గుజరాత్‌లో నీట మునిగిన కార్లు.. వైరల్‌ వీడియో | Over 50 Cars Submerged As Rain Floods Parking Lot In Gujarat Valsad | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో నీట మునిగిన కార్లు.. వైరల్‌ వీడియో

Jul 23 2026 9:21 PM | Updated on Jul 23 2026 9:43 PM

Over 50 Cars Submerged As Rain Floods Parking Lot In Gujarat Valsad

వల్సాడ్: గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర దక్షిణ భాగంలో ఉన్న వల్సాడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. వల్సాడ్‌లోని ఉంబర్‌గావ్ ప్రాంతంలో గురువారం ఉదయానికి కేవలం 16 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,100 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో బాధితులను ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. వాపి ప్రాంతంలో భారీ వరదల కారణంగా పార్క్‌ చేసిన 50 కార్లకు పైగా నీట మునిగాయి. ఆ వీడియోలో  ఓ భవనం పార్కింగ్ ఏరియా పూర్తిగా నీటితో నిండిపోయి.. నీటి మట్టం కార్ల కిటికీల వరకు చేరినట్లు కనిపిస్తోంది. పార్కింగ్ వెలుపల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) డేటా ప్రకారం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వల్సాడ్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది.

ఔరంగా, పార్, దమన్ గంగ వంటి నదులు పొంగి పొర్లడంతో వల్సాడ్‌లో భారీగా వరదలు వచ్చాయి. సురత్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ గుజరాత్‌లోని వల్సాడ్, నవసారి, డాంగ్స్, సూరత్, తాపి జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement