‘జన నాయగన్‌’ ట్విటర్‌ రివ్యూ | Jana Nayagan Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

Jana Nayagan X Review: ‘జన నాయగన్‌’ ట్విటర్‌ రివ్యూ

Jul 23 2026 8:13 AM | Updated on Jul 23 2026 8:54 AM

Jana Nayagan Movie Twitter Review, Public Talk

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌( తెలుగులో జన నాయకుడు). . హెచ్‌.వినోద్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య నేడు(జులై 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చెన్నైతో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అదిరిపోయిందని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తే.. యావరేజ్‌ సినిమా అని మరి కొంతమంది చెబుతున్నారు.  విజయ్‌ ఫ్యాన్స్‌ మాత్రం తమ అభిమాన హీరోని  తెరపై చూసి మురిసిపోతున్నామని చెబుతున్నారు. సినిమాలో విజయ్‌ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘సీఎం విజయ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీశాడు. దర్శకుడు వినోద్‌ సినిమాను బాగా తెరకెక్కించాడు. యాక్షన్‌ సీన్స్‌కి అనిరుధ్‌ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. పూజా హెగ్డే గ్లామర్‌ మరో ప్లస్‌ పాయింట్‌ అంటూ ఓ నెటిజన్‌ 4 రేటింగ్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement