గంటల మారెమ్మ హుండీ చోరీ | robery in maremma temple | Sakshi
Sakshi News home page

గంటల మారెమ్మ హుండీ చోరీ

Sep 21 2016 12:23 AM | Updated on Sep 4 2017 2:16 PM

మండలంలోని బత్తలపల్లి సమీపంలోని కనుమలో వెలసిన గంటల మారెమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

పుట్టపర్తి అర్బన్: మండలంలోని బత్తలపల్లి సమీపంలోని కనుమలో వెలసిన గంటల మారెమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి నెలా హుండీని లెక్కించి బ్యాంకులో పొదుపు చేస్తున్నట్లు చెప్పారు.
 
అయితే ఈనెల ఇంకా లెక్కించక పోవడంతో సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ కానుకలు ఉండవచ్చన్నారు. చోరీపై పుట్టపర్తి రూరల్పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.  ఈ సంవత్సరంలో ఆలయంలో రెండో సారి చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement