధ్రువ్ ముఖర్జీ. తన కంపెనీలో సరిగ్గా పని చేయలేక పోతున్న తన ఉద్యోగినికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. పైగా జీతంతో కూడిన సెలవు (Paid Getaway) పై పంపించాడు. దీంతో ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
పూణే నుండి రిమోట్‌గా పనిచేస్తున్న కంటెంట్ ఆపరేషన్స్ లీడ్ ఆర్య ఫడ్నిస్ (Aarya Phadnis). ఆమె గత రెండున్నరేళ్లుగా ఈ సంస్థలో నమ్మకంగా పనిచేప్తోంది. అయితే గత నెలలో కంపెనీ కంటెంట్ ఆపరేషన్స్‌లో ఆమోదాల ఆలస్యం, నాణ్యతా లోపాలు వంటి సమస్యలను ధ్రువ్ గమనించారు. మరోవైపు తన పనితీరు తగ్గినందుకు బాధ్యత వహిస్తూ జీతం నుండి కొంత మొత్తాన్ని కోత విధించాల్సిందిగా స్వయంగా ఆర్య ధ్రువ్‌ను కోరింది.
కానీ బాస్ ధ్రువ్ మాత్రం వేరుగా ఆలోచించారు. ఆమెపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఆమెతో మాట్లాడి వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఒత్తిడికి లోనవు తున్నట్లు తెలుసుకున్నారు. ఆర్య నివసించే పూణేలోనే ఒక మంచి Airbnb లో 3 రోజుల పాటు బస ఏర్పాటు చేసి, దానికి అయ్యే ఖర్చును కంపెనీయే భరించింది (ఇందులో 2 రోజులు ప్రశాంతంగా పని చేసుకోవడానికి, 1 రోజు పూర్తి విశ్రాంతికి కేటాయించారు).ఆమె ఇంటికి దగ్గరలోనే ఒక కో-వర్కింగ్ స్పేస్‌లో డెస్క్‌ను కూడా బుక్ చేశారు.
ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!
తన నిర్ణయం గురించి మాట్లాడుతూ "రోజు ముగిసే సమయానికి, టేబుల్‌కి అవతలి వైపు ఉన్నది కూడా ఒక మనిషే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, దానికి తగ్గట్టుగానే వారిని గౌరవించాలి. ఉద్యోగులు తప్పు చేసినప్పుడు తొలగించడం లేదా డీమోట్ చేయడం కంటే, కొన్నిసార్లు సానుభూతి (Empathy) చూపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి." అని చెప్పడం విశేషం.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
దరఖాస్తుల వెల్లువ : కంపెనీకి క్రేజ్
ధ్రువ్ ముఖర్జీ ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకోగానే వైరల్‌గా మారింది. ఈ కంనెనీలో మాకు ఉద్యోగం కావాలంటూ దరఖాస్తుల ఈ చిన్న స్టార్టప్ కంపెనీకి పెద్ద ఎత్తున జాబ్ అప్లికేషన్లు రావడం ప్రారంభమైనాయి. ఇందులో ఇప్పటికే ఒకరిని కంపెనీ ఉద్యోగంలోకి కూడా తీసుకుంది కూడా.
వర్క్‌ప్లేస్ టాక్సిక్ కల్చర్‌కు భిన్నంగా ఉన్న అతని వైఖరిని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకున్నారు. అటు ఆర్యకూడా మానత్వంతో ఆయన స్పందించిన తీరుపై సంతోషం వ్యక్తం చేసింది. ఆకంపెనీపై గౌరవం, బాధ్యత మరింత పెరిగాయని ఆమె పేర్కొంది.
ఇదీ చదవండి: 50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య


