డీఎంకే అవుట్‌.. టీవీకే ఇన్‌: రౌత్‌ వ్యాఖ్యలు | Shiv Sena Sanjay Raut Interesting Comments On INDIA Bloc | Sakshi
Sakshi News home page

డీఎంకే అవుట్‌.. టీవీకే ఇన్‌: రౌత్‌ వ్యాఖ్యలు

Jun 6 2026 9:20 AM | Updated on Jun 6 2026 10:42 AM

Shiv Sena Sanjay Raut Interesting Comments On INDIA Bloc

ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్‌ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.

ఈ సందర్భంగా రౌత్‌.. ‘ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్‌ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement