breaking news
poor performers
-
ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్
పనితీరు బాగా లేని ఉద్యోగులను పన్లోంచి తీసివేయడం ఏ కంపెనీ అయినా, లేదా బాస్ అయినా సాధారణంగా చేసే పని. కానీ ముంబైకి చెందిన ఒక స్టార్టప్ పౌండర్ తీసుకున్న నిర్ణయం నెట్టింట ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆ కంపెనీకి ఉద్యోగ దరఖాస్తుల వరద తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆబాస్ ఏం చేశాడు?'బ్లూ లాబ్‌స్టర్ మీడియా' (Blue Lobster Media) అనే కంటెంట్ ఆధారిత B2B స్టార్టప్ వ్యవస్థాపకుడు ధ్రువ్ ముఖర్జీ. తన కంపెనీలో సరిగ్గా పని చేయలేక పోతున్న తన ఉద్యోగినికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. పైగా జీతంతో కూడిన సెలవు (Paid Getaway) పై పంపించాడు. దీంతో ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.పూణే నుండి రిమోట్‌గా పనిచేస్తున్న కంటెంట్ ఆపరేషన్స్ లీడ్ ఆర్య ఫడ్నిస్ (Aarya Phadnis). ఆమె గత రెండున్నరేళ్లుగా ఈ సంస్థలో నమ్మకంగా పనిచేప్తోంది. అయితే గత నెలలో కంపెనీ కంటెంట్ ఆపరేషన్స్‌లో ఆమోదాల ఆలస్యం, నాణ్యతా లోపాలు వంటి సమస్యలను ధ్రువ్ గమనించారు. మరోవైపు తన పనితీరు తగ్గినందుకు బాధ్యత వహిస్తూ జీతం నుండి కొంత మొత్తాన్ని కోత విధించాల్సిందిగా స్వయంగా ఆర్య ధ్రువ్‌ను కోరింది.కానీ బాస్ ధ్రువ్ మాత్రం వేరుగా ఆలోచించారు. ఆమెపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఆమెతో మాట్లాడి వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఒత్తిడికి లోనవు తున్నట్లు తెలుసుకున్నారు. ఆర్య నివసించే పూణేలోనే ఒక మంచి Airbnb లో 3 రోజుల పాటు బస ఏర్పాటు చేసి, దానికి అయ్యే ఖర్చును కంపెనీయే భరించింది (ఇందులో 2 రోజులు ప్రశాంతంగా పని చేసుకోవడానికి, 1 రోజు పూర్తి విశ్రాంతికి కేటాయించారు).ఆమె ఇంటికి దగ్గరలోనే ఒక కో-వర్కింగ్ స్పేస్‌లో డెస్క్‌ను కూడా బుక్ చేశారు.ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!తన నిర్ణయం గురించి మాట్లాడుతూ "రోజు ముగిసే సమయానికి, టేబుల్‌కి అవతలి వైపు ఉన్నది కూడా ఒక మనిషే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, దానికి తగ్గట్టుగానే వారిని గౌరవించాలి. ఉద్యోగులు తప్పు చేసినప్పుడు తొలగించడం లేదా డీమోట్ చేయడం కంటే, కొన్నిసార్లు సానుభూతి (Empathy) చూపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి." అని చెప్పడం విశేషం. ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిదరఖాస్తుల వెల్లువ : కంపెనీకి క్రేజ్ధ్రువ్ ముఖర్జీ ఈ విషయాన్ని లింక్డ్ఇన్లో పంచుకోగానే వైరల్‌గా మారింది. ఈ కంనెనీలో మాకు ఉద్యోగం కావాలంటూ దరఖాస్తుల ఈ చిన్న స్టార్టప్ కంపెనీకి పెద్ద ఎత్తున జాబ్ అప్లికేషన్లు రావడం ప్రారంభమైనాయి. ఇందులో ఇప్పటికే ఒకరిని కంపెనీ ఉద్యోగంలోకి కూడా తీసుకుంది కూడా.వర్క్‌ప్లేస్ టాక్సిక్ కల్చర్‌కు భిన్నంగా ఉన్న అతని వైఖరిని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకున్నారు. అటు ఆర్యకూడా మానత్వంతో ఆయన స్పందించిన తీరుపై సంతోషం వ్యక్తం చేసింది. ఆకంపెనీపై గౌరవం, బాధ్యత మరింత పెరిగాయని ఆమె పేర్కొంది.ఇదీ చదవండి: 50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య -
బ్యాంకు ఉద్యోగులకు చైనాలో వెరైటీ పనిష్మెంట్!
బీజింగ్: ఉద్యోగులు ఎవరైనా బాగా పనిచేయకపోతే.. పైస్థాయి ఉద్యోగులు వారిని మందలించడం సహజంగా జరుగుతోంది. కానీ, చైనాలో మాత్రం ఆశించిన పనితీరు కనబర్చని బ్యాంకు ఉద్యోగులను వరుసక్రమంలో నిలుచోబెట్టి దుడ్డుకర్రతో చితకబాదిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగు చూడటంతో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. సరిగ్గా పనిచేయని ఉద్యోగులను దుడ్డుకర్రతో బాదిన ఉదంతంలో సదరు బ్యాంకు బాస్ తోపాటు పలువురు ఉన్నతాధికారులపై వేటు పడింది. పని విషయంలో వెనుకబడిన ఎనిమిది ఉద్యోగులు -నలుగురు పురుషులు, నలుగురు మహిళలను ఓ వేదిక మీద నిలుచోబెట్టి.. మీరు ఎందుకు మంచి పనితీరు కనబరచలేదని ఓ వ్యక్తి అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ ఎనిమిది సమాధానం ఇవ్వగా.. పనితీరు కనబర్చనందుకు తగినశాస్తి అనుభవించేందుకు సిద్ధం కండి అంటూ.. పడవ తెడ్డులాంటి కర్రతో ఆ వ్యక్తి ఎనిమిది మంది వెనుకభాగంలో బాదాడు. ఓ మహిళ ఈ దెబ్బలు తప్పించుకోవడానికి రెండు చేతులు వెనుకకు పెట్టినా.. ఆ చేతులు తీయమని చెప్పిమరీ కొట్టాడు. చాంగ్ ఝీ ఝాంగ్ జె గ్రామీణ వాణిజ్య బ్యాంకు ఉద్యోగులకు ఈ మేరకు ట్రైనింగ్ సేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ వీడియో వెలుగుచూడటంతో చైనా నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ పద్ధతి పురాతన కాలంలో బానిస వ్యవస్థను సూచిస్తున్నదని, ఉద్యోగులకు కూడా గౌరవాభిమానులు ఉంటాయని, వారినిలా దండించడం దారుణమని చైనా నెటిజన్లు 'వీబో' (చైనా ట్విట్టర్)లో మండిపడ్డారు. ఈ వీడియోపై ప్రజాగ్రహం నేపథ్యంలో చాంగ్ ఝీ బ్యాంకు చైర్మన్ గా ఉన్న స్థానిక కమ్యూనిస్టు పార్టీ చీఫ్ తోపాటు, పలువురు ఉన్నతాధికారులను చైనా సర్కార్ సస్పెండ్ చేసింది.


