మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు.
#MAREMMA - SEPTEMBER 10TH!
Best wishes to @maadhav_9999 and team 🤗 pic.twitter.com/p84lQanTvR— Ravi Teja (@RaviTeja_offl) July 22, 2026


