breaking news
maremma
-
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రఫ్ కట్ చూశా... భలే నచ్చింది – రవితేజ
రవితేజ సోదరుడి తనయుడు, రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్గా నటించారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలోని మహిషాపురంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా రఫ్ కట్ చూశాను... భలే నచ్చింది. ఎమోషన్స్ బాగున్నాయి. కుషాల్, మయూర్‌లకు ఈ సినిమాతో మంచి పేరు, డబ్బులు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. తమిళ అమ్మాయి దీపా తెలంగాణ భాష నేర్చుకుని, ఈ సినిమాలో బాగా పెర్ఫార్మ్ చేసింది. తొలి సినిమా అయినా నాగరాజు బాగా తీశారు. తమ్ముడు మాధవ్ బాగున్నావ్ రా.. ! ఈ సినిమా కోసం మాధవ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు బాగుంది. ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. మాధవ్ భూపతిరాజు మాట్లాడుతూ– ‘‘ఆయన (రవితేజ) నాకు పెదనాన్న కాదు... నా అన్నయ్య. నా తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రావడం హ్యాపీగా ఉంది. ఒక మనిషికి, ఒక దున్న΄ోతుకు మధ్య ఉన్న అనుబంధం తాలూకు ఎమోషన్‌ను ఊరి దైవం మారెమ్మతో కథలో చక్కగా బ్లెండ్ చేశారు నాగరాజుగారు. ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది’’ అన్నారు. మయూర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నాగరాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది మా ఊరి కథ అని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. మాధవ్ ఇలాంటి రూటెడ్ కథను ఎంచుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి’’ అని చెప్పారు. మంచాల నాగరాజు మాట్లాడుతూ– ‘‘2006 టైమ్ ఫ్రేమ్‌లో ఈ సినిమా కథ సాగుతుంది’’ అన్నారు. -
అలా చేస్తే ప్రతి స్క్రిప్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది : శివ నిర్వాణ
‘‘మారెమ్మ’ సినిమా ట్రైలర్ బాగుంది. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్రైలర్లో అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్, ఫొటోగ్రఫీ బాగున్నాయి. కథకి ఏం కావాలో అవి చేసుకుంటూ వెళ్తే ప్రతి స్క్రిప్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది. బ్లాక్‌బస్టర్ కావడానికి కావాల్సిన అన్ని అంశాలు ‘మారెమ్మ’లోనూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ శివ నిర్వాణ పేర్కొన్నారు. హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో రామ్ డిజిటల్ వేదికగా లాంచ్ చేశారు. ఇటీవల ‘ఇరుముడి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ ‘మారెమ్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ– ‘‘మారెమ్మ’ చిత్రంలో ఒక దున్నపోతుకు, మనిషికి మధ్య ఉండే అనుబంధం ఎలా ఉంటుందో థియేటర్లలో చూస్తారు. రవితేజగారు ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్ నచ్చింది... భావోద్వేగానికి గురయ్యారు’’ అని చెప్పారు. నాగరాజు మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్ ఎలా ఉందో అంతకు పది రెట్లు ఎక్కువ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన తెలంగాణ పల్లెటూరి సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మయూర్ రెడ్డి. -
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో.. ట్రైలర్ రిలీజ్
'ఇరుముడి' హిట్ కొట్టిన రవితేజ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇతడి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘ కొడుకు మాధవ్ ప్రధాన పాత్ర చేసిన 'మారెమ్మ' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం(సెప్టెంబరు 10) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)గతంలో 'లవ్ యూ ఇడియట్' అనే మూవీలో మాధవ్ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదొచ్చిందా లేదా అనే సంగతి జనాలకు పెద్దగా తెలీదు. తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'మారెమ్మ' ఒప్పుకొన్నాడు. ఏడాది క్రితం దీని గురించి ప్రకటన వచ్చింది. కొన్నిరోజుల క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు.మారెమ్మ అనే గ్రామ దేవత, ఈ దేవి కోసం పెంచే ఓ దున్నపోతు. దాన్ని కాపాలా కాసే ఓ కాపరి. ఊరిలో జరిగే కొన్ని అరిష్టాలు. ఇలా ట్రైలర్ సాగింది. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యంగా మూవీ ఉండనుంది. ఇందులో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్గా చేసింది. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమాతోనైనా మాధవ్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) -
రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. #MAREMMA - SEPTEMBER 10TH! Best wishes to @maadhav_9999 and team 🤗 pic.twitter.com/p84lQanTvR— Ravi Teja (@RaviTeja_offl) July 22, 2026 -
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ ‘మారెమ్మ’ మూవీ టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మారెమ్మ’ అనే టైటిల్ ఖరారు చేశారు. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపా బాలు కథానాయిక. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మారెమ్మ’ టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మారెమ్మ’. మాధవ్‌ను ఫెరోషియస్ రగ్డ్ లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నారు నాగరాజ్. ఈ పాత్ర కోసం ఆయన పూర్తీగా మేకోవర్ అయ్యారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి కందాలా, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి. -
గంటల మారెమ్మ హుండీ చోరీ
పుట్టపర్తి అర్బన్: మండలంలోని బత్తలపల్లి సమీపంలోని కనుమలో వెలసిన గంటల మారెమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి నెలా హుండీని లెక్కించి బ్యాంకులో పొదుపు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈనెల ఇంకా లెక్కించక పోవడంతో సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ కానుకలు ఉండవచ్చన్నారు. చోరీపై పుట్టపర్తి రూరల్‌పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఆలయంలో రెండో సారి చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.


