
హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మారెమ్మ’ అనే టైటిల్ ఖరారు చేశారు. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపా బాలు కథానాయిక. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మారెమ్మ’ టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
‘‘పవర్‌ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మారెమ్మ’. మాధవ్‌ను ఫెరోషియస్ రగ్డ్ లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నారు నాగరాజ్. ఈ పాత్ర కోసం ఆయన పూర్తీగా మేకోవర్ అయ్యారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి కందాలా, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి.